చిన్నపిల్లలు చడీచప్పుడూ లేకుండా సెన్సియర్ వద్ద, సైన్సు భవనాలనీ, సాహిత్య భవనాలనీ ఆక్రమించారు.
ప్రదర్శన ప్రశాంతంగా, క్రమబద్దంగా సాగడానికి ప్రభుత్వం కమ్యూనిస్టుల మీద ఆశలు పెట్టుకుంది.
సార్వత్రికసమ్మె విషయంలోనూ ఇంతే.
అన్ని పెద్ద పట్టణాలలోనూ ఊరేగింపులు ఎన్నో మధ్యరకంపట్టణాలలోనూ, చాలా గ్రామాల్లోనూ కూడా.
రంగస్థలం మీద సంఘటన దుసప్నంగా ముగిసింది. దాని ధనితరంగాలు మాత్రంనిజాయితీ పరులకుసిగ్గూ, గుడ్డివాళ్ళకి దిగ్ర్భాంతీ, అర్ధం చేసుకున్న వాళ్ళకి ఆగ్రహమూ కలిగించాయి. ఏదీ పైకి కనబడకపోయినా భూకంపపు కెరటాలు భూమిని తొలచినట్లు పైపెచ్చు కదిలిపోయింది. భావ చిత్రాలతో బ్రతుకుతోంది దేశం. తమ సూన్యంలో తలలు దాచుకున్నకొన్ని ఉష్ట్రపక్షులు మాత్రందీన్నేమీ పట్టించుకోలేదు.
అత్యంతోత్కృష్టమైన మేడే సందర్భాలలోకనిపించే వినీలమైన పారిస్ నగరాకాశం కింద, పట్టపగటివెలుగులో యావత్ ప్రజానీకమూ గుమిగూడుతోంది.
యూనియన్లూ, పార్టీలూ ప్లేస్ డీలారి పబ్లిక్ నుంచి బయల్దేరాయి. యువకులు డెలే రైల్వేస్టేషన్ నుంచి.
చేరి అంతా చర్యకు దిగితే చీలికలు నాశనమవుతాయి.
మధ్యాహ్నం గడిచేసరికి, రెండు ప్రదర్శనలూ ఒకటైపోయాయి. మధ్య స్థలమంతాప్రజలతో నిండిపోయింది.
వర్తమానాన్నెదిరించి, భవిష్యత్తు కోసం పోరాడిన యువతభవ్యమైన భూతకాలానికి ప్రాణప్రతిష్ట చేసింది.
కాని ఇది లక్షలాది ప్రజలజాతర మహోత్సవం.
యావత్ప్రజలూ పాల్గొన్న ఆఖరి ఎర్రతిరుణాల.
వీధుల్లో "ప్రజ" కిటికీల్లోబూర్జువా ప్రజ.
ఒకప్పుడు ఎదిరింపుగా, ఇప్పుడు సయంసంతృప్తిగా సాగించినకర్మకాండ.
మతగురువులుకూడా చేతలూ, చేతులూ కలిపిహుందాగా నడుస్తున్నారు.
పార్టీమనుష్యులు, యూనియన్ మనుష్యులు, మేధావులుకూడా అద్భుతంగా ఉంది ఊరేగింపు. అన్ని ఊరేగింపుల్లాగే అంతేకాదు అన్నింటినీ మించిపోయింది.
ఎంచేతంటే, ఇలా జరుగుతుందని చెప్పలేనిదిప్పుడు దగ్గరపడింది. ఫాక్టరీలూ కార్మిక వర్గ ప్రాంతాలూ అదుపులో ఉంచ శక్యంకానంతగా తిరగబడుతున్నట్లు టెలిఫోన్ వార్తలు చెబుతున్నాయి.
కాబట్టి కాకలు దీరిన కావలికుక్కలు, విశాసపాత్రమైన స్టాలినిస్ట్ దళాలురంగంలోకి దిగాలి.
పదిలక్షల మంది ప్రజలతో పోలీసులు పోరాడలేరుకాబట్టి, పది లక్షల మంది ప్రజలుప్రభుత్వ భవనాలనుసులువుగా ఆక్రమించగలరు. కాబట్టి, చతికిలబడ్డ ప్రభుత్వ భూతంపది.
లక్షలమందిని కాల్చి చంపవలసిందిగా ఉత్తరులియ్యలేదు. ఇది ఎందరికో స్పష్టంగా కనబడుతున్న సత్యం. అందుకే కమ్యూనిస్టులూ, యూనియన్లూ తమప్రజలపట్ల పోలీసులుగా ప్రవర్తించడం. ఏ బెడదా లేకుండా అధికారాన్ని హస్తగతం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ.
సెయింట్ మైఖేల్ రహదారి చేరగానే, విద్యార్ధుల లౌడ్ స్పీకర్లు వీధిపోరాటాల్లోనూ, పోలీసు స్టేషన్లలోనూ గాయపడ్డకామ్రేడ్ ల కోసం నిశ్శబ్దంపాటించాలని విజ్ఞప్తి చేస్తాయి. అంతటానిశ్శబ్దం.
