ఎవర్ని నమ్మాలి? ఎవర్ని నమ్మకూడదు అనే విషయంలో ఇంకా ఒక అంచనాకి రాలేదు.
"మనూ" పిలిచింది మంగళ.
"ఊ.....చెప్పు" అన్నాడు.
"షూటింగ్ జరుగుతుండగా నేనో విషయం గమనించాను."
"నేనా పొదను కెమేరాలోకి ఎక్కించాను" అన్నాడుస్థిరంగా వెంట్రుకవాసిలో తనకారుని ఢీ కొట్టబోయిన లారీని తప్పించుకొని ఆ లాక్ రంగు, నెంబరుతోసహ అతని మెమొరీలోకి ఎక్కించేసుకున్నాడు. లారీ ద్వారా ఒక బెదిరింపు....నవ్వుకున్నాడు మనస్సులోనే ప్రదీప్ గేమ్ బాగా ఆడుతున్నందుకు.
మంగళ ఆశ్చర్యపోయింది. తను తప్ప మరెవరూ ఆ పొదను చూసి వుండరని భావించింది. కాని.....కాని.....మనూ....
"ఏమిటి మంగళ......నేనా విషయాన్ని యెలా గమనించానని ఆలోచిస్తున్నావు. అవునా?.....నేను షూటింగ్ లోఉండగా చూద్దామని వచ్చావ్ అలాంటి నీవు ఓ పొదవైపు నాలుగైదుసార్లు చూసావంటే అదేదో ముఖ్యమైందనిపించింది. కెమేరా అటు తిప్పి జామ్ చేశాను..... కెమేరా అపలేదు...."
మంగళ దిగ్భ్రాంతికి లోనైంది. ఎప్పుడూ పరధ్యానంగా మతి మరుపుతో ఉండే మనూలో యింతటి పరిశీలనా శక్తివుందా? సంతోషమేసింది మంగళకి.
అంతలోనే భయం కూడా కలిగింది. మనూ చెప్పటంలేదు. కాని ఏదో జరుగుతోంది. ప్రమాదాలపై ఒక్కోఅడుగు వేస్తూన్నట్లు అనిపించింది మంగళకు.
అంతకుముందే జరగబోయిన లారీ ఏక్సిడెంట్ మరింత భయకంపితురాల్ని చేసింది మంగళను.
కారు ఇంటిముందు ఆగింది. మంగళ లోపలకు వెళ్ళిపోయింది.
కారు షెడ్ లో పెట్టి వచ్చి తను ఆఫీసుకి ఫోన్ చేశాడు.
"హలో.....ఎవరూ.....మిలీ.....నువ్వింకా వెళ్ళలేదా?"
"లేదు సార్! మీరు షూటింగ్ నుంచి నేరుగా ఆఫీసుకు వస్తారని స్టాఫంతా ఎదురుచూస్తున్నాం. మీరు రారా సార్?"
"రావటంలేదు. కోరమండల్ నుంచి ఫైల్ వచ్చిందా?"
"రాలేదుసార్. ఇప్పుడే మధు ఫోన్ చేశాడు. ఫైల్ తీసుకురావటానికి కోరమాండల్ కి వెళుతున్నట్టు."
"మధు ఇప్పుడు కోరమాండల్ ఆఫీస్ లో వుండివుండవచ్చు. ఫోన్ చేసి ఫైల్ తో ఇంటికొచ్చి వెళ్ళమని చెప్పండి."
"ఓ.కే సార్.....ఎనీ మోర్."
"మన యూనిట్ వస్తుంది. కెమేరా, సెట్ ప్రాపర్టీస్ జాగ్రత్తగా పెట్టించమని చందూకి చెప్పండి. మరలా రేపు ఎనిమిదికల్లా అవన్నీ లోకేషన్ కి వెళ్ళాలి. నాకేమన్నా ఫోన్స్ గాని, పోస్ట్ గాని......"
"మోడల్స్ షర్నాజీ పటేల్, ప్రీతిభవాని, సంజయ్ భూటానినుంచి ఫోన్స్ వచ్చాయిసార్. అందరు ప్రకటన గురించే అడిగారు. తెలియదని చెప్పానుసార్. మీరు నాకు చెప్పలేదుగదా సార్ అందుకని. నేనూ అప్లయ్ చేస్తున్నాను సార్ చెయ్యనా సార్?"
"గుడ్ లక్. ఎనీమోర్?"
