ఆమె నవ్వటం ఆపింది. అయినా ఇంకా ఆమె కళ్ళు నవ్వుతున్నట్లుగా ఉన్నాయి.
ఆమె చటుక్కున వెనుదిరిగింది.
"పొరపాటుగా అన్నానా?"
ఆమె ఓ క్షణం అటువేపే తిరిగి ఆగిపోయింది.
"సారీ.....నవ్వు బావుంది గదా అని బావుందన్నాను. కోపమొస్తే క్షమించాలి. ఆ కోపంతో కాఫీ ముద్ద ఇవ్వటం ఆపేయరు గదా? ప్లీజ్....."
ఆమె చటుక్కున్న అనిల్ వేపు తిరిగింది. మరలా ఇప్పుడు ఆమె కళ్ళు నవ్వుతున్నాయి.
"అంత స్ట్రెయిట్ గా ఉండటం ఒక్కోసారి ప్రమాదం తెచ్చిపెడుతుంది. పొరపాటున ఇంకో అమ్మాయెవరన్నా అయితే మిమ్మల్ని అపార్థం చేసుకుంటే మీ బుగ్గల గతేమవుతుంది?"
"ఇంకో అమ్మాయి ఇంతందంగా నవ్వగలదా?" అంటూనే బస్ కేసి సాగిపోయాడు.
హడావుడిగా వెళ్తున్న అనిల్ వేపు చూస్తుండిపోయింది కొద్దిసేపు సాలోచనగా.
"ఆమె భలే నవ్వుతుంది గదరా?" కాఫీ ముద్దను గిన్నెలో వేసి నీళ్ళు పోస్తూ అన్నాడు అనిల్.
"ఏంటిరోయ్ ఆకలిగురించి మర్చిపోయి అందంగా నవ్వటం గురించి ఆలోచిస్తున్నావ్? దెబ్బతింటావ్ నాయనా....." నారాయణ్ నవ్వుతూ అన్నాడు.
డికాక్షన్ తయారయింది.
టాగూర్ గ్లాసులోకి దాన్ని వంపుతూ "గురువుగారు ఏ గవర్నమెంట్ ఆఫీసరో అయుంటాడు. అందుకే ఆరోగ్యాన్ని మరింతగా కాపాడుకుంటూ మరింత కూడబెట్టుకొనేందుకు కాఫీ పొడిని ఒకసారి అలా పైపైనే వాడేసి వదిలేయమని చెప్పుంటాడు తన శ్రీమతికి. అందుకే డికాక్షన్ ఇంత ఘాటు. జిందాబాద్ ప్రజల సొమ్ము తినే ప్రభుత్వోద్యోగులు..." అన్నాడు పెద్దగా.
"జిందాబాద్" అని మిగతా ఇద్దరు కూడా పెద్దగా అరిచారు.
అంట్లు తోముతున్న శిరీష ఉలిక్కిపడి దూరంగా కనిపించే బస్ కేసి చూసింది. "అరేయ్ ఈ పూట బ్రెడ్, అరటిపండ్లకు కూడా డబ్బులు లేవురా- ఎలాగా?" నారాయణ్ ఆకలిని తలుచుకొని భయపడుతూ అన్నాడు.
"బాగా నటిస్తానన్నా నటింపచేసుకొనే కళాపోషకులే కరువయి పోయారు దేశంలో" అనిల్ నిస్పృహగా అన్నాడు.
"వాళ్ళంతా ఇప్పుడు టీవీ సీరియల్స్ తీసుకుంటున్నారు..... పాపం ఇక నీవు నటించాల్సింది సిటీలో ఎవరైనా చస్తే వాళ్ళ బంధువుల తరపున ఏడుపును నటించడమే.
"పోనీ ఆ చావు ఏడుపన్నా దొరికితే బావుండు" అన్నాడు అనిల్ లోపలకు పోయిన కడుపును తడుముకుంటూ.
* * *
థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ లైట్ బల్బ్ కనిపెట్టినట్లు, అలెగ్జాండర్ గ్రహంబెల్ టెలీఫోన్ ని కనిపెట్టినట్లు- టెలీఫోన్ ని కనిపెట్టినట్లుప్ టెలీవిజన్ ని ఒక వ్యక్తే కనిపెట్టాడని చెప్పుకొనేందుకు వీలులేదు.
ప్రపంచ వ్యాప్తంగా టెలీవిజన్ సృష్టికోసం చాలామంది శాస్త్రజ్ఞులు శ్రమించారు,
జర్మనీకి చెందిన కె.ఎఫ్. భ్రైన్ హాలో వేక్యూమ్ గ్లాస్ ట్యూబ్ కోసం శ్రమిస్తే, రష్యన్ శాస్త్రవేత్త వాల్డిమిర్ జ్వోరికిన్ పిక్చర్స్ ని ఎలక్ట్రిసిటీ క్రింద మార్చేందుకు శ్రమించాడు.
