"కాదు పెళ్ళయిన సన్నాసే! ఇంకా నేను లోపలకి రావోచ్చా?" మెల్లగా అడిగాడు.
దుర్గ ప్రక్కకి తప్పుకుంది.
బ్రహ్మాజీ లోపలకి వెళుతుండగా ఓ కేక.
"బ్రహ్మాజీ!"
ఆగి తల వెనక్కి త్రిప్పి చూశాడు బ్రహ్మాజీ.
చిదంబరం! ఆఫీసులో తమతోపాటు పనిచేసే క్లర్క్!
బ్రహ్మాజీ వెనక్కి తిరిగి చిదంబరం దగ్గరకి వెళ్ళాడు.
"ఏంటి యిలా వచ్చావ్?" అడిగాడు బ్రహ్మాజీ.
"ఏం లేదు. ఇలా ఇంటికి వెళుతుంటే నువ్వు కనిపిస్తే ఆగాను. అది సరేగానీ యిందాకేంటీ ఇందిరా పార్కువైపు నుండి వస్తున్నావు? నేను వానక నుండి పిలుస్తున్న కూడా నువ్వు వినిపించుకోకుండా వచ్చేశావు. నీకుఅక్కడెం పని?" అడిగాడు చిదంబరం.
ఊహించని ఈ సంఘటనకి బ్రహ్మజీకి చాలా గంగారు పుట్టింది. వెనక్కి తిరిగి చూశాడు.
దుర్గ యింక అక్కడే నిల్చుని వుంది. కొంపదీసి చిదంబరం అన్నది వినేసిందా?!
గబుక్కున ముందుకు తిరిగి చిదంబరంతో యిలా అన్నాడు కంగారుగా.
"నేనా... పార్కా? హహహ.... నేను పార్కుకెందుకేళతానూ....? నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నానో....హహహ...."
నేను పొరపాటు పడ్డానా? భలేవాడివే.... నువ్వు పార్కు వైపు నుండి..." చిదంబరానికి అతని భవం అర్ధం కాలేదు.
"ఏంటీ! కన్నేమైంది? అలా టకటకా కొడుతున్నావు?" అడిగాడు చిదంబరం అతడిని.
"హబ్భే! ఏం లేదు. నా నలకేదో పడినట్టుంటేనూ.... హహహ..."
"సరేగానీ! ఇందాకట్నుండీ గమనిస్తున్నామ్డుకలా ఊర్కే నవ్వుతున్నావు?"
"ఊర్కే! హహహ... తోచక.... !" పళ్ళు కొరుకుతూ అన్నాడు బ్రహ్మాజీ.
"సరేగానీ.... ఇందాక పార్క్ నుండీ..." మళ్ళీ అడగబోయాడు. చిదంబరం.
"నేను కాదని అన్నానా?" గట్టిగా అరిచాడు.
"ఏమండీ! మీరిలా రండి!" దుర్గ చిదంబరాన్నిపిలిచింది.
చిదంబరం ఆమె దగ్గరకి వెళ్ళాడు.
"ఇందాక మీరు పార్కు దగ్గర చూసింది ఈయన్నేనా?" అడిగింది దుర్గ.
"హయ్యో! ఈయన్నేనండీ. నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయ్ ఇదిగో యిదే చొక్కా, ఇదే ప్యాంటూ" అన్నాడు అతని చొక్కా వంక చూపిస్తూ.
"సర్లెండి మీరిక వెళ్ళండి! పాపం అయన ప్రొద్దున ఎప్పుడనగా తిన్నారు_ బాగా ఆకలిమీద వుంది వుంటారు. ఆయనకి వేడివేడిగా వడ్డించాలి!"
"అబ్బే! నాకు ఆకలి లేదు. ఆకలస్సలు లేదుగా హహహ... నిజ్జం. పడ చిదంబరం... మీయింటికెళ్ళి కాస్సేపు సరదాగా మాట్లాడుకుందాం" చిదంబరం భుజం మీద చెయ్యేసి రెండడుగులు ముందుకేస్తూ.
"వద్దులెండి....ఆయన్ని వెళ్ళనివ్వండి. కావాలంటే మీరు కడుపునిండా తిన్నాక వేలుదురుగానీ" అంది దుర్గ.
"వస్తానమ్మా!" అని దుర్గతో చెప్పి చిదంబరం వెళ్ళిపోయాడు.
దుర్గ క్రూరంగా బ్రహ్మాజీవంక చూసింది.
"నిజం దుర్గా! నాకేం పాపం తెలీదు" భయం భయంగా అన్నాడు అతను.
"మీరు పార్కు కి వెళ్ళారా లేదా?"
సూటిగా అడిగింది దుర్గ.
"వెళ్ళానుగానీ.... మా ఆఫీసులో రాంపండు అని ఒకడున్నాడు.... వాడితో వెళ్ళాను."
