"అలాగే సార్!"
బ్రతుకుజీవుడా అనుకుంటూ అఫేసులో నుండి బయటపడ్డాడు. రాంపండు.
* * * *
ఆటో రివ్వుమని ముందుకు వెళ్తూంది. ఆ ఆటోలో రాజీ... రామ్పండూ.
"నిజంగానే ఆఫీసుకు నా కోసమే సెలవు పెట్టి వచ్చేశావా?" అపనమ్మకంగా రాంపండుకేసి చాస్తూ అడిగింది రాజీ.
"మరీ బొత్తిగా, అంతిదిగా, అస్సలు నా మీద నమ్మకం తలకాయ పెట్టి షాపులవంక చూస్తూ.
తన మొహంవంక రాజీ చూసిందంటే మళ్ళీ తాను అబద్దం చెబుతున్నట్టు ఎక్కడ పసిగట్టేస్తుందోనని అతని భయం.
"ఏమోలే! నువ్వు నా కోసం సెలవు పెట్టావంటే నాకు నమ్మబుద్ది కావడంలేదు."
"అంతేలే... అందుకే ముందు అనుమానం పుట్టి తర్వాత ఆడవాళ్ళు పుట్టారని అన్నారు. అసలు ఈ వేళ ఆఫీసులో ఎన్ని అర్జంటు ఫైల్సు వున్నాయనీ... కానీ సీట్లో కూర్చున్నాక అయ్యో! నా రాజీ భోజనం కూడా చేయకుండా, కనీసం కాఫీ కూడా తాక్కుండా అలానే పడుకుని వుండే అని పదేపదే గుర్తొచ్చి ఫైల్సు అక్కడ పారేసి సెలవు చీటీ రాసి మా బాస్ కిచ్చా. కోపం వచ్చిందనుకో. అయినా నేను కూడా వీల్లేదని అన్నాను. వాడికి కోపం వచ్చిందనుకో. అయినా నాకు నువ్వు ముఖ్యంగానీ వాడుకాదుగా? వడి సమాధనం కోసం కూడా ఎదురు చూద్సకుమ్డా బయటకి వచ్చేసా" వీరుడిలా ఫోజుపెట్టి అన్నాడతను.
"నిజంగానా పండూ?" ప్రేమగా అతని వీపు చెయ్యేసి నిమురుతూ అంది రాజీ.
"ఊ! మరి కాక?" అన్నాడు పండు.
ఆటో సినిమా థియేటర్ ముందు ఆగింది. ఇద్దరూ ఆటో దిగారు. మీటర్ డబ్బులు చెల్లించి సినిమా హొర్డింగ్ వైపు చూశాడు రాంపండు.
"ఆడదే మగాడికి దిక్కు" అదీ సినిమా.
"అసలు ఈ సినిమా బాగుంటుందంటవా రాజీ?"
"ఎందుకు బాగుండదూ? అయినా నువ్వు నా సంతృప్తి కోసం కదా సినిమాకి తీసుకొచ్చావు? అలాంటప్పుడు నాకుయిష్టమైన సినిమాకి తీసు కేళతావా, నీకు యిష్టమైన సినిమాకితీసుకెళతావా?"
ఏమోలే! మనిద్దరికీ యిష్టమైన సినిమాకి వెళతాం అనుకున్నా అని మనసులో అనుకున్నాడు రాంపండు.
ఇద్దరూ సినిమా హాలు కాంపౌండ్ లోకి ఎంటరయ్యారు. అక్కడ జనం విపరీతంగా వున్నారు.
"చూశావా పండూ ఎంతమంది జనమున్నారో? సినిమా బాగుండకపోతే అంతమంది జనమెందుకుంటారు చెప్పు?" అందామె.
"అవును... అవునవును" అన్నాడు రాంపండు డూడూ బసవన్నాల తలని ఊగిస్తూ.
"త్వరగా డబ్బులివ్వు. టికెట్స్ తీసుకుంటా" అంది రాజీ
రాంపండు పర్సు తీసి డబ్బులు తీస్తూ చూశాడు హాలు ముందు పెట్టి వున్న హౌస్ పుల్ బోర్డుని.
"టిక్కెట్లు ఆయిపోయాయ్.... చూడు అక్కడ హౌస్ పూల్ బోర్డు కూడా పెట్టేశారు. ఇప్పుడెలా?" అన్నాడు ర్మ్పండు.
"అయ్యో...!" నిరుత్సాహంగా అంది రాజీ.
"పోనీ వేరే సినిమాకి వెళదామా?" అడిగాడు రాంపండు.
రాజీ సమాధానం చెప్పేలోగా ఆ వైపుగా ఒకడు "అఠ్ కా బారా...ఆఠ్ కా బారా..." అని జనం మధ్యలోంచి మెల్లగా అనుకుంటూ వెళ్ళాడు.
"పండూ! వాడెవడో బ్లాకులో టిక్కెట్లు అమ్ముకున్నాడు ఎనిమిది రూపాయల టిక్కెట్లు పన్నెండుట_ త్వరగా వెళ్ళి తీస్కో" సంతోషంగా అంది రాజీ.
"బ్లాకులో కొనమంటావా ...?" రాంపండు అయిష్టంగా మోహం పెట్టాడు.
లేకపోతే మనం ఇప్పుడు వెర్రి మోహాలు వేసుకుని యింటికెళ్ళి పోవాలా?"
బ్లాకులో టిక్కెట్లు కొని సినిమాకి వెళ్ళాలంటే నాకిష్టం వుండదు. పోనీ మనం వేరే సినిమాకి వెళ్తేనో?"
