Previous Page Next Page 
ఆనందం పరమానందం పేజి 4

కూరల మనిషి ప్రకటన విన్న పరమానందం భార్య జానకమ్మ గబగబా వీథిలోకి వచ్చి కూరల బండిని ఆపింది. బండిలో వున్న కూరలు తనిఖీ చేస్తూ అడిగింది.
"ఏ ఊరి కూరలయ్యా! వాడి పోయి కనిపిస్తున్నాయి!"
ఆ మాటకి రోషం తన్నుకు రాగా - కూరల మనిషి రాగాలు తీస్తూ సుమాధానం చెప్పేడు.
"భలే వోరే! చెడి పోయిన కూరల్ని గొడ్లకు పెడతామే గాని అమ్మకానికి పెట్టడం మా ఇంటావంటా లేదండి. తోటలోంచి సరాసరి ఇక్కడికి తీసుకోస్తన్నా! ఈ ఊరికి కోత్తగానీ - వ్యాపారానికి పాతవాడినే అమ్మగారూ! టమాటాలు తీసుకోండి. నవనవలాడుతున్నాయి."
"సరే! సరే! అన్ని కూరలు తలో కిలో చొప్పున ఇవ్వు అన్నది జానకమ్మ అతను ఆ పని మీదున్నాడు.
హల్లో పరమానందం చెక్కు మీద సంతకం చేయడం పూర్తి చేసేడు.
"భద్రాచలం!" అని ప్రేమగా పిలిచేడు.
"మీ పక్కనే వున్నానండయ!" అన్నాడు భద్రాచలం.
భద్రాచలానికి పెళ్లయింది గానీ -  ఆ పిల్ల ప్రస్తుతం ఎక్కడుందో తెలీదు. అంచేత పెళ్లీ సంసారమనే రొంపిలో రెండో తడవ కాలుపెట్టకూడదనే సిద్దాంతంతో అతను ఒంటరి గానే బతికేస్తున్నాడు.
పరమానందం భద్రాచలం చేతిలో చెక్కు పెట్టి అంటున్నాడు.
"వేణుగోపాలస్వామి గుళ్లో కొబ్బరి కాయల పందెం గురించి-"
"చిత్తం! చెప్పేరండి."
"మనం గెలిస్తే ఆనందం పంపిన చెక్కు తీసుకో! ఓడిపోతేమన చెక్కు వాడి మొహాన కొట్టు! అర్థమైందా?"
అర్థమైనట్లు భద్రాచలం తల ఊపేడు. అక్కడితో ఆగిపోకుండా - గొంతు తడుపుకుంటూ అన్నాడు.
"ఒక చిన్న మనవి!"
"చెప్పు!"
"గుమస్తాలంటే పద్దులవీ రాయడం, అప్పులనీ వసూలు చేయడం లాంటి పనులు మాత్రమే చేస్తారని నా చిన్నప్పుడు అనుకున"ఇప్పుడేమనుకుంటున్నావ్?"
"చిత్తం! ఈ విధంగా గుళ్లు గోపురాలు తిరుగుతూ పందేలకు వెళ్లడం కూడా గుమస్తా డ్యూటీలే అనుకుంటున్నాను."
"అంతే మరి! నీకు  జీతమిస్తున్నది అందుకే!"
"చిత్తం!"
"అమ్మగారికి మాత్రం మన పందేలకు వెళ్లడం కూడా గుమస్తా డ్యూటీలే అనుకుంటున్నాను."
"అంతే మరి! నీకు జీతమిస్తున్నది అందుకే!"
"చిత్తం!"
"అమ్మగారికి మాత్రం మన పందేల గురించి తెలీకూడదు."
భద్రాచలం ఏడుపు మొహం పెట్టి నవ్వుతూ అన్నాడు -
"అంతే కదండీ మరి! అనుకోకుండా అమ్మగారు ఎదురువచ్చి ఎక్కడికెడుతున్నావని నన్ను నిలబెట్టి అడిగేరనుకోండి-"
"అవునవును! అట్లా అడిగిందే అనుకో! అప్పుడేం చెబుతావ్?"
