రాత్రి తొమ్మిది దాటేక పిల్లలు నిద్రపోతారు. మగవాళ్ళు కాసేపు టీవీ ముందు రిలాక్స్ వ్వాలని అనుకుంటారు. అప్పుడు క్రైం సీరియల్స్ హారర్ సీరియల్స్ వేద్దాం లేదంటే ఓ ప్యామిలీ డ్రామా, ఓ క్రైం, ఓ హారర్... అలా వేద్దాం.మిడ్ నైట్ రొమాంటిక్ సీరియల్స్ వేయేచ్చు...
వీటితోపాటు సమ్ థింగ్ స్పెషల్ ప్రోగ్రామ్స్ వేద్దాం... రోడ్ మీద నలుగురు వ్యక్తులు నేచురల్ గాఎలా మాట్లాడుకుంటూ వెళ్తారో... కాలేజీ క్యాంటిన్ లో అమ్మాయిల కామెంట్లు, అబ్బాయిల సరదా టీజింగ్ లూ ఎలా వుంటాయో, సికిందరాబాద్ స్టేషన్ దగ్గర రోజూ సాయంత్రాలు మూగవాళ్ళు సైగలతో ఎలా మాట్లాడుకుంటారు, ఇలాంటి ప్రోగ్రామ్స్ సహజంగా ఉంది బావుంటాయి..."
పరమహంస అంకిత్ ను పరిశీలనగా చూశాడు.
'ఏంటి సార్ ఓవర్ ఏమోషనయ్యానా..." డౌట్ గా అడిగాడు అంకిత్.
"లేదు అంకిత్... నువ్వొట్టి గడుగ్గాయివే అనికున్నా... కానీ, ఇంత టాలెంట్ డివి అనుకోలేదు... ఎంత అనర్గళంగా, ప్రతీ ప్రొగ్రం నీ ఎనాలసిస్ చేశావు... అయినా ఈ విషయాలు అన్నీ మిగతా ఛానల్స్ వాళ్లకు తెలియవంటావా?"
"తెలియకపోవచ్చు. తెలిసినా ఇలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు ప్రిపేర్ చేయలేకపోవచ్చు... ఎంతో మందికి రాణి ఐడియా, విమానం కనిపెట్టే విషయంలో రైట్ సోదరలకే ఎందుకు వచ్చింది?"
"యసేస్స్ యూ ఆర్ కరెక్ట్ అంకిత్... నువ్వు చెప్పిన పద్ధతిలో ఫాలో అవడానికి ప్రయత్నిద్దాం... కానీ నీ నెక్స్ ట్ ప్రోగ్రామ్స్ ఏంటీ?"
"రేపు సాయంత్రం సికిందరాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర మూగవాళ్ళతో ఇంటర్యూ సార్"
"మూగవాళ్ళతో ఇంటర్యూ ఏమిటి?"
"వాళ్ళు మాట్లాడలేదు. కానీ సైగలతోఅద్బుతంగా ఒకరితో ఒకరు సంభాషించుకోగలరు. ఆ సంభాషణను ఘాట్ చేద్దాం..."
వెరీగుడ్ ఐడియా... ప్రొసీడ్... వాట్ నెక్స్ ట్?"
"ప్రస్తుతానికి అది సంసేన్స్..." అన్నాడు అంకిత్.
ఆ వాట్ నెక్స్ ట్ ప్రోగ్రామే తన జీవితాన్ని సంచాలనత్మకత మలుపు తిప్పుతుందని ఆ క్షణం అంకిత్ తెలియదు. తెలిస్తే కధ మరోలా వుండేది.
***
చల్లగాలి శరీరాన్ని స్పృశిస్తూ, అందమైన అనుభూతిగా మిగిల్చే ప్రయత్నం చేస్తోంది. చలికాలం కావడం వల్ల ఆరు గంటలకే చీకటీ ఒఅర్డా ఆకాశానికి, భూమికి మధ్య వేలాడుతుంది.
మృదువని రోడ్డు మెడ వచ్చిపోయే జనాన్ని చూస్తూ వాకింగ్ చేస్తోంది. శరణ్య చెప్పిన ఆడ్రస్ ప్రకారం, పెందర్ గాప్ట రోడ్డులో వున్న హాస్టల్ కు వెళ్ళింది.
వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో వుమ్తొన్న ఆ అమ్మాయికి శరణ్య ఫోన్ చేసి క్లుప్తంగా తన ప్రెండు వస్తుందని, కొన్ని రోజులు షెల్టర్ ఇవ్వమని చెప్పింది.
ఆ అమ్మాయి పేరు యమునా. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. ప్రవైట్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కావడంవల్ల, యమునతోపాటు వుండేందుకు, మరో రూమ్మేట్ ఎవరూ లేకపోవడం వల్ల మృదువని పేయింగ్ గెస్ట్ గా తీసుకుంది యమున.
ఆ అమ్మాయి రిజర్వ్డ్ డ్ నేచర్ కావడం కలిసొచ్చింది మృదువని. తన విషయాలు చెప్పనవసరం లేకుండా, మొత్తం ఇరవై ఆరు మంది వున్నారా హాస్టల్ లో ఒక్కో రూమ్ లో ముగ్గురేసి చొప్పున వుంటున్నారు. యమున రూమ్ లో ఒక్కర్తే ఉంటోంది.
ఎలాంటి రిస్పిక్షన్ లేవు. అందరూ ఉదయం వెళ్ళిపోతారు. నలుగురైదుగురు మాత్రం, మద్యాహ్నం వెళ్తారు. యమునా మృదువ ని అందరికీ పరిచయం చేసింది. అందరి ఉద్యోగాలు బీజీవే కావడంతో, ఎవరికీ వారు బెజీగా ఉంటారు.
సాయంత్రం ఆరున్నర ప్రాతంలో వచ్చేసి, ప్రెషన్ అయి, ఏడున్నర, ఎనిమిది కాళ్ళ భోజనం చేస్తారు. తర్వాత ఎవరి గదుల్లో వాళ్ళు వుండిపోతారు. లేదా హాలులో వున్న టీవీ ముందు కూచుంటారు.
ఒక విధంగా ఎ ఇబ్బందీ లేదు. కానీ లోలోపల మాత్రం భయంగానే ఉంది. సాయంత్రం కాగానే అలా చల్లగాలి కోసం బయటకు వచ్చింది.
ఇక్కడకు ఎప్పుడో పదేళ్ళ క్రితం వచ్చింది. అప్పుడు తను చిన్నమ్మాయి. పదేళ్లలో చాలా మార్పు వచ్చింది. కొత్త బిల్డింగ్న్ లు, పెరిగిన టాపిక్... ప్లే ఓవర్లు... అంతా హడావడే... దీల్లీని మిమ్చేలా అనిపించింది భావిశాత్ట్ లో హైదరాబాదు.