తండ్రి గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఆ మాటల్లో తన ప్రస్తావన రావడంతో హాలులోకి వచ్చింది.
హాలును ఆనుకొని తండ్రి పడగ్గది వుంది. రాత్రి కావడం వల్ల అంతా నిశ్శబ్దంగా వుండడం వల్ల వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.
"ఈ సంవత్సరం అవని పెళ్ళి చేసేద్దామండి" అంది తల్లి గొంతు.
"నాకూ చేయాలనే వుంది. మంచి సంబంధం దొరకాలిగా... విజయవాడ సంబంధం బానే వుంది. కానీ, కట్నం అయిదు లక్షలదాకా... అడుగుతున్నారు" అది తండ్రి గొంతు.
"మీరు మరీనూ...అయిన సంబంధం పెట్టుకొని బయట సంబంధాలు ఎందుకు చెప్పండి" అంది నిఘ్టారంగా మహాలక్ష్మి.
"అయిన సంబంధం అంటే?"
"మన రమేష్ లేడూ" అంది తల్లి.
"నీ తమ్ముడా?!"
ఏంటీ నా తమ్ముడు ఆ విజయవాడ సంబంధంకన్నా తీసిపోయాడా? అయినా వాడు నా తమ్ముడనేగా మీకు చులకన... వాడికేమైంది...నిక్షేపంగా వున్నాడు. మంచి వ్యాపారం... మనమ్మాయి సుఖపడుతుంది. పైగా ఈ సంవత్సరం ఇక్కడికే వచ్చి ఇక్కడే మరో బిజినెస్ మొదలెడతాడట.. కట్నం దగ్గర పేచీ కూడా వుండదు. మనకు వున్నంతలో ఇవ్వొచ్చు" ఉత్సాహంగా చెప్పకుపోతుంది తల్లి.
"అంతా బాగానే వుంది కానీ..."
"ఏంటి కానీ.."
"వాడొట్టి తల తిక్క మనిషి."
కోపంగా మొగుడి వంక చూసి "అనండి.. అనండి... మా తమ్ముడు మీకు చులకనయ్యాడా? వాడికేం...మంచి మంచి సంబంధాలు వస్తాయి. మనమ్మాయిని చేసుకుందామని వాడేం ఎదురుచూడ్డం లేదు. కాకపోతే వాడికి మనమ్మాయి అంటే ఇష్టమేకదా... అని అడిగాడు. నాకేం" అంది రుసరుసలాడుతూ.
"అబ్బ... ఎందుకే అలా ఇదయిపోతావు. అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కుందాం" అన్నాడు తండ్రి.
గుండెలో రాయి పడిన ఫీలింగ్ కలిగింది అవనికి.
తను అనిరుద్రతో విషయం చెప్పాలి. ఆలస్యమైతే తల్లి ఓ నిర్లయానికి వచ్చినా వస్తుంది. తనకు రమేష్ అంటే ఇష్టం లేదు. అప్పుడప్పుడు మందు తాగుతాడు. సిగరెట్లు కంపు, పైగా తనకా దృష్టే లేదు.
వెంటనే అనిరుధ్రతో మాట్లాడి ఓ నిర్ణయానికి రావాలనుకుంది.
సరిగ్గా అప్పడే ఫోన్ మ్రోగింది.
"ఇంత రాత్రివేళ ఫోన్ చేసేదెవరు? ఈ మధ్య రాత్రుళ్ళు ఎక్కవగా ఫోన్స్ వస్తున్నాయి." తండ్రి గొంతు బెడ్ రూమ్ లో నుంచి వినిపించింది. తండ్రి లేచి వస్తున్నట్టు అడుగుల శబ్దం.
"నేను చూస్తాన్లే నాన్నా..."హాలులో నుంచి గట్టిగా అని...గబగబ వెళ్ళి ఫోనేత్తింది.
అటువైపు నుంచి అదే నవ్వు.
"డబుల్ గేమ్ ఆడుతున్నావా? నా దగ్గర నాటకాలు ఆడొద్దు. బుద్ధిగా నేను చెప్పినట్లు వింటానని చెప్పి, మీ బాస్ తో కారులో షికారుకు వెళ్తావా! ఇంకోసారి అలా నిన్ను చాశానంటే నేనేం చేస్తానో నాకే తెలియదు" అటువైపు నుంచి బొంగురు గొంతు.
