టికెట్లు కావాలా అని అడిగితే కావాలనో, వద్దనో అనాలి గానీ అంతగా బాధపడే విషయం అందులో ఏముందో అర్ధంకాక ఆ వ్యక్తి తెల్ల బోయాడు.
* * * *
"ఇక్కడ కూర్చుందాం..." అన్నాడు బ్రహ్మాజీ పార్కులో ఓ మూలగా సిమెంట్ బెంచ్ దగ్గర ఆగి.
రాంపండు ఊ అనలేదు, అఆనలేదు. ఏం మాట్లాడకుండా ఆ సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాడు. బ్రహ్మాజీ అతని ప్రక్కన కూర్చున్నాడు.
"ఊ! ఇప్పుడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లెం?" అడిగాడు బ్రహ్మాజీ.
"నిన్న నువ్వు చెప్పిన ప్లాన్ అట్టర్ ప్లాఫ్ అయ్యింది!" ఆముదం మొహం పెట్టి అన్నాడు రాంపండు.
"ఏం? ఏదైనా చెత్త సినిమాకి తీసుకెళ్లావా?"
"ఊహు! ఆమె కోరిన సినిమాకే తీసుకెళ్లా.కానీ మేం వెళ్ళేసరికి హౌస్ పోల్ అయ్యింది."
"ఏం! కనీసం బ్లాక్ లో టిక్కెట్లు అమ్మలేదా ఎవరూ?"
"ఎందుకు అమ్మలేదూ... చాలా చక్కగా అమ్మారు."
"మరిహనేం" బ్లాక్ లో టిక్కెట్లు కొనండాల్సింది. పది రూపాయలు ఎక్కువ ఖర్చువుతుందని ఎవడైనా పెళ్లాంతో గొడవ పెట్టుకుంటారటయ్యా?" మందలింపుగా అన్నాడు బ్రహ్మాజీ.
"అంతే... మరేమో... బ్లాక్ లో టిక్కెట్లు కొందామనే అనుకున్నాను. కానీ..." నసిగాడు రాంపండు.
"కానీ...?"
"అలా బ్లాక్ లో టిక్కెట్లు కొనడం నా పాలసీ కాదు. అందుకని వాళ్ళు అమ్ముతున్నా ముందు కొనలేదు. కానీ రాజీ బాధ పడలేక కొందామని అనుకునే లోగా అవి కాస్తా అయిపోయాయ్" నెట్టి కొట్టుకుంటూ అన్నాడు రాంపండు.
"అంతే బ్లాకు టిక్కెట్లు అయిపోకపోయివుంటే నువ్వు కొని వుంటే వాదివేకడూ?" అడిగాడు బ్రహ్మాజీ.
"అంతే కదా మరి?"
"మరి అప్పుడు నే పాలేసీ ఏమి వుండేది రాపండూ! అందుకే పెళ్ళా ఫస్టు పాలసీ నెక్స్ టు .అయినా వేరే సినిమాకి తీసుకెళ్ళలేకపోయావా?"
"తీసుకేళదామనే అనుమున్నా. కానీ అంతదాకా ఆగితే కదా! నన్ను వదిలి పెట్టి ఆటోలో రయ్యిమని రాకెట్ లా వెళ్ళిపోయింది." వెర్రి మొహం వేసుకుని అన్నాడు రాంపండు.
"ఒక్కర్తే...?"
"ఆ! సుబ్బరంగా."
"అయితే మీ యిద్దరకీ మళ్ళీ మాటలు లేవన్నమాట!"
బుర్రకాయ్ వూపాడు రాంపండు.
"అయితే నీ ఖర్మ అనుభవించు. డానికి నన్నేం చేయమంటావు?" అన్నాడు బ్రహ్మాజీ.
రాంపండు రెండు క్షణాలపాటు ఆలోచించి యిలా అన్నాడు. "అది కాదురా బ్రహ్మం! నీకూ మీ ఆవిడకీ ఇలాంటి గావుదవాలెం రావా?"
"ఊహు! ఏమో మరి.... రావనుకుంటా.అబ్బే_ లేదే?" అన్నాడు బ్రహ్మాజీ.
రాంపండుకీ చిరెత్తుకువచ్చింది.
"ఏంటా సమాధానం? మేకు గొడవలు వస్తాయా రావా అని ఆ విషయం చెప్పు."
"నువ్వు చెప్పే విషయాలకైతే రావు.నేను సినిమాకి వెళదాం అని అంతే వెళదాం అంటుంది. లేదూ అంతే సరేనంటుంది. ఇందులో పడ్డగా గొడవ పాడేది ఏముంది చెప్పు?"
"అదృష్ట వంతుడివి. సరేగానీ ఇప్పుడు నన్నేం చెయ్యమంటావో చెప్పు?" దీనంగా మొహం పెట్టి అడిగాడు రాంపండు.
బ్రహ్మాజీ ర్మ్పండు వంక ఆశ్చర్యంగా చూశాడు.
"ఇమాట చిన్న చిన్న విషయాలకి అంతగా అలోచిస్తావెంటీ? అదీ ఈ విషయంలో నేనేం సలహా యిస్తాను?" అన్నాడు.
"ఇది నీకు చిన్న విషయం అనిపించోచ్చు గానీ రాజీ చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది, ప్రవర్తిస్తుంది. పోనీలే సినిమాకి ఈ వేళకాకపోతే రేపు వెళ్ళొచ్చులే ఇప్పుడు కొంపలు మునిగే నష్టం ఏముందీ అనుకోదు."
