Previous Page Next Page 
రెడీమేడ్ మొగుడు పేజి 7

     "రాజీ..." ఈసారి కాస్త గట్టిగ్ పిలిచాడు.

    "ఊ..." విసుక్కుంటూ అంది ఆమె.

    "నేను ఆఫీసుకేళ్తున్నా."

    "ఊ..."

    "డైనింగ్ టేబుల్ మీద అన్నం, కూరా, చారు పెట్టాను.లేచి మొహం కడుక్కుని కాస్తా బలవంతంగానైనా ఎంగిలిపడు.... ఎలాగూ నువ్వు యిష్టంగా ఎంగిలి పడలేవులే. మరి నీ అంత కమ్మగా నేను వండలేనుగా హహహ..." ఆమెను చీరఫ్ చెయ్యడానికి నవ్వుతూ అన్నాడు అతను.

    ఆమె మాత్రం వులకలేదు, పలకలేదు.

    "ఏం రాజీ! విన్నవా?" అన్నాడు.

    "విన్నాను... ముందు నువ్వఫీసుకు వెళ్ళు పాపం టైంమైపోతూంది. మళ్ళీ అర్దరాత్రేనా తమరి దర్శనం?" వ్యంగంగా అంది ఆమె.

    "లేదు రాజీ! ఈ వేళ త్వరగానే వస్తాను.నిజం...నీమీదోట్టు."

    "అవును.... త్వరగా రావడం నీకు అలవాటేగా? ఇంకా వెళ్ళు! అటువైపు తిరిగి  పడుకుంటు అంది ఆమె.

    "వెళ్తానుగానీ! నువ్వు మాత్రం భోజనం చెయ్యి. న మెడ కోపంతో ఆకలితో మాడకు రాజీ ..ప్లీజ్..." బతికిస్తూ అన్నాడు అతను.

     అలాగేలే..."

    థాంక్యూ రాజీ! ఇంకా వస్తాంనేం వ్యంగ్యంగా..త్వరగా వచ్చేస్థానులే.. వస్తానింక ఏం....? వ్స్తానేం ఇంకా?"

    "అలాగే అలాగే."

    "ఉంటానేం ఇక....ఇహుంటా... నువ్వు లేచి వీధి తలుపెస్కో."

    "ముందు నువ్వెళ్ళు ! తలుపులు నేనేస్కుంటాలే."

    రాంపండు వరండాలోకి వచ్చాడు.

    "బాబూ!" గరగరలాడే గొంతుతో.

    ఉలిక్కిపడి చూశాడు. యింటి ముందు బిచ్చగాడు.

    బాబయ్య! ఆకలవుతుంది. ఈ వేళ పులిహొర పొట్లం ఇటు పారెయ్యండి బాబయ్యా...!" అన్నాడు బొచ్చెని ముందుకు చాపుతూ.

    "ఏంరోయ్... నేను చారు మెతుకులు మింగాను. నీకు పులిహొరకావాలా? ఫోఫో ..." చికాగుగా అన్నాడు రాంపండు.

    "ఫో బాబయ్యా... నువ్వలానే అంటావ్... అమ్మాగారయితే బిర్యానీ పోట్లాలే వేస్తాది... నిన్నా బిర్యానీ పొట్లం వేసింది మాతల్లి. అందుకని ఈయాల పులిహొర అడిగా.... లోపలికెళ్ళి అమ్మగార్ని పిలు బాబయ్యా."

    "ఒరేయ్.. నువ్వేళ్తావా బెల్టుతో కొట్టమంటావా? అసలే అమ్మగారు అలిగి పడుకుంది. ఇంకా నువ్విక్కడ వున్నవంటే నిన్ను చీపుర్తో చితక్కోట్టేస్తుంది....ఫో" విస్సుగా అరుస్తూ అన్నాడు రాంపండు.