"ఒకే వ్యక్తి ఎవరో తెలియదు. ఐమీన్ అతని గొంతెప్పుడూ ఫోన్ లో వినలేదు. ఆరుసార్లు ఫోన్ చేసాడు. మీరెవారిని అడిగాను. విలన్ లా నవ్వి వూరుకున్నాడు సార్.
"వెరీగుడ్.....మిలీ......పోస్ట్ వచ్చిందా?"
"వచ్చిందిసార్......పంపమంటారా?"
"రేపు నేనొచ్చి చూస్తాను. ఆఫీస్ క్లోజ్చేసి మీరెళ్ళిపోండి...." అన్నాడు ఫోన్ పెట్టేస్తూ మనోహర్.
స్నానంచేసి మంగళ పెట్టిన టిఫిన్ తినేసరికి రాత్రి ఏడయింది.
మధుచక్రవర్తికోసం ఎదురుచూడటం వాయిదా వేసుకుని లేచాడు.
"మంగళ" పిలిచాడు.
పంటగదిలోవున్న మంగళ బయటకు వచ్చింది. "నేను బయటకు వెళుతున్నాను. రావటానికి రెండుగంటలు పట్టవచ్చు. మధూ ఓ ఫైల్ తెచ్చిస్తాడు. జాగ్రత్తగా లోపలపెట్టు. ఎవరైనా నాకోసం వచ్చినా, ఫోన్ చేసినా నేను నిద్రపోతున్నానని చెప్పు" అన్నాడు.
ఓ పాతప్యాంటు, షర్టు వేసుకున్నాడు. మెడలో పాత మప్లర్ వేసుకున్నాడు. వేషధారణ వింతగా అనిపించింది మంగళకు.
మంగళ ఏదో అనబోతుండగానే ఆమె బుగ్గమీద చిటికెవేసి "నోమోర్ క్వశ్చన్స్ డియర్. అనూ ఫోన్ చేస్తే బయటకెళ్ళానని" చెప్పు అంటూ బయటకి నడిచాడు. ఆ వెనుకే మంగళ పోర్టికోలో కొచ్చింది. మనోహర్ కారు వదిలేసి నడుచుకుంటూ వెళ్ళాడు. అప్పుడర్ధమయింది మంగళకు. తను ఇంట్లోనే వున్నట్లు నమ్మించటానికి కారు వదిలేసి వెళ్తున్నాడని. ఎక్కడికి వెళుతున్నాడు? ఇంట్లోనే వున్నట్లు ఎవర్ని నమ్మించాలనుకుంటున్నాడు?!
* * *
మనోహర్ బంజారా హొటల్ కి కొద్ది దూరంలో ఆటో దిగాడు.
ఈ మధ్యకాలంలో మనోహర్ కారులేకుండా ఎక్కడికి వెళ్ళలేదు సిద్ధపడలేరు. అదీ ప్రస్తుతపు స్థాయికి దిగువస్థాయి మార్పయితే మరీ తట్టుకోలేరు. బొంబాయిలో, యాడ్ ఫిల్ము ఇండస్ట్రీలో మనోహర్ చాలా నేర్చుకున్నాడు.
ఎలాంటి వాతావరణంలోనైనా. ఎలాంటి మార్పుకైనా సిద్ధపడగలిగినవాడే పైకొస్తాడని, తనూ అలాగే పైకొచ్చానని తరచూ ఎంతో అభిమానంతో చెబుతూండేవాడు. సింఘానియా తన అత్యంత ప్రియశిష్యుడు మనోహర్ కు.
మనోహర్ చీకటిని అసరా చేసుకొని నలువైపులా చూస్తూ తమ ఉదయం షూటింగ్ చేసిన స్థలానికి చేరుకున్నాడు. చుట్టూ చూసాడు. చీకటిగావుంది. చుట్టూప్రక్కల మనుష్యుళ అలికిడిలేదు.
లేక్ ఒడ్డునవున్న పోదల్ని చూశాడు. హొటల్ గదుల్లో వెలుగుతున్న లైట్లకాంతి అస్పష్టంగా ఆ పోదల పైభాగాన పడుతోంది. అక్కడ చాలా పొడలుండటంతో తనక్కావల్సిన పొదను పొదను వెంటనే గుర్తుపట్టలేక పోయాడు.
అంతలో తేరుకొని చురుగ్గా ఆలోచించాడు.
