"ఇట్స్ అనెథికల్" ఆవేశంగా అన్నాడు నగర న్యావాదు సంఘం అధ్యక్షుడు. " మీ రు అరెస్ట్ చేసింది సామాన్యుణ్ణి కాదు.ఒక ప్రముఖ లాయర్ని."
చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో చూసింది మేనక- " నాకు తెలిసి సామాన్యుడికో న్యాయం. న్యాయవాదికో న్యాయమూ లేదు"
"ఏ బేసిన్ పైన అరెస్టు చేశారు?" మరో లాయరు నిలదీశాడు. "లాయరుసూర్యం ఏనేరం చేశాడని?"
"క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షను 42 ప్రకారం ఏ వ్యక్తయినా ఓ పోలీసాఫీసరు ఊరు, పేరూ అడిగినప్పుడు చెప్పటానికి నిరాకరిస్తే కా వ్యక్తి ఎవరైనాకానీ అదుపుచేసే హక్కు చట్టరీత్యా నాకుందని చెప్పాల్సిన ఆగత్యం లేదనుకుంటాను. పైగా అవినీతి కార్యక్రమాలు సాగుతున్న ప్రదేశంలో అతడు మాకు నేరస్తుడిగా దొరకడంతోపాటు డ్యూటీ నిర్వహించబోయిన పోలీసులని ప్రతిఘటిస్తే అతణ్ణి అ రెస్టు చేయడానికి పోలీస్ అధికారి అవసరమైన అన్ని పద్ధతులూ అనుసరించవచ్చు."
ఇప్పుడు తాము డీల్ చేస్తున్నది సామాన్యేమైన వ్యక్తిని కాదని తెలిసిపోయిన మరో లాయరు వెంటనే అన్నాడు " అరెస్టు వారంటు ఉందా?"
"లేదు."
" మరి ఎలా ఇంత సాహసం చేశారు?"
" మానభంగంలాంటి కాగ్నిజిబుల్ అఫెన్స్ చేసిన రణధీర్ పరారీలో ఉంటూ ఓ ఇంట్లో దాగున్నప్పుడు అక్కడికి రైడ్ చేసిన పోలీసాఫీసర్ అతను మళ్ళీ అబ్స్ కాండ్ అయ్యే అవకాశం వుందనుకుంటే వారంటు లేకుండా అరెస్టు చెయ్యొచ్చు. సెక్షన్ 41 ప్రకారం కర్తవ్య నిర్వహణకి సిద్దపడుతున్న పోలీసు అధికారికి అడ్డుపడే లాయర్ సూర్యం లాంటివాళ్ళని వారంటు లేకుండా అరెస్టు చేయొచ్చు"
నడి రోడ్డుపైన యిలాంటి చర్చ అనవసరమనిపించిదేమో అసహనంగా అన్నాడో లాయరు" సూర్యాన్ని వెంటనే వదిలిపెట్టండి."
"ఇంటరాగేట్ చేయాలి."
ఇంతమంది చూస్తుండగా యిలాంటి అవమానం భరింపశక్యం కావటంలేదు " మేం పూచీ వుంటాం"
"అభ్యంతరం లేదు.ఆఫార్మాలిటీస్ అన్నీ స్టేషన్ లోనే పూర్తిచేద్దాం."
"మిస్ మేనకా!"బార్ కౌన్సిల్ అధ్యక్షుడు రోషంగా అరిచాడు. "చట్టం గురించీ , నేర విచారణ పద్ధతుల గురించీ మాకూ తెలుసు"
"తెలిసిన మీరు యిలా నడిరోడ్డుమీద న్యాయాన్ని కోరడం సమంజసం గా లేదు."
"వీల్లేదు!" లాయర్లంతా అన్నారు ఒకేసారి "అతని చేతికున్న బేడీల్ని తీసేయండి"
"సారీ" అనలేదామె. "ఇంపాసిబుల్" అంటూ నడవమన్నట్టుగా కానిస్టేబుల్స్ కేసి చూసింది.
"సారీ" అనలేదామె. "ఇంపాసిబుల్" అంటూ నడవమన్నట్టుగా కానిస్టేబుల్స్ కేసి చూసింది.
"ఆగండి!" బార్ కౌన్సిల్ అధ్యక్షుడు రోడ్డుకడ్డంగా కూర్చున్నాడు- "మొండితనం ప్రదర్శిస్తే మీరిక్కడనుంచి కదలరు."
"అలా చేయడం మరో నేరమవుతుంది." హెచ్చరికగా అంది.
ట్రాఫిక్ జామ్ అయింది.
చుట్టూ చేరిన జనం రెండు వ్యవస్థల మధ్య సాగుతున్న పోరాటాన్ని చూస్తూ ఆ యువతి మొండివైఖరిని మనసులోనే అభినందించుకుంటున్నారు.
నగరంలో అడుగుపెట్టి నలభై ఎనిమిది గంటలు కాకముందే ఆమె సృష్టించిన సంచలనానికి అబ్బురపడిపోతున్నారు
"ప్లీజ్ మూవ్!"
ఉదయ సూర్యుని లేత ఎండలో ఆమె చెంపలు అరుణవర్ణాన్ని అద్దుకొని కోల్పోతున్న సహనానికి అద్దం పడుతున్నాయి.
"చట్టం గురించి తెలిసిన మీరు మరో లా అండ్ ఆర్డర్ సమస్యకి కారణమైన నాకు ఇబ్బంది కలిగిచకండి,ప్లీజ్!"
" నో!" అరిచారు ముక్తకంఠంతో.
అరక్షణంలో లాయర్లంతా రోడ్డుకడ్డంగా కూర్చుని 'రాస్తారోక్' కార్యక్రమానికి సిద్ధపడ్డారు.
కేవలం తమ పంతం నెగ్గాలన్న ధ్యాసతప్ప మేనక ఏ స్థాయికి వెళుతుందీ వారు వూహించలేకపోయారు.
న్యాయం గురించి తెలిసిన వ్యక్తులే చట్టాన్ని ధిక్కరిస్తూ ఆటంకపరుస్తున్నారు. పోలీసులంటే సహజంగా ఉన్న ద్వేషభావంతో అక్కడ ప్రేక్షకులై చూస్తున్న చాలామంది రెచ్చిపోవడానికి అది కారణమయితే పరిస్థితిని అదుపుచేయడం కష్టమౌతుంది.ఇది మాబ్ సైకాలజీ!
'ఇల్లీగల్ అసెంబ్లీ' గురించి , ' రియటస్ మబ్' గురించి క్షుణ్ణంగా తెలిసిన ఐ.పి.యస్ ఆఫీసరుగా, సకాలంలో పరిష్కరించాల్సిన సమస్యగా భావించి, సమీపంలోని పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి హెడ్ క్వార్డర్టర్సుకి ఫోన్ చేసింది.
కేవలం పదినిముషాల్లో వేన్స్ లో అక్కడికి చేరుకున్న స్పెషల్ పోలీస్ ఎంత ఆందోళన్ని సృష్టించారూ అంటే లాఠీతో ' రియట్ కంట్రోల్ ఆపరేషన్' మొదలైంది. అయిదు నిముషాలపాటు కేకలు, కమోషన్... జనం కాకవికలైపోయారు.
"పోలీసు జులం నశించాలి!"
" ఏ.ఎస్. పి. డౌన్ డౌన్!"
"న్యాయవాదులకే రక్షణ లేనివాడు ఇక సామాన్యుల మాటోమిటి?" యిలా నినాదాలు చేసింది ప్రజలు కాదు, గాయపడిన న్యాయవాదులు మాత్రమే.
అరగంటలో అక్కడికి చేరిన సగంలోని మొత్తం లాయర్లు ఈ చర్యని గట్టిగా ఖంచించడమే గాక యస్పీ, అడిషనల్ యస్సీల దగ్గరికి ఊరేగింపుగా వెళ్లారు.
ఈ సంఘటనతో ' మిస్ మేనక' ప్రజల్లో ఎంత ప్రాచుర్యాన్ని సంపాదించిందీ వారు ఊహించనిది.
మిస్ మేనక పైన చర్య తీసుకోవాలంటూ ఆరోజు కార్టుల్ని బాయ్ కాటే చేశారు లాయర్లంతా.
నగరంలోనే కాదు, రాష్ట్ర్రం లో సైతం యిలా జరగడం తొలిసారి. కోర్టుల్లో అన్ని వ్యవహారాలూ స్థంభించిపోయాయి.
అలలేమీ జరగనంత యధాలాపంగా రణధీర్ ని, లాయరు సూర్యాన్ని స్టేషన్ లో నిర్భంధించిన మిస్ మేనక సరిగ్గా మధ్యాహ్నం పన్నెండుప గంటలకి మెసెజ్ రాగాఅడిషనల్ యస్ఫీ ఛాంబర్ కి వెళ్ళింది.