డెన్ ఫేర్ రోషెరో వద్ద ఊరేగింపు అంతమవుతుంది. పిల్లలు ప్ర్రారంభించినచోట పెద్దలు ముగించుతున్నారు. చేదుగా పిల్లలు చిరునవ్వుతున్నారు. డెన్ ఫేర్ కూడలివద్ద రాతి సింహపు విగ్రహం మూర్ఖపుమొగం వేసుకుని కూర్చుంది.
వేలకొలదినయం నియమిత రక్షకభటులు పట్టుదలగా ఉన్నారు. డెన్ ఫర్ వద్దవీరి లౌడ్ స్పీకర్లు, మొదటమృదువుగా తర్వాతకరుకుగా ఆరగో రహదారివైపుక్రమబద్దంగా- చెదిరిపోవలిసిందిగా కోరుతాయి.
మంచి చాకచక్యంతో ఒక కమ్యూనిస్టు చక్రదళం అవతలివైపుకి గుంపుల్ని నడిపిస్తుంది. అవతల, చక్రదళానికి వెలుపల విద్యార్ధులూ, చిన్న పిల్లలూ ఉన్నారు. ఒక లౌడ్ స్పీకర్ నుండి వినబడీ వినబడనట్లు ప్రకటన; "ఇష్టమైన వాళ్ళు టెలివిజన్ సెట్ల వద్దకు పోవచ్చు. విద్యార్దులారా! యువకార్మికులారా! రాస్సెల్ రహదారివైపు నడవండి..."
లెక్కలేనన్నికన్నాలున్న బ్రాహ్మాండమైన జల్లెడ. ప్రవాహంలో మనం కలిసిపోయి చట్రాన్ని చీల్చుకుని అవతలివైపుకు వెళతాము. అక్కడ మన స్నేహితులు మంత్రించినట్లు ప్రత్యక్షమవుతారు.
మార్స్ గార్డెన్ దిశగా, ఈఫిల్ టవర్ వద్ద ఒక పార్కు ఆకు పచ్చని ఆ చతుర్బుజపుస్థలంలో సతంత్రుల, సమరయోధులసమావేశం శాసనసభగా మారుతోంది.
జనసమూహంకూర్చుని ఉంది. మిలిటెంట్లు మాటాడుతున్నారు; సాగిన ఊరేగింపు గూర్చి, సాగబోయేపోరాటం గురించి.
ఊదారంగు ఆకాశం.
చీకటిపడుతున్న కొద్దీ సతంత్ర ప్రజల అన్ని సమావేశాలలోలాగానే ఒకే ఒక కర్తవ్యం ముందుకొచ్చింది.
"లాసోర్బాన్!" (సోర్భాన్ వైపుగా)
అయేనావంతెన కిందనిశ్చలంగా పోలీసులు దాక్కున్నాడు. ప్రదర్శనకు క్రితం రాత్రి వీరిని లాటిన్ కార్టార్ నుంచీ, సోర్బాన్ నుంచీ ఉపసంహరించారు. ఇంకా వాళ్ళక్కడే ఉండరు కదా.
ఈ విధంగా విద్యార్ధులు తను కోటలు గెలుచుకున్నారు. పార్టీలూ, యూనియన్లూ, తమ ప్రదర్శనంనిరహించుకొని, తమ సైన్యదళాలనుకాపాడుకున్నాయి. అశరీర ప్రభుతంతన చర్మాన్నికాపాడుకుంది.
దేశంలో మిగిలిన అనేక ప్రాంతాలలో పోలీసు స్టేషన్లు మిలిటెంట్లు ముట్టడించారు. జనాభా, కార్మికులూ, విద్యార్దులూ దగ్గరకొచ్చారు. ఎక్కడో చెదురుగా తప్ప, సరత్రా పోలీసులే మాత్రమూ కలిగించుకోలేదు. ఎన్నో చోట్ల పోలీసుకార్యాలయాల్లోనే బారికేడ్లు నిర్మించుకున్నారు.
సమ్మెసంతృప్తి కలిగించినట్లు అంకెలు చెబుతున్నాయి. అది యూనియన్ల పిలుపు ప్రకారం సాగిన సమ్మె. "సంతృప్తికరం"గా మాత్రమేజరిగింది. ఆ సంగతి మరచిపోకూడదు.
10
అనుగుతల్లి, తియ్యని తల్లి
గారాలతల్లి, మనందరికితల్లి
సోర్బాన్: ఆల్మామేటర్ (అనుగుతల్లి)
సోర్బాన్ప్: మేటర్ డల్సిస్సిమా, మేటర్ అమాటిస్సిమా, మేటర్ నోస్ట్రా.
ఆల్మామేటర్ కి మానభంగం చెయ్యడి.