ఎక్కడ తండ్రి హాలులోకి వస్తాడోనని భయం వేసింది అవనికి.
"ఎవరమ్మా" తండ్రి పడగ్గదిలో నుంచే అడిగాడు.
"రాంగ్ నెంబర్ నాన్నా" అంది ఫోన్ పెట్టేసి.
మళ్ళీ ఎక్కడ ఫోన్ రింగవుతుందోనని భయంగా వుంది ఓ ప్రక్క.
లక్కీగా ఫోన్ రింగావ్వలేదు. తన గదిలోకి వెళ్ళింది. అవనికి నిధ్రరావడం లేదు.
దానిక్కారణాలు రెండు.
ఒకటి... తల్లిదండ్రులు తన పెళ్ళి విషయంలో ఓ నిర్ణయం తీసుకోక ముందే తను అనిరుద్ర విషయం చెప్పేయాలి.
రెండోది.. ఆ ఆగంతుకుడి విషయం తేల్చేయాలి. అందుకు వసుధ తన కెంత వరకు సహకరిస్తుందో తెలియదు. ఈ విషయంలో బయటవాళ్ళను నమ్ముకోవడంకన్నా తన వాడ్తెన అనిరుధ్రను నమ్ముకోవడమే బెటరనుకుంది.
అనిరుధ్రకు ఈ ఆగంతకుడి విషయం చెప్పడమే మంచిదన్న అభిప్రాయం ఆమెలో బలపడసాగింది.
అదే సమయంలో బాస్ విషయం కూడా ఆలోచించింది. ఆయన ప్రవర్తనను ఎంతవరకు అనుమానించవచ్చు?
అలా ఆలోచిస్తూనే ఏ అర్ధరాత్రో నిద్రపోయింది.
* * *
ఉదయం ఎర్లీగానే లేచింది. డుంబు కొద్దిగా కోలుకున్నాడు.
అవని ఆ రోజే అనిరుద్రను కలిసి తమ పెళ్ళి విషయం చర్చించాలని నిర్ణయించుకుంది. ఇంట్లో నుంచి ఓ గంట ముందు బయల్దేరి అనిరుద్ర దగ్గరకు వెళ్ళాలనుకుంది.
సరిగ్గా గంట ముందు బయల్దేర్దామని అనుకుంటుండగానే వసుధ దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది.
"ఏయ్... అవని... నేను వసుధను... నేను అరగంట ముందే వస్తున్నాను. అలా కాసేపు శాన్ బాగ్ లో కూచిని కబుర్లు చెప్పుకుందాం.. తొమ్మిదికల్లా వచ్చేయ్" అంది.
"కుదర్దు..." అని చేబుదామనుకుంటుండగానే అటువైపు వసుధ ఫోన్ పెట్టేసింది.
"సిట్..." విసుగ్గా నుదురు మీద చేయితో కొట్టుకుంది. నిన్ననే తను కలవలేదని, ఫీలవుతోంది. ఇప్పుడు కలవకపోతే, మరింత ఫీలవుతుంది.
ఈ రోజు ఇక అనిరుధ్రను కలవడం కుదరదేమో అనుకుంది.
టిఫిన్ చేసి, కాఫి తాగి ఆఫీసుకు బయల్దేరింది.
"ఇవ్వాళ ముందుగా వెవెళ్తున్నావేంటమ్మా" అడిగాడు తండ్రి.
"కాస్త షాపింగ్ చేయాల్సిన పని వుంది నాన్నా" అని అబద్దమాడి బయటపడింది.
దారి పొడుగునా బాస్ గురించి అడిగితే, వసుధతో ఏం చెప్పాలి? అని ఆలోచిస్తూ వుండిపోయింది.
"నిజం మాత్రం చెప్పొద్దు" అనుకుంది అవని.
* * *
శాన్ బాగ్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే వసుధ వచ్చింది.
"ఇంత ఆలస్యం అయ్యిందేమిటి? నీకోసమే ఎదురు చూస్తున్నా... నేనింకా టిఫిన్ కూడా చేయలేదు" అంది వసుధ హొటల్ లోకి దారితిస్తూ.
"అయ్యో... నేను టిఫిన్ చేసే వచ్చాను" అంది నొచ్చుకుంటున్నట్టు అవని.
"పర్లేదు... నాకోసం మళ్ళీ తిను" అంటూ ఓ కార్నర్ టేబుల్ దగ్గర కూచుంది.
