"ఛా...ఛా..ఏడుస్తున్నావా? ఇప్పుడేం జరిగింది?"
"ఊ...ఏం జరగలేదు. నీకేం నీకె బాధలేదు ఆడపిల్లగా పుట్టటం నా ఖర్మ ఇలా కావటం మరింత ఖర్మ, నా బాధ నీకేం తెలుస్తుంది?"
నిజంగా ఓ మగవాడు ఆడది ఇలా ఒకే చోట పక్క పక్కన వుంటే అందమైన అమ్మాయి జాలిగా ఏడుస్తూ అమాయకంగా మాట్లాడితే మగాడనేవాడు ఊరుకోడు" అనుకుంది కీర్తి.
"మగాడివి నీకేం బాధ తెలుస్తుంది, అసలు నాకు బాధ వుంటే కదా?" అంది కీర్తి కావాలని బొంగురుగా స్వరం మార్చి.
గోమతి జాలిపడింది__
"ఏడవను పడుకుంటాను" అంది.
"గుడ్ ఒకరి నొకరు అర్ధం చేసుకుంటే చాలు. మనమేదో దారి చూసుకుని పారిపోవచ్చు మీ వాళ్ళ దగ్గర నిన్ను చేర్చే బాధ్యత నాది."
"నిజం ఈ లోపల నన్నేం చేయవద్దు."
"నిజం పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయక పడుకో" అని గోమతి చేతిమీద ముద్దు పెట్టుకుని చేతిని వదిలేసింది కీర్తి.
గోమతి చటుక్కున చేతిని వెనక్కు లాక్కుని ముడుచుకు పడుకుంది. తర్వాత కొద్దిసేపటిలోనే గోమతి నిద్రపోయింది.
అర్ధరాత్రప్పుడు కీర్తికి మెలుకువ వచ్చింది. నిద్రలో భయపడి కావచ్చు గోమతి కీర్తిని కౌగలించుకుని పడుకుని వుంది.
కీర్తి చిన్నగా నవ్వుకుంది.
9
ఉదయం ముందుగా మెలుకువ వచ్చింది గోమతికి. సిగ్గుపడింది.
కీర్తి వెల్లకింతలా పడుకుని వుంది. గోమతి కీర్తి మెడగట్టిగా కౌగలించుకుని ఓ కాలు మీద వేసుకుని పడుకుంది. కీర్తి నిద్రపోవటం చూసి అమ్మయ్య. జరిగింది తల్చుకుని కమల్ మంచివాడనే అభిప్రాయానికి వచ్చింది. ఆలోచిస్తూ అలాచూస్తూ కూర్చుంది.
గోమతి కాసేపాగి కీర్తిని లేపింది.
బొబ్బూ, బప్పూలు, వీళ్ళు లేవటం కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళు లేవటం చూసి కిందకు దింపారు.
"మాయింట్లో బెడ్ కాపీ తాగుతాము" అంది గోమతి.
"మా ఇంట్లో నెస్ కాఫీ తాగుతాము" అంది కీర్తి ఏదో పోగొట్టుకున్నట్లు గోమతి అలాగనే ముఖం పెట్టి.
"ఊ" అని చిరుకోపంతో మూతి తిప్పింది గోమతి.
సుండాజాతి వారి పద్దతి ప్రకారం కాలకృత్యాలు తీర్చుకోటం జరిగింది. వాళ్ళంతా చిక్కటి జావతాగుతూ వీళ్ళకి ఇచ్చారు. కీర్తికి గోమాతికి కాపలా ఉన్నారు మిగిలిన మగవారంతా పదిపదిహేను మంది జట్లుగాచేరి నలువైపులా వెళ్ళారు. వారు వేటాడి కావలసిన వస్తువులు తెచ్చుకుంటారు.
బొబ్బూ చేత సూట్ కేసులు బ్యాగ్ లు కిందకి దింపించింది కీర్తి.