టెలివిజన్ పనిచేయటానికి ముఖ్యంగా రెండే ప్రధానం- ఒకటి ఎలక్ట్రిసిటీ, రెండు లైట్. ఆకాశంలో మెరుపు మెరిసినప్పుడు లైట్, ఎలక్ట్రిసిటీ సిమిలర్ గా ఉంటాయని రుజువవుతోంది. మెరుపుతో ఒక చిత్రాన్ని ఎలా పెయింట్ చేయటం అన్నదే సమస్య అయింది.
1817లో జె.జె బెర్లీలియన్ అనే శాస్త్రజ్ఞుడు సెలీనియమ్ ఎలిమెంట్ ని కనుగొనటం జరిగింది. అయితే 1873వరకు సెలీనియమ్ కాంతి నుంచి ఎక్స్ పోజ్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీకి అదో ప్రవాహకంగా మారిపోతుంది. దీని నుంచే ఉత్తేజాన్ని పొందిన శాస్త్రజ్ఞలు సెలీనియమ్ కలిగి ఉన్న చిన్న ఎలక్ట్రిక్ సర్క్యూట్ కాంతికి ఎక్స్ పోజ్ అయితే అది కరంట్ ని జనరేట్ చేస్తుందని కనుగొన్నారు.
దాంతో టెలీవిజన్ పుట్టుకలో మొదటి దశ పూర్తయింది.
లైట్ ఎలక్ట్రిసిటీ కింద ప్రత్యక్షంగా మారటమే తొలిదశ.
లైట్ ఎలక్ట్రిసిటీగా మారటమే టెలీవిజన్ కెమేరాకి బేస్. ఆ ఎలక్ట్రిసిటీ తిరిగి లైట్ గా మారటమే టెలీవిజన్ రిసీవర్ లోని పిక్చర్ ట్యూబ్ కి బేస్.
1884లో జర్మనీకి చెందిన పాల్ నిప్ కొ అనే శాస్త్రజ్ఞుడు కాన్ సెన్ ట్రిక్ హొల్స్ ఉన్న డిస్క్ నొకదానిని తయారుచేసాడు. ఆ డిస్క్లోని ప్రతి చిల్లు ఒక చిత్రం మీద నుంచి పాస్ అయినప్పుడు ఆ చిత్రమే లైట్ కి సోర్స్ గా గుర్తించబడింది. ఆ లైట్ తిరిగి ఎలక్ట్రికల్ కరెంట్ గా మారి తిరిగి లైట్ గా మారుతుంది. చిత్రం క్రియేట్ కావటానికి డిస్ విజువల్ మోర్స్ కోడ్ ను పంపిస్తుంది.
అయితే ఈ ప్రాసెస్ చాలా నెమ్మదిగా జరుగుతుండటంతో జర్మనీకి చెందిన డబ్ల్యూ ఎల్ వోచ్, జె.ఎలస్టర్, ఎ.గర్ టెల్ అనే శాస్త్రవేత్తలు పొటాషియమ్ హైడ్రైడ్ సెల్ ను డివైజ్ చేసి తక్కువ కాంతి నుంచి సయితం ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అయ్యేలా కనుగొనగలిగారు.
ఆ తరువాత కె.ఎస్. బ్రైన్ (జర్మనీ) ఎలక్ట్రిసిటీ కాంతిగా మారేప్రత్యేక్ష పద్దతిని కనుగొన్నాడు. కేతోడ్ రే ట్యూబ్ ని ఇతను బాగా అభివృద్ది పరిచాడు. ఈ గ్లాస్ ట్యూబ్ కి చివర ఫ్లోరో సెంట్ స్క్రీన్ ఉంటుంది. పిక్చర్ ట్యూబ్ లోంచి ఒక ఎలక్ట్రిసిటీ కిరణం స్క్రీన్ హిట్ చేయగానే అది వెలుగుతుంది.
1923లో వాల్డిమిరీ జ్వోరోకిన్ ఐకోనోస్కోప్ కెమేరా ట్యూబ్ ని కనిపెట్టాడు. ఎ ఇమేజ్ నైనా ఇది ఎలక్ట్రానికల్ చదివేసి వెంటనే ఎలక్ట్రిక్ కరంట్ గా మర్చివేస్తుంది. దీని మూలంగా ఎలక్ట్రానిక్ టెలీవిజన్ ఇమేజ్ తొలిసారి సృష్టించబడింది.