"వీల్లేదు. మనం ఈ సినిమాకే వెళ్ళాలి! టిక్కెట్లు కి నాలుగు రూపాయలేగా ఎక్కువ? రెండు టిక్కెట్లుకి ఎనిమిది రూపాయలు, మనం ఇప్పుడు ఆటోకి పడి రూపాయలు యిచ్చాం. మరోసారి ఈ సినిమాకి రావాలంటే మళ్ళీ ఆటోకి డబ్బులు పెట్టోద్దూ?"
"డబ్బుల గురిమ్చికాడు బ్లాకులో సినిమా టిక్కెట్లు..." ఏదో చెప్పబోయాడు.
"నేనే వినదల్చుకోలేదు పండూ! నువ్విప్పుడు టిక్కెట్లు కొనాల్సిందే... మనం ఈ సినిమా చూడాల్సిందే" రాజీ కాస్త హెచ్చుగా స్వరంతో అంది. ఆమె మొహం కూడా సీరియస్ గా పెట్టింది.
రాంపండు తమని ఎవరైనా గమనిస్తున్నారుమోనని కాస్త యిఉబ్బండిగా మొహంపెట్టి చూట్టూ చూసి "సరే! అలాగే. నువ్వు అరవకు" అని తక్కుతూ, తరుతూ దిక్కులు చూస్తూ అడుగులు ముందుకు వేశాడు.
"మీరిలా పెళ్ళి నడకలు నడిస్తే అయినట్టే. టిక్కెట్లు మీరే బ్లాకులో అమ్ముతున్నట్టు అలా భయం భయంగా చూస్తారేం?" విసుక్కుంటూ అంది రాజీ.
"అసలు బ్లాకులో టిక్కెట్లు అమ్మడమే కాదు, కొనడం కూడా నేరమే తెల్సా?" అన్నాడు రాంపండు.
"సరేసరే! అమ్మే వాడికంటే మీ రెక్కవ భయపడుతున్నారు.... త్వరగా వెళ్ళండి" కంగారు పెట్టింది రాజీ.
రాంపండు ముందుకు చూశాడు. ఇందాక తన ప్రక్కనుండి అఠ్ కా బారా అని అంటూ వెళ్ళిన వాడిచూట్టూ జనం మూగి వున్నారు.
రాంపండు వాడి దగ్గరకి వెళ్ళేసరికి జనం వాడి దగ్గర్నుండి హహకారాలు చేస్తూ డిస్టర్బ్ అయ్యారు.
కొంప మునిగినట్టుందే అనుకుంటూ రాంపండు వాడి ముందుకి ఓ లాంగ్ జంప్ చేసి "అఠ్ కా బారా టిక్కెట్లు వున్నాయా బాబూ?" అని అడిగ్డు.
"లేవు బాబూ! ఇందాక మీ ప్రక్క నుంచి వెళుతున్నప్పుడు నన్ను పట్టించుకోలేదు కాదు బాబూ?" ఈసడింపుగా అంటూ వాడు వెళ్ళిపోయాడు
రాంపండు రాజీ దగ్గరకి నీర్సంగా వెళ్ళాడు.
"బ్లాక్ టిక్కెట్లు కూడా అయిపోయాయ్" రాజీతో చెప్పాడు.
రాజీ మొహం అప్పటికే ఎర్రగా కందిపోయి వుంది. "ఎందుకు అయిపోవూ? మీరు కాళ్ళు ఈడ్చుకుంటూ మెల్లగా వెళితే. అసలు వాడుయిందాక మన మనస్పూర్తిగా తీసు కోస్తేగా టిక్కెట్లు దొడరకటానికి?"
"పోనీ 'నేనే నీ యమ్మా మొగుడ్ని' సినిమాకి వెళదామా?"
"అక్కర్లేదు. మీరే వెళ్ళండి" అని రాంపండు సమాధానం కోసం కూడా చూడకుండా రివ్వున హాలు బయటకి నడిచింది రాజీ.
"రాజీ అగు! అగు రాజీ!" అంటూ ఆమె వెంట పడ్డాడు రాంపండు .
కానీ అప్పటికే ఆలస్యం అయ్యింది హాలు బయట వున్న అటోరాజీ ఎక్కడం, అది రివ్వుమని వెళ్ళిపోవడం క్షణాల్లో జరిగిపోయింది.
రాంపండు తెల్ల మొహంవేసుకుని గేటు దగ్గర నిలబడిపోయాడు.
"పాపం! ఎవర్తినో సినిమాకి తెచ్చుకున్నడురా.... బేరం కుదిరినట్లు లేదు. అదేళ్ళిపోయింది"
ఎవరో తనని ఉద్దేసించి అనడం రాంపండు చెవిన పడింది.
"ఈ..."భాధగా జుట్టు పీక్కున్నాడు రాంపండు.
"సార్...!" ఎవరో పిలిస్తే ప్రక్కకి తిరిగి చూశాడు ఓ వ్యక్తి అతనివంకే చూస్తున్నాడు.
"ఏం లేద్సార్! ఇంట సేపూ మా ప్రెండ్స్ వస్తారుమోనని చూశాం వాళ్ళు వచ్చేలా లేరు. అవతల సినిమా స్టార్ట్ అయిపోయేలా వుంది. నా దగ్గర రెండు బాల్కనీ టిక్కెట్లున్నాయి కావాలా సార్?" రాంపండు అడిగాడు ఆ వ్యక్తి.
"ఈ..." మరింత బాధగా జుట్టు పీక్కుంటూ అరిచాడు రాంపండు.