"తినలేను...కాఫీ తాగుతాను" అంది.
"లైట్ గా ఇఢ్లీ తీసుకో... అంటూ అవనికి ఇఢ్లీ ఆర్డర్ చేసి తనకు మాసాలా దోశ చెప్పింది. సర్వర్ వెళ్ళిపోయాక, "ఇప్పుడు చెప్పు" ఏంటీ బాస్ కథా కామామిఘా" అని అడిగింది వసుధ.
"మరేం లేదు కొత్త ప్రోడక్ట్ ఏదో ఎక్స్ పోర్ట్ చేయాలనుకుంటున్నాడట. దాని తాలుకు డిటెయిల్స్ కంప్యూటర్ లో ఫీడ్ చేయమన్నాడు."
"అంతేనా! అదేమంత ఇంపార్టెంట్ విషయం కాదే" అంది అవని వైపు సూటిగా చూస్తూ వసుధ.
"ఏమో... నాకేం తెలుసు ... నన్ను పిలిచి చెప్పాడు."
"నిజమే చెబుతున్నావా?" సడన్ గా అడిగింది వసుధ.
"అదేంటి.. నన్ను సందేహిస్తున్నావా?" అంది అవని వెంటనే.
"ఛ.. ఛ.. నా ఉద్దేశ్యం అది కాదు. నా దగ్గర ఏమైనా దాస్తున్నావేమోనని...నేను ఏది చేసినా నీ మంచి కోసంమేనని నీకు తెలుసుగా."
"అందుకేగా నీకు ఆ అగంతకుడి విషయం చెప్పాను. అన్నట్టు మరిచిపోయాను. రాత్రి మళ్ళీ ఫోన్ చేశాడు" చెప్పింది అవని.
"ఏమన్నాడు?" నిరాశక్తగా అడిగింది వసుధ.
"నేను బాస్ తో కారులో వెళ్ళడం చూసాడట.. ఇంకోసారి అలా చేస్తే వూర్కొనన్నాడు."
"అలాగే" అంది.
"ఏంటి...అలాగా" అని అంత తేలిగ్గా తీసి పారేస్తున్నావు?" అడిగింది అవని.
"వాడు ని ప్రతి కదలికను వాచ్ చేస్తున్నట్టున్నాడు. నువ్వు జాగ్రత్తగా వుండడం మంచిది. ఎందుకైనా మంచిది బాస్ తో అంత క్లోజ్ గా మూవ్ అవ్వకు" అంది వసుధ.
"ఛ..ఛ..అతను బాస్..నేను ఎంప్లాయిని. నేను ఎందుకు అంత క్లోజ్ గా మూవ్ అవుతాను" అంది.
ఈలోగా టిఫిన్స్ వచ్చాయి.
"ఇంతకీ నువ్వు బాస్ కారు లో ఎందుకు వెళ్ళినట్టు? అడిగింది దోశ తింటూ వసుధ.
"రాత్రయింది.. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానన్నాడు. అప్పటికీ వద్దన్నాను. కానీ ఫోర్స్ చేసాడు. తప్పనిసరి పరిస్ధితిలో వెళ్ళాల్సి వచ్చింది." అంది.
పది నిముషాల్లో టిఫిన్ పూర్తి చేశారు. కాఫి చెప్పారు.
"అవనీ...నాకు నిజమే చెబుతున్నావుగా?" అడిగింది మరోసారి వసుధ.
"అదేంటి.. పదే పదే అనుమానంగా అలా అడుగుతున్నావు? నామీద నీకు డౌటా?" అంది అవని తత్తరపాటును కప్పిపుచ్చుకుంటూ.
"అలా అని కాదు... భయంతో నువ్వేమైనా దాస్తున్నావేమోనని అడిగానంతే" అంది.
ఈలోగా కాఫీ వచ్చింది.
ఇద్దరు కాఫీ తాగారు. బిల్లు వసుధే ఇచ్చింది.
"పద వెళ్దాం" అంది లేస్తూ.
ఇద్దరూ ఆఫీసుకు బయల్దేరారు.
* * *
ఇన్ స్పెక్టర్ బెనర్జీ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. సరిగ్గా అరగంట క్రితం ఫెడ్రిక్ వచ్చాడు.
మాస్టర్ అండ్ మాస్టర్ ఎక్స్ పోర్ట్స్ అధిపతిగా ఆయన గురించి బెనర్జీకి తెలుసు.
