Previous Page Next Page 
ఆక్రోశం పేజి 10


    ఆ మాటకు రాబర్టు మర్చంట్ తెల్లమొహం పెట్టాడు.

 

    "మన ఇంటెలిజెన్స్ క్రూ... సిటీని గాలిస్తున్నారు. మిస్టర్ చీఫ్! విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్! ఉయ్ విల్ గెట్ ఇన్ఫర్మేషన్..."

 

    ఆ మాటల్ని వినిపించుకోలేదు మహంత.

 

    అతని మనసంతా ఆందోళనతో నిండిపోయింది.

 

    సరిగ్గా...

 

    అదే సమయంలో...

 

    కార్డ్ లెస్ టెలిఫోన్ మోగింది.

 

    ఆతృతగా అందుకున్నాడు రాబర్టు మర్చంట్.

 

    రెండు నిమిషాల తర్వాత ఫోను ఆఫ్ చేశాడు.

 

    "మిస్టర్ చీఫ్! దేశ్ ముఖ్ మలయా ఎయిర్ పోర్టులో వున్నాడు"

 

    మలయా ఎయిర్ పోర్టు శుక్రవర్ణ మహంత, పర్సనల్ ఎయిర్ పోర్టు. లీజర్ అవర్ రిసార్టుకి అది అయిదు కిలోమీటర్ల దూరంలో వుంది.

 

    తన పుట్టినరోజు ఫంక్షన్ కి వచ్చిన రాయల్ గెస్టుల్లో ఏ ఒక్క గెస్టుకీ ఆ ఎయిర్ పోర్టుని చూపించలేదు మహంత!

 

    దానిక్కారణం...

 

    డి.సి.8 పర్సనల్ ఫ్లైటు... దాదాపు ముప్పై ఒక్క అమెరికన్ మిలియన్ డాలర్ల ఖర్చుతో డి.సి.8, ఫ్లైటుని తయారుచేయించాడు అతను. అతని బిజినెస్ లైఫ్ కి డి.సి.8 ఒక డ్రీమ్!

 

    గోల్డ్ ప్లేటెడ్ ఫాసెట్సు. గోల్డ్ ప్లేటెడ్ సీటు బెల్టులు, స్పెషల్ బెడ్ రూమ్, షాండిలీర్స్, స్పెషల్ బాత్రూమ్, మీటింగ్ రూమ్స్, కంప్లీట్ కిచెన్, గోల్డ్ సిల్వర్ ప్లేటెడ్ కిచెన్ వేర్...

 

    అతను నిర్మించుకున్న ఆకాశంలో స్వర్ణభవనం డి.సి.8... డి.సి.8 నేలమీద చూసినవాడెవడైనా, ఏ జైపూర్ కోటలోంచో ఒక ప్యాలెస్ పార్టుని తీసి విమానంగా మార్చినట్టు వుంటుంది ఆ ఫ్లైట్...

 

    ఆ ఫ్లైటు ప్రత్యేకతలు... ఒకసారి నింపిన ఇంధనంతో, దాదాపు పదిహేను గంటలసేపు నిరాఘాటంగా ప్రయాణం చెయ్యొచ్చు. అలాగే ఆ ప్లైట్లోని మహంత బెడ్ రూమ్ నుంచి ప్రపంచంలో ఏ ప్రాంతానికయినా ఫోను ద్వారా మాట్లాడగలిగే సదుపాయం... అలాగే ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఏ మారుమూల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అవసరమైన శాటిలైట్ స్పెషల్ నెట్ వర్క్ వుంది.

 

    ఇంకో విశేషం...

 

    ఆ ఫ్లైట్ లో అమర్చిన ఎలక్ట్రానిక్ మేప్... ఫ్లైట్ ఆకాశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, విమానం ఏ దేశంలో, ఏ ప్రాంతంలో వుందో ఆ ఎలక్ట్రానిక్ మేప్ స్పష్టంగా ఎప్పటికప్పుడు తెలియచేస్తుంది.

 

    ఈ విమానం నడపడానికి అమెరికా నుంచి ఇద్దరు స్పెషల్ పైలెట్స్ ని తెప్పించాడతను.

 

    తన ప్రత్యేక రూపకల్పనలో అపురూపంగా తయారయిన ఆ విమానం గురించి అందుకే ఎవరికీ చెప్పలేదతను.

 

    మలయా ఎయిర్ పోర్టు వేపు ఎవరూ వెళ్ళకుండా అవసరమయిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాడతను.

 

    కానీ దేశ్ ముఖ్ అక్కడికెలా వెళ్ళగలిగాడు?

 

    అసలు దేశ్ ముఖ్ కి ఫ్లైటు విషయం ఎలా తెలిసింది? ఎందుకు వెళ్ళాడు?

 

    అసలు దేశ్ ముఖ్ ఇక్కడికెందుకొచ్చాడు?

 

    సరిగ్గా పదినిమిషాలు గడిచాయి.

 

    మలయా ఎయిర్ పోర్టులో డి.సి.8 ఫ్లైట్లో వున్నాడు మహంత.

 

    విశాలమైన ఫ్లైట్ లో ఒక్కడే తిరుగుతున్న దేశ్ ముఖ్ ని చూసి ఆశ్చర్యపోయాడు మహంత.