"చెప్తానండి! నోటికోచ్చిందేదో చెప్తాను."
"ఏం చెప్తావో - ఇప్పుడే చెప్పు!"
"అట్లా బేంకు వరకు వెళ్లోస్తానని చెబుతానండి!"
"అదీమాట! గురి చూసి కొట్టాలి! వెళ్లిరా!" అన్నాడు పరమానందం.
సరిగ్గా అప్పుడే జానకమ్మ ఏమండి అని పిలవడం వినిపించింది.
భద్రాచలం ఉలికిపడి పరాకున బదులిచ్చేడు-
"నన్నా అమ్మా పిలుస్తున్నారు?"
"నిన్నుకాదు! నన్ను! ఏమండీ అని నన్ను మాత్రమే పిలుస్తుంది" అన్నాడు పరమానందం.
"చిత్తం! క్షమించాలి! నన్నేమో అనుకున్నాను."
అని అక్కడ్నించి భద్రాచలం వెళ్లిపోతుండగా - అతనికి జానకమ్మ ఎదురుపడింది. భద్రా చలాన్నీ అతని చేతిలోని చేక్కునీ చూస్తూ అడిగింది-
"ఎక్కడికి?"
"ఎక్కడికంటే ఏం చెప్పనమ్మా! ఇది  చెక్కుకదా! అంచేత బేంకుకి వెళ్లి కొబ్బరికాయలు లెక్కపెట్టుకురావాలి!" అన్నాడు భద్రాచలం.
"ఏమిటేమిటీ?  బేంకుకి వెళ్లి కొబ్బరికాయలు లెక్కె పెడ్తావా?"
భద్రాచలం ఏదో చెప్పబోతుండగా పరమానందం కలగజేసుకుని సర్ది చెబ్తున్నాడు.
"వెధవ సైత్యం వాగుడు!"
"అవునండి!" అన్నాడు భద్రాచలం.
"అతని మాటలు పట్టించుకోవద్దు!"
"అవునండి!" మళ్లా అన్నాడు భద్రాచలం.
"నువ్వు వెళ్లవయ్యా!" అని భద్రాచలాన్ని తోసేడు.
"ఆ తోపుడుకి భద్రాచలం తూలి ముందుకు పడబోయి తమాయించుకుని నిలబడి ఆ తర్వాత అక్కడ్నించి పరుగెత్తేడు.
అతను వెళ్లిపోయేక అడిగేడు పరమానందం.
"కూరలు కొన్నావా జానకీ."
"అబ్బే! ఎత్తుకొచ్చా! అర్ధంలేని ప్రశ్నలు వాకిట్లో కూరలబ్బాయి  వున్నాడు. అతనికీ  డబ్బులిచ్చి పంపించండి!"
"అంటే కూరలబ్బాయి మనింటి వరకూ వచ్చేడు?" ఆశ్చర్యంగా అడిగేడు పరమానందం.
"ఏ దేవుడో పంపితే వచ్చేడు. అతన్ని బెదరకొట్టకుండా డబ్బులిచ్చి పంపించండి!" అని జానకమ్మ వంట గదిలోకి వెళ్లిపోయింది.
పరమానందం ఎంతో కులాసాగా కూరలు మనిషిని చేరుకోగానే ఎంతో ఆత్మీయంగా అతని భుజమ్మీద చెయ్యివేసి అడిగేడు.
"నీ  పేరేమిటయ్యా?"
"పావకాలండి!"
"ఊరు మంగళగిరా?"
కూరలబ్బాయి ఆశ్చర్యపోతూ అడిగేడు-
"అరే! ఎట్టా కనుక్కున్నారు?"