"అయినా ఆమె మాట్లాడకపోతే నీకేంటి నష్టం? నువ్వూ మాట్లాడకు. చచ్చినట్లు తనే దిగి వస్తుంది."
"మా నాయనే! అది అంత ఈజీ అయితే నాకీ బద ఎందుకూ? తాను అస్సలు దిగి రాదు. ఏదో విధంగా నేను తనని ప్రసన్నం చేసుకోవలసిందే!"
"సరే! ఇప్పుడు నేన్నేం చేయమంటావు?" అడిగాడు బ్రహ్మాజీ.
"పామిలీ విషయాలన్నాక ప్రతి రోజూ ఏదో ఒక గొడవ వస్తూంటుంది.ప్రతి రోజూ నీకు నేనెక్కడ సలహాలిచ్చి చావానూ?"
"ఒరేయ్! ఒరేయ్! అలా అనకురా బ్రహ్మం. ప్రస్తుతం సిచ్యూవేషన్ చాలా సీరియస్ గా వుంది. అందుకే సలహా అడుగుతున్నా....తను పుట్టింటికి వెళ్ళడానికి సూట్ కేస్ కూడా సర్దేసుకుంది" ప్రాధేయపడుతూ అన్నాడు రాంపండు.
"వెళితే వెళ్ళనీ! హాయిగా నలుగు రోజులు రెస్ట్ తీసుకుంటుంది. నీ క్కోడా మానసికంగా రెస్టు దొరుకుతుంది."
"అది కాదురా! పాపం రాజీని బాధపెట్టి ఆమెకు దూరంగా నేనుండలేన్రా..."
"అదీ నీ వీక్నెస్! అదే నేనైతేనా మా ఆవిడ్ని అస్సలు కేర్ చెయ్యను. అందుకే అది నా కెప్పుడూ లొంగి వుంటుంది" గర్వంగా అన్నాడు బ్రహ్మాజీ.
"సరేలేరా బాబూ! నీలాగా అందరకీ సాద్యం కాదు కదా. నేను కేర్ చేస్తుంటేనే పరిస్థితి యిలా వుంది. కేర్ చేయ్యాకపోతే నరకం చూపిస్తుంది. అనవసరమైన వాదనేందుకుగానీ ప్రస్తుతానికి ఓ సలహా పారేయ్"బ్రహ్మాజీ క్షణంపాటు అలిచించాడు. తర్వాత యిల అన్నాడు_
"ప్రస్తుతం నువ్వు శెలవులోనే వున్నావు కదా.ఎక్కడికయినా జాలీ ట్రిప్ వెయ్యి. ఏ గోవానో, మైసూర్, బెంగుళూరో, ఎక్కడ అక్కడకి..."
అతను ఆలోచనగా మొహం పెట్టాడు.
* * * *
బ్రహ్మాజీ డోర్ బెల్ నొక్కాడు.
నలుగు క్షణాల తర్వాత తలుపులు తెరుచుకున్నాయి.
ఎదురుగా అతని భార్య దుర్గ!
"ఇప్పుడు టైమెంతయ్యింది?" అడిగింది దుర్గ.
బ్రజ్మజీ వాచ్ వంక చూసి "ఏడున్నర" అని చెప్పి లోపలకి వెళ్ళబోయాడు.
"ఆగండి..." చాతీమీద చెయ్యేసి వెనక్కు తోసింది దుర్గ.
"మీ ఆఫీసు ఎంతదాకా?" అడిగింది.
"అయిదుదాకా..." మెల్లిగా సమాధానం చెప్పాడు బ్రహ్మాజీ.
"మరి ఇంతదాకా ఎక్కడ తిరిగారూ?" కొరకొరా చూస్తూ అడిగింది దుర్గ.
"నేనా? నేనెక్కడ తిరుగుతనూ భలేదానివే... మా ఆఫీసులో సర్వోత్తమరావు అని సర్వనికృష్టరావు వున్నాడుగా. అతను ఏదో అర్జంట్ ఫైలొకటి వుంటే ఆఫీసులోనేవుంచేశాడు" అంటూ అబద్దం చెప్పేశాడు బ్రహ్మాజీ. తనూ, రామ్పండూ కలసి పార్క్ కి వెళ్ళాం అని చెప్పడానికి అతనికి భయం వేసింది.ఒక మగాడితో పార్క్ కి వెళ్ళానని అంతే దుర్గ చచ్చినా నమ్మదు. పెళ్ళాంతో నిజం చెప్పి కొరివితో తల గోక్కునేకంటే అబద్దం చెప్పిహాయిగా వుండటం మేలు అనుకున్నాడు.
"ఓసారి నన్ను మీ ఆఫీసుకి తీసుకెళ్ళి అ సర్వోత్తమరావు గాడిని పరిచయం చెయ్యండి.మిమ్మల్నాసాలు ఆఫీసులో లేటుగా ఎందుకుంచుకున్నాడో కనుక్కుంటూ... ఇంటి దగ్గర పెళ్ళాం ఏదురుచూస్తుందన్నా ఇమ్గిమ్త జ్ఞానం అతనికి వుండక్కర్లా.... ఇంతకీ అతను పెళ్ళికానిసన్నాసా?"