ఒక్కో సూటుకేసు బ్యాగ్ అన్ని గాలించారు పని కొచ్చేవి ఏదయినా వుంటాయేమోనని కీర్తి గోమతీను.
ఆల్బంని చిలకలని చూసి "ఇది... ఇది..." అంటూ ఆగి పోయింది గోమతి.
"ఏమిటి ఇది తెలిస్తే చెప్పు గోమతీ" అంది కీర్తి.
"నా పక్కన మన తెలుగు వాళ్ళే కూర్చున్నారు. కాని వాళ్ళు ఫ్రెంచ్ లో మాట్లాడు కుంటున్నారు. నాకు ఫ్రెంచ్ భాషవచ్చు వాళ్ళల్లో ఒకడు" ఏమిటో మనకంపెనీ వ్యవహారాలు బావుండలేదు. బాస వ్యవహారం బాగుండలేదు. మొదట చెప్పినట్లు వుంచక మధ్యలో మార్పేమిటి? అన్నాడు.
వెంటనే రెండోవాడు "వుష్! నీలాగా ఓర్పు తక్కువ కోపం ఎక్కువ అయితే జాబ్ పీకేస్తాడు. ఏ కారణం వల్ల ఏం మారుస్తున్నారో మన కనవసరం. అన్నట్లు నీతో ఏమొస్తున్నాయి! ఏం తీసుకొస్తున్నావు?" అని అడిగాడు.
"చిలుకలు ఇరవై ఆరు. ఆల్బం ఒకటి. నాలుగు కర్ చీపులు, మిగతావి దుస్తులు."
"ఉహూ!"
ఉన్నట్లుండి మార్పు వల్ల నాకేదో అనుమానంగా వుంది."
"ఉష్, వెబ్ సంగతి గుర్తుంచుకో, ఈగలాగా ప్రవర్తించావంటే ఎగిరిపోగలవు. ఇంకా మనం ప్రసంగం మార్చటం మంచిది. మనరూట్ మారినా మళ్ళీ కల్సుకుంటాము కదా!"
"ఓ.కే,"
"ఇదే వాళ్ళిద్దరూ ఫ్రెంచ్ లో మాట్లాడుకున్నది నాకేం అర్ధం కాలేదు కమల్! ఇంగ్లీష్ నావెల్ చదువుతూ వుండిపోయిన నాకు వాళ్ళ సంభాషణ వినపడింది. నా వెల్ లోంచి తలెత్తి మాత్రం నేచూడలేదు" గోమతి చెప్పింది.
"ఉహుఁ!" అని దీర్ఘాలోచనలో మునిగి పోయింది కీర్తి.
"ఆల్బం, కర్ చీపులు, చిలకలు వాళ్ళతాలూకా రహస్యం కావచ్చు. లేక కోడ్ కావచ్చు సమాచారం వుండి వుండవచ్చు. అవి పరిశోధిస్తే గాని ఏదయినది బైట పడదు దుండగులకి బాస వున్నాడు. ముందుగా తామూహించినట్లు బాస్ భారత దేశంలోనే వుండి తన అనుచరులని శత్రుదేశాలకి తరలిస్తూ రహస్య పత్రాలను, స్మగ్లింగ్ వస్తువులను చేరేస్తున్నాడేమో ఓ ఆల్బంలో రహస్యం వుంటే అది కని పెడితే మంచులా విడిపోయింది రహస్యం. గోమతికి తనెవరో చెప్పకూడదు. తన విషయం అనుమానం వచ్చి గోమతి నాటకం ఆడుతూ వుండవచ్చు. లేక పోనువచ్చు వెబ్ అంటే గూడు. గూడు అంటే ఏరకంది ఎందుకా మాట వచ్చింది? విమానంలో తను తనవాళ్ళు ప్రయాణం చేస్తున్నారని తెలిసే విమానాన్ని ప్రమాదానికి లోను చేశారా? విమానాన్ని ప్రయాణానికి లోను చేయక తప్పలేదా? కారణం...?