Previous Page Next Page 
చీకటికి అవతల పేజి 5


    ఆమె చెప్పింది నిజమేననిపించింది- "ఓకే- అయితే" అని బాత్రూమ్ లో దూరాడు.

 

    ఆమె అతను తెచ్చిన సూట్ కేస్ ను తెరిచి అందులోని వస్తువులను తీస్తూ వుండిపోయింది.

 

    మరో అరగంటకు అతను బయటకొచ్చాడు.

 

    వచ్చీ రావడంతోనే ఆమె దగ్గరికి వచ్చి "ఇదిగో- ఈ రెండు వేళ్ళల్లో ఒకటి పట్టుకో" అన్నాడు కుడిచేయి చూపుడు వేలునీ, మధ్య వేలునీ చూపిస్తూ.

 

    "ఎందుకు?"

 

    "ముందు పట్టుకో చెబుతాను"

 

    ఆమె చూపుడు వేలుని పట్టుకుంది.

 

    "అయితే రాత్రికి బెడ్ రూమ్ లో నువ్వు అన్ డ్రెస్ అయ్యి వుండాలన్న మాట."

 

    ఆమెకు మతిపోయినంత పనైంది.

 

    "మీ చూపుడు వేలు పట్టుకోవడానికీ, అలా వుండడానికీ సంబంధం ఏమిటి?"

 

    "అదంతే ఈరోజు రాత్రి మనం ఎలా వుండాలో వేళ్ళు డిసైడ్ చేస్తాయన్న మాట.

 

    చూపుడువేలు పట్టుకుంటే అన్ డ్రస్సయి వుండాలి. మధ్య వేలు పట్టుకుంటే దుస్తులతో వుండాలి అని మనసులో అనుకుని రెండు వేళ్ళల్లో ఒకటి పట్టుకోమన్నాను.

 

    నా అదృష్టం కొద్దీ, నీ దురదృష్టంకొద్దీ చూపుడువేలు పట్టుకున్నావ్? అని వివరణ ఇచ్చి నవ్వుతున్నాడు అతను.

 

    "అయితే ఈ రెండువేళ్ళల్లో మీరొకటి పట్టుకోండి" అంది ఆమె రెండు వేళ్ళను చూపిస్తూ.

 

    అతను చూపుడువేలుని పట్టుకోబోయి, కొంచెం తటపటాయించి నడిమ వేలు పట్టుకున్నాడు.

 

    "అయితే లైట్ ఆర్పేయాలన్న మాట" ఆమె కూల్ గా చెప్పింది.

 

    "బెడ్ రూమ్ లో లైట్ ఆర్పేయాలా? నువ్వు డ్రెస్ లో లేకున్నా ఏం లాభం అప్పుడు?" అతను నిరుత్సాహపడిపోతూ అన్నాడు.

 

    "మరి నడిమవేలు పట్టుకున్నారు. చూపుడువేలు పట్టుకుని వుంటే ఎంచక్కా లైట్ వుండేది. పాపం-" ఆమె అతన్ని ఉడికిస్తూ అంది.

 

    "అదేం కుదరదు" అతను ఒప్పుకోలేదు.

 

    "మీరు నేర్పించిన ఆటే కదా. మీరే అడ్డం తిరిగితే ఎలా?" చిన్నగా నవ్వుతూ అన్నదామె. అతను సరేనన్నట్లు తల ఊపి దీనికి పై ఎత్తు ఎలా వేయాలా అని ఆలోచిస్తూ ఓ క్షణంపాటు నిశ్శబ్దంగా వుండిపోయాడు.

 

    తరువాత ఏదో ప్లాష్ అయినట్లనిపించి-

 

    "ఇదిగో- ఈ రెండు వేళ్ళలో ఒకటి పట్టుకో" అన్నాడు.

 

    ఆమె ఈసారి నడిమ వేలుని పట్టుకుంది.

 

    "ఓహ్! ఐయామ్ ఏ లక్కీ గై" అని ఆపాడు.

 

    "ఎందుకు?"

 

    "ఈరోజు మన పడక- డాబామీద- అప్పుడిక లైట్లు లేకపోయినా ఫరవాలేదు.

 

    ఆకాశంలో ఏకంగా పెద్ద పెట్రోమాక్స్ లైట్ ఉంటుంది. అదే చందమామ" అతను చిన్నగా నవ్వుతున్నాడు.

 

    "అయితే ఈసారి మీరు పట్టుకోండి" అని ఆమె రెండువేళ్ళు చాచింది.

 

    మళ్ళీ ఏదో తిరకాసు పెడుతుందనిపించి, "ఒద్దులే- ఈ ఆట ఇంతటితో ఆపేద్దాం. ముందు అర్జెంట్ గా నీకో మంచి ప్రజెంటేషన్ కొనాలి. బజారుకెళదాం పద" అని ఆమెను లేవదీశాడు.

 

    "నేనొప్పుకోను" అంటూ నందిని మొండికేసింది.

 

    "సరే అయితే- డాబామీద వద్దులే. పెద్దలైట్ వేయనుగానీ బెడ్ లైట్ వుంచుకొందాం- ఓకేనా?"

 

    "ఓకే" అని పైకి లేచింది.

 

    ఇద్దరూ బజారుకి బయల్దేరారు.