    "ఏంటి బాబూ అలా విసుక్కుంటావు? బిర్యానీయో, పులిహొర వేస్తె వేయాలి లేకపోతే లేదని చెప్పాలిగానీ అలా వుసుక్కుంటే ఎలా?" రాంపండువంక కృరంగా చూస్తూ వెళ్ళిపోయాడు ఆ బిచ్చగాడు.

   
                                         *    *    *    *   


    రాంపండుని చూస్తూనే బ్రహ్మాజీ ఇంట పెద్దగా నోరు చాపాడు.

    "ఏంటి కృష్ణుడిలా నీ నోటిలో విశ్వం మొత్తాన్ని చూపించాలని ప్రయత్నిస్తున్నవా? నోర్ముయ్యి ఈగలూ, దోమలూ దూరిఫోగలవ్... అయినా నువ్వు నోరెందుకలా తెరిచావు?" అన్నాడు రాంపండు బ్రహ్మాజీతో

    "నిన్ను చూసి" అన్నాడతను.

    "నన్ను చూశా? నన్ను చూసి అంతగా ఆశ్చర్య పోయి ఇంతగా నోరు తెరిచే విషయం ఏముంటుంది?!" అన్నాడు రాంపండు. అంతలోనే అతనికి అనుమానం వచ్చింది. కొంపదీసి తన డ్రెస్సింగులో ఏమయినా లోపంగానీ వుందా?
    రాంపండు అటువైపుకి తిరిగి తన ప్యాంటు గుండీలు సరిగ్గా పెట్టుకున్నాడో లేదో చెక్ చేసుకున్నాడు.

    "ఏంటి? ఎందుకలా నోరు తెరిచావు?" మళ్ళీ అడిగాడు ఇటు వైపు తిరుగుతూ.

    "అదికాదు.... నువ్వాఫేసుకి ఎందుకుకొచ్చావు?" ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు బ్రహ్మాజీ.

    "ఏం అలా అడుగుతున్నావు? నన్నేమయినా సడెన్ గా వుద్యోగంలోంచి పీకేశారా?"

    "అదికాదు... నిన్ననేగా మీ ఆవిడకి ఇంట్లో బాగోకపోతే అదేదో అడవాళ్ళ నర్సింగ్ హొంలో చేర్పించానని అన్నావు.... బాస్ కూడా నిన్ను నలుగు రోజులపాటు రావద్దని అన్నాడు కదా!?"

    ఛఛ... రాజీతో గొడవపడి, మాటలు కూడా లేక మనసంతా పాడై కన్ ప్యూజ్ అయి తనకా విషయమే గుర్తు లేదసలు.

    "ఏంటి? మీ ఆవిడకి ఇప్పుడెలా వుంది?" మళ్ళీ తనే అడిగాడు బ్రహ్మాజీ.

    "అంటే... అదీ... మరేమో...." నీళ్ళు నమిలాడు రాంపండు.

    "ఏంటి? ఇంకా ఒంట్లో బాగోలేదా?"

    "మా అవిడకేం? నిక్షేపంగా వుంది. ఇంటికి త్వరగా వెళ్ళాలని మా ఆవిడకి ఒంట్లో బాగోలేదని బాస్ కి చెప్పాను. అయన ఇంటికొచ్చి చూస్తానంటే ఆస్పత్రిలో వుందని చెప్పాను. అయన ఇంటికొచ్చి చూస్తానంటే ఆస్పత్రిలో వుందని చెప్పాను. అక్కడకి కూడా వస్తానంటే అది ఆడాళ్ళ నర్సింగ్ హొం అని ఇంకో అబద్దం చెప్పాస్ల్ వచ్చింది... ఇంకా చేస్తే ఇమ్తికిత్వరగా వెళ్ళలేకపోయా. మా ఆవిడని కూడా ఎక్కడికీతీస్కెళ్ళలేకపోయా" అంటూ జరిగిందంతా చెప్పాడు రాంపండు.