అంతకు ముందు ఓ వి.ఐ.పి.కి బందోబస్తుకు వెళ్ళినప్పుడు ఆ వి.ఐ.పి. ఫ్రెండ్ గా ఫెడ్రిక్ తెలుసు.
"చెప్పండి" అన్నాడు, కుశల ప్రశ్నలయ్యాక.
"నన్ను హత్య చేయడానికి ఎవరో కుట్ర పన్నుతున్నారు" చెప్పాడు ఫెడ్రిక్.
ఒక్కక్షణం ఫెడ్రిక్ జోక్ చేయడం లేదు కదా అనుకున్నాడు.
"వాడ్డు యూ మీన్."
"యస్ మిస్టర్ ఇన్ స్పెక్టర్...నేను జోక్ చేయడం లేదు."
ఫెడ్రిక్ తలుచుకుంటే డ్తెరెక్ట్ గా కమీషనర్ తోనే మాట్లాడగలడు. అతనికి అంత పలుకుబడి వుంది. అలాంటిది తనను వెతుక్కొంటూ రావల్సిన అవసరం ఏముంది?
అతని మనసులోని భావాలను చదివినట్టు మాట్లాడాడు ఫెడ్రిక్.
"మీ అనుమానం నాకు తెలుసు.. నన్ను ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని నేను, ఏ కమీషనర్ కో, హొం మినిష్టర్ కో చెప్పొచ్చు. బందోబస్తు కోరవచ్చు. పర్సనల్ సెక్యూర్టీ పెట్టుకోవచ్చు. కానీ నేను అవేమీ చేయకుండా మీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా?"
"ఎందుకు" అన్నట్లు చూశాడు బెనర్జీ.
"నమ్మకం... మీ మీద నమ్మకం. మీ సిన్సియార్టి మీద నమ్మకం" ఫెడ్రిక్ అన్నాడు.
"నా మీద మీకున్న నమ్మకానికి థేంక్స్" మనస్పూర్తిగా అన్నాడు బెనర్జీ. యిరీ కూడా చేయించాను. మీ మీద అనుమానంతో కాదు, నా నమ్మకం నిజమేనన్న విషయాన్ని నేను కన్ ఫర్మ్ చేసుకోవడానికి.
"డిపార్ట్ మెంట్ లో మీలాంటివాళ్ళు అరుదు. మీ గురించి పూర్తిగా ఎంక్వయిరీ కూడా చేయించాను. మీ మీద అనుమానంతో కాదు, నా నమ్మకం నిజమేనన్న విషయాన్ని నేను కన్ ఫర్మ్ చేసుకోవడానికి.
మీకు రావల్సిన ప్రమోషన్లు ఆగిపోవడానికి కారణం మీ సిన్సియార్టినే...
మీకన్నా తక్కువ ర్యాంకు వున్న వాళ్ళు చివరికి కానిస్టేబుళ్ళు కూడా సొంతయిళ్లు సంపాదిందిచినా మీరు మాత్రం ఇంకా కేవలం అద్దె ఇంట్లోనే వున్నారంటే దానిక్కారణం మీరు చేసే పనికి 'లంచం' అనే ప్రతిఫలం స్వీకరించకపోవడం.
మీరింకా పెళ్ళి చేసుకోలేదంటే...మీ వృత్తికి పెళ్ళి ఎక్కడ ప్రతిబంధకం అవుతోందోనన్న భయం...ఆ భయం వెనక మీ వృత్తికి అన్యాయం చేయొద్దన్న తపన వుంది. యా మై రైట్" అన్నాడు ఫెడ్రిక్.
అలాగే చూస్తుండిపోయాడు బెనర్జీ. ఎంత చక్కని విశ్లేషణ.
ఫెడ్రిక్ తనని పోగిడినందుక్కాదు. తన గురించి చక్కగా ఎనలైజ్ చేసినందుకు గర్వంగా వుంది.
తనని చాలామంది రాజకీయ నాయకులు విమర్శిస్తారు. వాళ్ళ పనికి తన వృత్తి అడ్డు వస్తుందని, తనని ట్రాన్స్ ఫర్ చేయించడానికి ప్రయత్నిస్తారు.
తను వృత్తిలో ఎప్పుడూ తలంవంచలేదు. అది ఒక్కటే తనకు సంతోషాన్ని కలిగించే విషయం.