అనిమిష అతని పెదవుల మీద గాడంగా ముద్దు పెట్టుకుంది. బాటిల్ లోని మిగాత డ్రింక్ ని గ్లాసులో పోసి అందించింది.
"ఓకే....సాంక్షన్....మ్తేడియర్...." తమకంగా ఆమెను తన కౌగిలిలోకి తీసుకుంటూ అన్నాడు రవిచంద్రనాయుడు.
రవిచంద్రనాయుడు, హరికృష్ణమనాయుడు కొడుకు ముక్తానందకు అన్నయ్య.
పొడవుగా__పునీత్ ఇస్సార్ లా ఉంటాడు.
ఒకానోకా దశలో హరికృష్ణమనాయుడు తన ఆశలకు, ఆశయాలకు ప్రతినిధిగా రవిచంద్రనే ఎంపిక చేసాడు.
కానీ__
రవిచంద్ర వ్యక్తిత్వం ఆయనకు ఆలస్యంగా తెల్సింది కష్టపడడం కన్నా సుఖపడడం మీదే రవిచంద్రకు మక్కువ ఎక్కువని.
బాధ్యత రహింతగా జులాయిగా తిరగడం సరదా.
సడన్ ఇంటికి రావడం, కవాలసినంత డబ్బుని చేజిక్కించుకోవడం, సరార్తే పోవడం.
మళ్ళి ఏ నెలరోజులకో కనబడడం.
విచ్చలవీడితనానికి బాగా అలావాటు పడిపోయాడు రవిచంద్ర.
చాలా కాలం కొడుకుని వెన కేసుకోచ్చింది రవిచంద్రతల్లి హేమంత జబ్బుతో చనిపోయే దశలో__
"వాడ్ని ఎలాగ్తెనా బాగు చెయ్యండి.....వాడికి మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చెయ్యండి వాడికి పుట్టిన పాపకు నా పేరు పెట్టండి" అని తన చివరికోరికగా చెప్పి భర్త హరికృష్ణమనాయుడు చేతుల్లో చనిపోయిందావిడ.
భార్య మాటను మనసారా మన్నించడం కోసం__రవిచంద్రలో మార్పు కోసం ప్రయత్నించాడు. కుదరలేదు___వదిలేసాడు. ఆ తండ్రి కొడుకుల మధ్య జరిగే ప్రచ్చన్న యుద్ధం గురించి లాయర్ సూర్యసాగర్ కి, ముక్తానందకు మాత్రమే తెలుసు.
అలాంటి పరిస్ధితిలో రవిచంద్రను పట్టింది అనిమిష.
ఒకసారి రవిచంద్ర, కలకత్తాలోని కాస్మోపాలిటన్ క్లబ్ కు వెళ్ళిన పుడు తార స పడింది అనిమిష.
అనిమిష అందానికి దాసోహమ్తెపోయాడురవిచంద్ర.
పెళ్ళి చేసుకొంటానని ప్రామిస్ చేసాడు. ఆమె కోసమే తన జీవితం అన్నంతగా బతుకుతున్నాడు.
రవిచంద్రకు ప్రధానమ్తెన శత్రువు ఎవరో కాదు. తండ్రి హరికృష్ణమనాయుడే!అందుకే_
హరికృష్ణమనాయుడు పాలిటిక్స్ లోకి వెళ్తూన్నాడంటే, మొట్టమొదటి ఆనందించిన వాడు రవిచంద్ర.
పాలిటిక్స్ బిజీలో తండ్రి తిరుగుతున్నప్పుడు ఆయన బిజినేస్స్ ల్ని స్వాదిఅనం చేసుకోవాలని రవిచంద్ర ఆశ.
అందుకే తండ్రి ఎలక్షన్ల కేంఫ్ లలో బాగా వర్క్ చేసాడు రవి చంద్ర. విడిలోఇంత మార్పేమిటని, తండ్రి ఆశ్చర్యపోయినా, ఆ సిన్సి యర్టి వెనకున్న కుట్ర ఆయనకు సులభంగానే అర్ధమ్తెపోయింది.
తండ్రి ప్రమాణ స్వికారోత్సవాన్ని చూడడానికొచ్చాడు రవిచంద్ర. రవిచంద్రతోపాటే తనూ డిల్లి వచ్చింది అనిమిష.
రవిచంద్ర,అనిమిష....
లేత నిలపు కాంతిలో వాత్సాయనుడు బాపూ చేత్తో వేసిన బొమ్మల్లా ఉన్నారు.
విశాలమ్తెన బెడ్ మీదఅలసటతో కళ్ళు మూసుకున్నాడు. అతని గుండెమీద తలపెట్టుకుంది తమకంగా అనిమిష.
అతని గుండెమీద పరచుకున్న ఆమె జుత్తు నల్లటి జలపాతంలా ఉంది.
మెయిన్ డోర్ చప్పుడు, దాంతోపాటు కాలింగ్ బజార్ మోగడంతో ఉలిక్కిపడి లేచింది అనిమిష.
అంత అర్ధరాత్రి వచ్చినవాళ్ళేవరో అర్ధం కాలేదు అనిమిషకు.
న్తెట్ గౌన్ తోసుక్కుని దువ్వెనతో తల దువ్వుకుంటూ, గబగబా వెళ్ళి డోర్ పక్కన నిలబడి
"ఎవరు" అడిగింది.
"నేనే తలుపు తియ్...."
ఆ గొంతు ఎవరిదీ అనిమిషకు తెల్సు!
పుష్పక్!
"పుష్పక్ కి ఈ మధ్య సమయమూ, సందర్భమూ తెలీడం లేదు"
విసూక్కూంటూ డోర్ తెరిచింది అనిమిష.
అనిమిష ఊహించింది కరక్టే.
ఎదురుగా పుష్పక్ నుంచున్నాడు_ గబుక్కున గది బ్తేటకొచ్చి, కోఅపంగా చూస్తూ.
"ఇక్కడ డిస్టబ్ చెయ్యొద్దని చెప్పానా...." విసురుగా అంది.
"పిచ్చి....అనిమిషా....నిన్నేప్పడూ డిస్టబ్ చెయ్యాలో నాకు తెలుసు గాని....అలా కోప్పడిపోకు....నీకో హేపియస్ట్ న్యూస్ తెచ్చాను...." గొంతు తగ్గించి అన్నాడు పుష్పక్.
"ఏంటది...." తనూ మెల్లగా అడిగింది అనిమిష.
"రవిచంద్ర పాదర్.... హొం మినిస్టర్ నాయుడిని ఎవరో మర్డర్ చేసారు....ఇప్పడే ఫోనోచ్చింది..."
చావు కబురు చల్లగా చెప్పడు పుష్పక్
ఒక్కక్షణం అనిమిష, నమ్మలేనట్లుగా చూసింది.
"ఎస్....అనిమిషా....మీ ఇంట్లో ఫోన్ ఎవరూ లిప్టు చెయ్యడం లేదని, నా రూంకి ఫోన్ చేసి చెప్పారు....పోలిస్ కంట్రోల్ రూం నుంచి ఎవరో చేసారు...."
అనిమిష పెదాలు నెమ్మదిగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి.
మరుక్షణం____