"పార్కుకి... అందులో మరో మగాడితో వెళ్ళారు! మీరలా చెప్తే నేను నమ్మాలి!"
"నిజా దుర్గా.... పాపం వాడికేదో ఫలిలీ ప్రాబ్లెం వుందట!....దానిని గురించి న సలహా తీసుకుందామని పార్కుకి తీసుకెళ్ళాడు."
"మీ దగ్గర సలహాలు తీసుకునే ఆ సన్నాసి ఎవడు? ఆ సలహాలు కూడా పార్కులో తీసుకోవాలని అనుకున్నాడా ?... ఊ....?"
"అంటే ఆఫీసులోనే తీసుకునేవాడే.... కానీ ఆఫీసులో ఎందుకు తీసుకోలేదంటే ఆఫీసుకు శలవు పెట్టాడన్న మాట.... అందుకని ఆఫీసుకి ఫోను చేసి పార్కుకి రంమానాడు... అసలు ఆఫీసుకు ఎందుకు శలవు పెట్టాడంటే....."
"సర్లే... ఇంకా చెప్పింది చాలు.... అట్టే శ్రమపడకండి" అంటూ బ్రహ్మాజీ చొక్కా వాసన చూసింది. "ఊ... అయితే ఆ అమ్మి ప్రేల్పూ గట్రా ఏం వాడదన్నమాట?"
"అమ్మి ఏంటీ?" భయం భయంగా అడిగాడు బ్రహ్మాజీ.
"చెప్తాగా.... కంగారేందుకూ?" బ్రహ్మాజీ చొక్కా కలర్ పట్టి లోపలకి సర్రున లాగి వీధి తలుపు ధబెల్ మని వేసింది దుర్గ.
* * * *
రాంపండు వేగంగా నడుస్తున్నాడు.
తనని మనసులో ఎన్నో ఆలోచనలు!
బ్రహ్మాజీ చెప్పిన సలహా అతనికి బాగానే నచ్చింది.
రాజీని గావువాకో, మైసూర్ కో, లేదా ఏ ఊటికో ఎక్కడికో తీసుకెళితే బాగుంటుంది. అలా ఏకాంతంగా ఎక్కడికైనాకెళితే రొమాంటిక్ మూడ్ లో పడతారు! ఎన్నాళ్ళయిందో సరదాగా ఎంజాయ్ చేసి?
పాపం! రాజీకి కూడా ఒక్కర్తీ ఇంట్లో ఉండీ బోర్ కొడుతుంటుంది. అందుకే అలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటుంది.
వాచ్ వంక చోశాడు.
పావు తక్కువ ఎనిమిది! చాలా లేటయింది... త్వరగా వెళ్ళాలి!
నడక వేగం పెంచాడు రాంపండు.
పాపం... నిన్నటి నుండీ ఏమీ తినలేదు. ఎంత బ్రతిమిలాడినా పచ్చి మంచినీళ్ళు త్రాగకుండా పడుకుంది. ఎంత ఆకలిగా వుందో ఏమో! ఇప్పుడు హొటల్ నుండి ఏమైనా ప్యాక్ చేయించి తీసుకెళ్ళి ఊరు ప్రయాణము గురించి నిండా తినిపించాలి అనుకున్నాడు.
రాంపండుకి తెలీదు.... తను ఆఫీసుకేళ్ళగానే రాజీ మంచం మీంచి లేచి ప్రక్కింటి కుర్రాడితో హొటల్ నుంచి తెప్పించుకుని సుష్టిగాతిందని.
ఎఅదో ఆలోచిస్తూ కంగారుగా నడుస్తున్నా రాంపండు శరీరానికి మరో మెత్తటి శారేరం ధడేల్ మని కొట్టుకుంది.
ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు.
బాబ్డ్ హర్ తో, స్లీవ్ లెస్ జాకెట్టుతో ఓ అందాల అప్సరస అతని ముందు నిలబడి వుంది. ఆమె సీరియస్ గా రాంపండు వంక చూసింది. ఆమె హ్యండ్ బ్యాక్ చేత్తో అందుకున్నాడు.
"సారీ మేడమ్ ... నేను ఏదో ఆలోచిస్తూ పోరబాట్న డ్యాష్ కొట్టాను.... అంతేగానీ కావాలని కాదు మేడమ్.. నేనసలు అలాంటి వాడిని కాదు. అసలు పెళ్ళి చూపుల్లో కూడా నేను మ ఆవిడని అరిగ చూడలేదు.... నా కంత మొహమాటం మేడం.... మీరు మరో విధంగా _" ఇంకా అతని ఎక్స్ ప్లషెన్ పూర్తీకాకుండానే ఆమె అతని చేతిలోని బ్యాక్ ని లాక్కుని "ఇట్సాల్ రైట్" అంటూ హైహీల్స్ టకటక లాడించుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది.