Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 34

    "ఎందుకు?" సుదీర కోపంతో అడిగాడు.

    "తర్వాత చెపుతా" అని సుందరి లెటర్ చదవటంలో మునిగిపోయింది.

    అక్క ముఖంలో హావభావాలు చూస్తూ వుండిపోయాడు సుధీర్.

    సుధీర్ ని ముందు లెటర్ చదవద్దని సుందరి అనటానికి తగిన కారణం వుంది. శంకర్రావుకి ఎ ప్రేమికురాలైనా పచ్చిబూతు భాషలో ప్రేమలేఖ రాసింది అనుకో. అలాంటి సెక్స్ లెటర్ చిన్న వాడిన సుధీర్ చదివితే ఎలా? ఆ ఉద్దేశ్యంతో సుందరి లెటర్ చదవ వద్దంది.  

    సుందరి లెటర్ పూర్తిచేసింది. ఏమీ అర్దంకాలేదు.  మళ్ళీ చదివింది. మళ్ళీ మళ్ళీ చదివింది. చివరకి లెటర్ ని సుధీర్ కి యిస్తూ "ఇదేమిటో చదివి చెప్పారా" అంది.

    "చదివి చెప్పటం ఏమీటి-లెటర్ తెలుగులో లేదా?" అడిగాడు సుధీర్

    "తెలిగులోనే వుంది. చదవమన్నాను చదువు" అంది సుందరి.

    సుధీర్ చదవటం మొదలు పెట్టాడు.
   
    u.s.r.

    అర్జంట్ కాల్  ఫ్రమ్ న్యూఢిల్లీ. 

    అతి కష్టం మీద పని అయింది. గుర్రాన్ని నీటి తొట్టిదాకా లాక్కెళ్ళగలం గాని. దానిచేత నీళ్ళు తాగించలేము కదా?

    ఆ ప్రయత్నంలో సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించటం జరిగింది.

    దండం దశగుణం పని అయింది.

    అయితే!

    మొరటుతనం ప్రాణాంతకం కదా?

    పని పూర్తి అయినా సందర్భంలో రారాజుగారు ఇరువురిని దృష్టిలో పెట్టుకుని దాని బాధ్యత అప్పగిస్తున్నారు.

    రెండు వాటాలు వేశారు. సగం నీ వంతు, మిగతా సగం రాబర్ట్ వంతు.

    ఇక్కడ పని అయింది.

    మీరుకూడా చాకచక్యంగా మిగతాపని పూర్తిచేయండి. రేపే నీ వంతు పంపిస్తున్నాము.

    ఆధారంలేని పని అధ్బుతంగా ఎవరు ముందు చేయగలరో వారికి ఘనమైన ఇంక్రిమెంటు వుంటుంది.

    శంకర్రావు పని ఫస్ట్ న అవుతుందని నేను, రాబర్ట్ పని ఫస్ట్ న అవుతుందని రారాజుగారు సరదాగా పందెం వేసుకున్నాము.

    నన్ను ఈ విషయంలో విజేతని చేయాలి సుమా!

    మామూలు ప్రకారం మామూలు దోవన అది నీకు అందుతుంది.

    వెంటనే రంగంలోకి దిగి డెలివరీ క్విక్ గా చేయి. ఆఖరికి ఆవగింజంత కూడా మిగలకూడదు. అఖండుడివి, ఘటనాఘటన సమర్దుడివి. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకానివి. ఇంక నీకేమీ చెప్పక్కరలేదనుకుంటాను.

    అందరి విషయం చూడు.

    అలాగే ఈ పని పూర్తికాగానే మొత్తం నీకు???

                                                                                                                               ఇట్లు,

                                                                                                                            టు ఇన్ వన్.

    సుధీర్ లెటర్ చదవటం పూర్తిచేసి మళ్ళీ మళ్ళీ చదవటం మొదలుపెట్టాడు.

    "చదవటం కాలేదా?" సుందరి అడిగింది.

    "అయింది."

    "మరి?"

    "అర్ధంగాక మళ్ళీ చదువుతున్నాను."

    "నాకూ అర్ధం కాలేదు. లెటర్ అనంగానే ఎవరైనా యోగక్షేమాలు రాస్తారు. ఆపదలో వుంటే రాస్తారు. వ్యవహారాలు రాస్తారు. లేకపోతే ప్రేమలేఖ, చివరికీ బెదిరింపులేఖ-అంతేగాని ఇలా అర్ధం పర్ధం లేని...." అని సుందరి అంటుంటే__

    "ఆగక్కా అర్ధమైంది" అన్నాడు సుధీర్.

    "పిచ్చి లెటర్ అర్ధమయిందా.....?" సుందరి వింతగా అడిగింది.

    "ఇది పిచ్చిలెటర్ అర్ధమయిందా.....?" సుందరి వింతగా అడిగింది.

    "ఇది పిచ్చి లెటర్ కాదు" సుధీర్ చెప్పాడు.

 Previous Page Next Page