అరచేతికి గుచ్చుకున్నాయి రెండు గాజుముక్కలు.
"అయామ్ రెడీ ఫర్ యువర్ ఛాలెంజ్. ఒన్ ఇయర్... ఒన్ ఇయర్... సంవత్సరం గడువిస్తున్నాను. బిలియన్లకు పడగలెత్తిన నన్ను పెన్నీలెస్ పాపర్ ని చేయాలి. చేయగలరా... అదీ మీరనుకున్న ఆర్డినరీ కామన్ యంగ్ లేడీ చేత... ట్రై యువర్ లక్... ఐ లైక్ బెట్స్... బెట్ లేకపోతే ఇండియాకు మహాభారతమే లేదు... మానవ జీవితమే లేదు.
దిసీజ్ ఛాలెంజ్ బిట్వీన్ యు అండ్ మీ... బెట్ ఎంతో చెప్పండి" పౌరుషంగా అన్నాడు మహంత.
వెంటనే బదులివ్వలేదు అతను.
"మిస్టర్ దేశ్ ముఖ్... నన్ను ఢీ కొనడం అమెరికన్ స్పేస్ షిప్ ని ఢీ కొనడం లాంటిదని మీకు తెలుసు... మీరు వెనక్కి తగ్గిపోయినా నేనేమీ అనుకోను... మరోసారి ఆలోచించుకోండి."
"నేను ఆలోచిస్తోంది మీ గురించి... నువ్వు ఓడిపోతే సూసైడ్ చేసుకోకూడదు."
సూసైడ్!
వరల్డ్ రిచ్చెస్ట్ పర్సనాలిటీస్ మెంటాలిటీ తెల్సిన దేశ్ ముఖ్ అలా అనగానే వులిక్కిపడ్డాడు అతను.
"నేనంత పిరికివాడ్ని కాదు... డోంట్ ఫుట్ మి ఇంటూ సైకలాజికల్ ఫియర్. ఎస్... నేనే... ఓడిపోతే... నా ఎంపైర్ ని మీకిచ్చేస్తాను. దిసీజ్ ట్రూ... నా బర్త్ డే సాక్షిగా చెప్తున్నాను. మరి... మరి మీరు ఓడిపోతే?"
"చెప్పు... ఏం చేయమంటావో చెప్పు" కూల్ గా అడిగాడాయన.
"నా దగ్గర ఫోర్తు క్లాస్ ఎంప్లాయిగా పని చేయాలి" క్రూడ్ గా అన్నాడతను.
"ఓ.కె." రెండు క్షణాల తర్వాత బదులిచ్చాడు దేశ్ ముఖ్.
"ఒక్క షరతు మిస్టర్ దేశ్ ముఖ్... ఈ బెట్ మనిద్దరి మధ్యే... ఈ విషయం మీకూ, నాకూ తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు. దిసీజ్ ఏన్ ఇంటలెక్చువల్ బ్రెయిన్ గేమ్. ట్రీట్ ఇట్ లైక్ దట్ అండ్... మేక్ ష్యూర్ ఆఫ్ ఇట్ దట్... ఇన్ ఎనీ మేనర్... వయొలెన్స్ షుడ్ నాట్ బీ ప్రమోటెడ్."
"ఓ.కె... నేను గానీ, నా వాళ్ళు గానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా రైఫిల్ ని పట్టుకోకుండా చూసే బాధ్యత నాది. మరి నువ్వు?" అడిగాడు దేశ్ ముఖ్.
"ఏ పరిస్థితుల్లోనూ నేను మీకు ప్రాణహాని తలపెట్టను" కూల్ గా చెప్పాడతను. చెప్పి-
చేతి వాచీ చూసుకున్నాడు.
"మిస్టర్ దేశ్ ముఖ్... మన బెట్ ఈ క్షణం నుంచీ ప్రారంభమౌతుంది. మనం ఇండియన్ టైమ్ అండ్ డేట్ ని ఫాలో అవుదాం... ఏమంటారు?"
"యాజ్ యూ లైక్ మేన్" లేచి నిలబడ్డాడు దేశ్ ముఖ్.
ఇద్దరూ పక్క పక్కనే మౌనంగా నడుస్తున్నారు.
"ఒన్ మినిట్ ప్లీజ్" మళ్ళీ వెనక్కి వెళ్ళాడు మహంత. చేతిలో వీడియో డిస్క్ తో అతని దగ్గరకొచ్చాడు.
