Previous Page Next Page 
చీకటికి అవతల పేజి 7


    కొడుకు వూరంతా ఇష్టం వచ్చినట్లు అప్పులు చేయడం, వాళ్ళొచ్చి తన దగ్గర్నుంచి డబ్బులు వసూలు చేయడం ఆయన సహించలేకపోయాడు.

 

    అయినా ఏం చేస్తాడు? కొడుకు పెరిగి తనకంటే అయిదంగుళాల ఎత్తు పెరిగాడు. అప్పుడప్పుడూ భార్య దగ్గర కన్నీళ్లు పెట్టుకునేవాడు.

 

    ఆమె ఏదో సర్దిచెప్పేది. కొడుకుని మంచి మార్గాన నడవమని బతిమిలాడేది. చలపతికి ఇరవయ్యేళ్ళు వచ్చేసరికి ఆమె చనిపోయింది.

 

    కొడుకు అప్రయోజకుడు కావడం, భార్య మరణించడంతో రఘుపతి మందుకి బానిసయ్యాడు. మనశ్శాంతి కోసం కల్పనను ఆశ్రయించాడు.

 

    కల్పనా నిజంగా బావుంటుంది. స్త్రీ ఎలా వుంటే మగాడు పిచ్చెక్కిపోతాడో అలా వుండేది. పెద్ద కళ్ళతో పోటీపడే ఎదను చూస్తే ఎవరికైనా కిక్కు ఎక్కుతుంది. చెయ్యెత్తు మనిషి, మంచి కండపుష్టితో, సెక్సీతనం వలపులతో కసిక్కేంచేది.

 

    ఆమెకు పాతికేళ్ళు. భర్త ఓ యాక్సిడెంట్ లో చనిపోతే, ఆ తాలూకు డబ్బులు ఇప్పించమని రఘుపతిని అడిగింది. వాళ్ళు కలసి టౌన్ కి వెళ్ళేవాళ్ళు. అలా వాళ్ళిద్దరికి సాన్నిహిత్యం ఏర్పడింది.

 

    ఈ విషయం చలపతికి తెలుసు. అయినా తండ్రిని అడిగే ధైర్యం లేకకాదు. ఆయన్ను చూడడమంటేనే ఎలర్జీగా ఫీలయ్యేవాడు. ఆయన బయట వుంటే తను లోపల వుండేవాడు. మరో అయిదేళ్ళకు కాబోలు రఘుపతికి పక్షవాతం వచ్చి కాళ్లు చచ్చుబడిపోయి మంచం ఎక్కాడు.

 

    ఆ రోజు చలపతి ఎంత ఆనందించాడో చెప్పలేం. తనకు పూర్తి స్వాతంత్ర్యం వచ్చినట్టు ఫీలయ్యాడు.

 

    రెండో రోజు ఉదయం లేచి నీట్ గా తయారయ్యాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. "ఈ రోజు నుంచి నీ ఆస్తిమీద సర్వహక్కులు నావే. నన్ను అప్రయోజకుడని ఎప్పుడూ తిట్టేవాడివి. కానీ నేనంత ప్రయోజకుడయ్యేదీ కళ్ళారా చూపిస్తాను. అలా నీమీద నా కసి తీర్చుకుంటాను" అని చెప్పి రైస్ మిల్లుకు వచ్చాడు.

 

    తండ్రి కూర్చున్న సీట్లో కూర్చుంటే ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించింది.

 

    ఆయన అహంకారంమీద, అతిశయంమీద, ఒక్క మాటలో చెప్పాలంటే జబ్బులో నిస్సత్తువుగా వున్న తన తండ్రిమీద కూర్చున్నట్టే భావించాడు. తన తండ్రిమీద నిశ్శబ్దంగా పగతీర్చుకుంటున్నానన్న ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు.

 

    సాయంకాలం వరకు స్ట్రిక్ట్ గా రైస్ మిల్లు వ్యవహారాలు చూసుకున్నాడు. ఎక్కడెక్కడ ఏమేం లొసుగులు వున్నాయో గమనించాడు. వాటిని అధిగమించాలంటే ఏం చేయాలో కూడా ఆలోచించాడు.