షూటింగ్ జరిగే సమయంలో మంగళ ఎక్కడ నిలబడి ఆ పొదల వైపు చూసిందో వూహించుకున్నాడు. మరుక్షణం మనోహర్ అదే స్థలంలో నిలబడ్డాడు. మంగళ ఏ వేపుకు తలత్రిప్పి చూసిందో గుర్తుకుతెచ్చుకొని తనూ అటే తలత్రిప్పాడు. అప్పుడు గుర్తుపట్టగలిగాడు తనక్కావల్సిన పొదను. బాగా చీకటిగావుంది. అక్కడికి వెళ్ళేందుకు దారికూడా ఉన్నట్లు లేదు. అన్నీ బండలు, రాళ్ళు అడ్డదిడ్డంగా వున్నాయి.
జేబులోంచి పెన్ టార్చి తీసాడు. టార్చికాంతిలో జాగ్రత్తగా ఆ పోడ దగ్గరకు నడిచాడు. తనని ఎవరన్నా గమనిస్తున్నారేమోనని మరో సారి నలువైపులా చూశాడు. ఎవరూలేరని నిర్ధారించుకొని టార్చీని పొదలోకి ఫోకస్ చేశాడు. జాగ్రత్తగా పరిశీలిస్తూ పొదలోకి వంగాడు. టార్చీ కాంతిలో పొద మొదట్లో కొన్ని బూట్లముద్రలు కనిపించాయి. గజిబిజిగా ఒకదానిమీద ఒకటి పడివున్నాయి. పొదను బాగా కెలికినట్లుగా వుంది. ఆగంతకుడికి సంబంధించిన ఏదో ఒకవస్తువు దొరక్కపోదా అని వచ్చాడు కాని ఎం కనిపించకపోవటంతో నిరుత్సాహం కలిగింది మనోహర్ కి.
అంతలో తన గురువు సింఘానియా మాటలు గుర్తుకువచ్చాయి. "దేనికీ నిరుత్సాహపడకు. నీవు కావాలనుకున్నది, నీవనుకొన్న చోటే దొరుకుతుంది. దొరకనప్పుడు మరికాస్త పట్టుదల. సహనం కూడగట్టుకో అప్పుడు మరలా శోధించు దొరుకుతుంది."
మరలా టార్చి వెలిగించాడు. తనకళ్ళని కెమేరా లెన్స్స్ గా చేసుకొని అంగుళం, అంగుళం చూడటం మొదలెట్టాడు. కొద్ది సమయం గడిచింది.
అప్పుడు మెరిసాయి అతనికళ్ళు పంగొని ఆ వస్తువుల్లో ఒకదాన్ని తీసుకొని కర్చీప్ లో చుట్టుకున్నాడు.
ఎవరీ ఆగంతకుడు! ఎందుకొచ్చాడు? వచ్చినా ఫోటోలు తీయాల్సిన అవసరం ఏం వచ్చింది? మనోహర్ ఆలోచిస్తూ నడక ప్రారంభించాడు.
పై ప్రశ్నలకు సమాధానాలు ఒక హత్యాప్రయత్నం జరిగాక కాని గ్రహించలేకపోయాడు.
* * *
షూటింగ్ జరుగుతున్నంతసేపు, గిరీష్ చూపులన్నీ రూపా చక్రవర్తి పైనే వున్నాయి. అది ఆమె గమనించింది. ఆ చూపుల్లో అతను వ్యక్తపర్చిన అవసరాన్ని ఆమె గుర్తించింది.
ఆమెకు ఆ అవసరమే కల్గింది.
అది మనోహర్ కి తెలిస్తే ప్రమాదమని, అదే ప్రొఫెషనల్ నెగ్లిజెన్స్ అవుతుందని కూడా తెలుసు. తెల్సినా గిరీష్ చూపుల్లో తనచూపు కలిపింది, అదీ ఎవరూ గమనించకుండా. ఆమె చూపుల్లో ఛాలెంజ్. ఆమె చిరుపెదాల కదలికలో ఆహ్వానం కనిపించాయి. గిరీష్ కి. గిరీష్ రూపాచక్రవర్తి బసచేసిన రాక్ విల్లా హొటల్ కి వచ్చినప్పుడు 7.55 అయింది.
లిప్ట్ ఎక్కి ఐదో ఫ్లోర్ దిగి, కారిడార్ లోకి చూచి తెల్సిన వారు ఎవరూ లేరని నిర్ధారించుకొని రూపా గది దగ్గరకు నడిచి మరోసారి అటూ ఇటూ చూసి తలుపుతట్టాడు. తలుపు తీసి గిరీష్ ని చూసిన రూపా ఆనందంగా లోనికి ఆహ్వానించింది. గిరీష్ సందేహించాడు.
గిరీష్ ని చేయిపట్టుకొని గదిలోకి లాగుతూ "కమాన్ యార్...." అంది నిర్లక్ష్యంగా, గిరీష్ వైపు మత్తుగా చూస్తూ.