"అదొక విద్యలే! చెబితే అర్థం కాదు! అవునూ - మంగళగిరిలో ఒక కోటీశ్వరుడున్నాడు. పేరుకూడా కోటీశ్వర్రావ్! అతన్నీకు తెలుసా!"
కూరలబ్బాయి విసుగ్గా అన్నాడు -
"కూరలమ్ముకునే వోడికి కోటీశ్వరులెట్లా తెలుస్తారండి? తెలవదండి! డబ్బులిచ్చి పంపండి!"
"ఇస్తాన్లేవయ్యా! నిన్ను చూస్తుంటే మంగళగిరి కోటీశ్వరుడు జ్ఞాపకం వచ్చేడు"
"అంటే? ఆ కోటీశ్వరుడు అచ్చం నాకుమల్లే వుంటాడండి?"
"ఇంచుమించు అంతే! అంతేకాదు - మొదట్లో అతని వృత్తి కూడా నీ వృత్తే!"
"అంటే? కూరలమ్ముకునే వాడా  'పాపం?"
"పాపం? ఏమిటి పాపం? కూరలమ్ముకొడం పాపమా? అతను కూడా మొదట్లో నీలాగే కూరలనీ అమ్ముకునేవాడు. నా హస్తవాసి మంచిదని ఒక రూపాయి ఇమ్మని బతిమాలితే ఆశీర్వదించి యిచ్చేను అంతే!" అని ఆగిపోయేడు పరమానందం.
"అంతే అంటే?" ఆత్రంగా అడిగేడు కూరలబ్బాయి.
"ఏం చెప్పాలయ్యా పానకాలు? రూపాయి తీసుకెళ్లి సరిగ్గా  అయిదేళ్లు గడిచేయో లేదో - అయిదు కోట్లు సంపాయించేడు పూర్ ఫెలో!"
ఆ మాటతో పానకాలుకి ఆశకలిగింది. క్షణంలోనే ఆ ఆశ ముదిరిపాకానపడింది. అందుచేత ఎందుకైనా మంచిదని - ముక్తాయింపు విసిరేడు -
"అయ్యా - తమరి హస్తవాసి అంత గట్టిదండి?"
"ఏం చెప్తాం! అందరూ అదే మాట అంటుంటే కాదంటామా! అయినా నా గురించి నేనే చెప్పుకుంటే - పచ్చి కూరలు తిన్నంత అసహ్యంగా వుంటుంది. ఇప్పుడు సపోజ్ -నేను నీకు రూపాయి యిచ్చేనే అనుకో!"
"ఇచ్చేరే అనుకోండి! అప్పుడే మవుద్ది?"
"నువ్వుకూడా నాక్కనిపించవు! ఎక్కడెక్కడో తిరిగి అయిదేళ్ల తర్వాత?"
"ఊ....అయిదేళ్ల తర్వాత?"
"అదోకరోజు. ఆదివారం!"
"ఆదివారం నాడే మాలాంటోళ్లకి తీరుబడిగా వుంటదండి చెప్పండి."
"ఆ రోజు నువ్వు - పది లక్షల ఖరీదు చేసే కార్లో మా యింటికి వస్తావు!"
"కారు ఖరీదు పదిలక్షలా?" ఆశగా గొణుక్కున్నాడు పానకాలు.
"కారుదిగి మా యింటిలోకి వస్తావు. నా కాళ్లమీద పడతావు."
"పడినా తప్పులేదు పదిలక్షల కారు!"
"నేను నిన్ను మెల్లిగా లేవనెత్తేను. కులాసాగా వున్నావా పానకాలూ అని అడుగుతాను!"
"వున్నానని తలూపుతాను."
నేనిచ్చిన రూపాయితో ఎంత సంపాయించేవని అడుగుతాను."
"కోటి రూపాయిలని చెబుతాను."
"అంతే కాదు! మీ రూపాయి మీరు తీసుకొండని బతిమాలుతావు. కానీ - నేను తీసుకొను. నీ భుజం తడతాను."
"తట్టండి!"

 Previous Page Next Page