జ్వోరోకిన్ కనిపెట్టిన ఈ ఐకోనోస్కోప్ తొలి టెలీవిజన్ కెమేరా అయింది.
జ్వోరోకిన్ రష్యానుంచి అమెరికా వచ్చి అక్కడే సెటిల్ అయిన వలసవాది.
1932లో ఆయన రేడియో కార్పోరేషన్ ఆఫ్ అమెరికాలో పని చేస్తుండగానే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై ఒక టీవీ ఎంటెనాను అరేంజ్ చేసి మైళ్ళ దూరంలో ఉండే టీవీ సెట్లకు ఇమేజెస్ ట్రాన్స్ మిట్ చేయగలిగాడు.
ఇక అక్కడినుండి వివిధ దేశాలకు చెందిన శాస్త్రజ్ఞులు టెలీవిజన్ సిస్టమ్ ని అభివృద్ధి పర్చే ప్రయత్నంలో ముమ్మరంగా పాల్గొన్నారు. జర్మనీకి చెందిన 'మాన్ ఫ్రెడ్ ఓన్ ఆర్డెనె' కేతోడ్ రే ట్యూబ్ సెన్సివిటీని పెంచాడు. 1933లో ఇంగ్లాండ్ కి చెందిన సర్ ఐజాక్ షోయన్ బెర్డ్ 405 లైన్స్ లో ఇమేజ్ ని చదవగల టీవీ సిస్టమ్ ని కనుగొనటమే గాక ఇంటర్ లేసింగ్ అనే ప్రధాన ప్రక్రియను సృష్టించగలిగాడు.
ఎట్టకేలకు 1939లో అలెన్ బి.డూ మాంట్ ఇంజనీర్ ప్రపంచంలో తొలిసారి వాణిజ్యపరంగా టెలీవిజన్ సెట్స్ తయారు చేయటం ప్రారంభించాడు. అదే సంవత్సరంలో మొదటిసారి బేస్ బాల్ గేమ్ ని ప్రసారం చేయడం జరిగింది. అది న్యూయార్క్ లోని టెలీవిజన్ సెట్స్ ఉన్న కొద్దిమంది ప్రేక్షకులే చూడగలిగారు.
1940 జూలై ఒకటిన న్యూయార్క్ సిటీలో ఫస్ట్ కమర్షియల్ లైసెన్డ్స్ టెలీవిజన్, ట్రాన్స్ మిటర్ పనిచేయటం ప్రారంభించాయి. అప్పట్లో వారానికి 15 గంటలే ప్రసారాలు ఉండేవి.
అదే సంవత్సరంలో ఆర్.సి.ఎ కలర్ టెలీవిజన్ సిస్టమ్ ని డెవలప్ చేసి ప్రసారం చేసింది. అప్పుడే కోఏక్సిల్ కేబిల్ ను డెవలప్ చేసి న్యూయార్క్ లోని ప్రోగ్రామ్ ని, యదాతథంగా ఫిలడల్ఫియా టీవీ స్టేషన్ కూడా ప్రసారం చేయగలిగేటట్లు చేసారు.
టీవీ వచ్చిన తొలిరోజుల్లో రెడియోని తట్టుకొని నిలబడటానికి చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంది. అప్పటికి రెండవ ప్రపంచం యుద్దం రావటంతో శాస్త్రజ్ఞుల దృష్టి వేరే ప్రయోగాల మీదకు మరలటంతో దాని అభివృద్ధి ఒకింత మందగించింది. ఆ యుద్ద సమయంలో కనుగొన్న రాడార్ సిస్టమ్ నే తరువాత టీవీ పరిశోధనకు, అభివృద్ధికి ఉపయోగించటం జరిగింది.
1946కి 18,24 అంగుళాల వెడల్పు గల టీవీ తెరలు పుట్టు కొచ్చాయి.
ఢిల్లీ దూరదర్శన్ ప్రసారాల్ని యదాతథంగా హైద్రాబాద్ దూరదర్శన్ ప్రసారం చేయటం లాంటి కోఏక్సిల్ కేబ్ ల్ సిస్టమ్ బాగా ప్రాచుర్యాన్ని పొందింది.
సినిమా కెమేరాకి టీవీ కెమేరాకి చాలా తేడా ఉంటుంది. అలాగే సినిమా స్క్రీన్ కి కూడా తేడా ఉంది.