తన బాస్ కి తెలిస్తే గొడవవుతుందనే జంకు, భయం ఒకప్రక్క రూపా అందాల్ని వదులుకోలేని తీవ్రమైన కాంక్ష మరో ప్రక్క . బ్రతుకు భ్రద్రతకు, బలహీనతకు మధ్య కాంట్రాడిక్షన్......బలహీనతే ఎక్కువ సార్లు గెలుస్తుందేమో. పల్చటి నైటీలో రూపా చక్రవర్తి వంపులు స్పష్టంగా కసిగా చాలేజింగ్ గా కనిపిస్తున్నాయి గిరీష్ కి. ఆ వంపుల మలుపుల్లో గిరీష్ ఆకలి చూపులు చిక్కుకుపోయాయి.
తమకంగా ఆమెవైపే చూస్తున్న ధైర్యం చేయలేకపోయాడు గిరీష్.
ఆ పని రూపా చక్రవర్తే చేసింది. మరుక్షణం ఆమె కౌగిట్లో నలిగి పోతున్నాడు గిరీష్. తెలివిగల ఆడది, సుఖాల మూలన్ని క్షుణ్ణంగా తెల్సుకున్న ఆడది, అందునా తాగిన ఆడది. తన అందాల్ని అడ్డాలు లేకుండా చూపించే వృత్తిలో ఉన్న ఆడది విజృంభిస్తే అంత హార్ట్ గా వుంటుందని ఇప్పుడే తెలుసుకున్నాడు గిరీష్.
అంతలో తలుపుమీద చప్పుడయింది. ఉలిక్కిపడ్డాడు గిరీష్.
రూపాకి తలుపుకొట్టిన శబ్దం భయం కలిగించలేదు, ఆమెకివి మామూలే గనుక, సినిమా ఫీల్డ్ లో .మోడల్ వరల్డ్ లో ఇలాంటివి మామూలే అని తెల్సినా, తను మనోహర్ దగ్గర వర్క్ చేస్తున్నాను గనుక ఇలాంటివి కూడదనే విషయం భయం కల్గించింది. భయపడుతున్న గిరీష్ వి వలదన్నట్లుగా కళ్ళ ద్వారా అభయమిచ్చి గిరీష్ ని అయిష్టంగా వదిలేసి "ఎవరూ?" ప్రశ్నించింది నిర్లక్ష్యంగా.
"మనోహర్"
ఇద్దరికి ఒక్కసారి వళ్ళు చల్లబడింది. ఇద్దరిలోనూ కంగారు ,గాబరా ఎక్కువయింది. టైమ్ కాని టైమ్ లో బాస్ రావటమేంటి?
ఏంచెయాలో-ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో తెలియని అయోమయ పరిస్థితిలో పడిపోయారు. ఈ విషయం తెలిస్తే మనోహర్ తనను గెంటి వేయవచ్చు. ఎంతో కష్టంమీదగాని మనోహర్ దగ్గర చేరలేక పోయాడు.
మనోహర్ లా తనూ మంచి యాడ్ ఫోటోగ్రాపర్ కావాలనుకుంటున్న తన ఆశయం నాశనమైపోతుంది.
గిరీష్ ఆలోచనలు ఇలా వుండగా ముందు తేరుకున్న రూపా, ఠక్కున గిరీష్ ని బాత్ రూంలోకి నెట్టింది. షాల్ తీసుకొని ఒంటినిండా కప్పుకొని తలుపుతీసింది, ఎదురుగా మనోహర్. ఒక్కక్షణం కంగారుపడ్డా, వెంటనే తేరుకొని మనోహర్ ని లోపలకు ఆహ్వానించింది.
"కబురుచేస్తే నేను వచ్చేదాన్ని. మీరెందుకు మనోహర్ గారు శ్రమ తీసుకొని వచ్చారు?"
ఇంత గౌరవంగా ఎ మోడల్, ఏ ఫోటోగ్రాఫర్ వద్ద, యాడ్ ఏజన్సీ బాస్ ల దగ్గర వ్యవహరించరు. తమను ఎడాపెడా రాక్షసంగావాడుకునే వాళ్ళమీద మాకెందుకు గౌరవం అంటారు. మేము తయారుచేయబడ్డ ఖరీదైన వేశ్యలం___దానికి కారకులైన వాళ్ళని ఎందుకు గౌరవించాలి? గౌరవిస్తున్నట్లు, భయపడుతున్నట్లు నటిస్తాం. అంతే ఇది కొందరి మోడల్స్ అంతరంగం.