 

    చివరికి రైస్ మిల్లు కట్టేసి సీట్లోంచి లేస్తున్నప్పుడు తన తండ్రిమీద పూర్తి ఆధిపత్యం చెలాయించడం లేదని అనిపించింది.

 

    అదేమిటో ఆలోచిస్తూ ఇంటికి బయల్దేరాడు. చివరగా తను ఏం మిస్సయ్యాడో తెలిసిపోయింది.

 

    మళ్ళీ శుభ్రంగా తయారై తండ్రి దగ్గరికి వెళ్ళాడు.

 

    "ఉదయం నుంచి సాయంకాలం వరకు రైస్ మిల్లులో వుండి ఇంతకాలం నువ్వు పాలించిన సామ్రాజ్యాన్ని నా చేతుల్లోకి తీసుకున్నాను.

 

    సామ్రాజ్యాన్ని జయించినపుడు అందులో వుండే రాణులంతా కూడా శత్రురాజుకి చెందుతారు. అలానే నీ ఉంపుడు కత్తె కల్పన కూడా ఈరోజు నుంచి నాదవుతుంది, వస్తా" అని బయల్దేరాడు.

 

    ఆ సమయంలో తండ్రి కళ్ళల్లో కనిపించిన బాధను చూసి తను నూటికి నూరుశాతం తండ్రిమీద ప్రతీకారం తీర్చుకున్నట్టు రాక్షసానందం పొందాడు.

 

    కల్పన ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు.

 

    అప్పటికే విషయం తెలిసింది ఆమెకి. తనను ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడిన మనిషి శాశ్వతంగా మంచంలో పడిపోయాడని విన్నప్పట్నుంచి దుఃఖం పొంగుకొస్తోంది.

 

    తను బాధని పంచుకునేందుకు కూడా ఆమెకి ఎవరూ తోడులేరు. రఘుపతితో స్నేహం మొదలైనప్పట్నుంచి అందరూ ఆమెని వెలేసినట్టు చూస్తున్నారు. ఆమెతో మాట్లాడడానికిగాని, ఈమె ఇంటికి రావడానికి గాని ఎవరూ అంతగా ఇష్టపడరు.

 

    అలాంటి నిస్సహాయస్థితిలో వున్న ఆమెకు చలపతిని చూడగానే కొండంత అండ దొరికినట్టయింది.

 

    రఘుపతికి వచ్చిన కష్టాన్ని చూసి కరిగిపోయిన మనస్సంతా కన్నీళ్ళయి ప్రవహిస్తోంది. తన బాధంతా తీరిపోవడానికన్నట్టు ఆమె భోరున ఏడుస్తోంది.

 

    చలపతి ఆమెను ఓదార్చడానికన్నట్టు రెండు చేతులతోనూ పొదివి పట్టుకున్నాడు. అలానే మెల్లగా నడిపించుకుంటూ హాల్లోకి వెళ్ళాడు.

 

    "ఆయన లేకుండా నేనెలా బతికేది?" ఏడుపును దిగమింగుకుంటూ అడిగింది కల్పన.

 

    "అంతా నేను చూసుకుంటాను. నువ్వేం దిగులుపడకు" అన్నాడు చలపతి సీరియస్ గా.

 

    నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి బుట్ట పడవ దొరికినంత సంబరబడిపోయింది ఆమె. తనను ద్వేషించాల్సిన వ్యక్తే స్వయంగా వచ్చి స్నేహహస్తాన్ని చాచడం ఆమె నమ్మలేకుండా పోతోంది.

 

    అతని చేతులు ఆమె భుజాల మీద నుంచి కిందకు దిగి ఎత్తుగా అడ్డు వస్తున్న ఎద దగ్గర ఆగాయి.