"బెట్ మనిద్దరి మధ్య అయినా అందుకు సాక్ష్యం అవసరం. దిసీజ్ ద డిస్క్... ఈ పదిహేను నిమిషాలసేపు మన డిస్ కషన్ ఈ డిస్క్ లో వుంది. ఎప్పుడు ఏం అవసరం వస్తుందో చెప్పలేం కీప్ విత్ యూ" ఆ డిస్క్ ని అతని చేతిలో పెట్టాడు మహంత.
ఇద్దరూ రన్ వే మీద నడుస్తున్నారు.
"నన్ను ఫోర్తు క్లాస్ ఎంప్లాయిగా చూడడం నీ సరదా కదూ?" తల తిప్పి అడిగాడతను.
"ఎస్... ఎందుకంటే నా లక్, హైట్స్ కి అదొక స్టేటస్ సింబల్ కావాలి మేబీ ఇటీజ్ క్రూయల్... బట్... ఇట్స్ మై విష్" కన్పించని క్రూరత్వం మహంత మనసులో.
"ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మహంతా" పదినిమిషాల తర్వాత తన ఫ్లైట్ ఎక్కబోతూ అన్నాడు అతను.
"ఐ టూ సేమ్ దేశ్ ముఖ్. మధ్యలో మనం ఒకటి రెండుసార్లు ఫోన్లో మాట్లాడుకుంటే బావుంటుంది" జాలిగా నవ్వుతూ అన్నాడతను.
"వైనాట్ ష్యూర్... ష్యూర్" ముందుకు నడుస్తూ అన్నాడు దేశ్ ముఖ్. అప్పటికే అతని పి.ఎ. ఇద్దరు అసిస్టెంట్లు ఫ్లయిట్ ఎక్కేశారు.
"సీయూ మిస్టర్ మహంతా..." అని చెప్పి పక్కకు తిరిగి ఏదో జ్ఞాపకం వచ్చి, మహంత ముఖంలోకి చూసి-
"నీ బర్త్ డే పార్టీలో నీ కొడుకు కన్పించలేదు కదూ... ఏం" అడిగాడతను.
"హి ఈజ్ బిజీ" వెళ్ళిపోయే ముందు దేశ్ ముఖ్ సడన్ గా తన కొడుకు గురించి ఎందుకు అడిగాడో అర్ధంకాలేదు అతనికి.
మరికొద్ది నిమిషాల తర్వాత-
దేశ్ ముఖ ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది.
ఎయిర్ పోర్టు నుంచి హాలిడే రిసార్ట్ కి వస్తున్న అతను దేశ్ ముఖ్ తో తను చేసిన ఆర్గ్యుమెంట్ అంతా జ్ఞాపకానికొస్తోంది.
తను తొందరపడ్డాడు. నో... నో...
దేశ్ ముఖ్ సీరియస్ నెస్ ఎలాంటిదో తనకు తెలుసు.
డెడ్ లీ ప్లాన్స్, డేంజరస్ ప్లాన్స్, ఇంటెలిజెంట్ ప్లాన్స్... అత్యద్భుతంగా వేయగలిగిన వ్యక్తి అతను.
అతను ఇండియాలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచే తన ఛాలెంజ్ మీద వర్కవుట్ చేస్తాడు.
బీ కేర్ ఫుల్ మేన్... బీ కేర్ ఫుల్... మహంత బ్రెయిన్ హెచ్చరిస్తోంది.
ఏదో తెలియని భయం ప్రవేశించింది అతనిలో.
వరల్డ్ గ్రేటెస్ట్ అండ్ రిచ్చెస్ట్ పీపుల్ గెస్టులుగా వచ్చిన తన బర్త్ డే పార్టీ చివర అనుకోకుండా తలెత్తిన ఈ ఛాలెంజ్ వరల్డ్ గ్రేటెస్ట్ ఈవెంట్ గా చరిత్రలో నిలిచిపోతుందన్న విషయం-
మహంత ఊహించని విషయం!
* * * *
స్పెయిన్లో...
ఈ సంఘటన జరిగి నలభై అయిదు నిమిషాలైంది.
ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ లో...
రాయలసీమలోని కడపకు యాభైమైళ్ళ దూరంలో వున్న కుగ్రామంలో...
రాత్రి 10-20 నిమిషాలైంది.
ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో వుంది నేషనల్ హైవే. ఆ నేషనల్ హైవేకి ఒక పక్కన, ఓ టీ బడ్డీ చీకట్లో తాబేలులా వుంది.
అదే సమయంలో...
గాజుకళ్ళ ముసిల్దానిలా మసక హెడ్ లైట్స్ తో వచ్చిన ఓ డొక్కు బస్సు టీ బడ్డీ పక్కన రోడ్డు మీద ఆగింది.
ఆ బస్సులోంచి ముగ్గురు వ్యక్తులు దిగారు.