సినిమా కెమేరాలో షూట్ చేసిన ఫిల్మ్ ని లాబ్ కి పంపించి డెవలప్ చేసి, దాన్నుంచి పాజిటివ్ ప్రింట్ చేసి, అపుడు చూడాలి. అదే టీవీ కెమేరాలో కేసెట్ ని వీడియో రికార్డర్ ద్వారా రివైండ్ చేసి ప్లేలో పెడితే ఆ రికార్డర్ కి ఉన్న అతి చిన్న స్క్రీన్ మీద మొత్తం చూడవచ్చు. అప్పటికప్పుడే ప్రతి షాట్ ని చూసుకొని రిజల్ట్స్ బాగా లేకపోతే తిరిగి మరోసారి అప్పటికప్పుడే షూట్ చేసుకోవచ్చు. సినిమా కెమేరాలో వాడే ముడి ఫిల్మ్ ఫ్రేమ్స్ కింద ముందే డివైడ్ చేసి ఉంటుంది. మూవీ కెమేరా ఎప్పుడైతే ఫోకస్ అవుతుందో అప్పుడు లైట్ లెన్స్ ద్వారా ప్రవహించి లోపల తిరుగుతుండే ఫిల్మ్ మీద పడి ఎక్స్ పోజ్ అయిపోతుంది. ఆ ప్లాస్టిక్ ఫిల్మ్ మీద లైట్ సెన్సిటివ్ ఫోటో కెమికల్ కోటింగ్ చేసుంటుంది. క్షణానికి 24 ఫ్రేమ్స్ మీద అతి చిన్న ఇమేజ్ డూప్లికేట్ అయుంటుంది. దాన్ని తెర మీద క్షణానికి 24 ఫ్రేమ్స్ చొప్పున ప్రాజెక్ట్ చేసినప్పుడు మనకు సినిమాలా కనిపిస్తుంది. టీవీ ఫిల్మ్ కూడా ఫ్రేమ్స్ పద్ధతిలోనే పనిచేస్తుంది. దీనిలో క్షణానికి 30 ఫ్రేమ్స్ ఎక్స్ పోజ్ అయిపోతుంటాయి. ఫిల్మ్ కెమేరాప్రతి ఇమేజ్ ని క్రియేట్ చేసేందుకు ఫోటోగ్రాఫిక్ ఎమల్షన్ ఉపయోగిస్తుంది. అదే టెలివిజన్ కెమేరా ఎలక్ట్రిసిటీ ద్వారా చిన్న చిన్న చుక్కల్ని ఎక్స్ పోజ్ చేసుకుంటుంది. ఒక మనిషి మొఖాన్ని టీవీ కెమేరా అసంఖ్యాకమైన చిన్న చుక్కల క్రింద ఎక్స్ పోజ్ చేసుకుంటుంది. టీవీ లో ఏదైనా ప్రోగ్రామ్ వస్తుండగా నిశితంగా, అతి దగ్గరగా దానికేసే చూస్తే చిన్న చిన్న చుక్కలు గాని లైన్స్ గాని కనిపిస్తాయి. అలాంటి అసంఖ్యాకమైన చుక్కలు గీతలే కలిసి ఇమేజ్ ను క్రియేట్ చేస్తాయి. ఆ చుక్కలు, గీతలు ఇమేజ్ ఛేంజ్ చేసేందుకు నిరంతరం మారి పోతుంటాయి. ఒక న్యూస్ పేపర్ తీసుకొని అందులోని ఒక ఫోటో సెలెక్టు చేసుకొని మేగ్నిఫియింగ్ గ్లాస్ తో అతి దగ్గరగా చూస్తే కొన్ని వేళ చుక్కలు కనిపిస్తాయి. ఆ చుక్కలే ఒక ఇమేజ్ ని క్రియేట్ చేస్తాయి. ఆ చుక్కలు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండటం మూలాన, ఒకింత దూరం నుంచి మనం చూడటం వలన క్లియర్ ఇమేజ్ ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా మన కళ్ళకు కనిపిస్తుంది.
అదే కలర్ తెలీవిజన్ సెట్ అయితే ప్రతిచుక్క లైన్ బ్లూ, గ్రీన్, రెడ్ కలర్ లో కనిపిస్తాయి. ఈ మూడు రంగులలో ఉండే చుక్కలు, లైన్స్ ఎలక్ట్రిసిటీ సహకారంతో ప్రేరణ పొంది రంగుల చిత్రాన్ని సృష్టించేందుకు ఒకటవుతాయి.
టీవీ సెట్ ఆన్ చేసాక డని సౌండ్ పూర్తిగా తగ్గించి చూస్తే మనకు ఎలాంటి శబ్దం వినిపించదు. అందుకు కారణం టీవీ సెట్ లో మూవింగ్ పార్ట్స్ ఏమీలేకపోవటమే. టీవీ పని చేయటానికి ప్రతి చర్యా ఎలక్ట్రానికల్ గా, నిశ్శబ్దంగా పనిచేసుకుపోతుంటుంది.