"నేనా... మా మరిది కోసం పిల్లని చూడ్డానికి ఇక్కడికి వచ్చాను. అయినా ఇలా రోడ్డు మీద నిలబడి మాట్లాడడం ఏమిటి? పద ఏ రెస్టారెంట్ లోనయినా కూర్చుని మాట్లాడ్డాం" అన్నాడు రంగారావు.
రాంపండు గుండెల్లో రాయి పడింది.
"అయినా అమనం రేపు కలసి దీటేయిల్ద్ గా మట్లాడుకుంటేనో? హాహహ" అన్నడు రాంపండు.
"ఎందుకిలా అనవసంరంగా నవ్వుతావు? అదేమైనా జోకా? రేపు నేను వుండడం లేదు. ఈ వేళరాత్రికే పడి గంటల బస్సుకి వెళ్ళిపోతున్నా. పిల్లని అతని చెయ్యి పట్టుకుని బరబరా లాక్కుని వెళ్ళిపోయాడు.
* * * *
రాత్రి తొమ్మిది గంటలైంది. డోర్ బెల్ నొక్కుతుండగా రాంపండు చెయ్యి వణికింది.
అతని బిర్యానీ పార్సెల్ వుంది రంగా, అతనూ ఇద్దరూ రెస్టారెంట్ లో తినేశారు. బయటకి వెళ్తాం అన్నా ఉద్దేశ్యంతో రాజీ వంటచేసి వుండదని అతనికి తెలుసు. అందుకే రెస్టారెంట్ లో బిర్యానీ పార్సెల్ చేయించుకుని వచ్చాడు.
మరోసారి డోర్ బెల్ నొక్కాడు.
వెంటనే తలుపులు తెరుచుకున్నాయి.
రాజీ మొహం జేవురుమంది. బాగా ఏడ్చినట్టు కళ్ళు ఎర్రగా వుబ్బి వున్నాయి.
"అంతే నేను త్వరగా వద్దామని అనుకున్నానన్నమాట... నేను అప్పటికి చెప్పా... ఒరేయ్ ఇంటి దగ్గర ఆవిడా వెయిట్ చేస్తుంటుందీ మనం రేపు కలుద్దాం అని. కానీ విచిత్రంగా వాడు ఈ వేలే వెళ్ళిపోవాలట... ఇంట్లోకి వస్తూ అన్నడు రాంపండు.
"నేను పడుకుంటున్నా" నిన్నట్నుండీ నువ్వసలు మాట్లాడితేగా...! అన్నాడు అతను.
"ఇప్పిడంటున్నగా.... నేను రెస్ట్ తీసుకోవాలి! మీరు లేచేల్ళీ మీ పనులు చూస్కోండీ" విసుక్కుంటూ అంది.
ఇప్పుడామేను బ్రతిమిలాడితే ఇంకా రెచ్చిపోతుందని అతనికి తెలుసు.
అందుకే బాధగా నిట్టూర్చి మంచం మీది నుండి లేచాడు. వీధి తలుపులు తీస్తే గుమ్మంలో పాల పాకెట్ వుంది. దాన్ని తీసుకెళ్ళి కత్తెరలో కత్తిరించి పాలన్నీ గిన్నెలోకి కుమ్మరించి స్టవ్ మీద పెట్టాడు.
పాలు కాగేలోగా పళ్ళు తోముకుని వంట గదిలోకి పరుగు తీశాడు.
అప్పుడే గిన్నెలోకి పాలు పొంగుబోతున్నాయి. వంట గదిలోని ప్లాట్ ఫాం మీది మసిగుడ్డని హడావాడిగా అందుకుని స్టవ్ మీద నుండి పాలగిన్నెని ఎత్తాడు. అల ఎత్తుతుండగా గిన్నె అతని వెల్లకి కాస్తంత అంటుకుని సర్రుమంది.
"బేరర్..." అని అరిచి పాలగిన్నెని కిచెన్ ప్లాట్ ఫాం మీద డబ్బున ఎత్తాడు. అలా ఎత్తడంలో గిన్నెలోని పాలు పావు భాగం క్రిందకి చింది అతని కుడికాలు పాదంమీద ఒలికాయి.
ఈసారి కేర్ ర్ మని ఓ గెంతు గెంతాడు. తర్వాత స్టవ్ కట్టేసి బాత్రూంలోకి పరుగుతీసి కోశాయ్ నీళ్ళ క్రింద క్లిన చేతి వెళ్ళనీ, పాదాన్నీ పెట్టాడు.
మంట...! మంట..!!
పాలుకాచడానికే ఇంత చావో చ్చిపడిందే.... ఈ ఆడాళ్ళు కాళ్ళూ చేతులూ ఏమీ కాలకుండా వంటేలా చేస్తారబ్బా! అని ఆశ్చర్యపోయాడు. తర్వాత కెర్ర్ ర్ మానడం, గిన్నె శబ్దం అంతా వినిపించింది. భర్త చెయ్యా ఏదో కల్చుకున్నాడని ఆమెకి అర్డంమయ్యింది. ఆమె మనసు బాధతో మూలిగింది.
మంచం మీది నుండి లేచి వంటగదిలోకెళ్ళి చూడాలనిపించింది. కానీ అంతలోనే బెట్టు... లేదా పట్టుదల.
ఏం ఫరవాలేదులే.... చేతికి కాస్త మంట సెగ తగిలి వుంటుంది అని మనషిని వూరడింపచేయడానికి ప్రయత్నించింది.
మనసుకి వ్యతిరేకంగా కళ్ళు గట్టిగా బిగించి మూస్కుని పడుకుంది ఆమె.
వంట గదిలో....
నేలమీద ఒలోకిన పాలను తడిగుడ్డతో తుడుస్తూ ఆ పూట వంటెంచెయ్యాలా అని ఆలోచించసాగాడు. రాంపండు.
చారు, బంగళాదుంపలవేపుడూ చెయ్యడం చాలా ఈజీ అనిపించింది అతనికి. ఇంకా పచ్చళ్ళు ఎలాగూ వున్నాయి!
* * * *
తొమ్మిదిన్నరకి గబగబా నాలుగు ముద్దలు డోక్కుంటూ, బలవంతంగా కక్కుతున్నాడు రాంపండు. అంటే వంట అంత చక్కగా చేసుకున్నాడన్నమాట!
ప్యాంటూ, షర్ట్ వేసుకుని రాజీ గదిలోకి వెళ్ళాడు. ఆమె యింకా కళ్ళు మూసుకుని దొంగ నిద్రపోతూంది.