 

    "దిసీజ్ మై డ్రీమ్! మీరు చూస్తానంటే నేనే స్వయంగా మిమ్మల్ని తీసుకొచ్చి చూపించేవాడ్ని" ఎలా అనాలో తెలీక అన్నాడు మహంత.

 

    "ఇండియాలోని తాజ్ మహల్లా వుంది. దిసీజ్ ఫ్లయింగ్ మాన్యుమెంట్... యామై కరెక్ట్?" పొగిడాడు దేశ్ ముఖ్.

 

    ఈ ఫ్లైట్ లో పైలెట్స్ క్కూడా తెలీని సీక్రెట్స్ కొన్ని వున్నాయి. వాటిని వూహించి తెలుసుకోడానికి వచ్చాడా దేశ్ ముఖ్.

 

    ముఖం ప్రసన్నంగా ఉన్నా మనసు సీరియస్ గా ఉంది మహంతకు.

 

    స్పెషల్ పర్సనల్ బార్ రూమ్ లోకి అడుగుపెట్టాడు మహంత.

 

    "కమాన్ సాబ్! లెటజ్ హేవ్ ఫన్" బటన్ నొక్కాడతను.

 

    రెండు అందమైన, నాజూకయిన గ్లాసులు టేబుల్ కిందనుంచి పైకొచ్చాయి.

 

    ఆ రెండు గ్లాసుల నిండా డ్రింక్.

 

    పారిస్ మేడ్ ఫ్రూట్ మిక్చర్ జిన్.

 

    "ఇంకా అరవై నిమిషాలు మాత్రమే టైముంది" సీట్లో రిలాక్స్ అవుతూ గ్లాస్ ని చేతిలోకి తీసుకుంటూ అన్నాడు దేశ్ ముఖ్.

 

    "దేనికి?" అడిగాడు మహంత.

 

    "మరీ ఎక్కువగా ఆలోచించకు... వర్రీలో పడతావ్. బొంబాయిలో బిజినెస్ కాన్ఫరెన్స్ వుంది... వెళ్ళాలి" డ్రింక్ ని సిప్ చేస్తూ చెప్పాడు దేశ్ ముఖ్.

 

    "నా డి.సి.8 ఫ్లయిట్ లో సరిగ్గా గంట తర్వాత మీరు బయల్దేరితే సరిగ్గా ఐదు గంటల తర్వాత మీరు బొంబాయిలో వుంటారు" తన ఫ్లయిట్ స్పెషాలిటీని గర్వంగా చెప్పాడు మహంత. (ఇలాంటి అద్భుతమయిన ఫ్లయిట్ అద్నాన్ ఖషోగీకి వుంది.)

 

    పెదవులతోనే నవ్వాడు దేశ్ ముఖ్.

 

    "టైమ్ సార్! ఐ బిలీవ్ టైమ్... ఐ రెస్పెక్ట్ టైమ్... కాలంతో పరుగెత్తగలిగే వాడికి కాలం అనుకూలిస్తుంది. టైమ్ అండ్ లక్... వీటి విషయంలో మీకు చిన్నచూపు... కానీ ఇవాళ నన్నూ, నా పరిస్థితినీ చూశారు కదా! మీ దగ్గర పనిచేసిన పాతికమంది ఎగ్జిక్యూటివ్స్ లో వకడిగా వున్నవాడ్ని నేడు నా బిజినెస్ టర్నోవర్ ఎన్ని బిలియన్ డాలర్సో నాకే తెలీదు" గర్వంగా అన్నాడతను.

 

    "టైమ్ అండ్ లక్ గురించి ఎప్పుడో మనం మాట్లాడుకున్నాం. అవునా?" జ్ఞాపకం తెచ్చుకోడానికి ప్రయత్నించాడు దేశ్ ముఖ్.

 

    "ఎస్... ఎస్. నన్నింత వాడ్ని చేసినవి టైమ్ అండ్ లక్... టైమ్ ఈజ్ మై గ్రేటెస్ట్ ఎస్సెట్, అండ్ ఐ షల్ రిజిట్ మై సెల్ఫ్ టు ఇట్. ఆన్ ఎ బడ్జెట్ సిస్టమ్... విచ్ ప్రొవైడ్స్ దట్... ఎవ్వెరి సెకండ్ నాట్ డివోటెడ్ టు స్లీప్... షల్ బీ యూజ్ డ్ ఫర్ సెల్ఫ్ ఇంప్రూవ్ మెంట్- అదే నా లక్" ఆ మాటలు చెపుతున్నప్పుడు మహంత కళ్ళల్లో మెరిసిన మెరుపుని గమనించాడు దేశ్ ముఖ్. దేశ్ ముఖ్ గ్లాస్ ఖాళీ అయ్యింది.

 

    "నీతో ఆర్గ్యూ చేయడం నాకిష్టం లేదు. బట్... నా పాయింటు నీకు తెలుసు అదే మళ్ళీ చెపుతున్నాను... టైమ్ అండ్ లక్ కాలం, అదృష్టం నీకు టెంపరరీ అదృష్టాన్నిస్థాయి. నిన్ను బిలియనీర్ ని చేస్తాయి... నిన్ను ఆకాశంలోకి తీసుకెళతాయి. కానీ అవ్వన్నీ టెంపరరీయే... స్పాన్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్... కొన్ని సంవత్సరాలు... అందుకే వాటిని కాలం, అదృష్టము అంటారు" నవ్వాడు దేశ్ ముఖ్.

 Previous Page Next Page