 

    జింకపిల్లమీద చేయివేసి ప్రేమగా దానిని నిమురుతున్నప్పుడు అది ఠక్కున పెద్దపులిగా మారిపోయినట్టు ఆమె జడుసుకుంది.

 

    చివుక్కున తలెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. అతను ఏమీ తొట్రుపడలేదు.

 

    పైపెచ్చు చిన్నగా నవ్వుతున్నాడు.

 

    అతన్ని తను పొరబాటుగా అర్థం చేసుకున్నానన్న సంశయం మొదలైంది. కానీ చేతుల స్పర్శ మరో విధంగా వుంది. అందుకే అతని వైపు బ్లాంక్ గా చూసింది.

 

    "ఈరోజు నుంచి నాన్న వ్యాపారాన్ని నా చేతుల్లోకి తీసుకున్నాను అది నా బాధ్యత. అలానే నిన్ను కూడా. ఆయన కొనసాగించిన వేటినీ ఆపకూడదనీ నిర్ణయించుకున్నాను. నీకు ఎవరూ లేరు. ఎవరి ప్రేమా లేకుండా బతకడం కష్టం. ఇక ఈ ఊర్లో నువ్వు ఒంటరి. స్త్రీలైతే నీ నీడవంక చూడడానికి కూడా ఇష్టపడరు. మగాళ్ళు నీ శరీరం కోసం తాపత్రయపడతారుగానీ గుండెల్లో అంత చోటివ్వరు. నేను అలా కాదు. మనసా వాచా నిన్ను కోరుకుంటున్నాను" అతను ఎఫెక్ట్ కోసమన్నట్టు ఆగి తిరిగి ప్రారంభించాడు.

 

    "అనవసరమైన సెంటిమెంట్లతో జీవితాన్ని పాడు చేసుకోకు. ప్రాక్టికల్ గా ఆలోచించు. మా నాన్న ఇక మంచం మీద నుంచి లేవలేడు. నిన్ను చూసుకోలేడు. ఇప్పుడు అధికారమంతా నా చేతికి వచ్చింది.

 

    నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగదు. అందువల్ల నన్ను కాదనడం తెలివితక్కువ పనే అవుతుంది. నువ్వు మా నాన్నకి ఉంపుడుకత్తెవే కానీ నాకు తల్లివికాదు. కాబట్టి వావివరసలు మరిచి పాపం చేస్తున్నానేమో అన్న శంక వద్దు. నాకు నీ ప్రేమ కావాలి. నీకు మగతోడు కావాలి. కాబట్టి- ఇది చిన్న అడ్జస్ట్ మెంట్ అనుకో" అని చేతుల్ని మరింత బిగించాడు.

 

    ఆ క్షణంలో ఆమె అన్నీ ఆలోచించింది. అతను చెప్పినట్లు అన్నిటిని ప్రాక్టికల్ గా బేరీజు వేసుకుంది. ప్రస్తుతం తనున్న పరిస్థితుల్లో అతను చెప్పినట్లు వినడమే మంచిదనిపించింది.

 

    నిజానికి ఆమె పుట్టెడు దుఃఖంలో వుంది. ఒంటరిగా వుంది. ఏ చిన్న ఆధారం దొరికినా దానికి అమాయకంగా అల్లుకుపోవాలన్న స్థితిలో వుంది.

 

    అందుకే ఆమెకు నైతిక విలువలు గుర్తుకు రాలేదు. పరిస్థితులు ఎంత బలీయంగా ఒక మనిషిని లొంగదీసుకుంటాయో మాత్రం తెలిసింది.

 

    అందుకే కనుచివర్ల నిలిచినా నీటి బిందువుల్ని తుడుచుకుంటూ అతన్ని చూసి చిన్నగా నవ్వింది.

 

    ఆ నవ్వుకు అర్థం తెలిసి చలపతి తన చేతుల్ని మరింత కిందకు దించి సెక్సీగా రెచ్చగొడుతున్న ఆమె నడుం మడతల్ని గట్టిగా పట్టుకున్నాడు.

 Previous Page Next Page