    "సో! మీ ఆవిడ నీతో గొడవ పెట్టుకుందన్నమాట? ఇంకాస్సేపు నువ్విక్కడ వున్నావనుకో... బాస్ తో కూడా నీకు గొడవయివయిపోతుంది" అన్నాడు బ్రహ్మాజీ.

    "అదేం?" అమాయకంగా అడిగాడు రాంపండు.

    "మీ ఆవిడకి సీరియస్ గా వుంది నర్సింగ్ హొంలో  వుంటే నువ్వాఫీసుకి ఎలా వస్తావు.... రావు కదా?"

    "మా ఆవిడకి ఆరోగ్యం బాగానే వుందని చెబుతున్నా కదా?"

    "ఆ విషయం మన బాస్ గాడికి తెలీదు కదా? దానికితోడు నిన్న నీతో నాలుగు రోజులు సెలవుపెట్టి మీ ఆవిడని దగ్గరుండి జాగ్రత్తగా చూస్కోమని చెప్పాడు. ఇప్పుడు నిన్నిక్కడ చూస్తే మండిపడతాడు. ఏమయ్యా పెళ్ళాం ప్రాణాలు పోయినా నీకు పట్టేలా లేదే అని! నిన్న నువ్వు చెప్పింది అబద్దమని తెలిస్తే యింకా డేంజరయిపోయి, నీవ్యవహరాన్నంతా ఫైల్లో ఎక్కించి నీ ఇంక్రిమెంట్ కట్ చేస్తాడు" రాంపండుని బెదరగొట్టాడు బ్రహంజీ.

    "అయితే ఇప్పుడెలా?" బుర్ర గోక్కుంటూ అన్నాడతను.

    "ఎలా ఏంటి? బాస్ రాకముందే నువిక్కడ నుండి జారుకో. ఓ పని చెయ్. ఇంటి కెళ్ళిమీ ఆవిడతో ఆవిడా కోసమే సెలవుపెట్టి వచ్చానని చెప్పు. ఆవిడ కోపం యిట్టే ఎగిరిపోతుంది ఆవిడని ఏదయినా సినిమాకు తీస్కేళ్ళు_ పాపం సంతోషిస్తుంది" ఓ ఉచిత సలహా పారేశాడు బ్రహ్మాజీ

    బ్రహ్మాజీ సలహా బాగానే ఇంటికి వెళతా. నేనిక్కడికి వచ్చినట్టు బస కి చెప్పొద్దు" అన్నాడు రాంపండు.

    "నేనెందుకు చెప్తాను?" అన్నాడు బ్రహ్మాజీ.

    రాంపండు గుమ్మం వైపు రెండడుగులు వేశాడో లేదో సర్వోత్తమరావు లోపలకి వస్తూ ఎదురుపడ్డాడు.

    అతన్ని చూడగానే రామ్పండుకి కంగారు పుట్టింది.

    "గుగుగు గుడ్ మార్నింగ్ సార్!" అన్నాడు కంగారుగా.

    "ఏంటీ? నీకి నత్తి వ్యవహారం ఎప్పటి నుంచీ వచ్చింది? అయినా నిన్ను సెలవుపెట్టి మీ ఆవిడా వ్యవహారం చూస్కోమని చెప్పానా?" ఆనాడు సర్వోత్తమరావు.

    "చెప్పారుగానీ మీరు నిజంగా చెప్పారో లేకపోతే జోక్ చేశారో అని డౌంట్ వచ్చి మళ్ళీ ఓసారి అడిగిపోదామని వచ్చా సార్."

    "జోకా? నువ్వేమయినా నాకు బామ్మర్దివా జోక్ చేయడానికి? బి కేర్ పుల్... ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వ్యవహారం నాతో పెట్టుకోకు" సీరియస్ గా అన్నాడు.

    "అలాగే సార్!"

     "నువ్వింక వెళ్ళొచ్చు."

 Previous Page Next Page