 

    అతను ఆమెకి ఓ చక్కటి బంగారు చైన్ ను కొన్నాడు.

 

    అది మామిడిపిందెల చైన్.

 

    డాలర్ లేదు.

 

    అక్కడే మెడలో వేసుకుంది.

 

    ఆమె కంఠం వెనకాల పుట్టి, కంఠం దగ్గర మెలి తిరిగి, విశాల మైదానంగుండా సాగి, రెండు కొండల మధ్య ప్రవహించి,
    అక్కణ్ణుంచి బయల్దేరి ఓ స్టార్ హోటల్ లో లంచ్ తీసుకున్నారు.

 

    అటునుంచి గుడికి వెళ్ళి, తిరిగి బజారులో పూలూ, పళ్ళూ, స్వీట్స్ వగైరా తీసుకుని ఇంటికొచ్చేటప్పటికి సాయంకాలం ఏడయ్యింది.

 

    మరోగంటకు వాళ్ళిద్దరికీ ఏకాంతం చిక్కింది. ఇద్దరూ బెడ్ రూమ్ లోకి నడిచారు.

 

    "ఇక ఈ రాత్రికి నిద్రపట్టనివ్వద్దు" అన్నాడతను బెడ్ మీద వాలిపోతూ.

 

    అతని ఆరాటాన్ని చూసి ఆమె గమ్మత్తుగా నవ్వింది.

 

    "ఉండండి- ఓ అయిదునిముషాలు" అని బాత్రూమ్ లోనికి వెళ్ళింది.

 

    మధ్య మధ్యలో అతను తలుపులు తట్టాడుగానీ ఆమె తలుపు తెరవలేదు.

 

    "మన ఆట గుర్తుంది కదా. డ్రెస్ వద్దు" అని అరిచాడు గట్టిగా.

 

    దీన్ని ఆమె పాటించలేదు.

 

    మసకరంగు నైటీతో బయటికి వచ్చింది.

 

    లోపల ఇంకేమీ లేకపోవటంవల్ల ఆమె శరీరమంతా ట్రాన్స్ పరెంట్ నైటీలోంచి అస్పష్టంగా కనిపిస్తోంది.

 

    అతను తన చూపుల్ని ఎక్కడ చూస్తున్నాడో గమనించి తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గరికి వెళ్ళింది.

 

    లైట్ గా సెంట్ స్ప్రే చేసుకుంది. బెడ్ రూమంతా సుగంధాల దీవిలా అయిపోయింది. అతను అద్దం దగ్గరికి వచ్చి ఆమెను పొదివి పట్టుకున్నాడు. రక్తమంతా సలసలా కాగుతున్నట్టనిపించింది ఆమెకి. ఎద భారంగా తయారైంది.

 

    "ఇప్పుడే కాదు" అంది అద్దంలోని అతని ప్రతిబింబాన్ని చూస్తూ.

 

    "మరెప్పుడు?"

 

    ఆమె ఏమీ సమాధానం చెప్పకుండా టవల్ ని అతని భుజంమీద వేసింది.

 

    తనను ఏం చేయమంటుందో అతనికి అర్థమైంది. "ఓ.కే. నేను స్నానం చేసి వచ్చేటప్పటికి నువ్వు పసిపాపలా దర్శనమివ్వాలి" అని వెళ్ళాడు.

 

    ఆమె బెడ్ మీద పడుకుంది.

 

    అంతమంది జనం మధ్య కదలని బస్సులో ఉక్కపోతలో కూడా నవవధువు ఎందుకంత హాయిగా నవ్వగలిగిందో గుర్తొచ్చింది నందినికి.

 

    సిగ్గు శరీరాన్ని నొక్కిపట్టిందిగానీ లేకుంటే అది వికసితపుష్పమే అయ్యేది.

 

    లోపలికి వెళ్ళిన నితిన్ మూడు మగ్గుల నీళ్ళతో స్నానం అయిపోయిందనిపించి బయటికి వచ్చాడు.

 

    నందిని అటుతిరిగి పడుకుని వుంది.

 

    చన్నీళ్ళ స్నానం చేసినా ఒంట్లోంచి వేడి వేడి ఆవిర్లు పైకి ఉబుతున్నాయి.

 

    కోరిక శరీరాన్ని చుట్టుకుని నొక్కుతున్నట్టు ఒళ్ళంతా తీపులు పుడుతున్నాయి.

 

    కళ్ళముందు నందిని తప్ప మరే వస్తువూ ప్రతిబింబించడం లేదు.

 

    "పెళ్ళి రోజు కదా- ఓ కోరిక కోరనా?" అని అడుగుతూ తల దువ్వుకుంటున్నాడు.

 

    ఆమె నుంచి ఎటువంటి సమాధానం లేదు.

 

    "పోనీ రెండు వేళ్ళలో ఏదో ఒకదాన్ని పట్టుకో. ఏ వేలు పట్టుకుంటే ముందు మనసులో ఏం అనుకుంటానో దాన్ని ఆచరిస్తాను. పెళ్ళయిన రోజు నుంచి వున్న కోరిక ఇది. శృంగారంలో అదింతవరకు తీరలేదు. ఈ రోజైనా తీరుతుందేమో చూద్దాం" అని హుషారుగా భార్య దగ్గరికి వచ్చాడు.

 Previous Page Next Page