Previous Page
Next Page
పెట్టితిసిచూడు పేజి 33
సినిమాకిగాని, షాపింగ్ కు గాని బయలుదేరితే వంకులు తిప్పిన రెండు పాయలను ముఖాన వేలాడ ముంగురుల్లా పడేసుకుని వాలుజడను భుజంమీదనుంచి తిప్పి ముందుకు వేసుకుని తాంబూలంతో ఎర్రబడ్డ పెదవులు, మ్యాచింగ్ చీర, జాకెట్, కాటుక పులిమిన కళ్ళు, కాస్త వయ్యారంగా నడుస్తూ వెళుతుంది.
స్పాంజీవున్న షేప్ బాడీలు వాడుతుంది.
"నీవు నవ్వితే అప్సరసలా ఉంటావు" అని గతంలో ఎవరో అనడంవలన మాటకు ముందు నవ్వుతుంది కిలకిలా.
ఇంతకు మించి సుందరి ఏపనీ చేయదు.
అయినా సుందరిమీద ఆ రకం మగవాళ్ళకి ఆ రకం ఆడదేమోనన్న అనుమానం వచ్చి వెర్రి వికారాలు ప్రదర్శిస్తుంటారు.
యు. శంకర్రావు ఆ రకం మగవాడు.
సందు గుమ్మంలో నుంచుని రకరకాల సిగ్నల్స్ సుందరి మీదకి పంపిస్తుంటాడు.
సుందరి ఏ రకమయిన వికారాలు ప్రదర్శించదు గాని, శంకర్రావు తనని చూస్తూ వికారపు చేష్టలు చేస్తూ పాడు ఫోజులు పెడుతున్నాడా లేదా అని ఓ కంట గమనిస్తూ వుంటుంది.
అది చూచి సుందరి దైర్యం చేయలేకపోతున్నదని శంకర్రావు అనుకుంటాడు.
'నా ఇంట్లో నేను తిరుగుతుంటే వాడెందుకు కన్ను కొట్టాలి 'రా' అన్నట్లు ఆ సిగ్నల్ ఏమిటి?' అని పళ్ళు నూరుకుంటుంది సుందరి.
'నీవు చూడబట్టేకదా అతని వేషాలు తెలిసేది. చూట్టం మానెయ్యి' అని అప్పుడప్పుడు ఎవరయినా హితబోధ చేయటానికైనా సుందరి ఈ విషయం ఎవరితోనైనా చెపితేకదా!
శంకర్రావు మంచివాడు కాదని, అలాంటి వెధవ, ఇలాంటి వెధవ అని సుందరి భార్తముందు తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టి ఆనందిస్తూ ఉంటుంది.
శంకర్రావు తాగుడు, ఇంటికి రకరకాల ఆడవాళ్ళను తెచ్చుకోవడం తెల్సిన సుబ్బారావు "వాడొట్టి రోగ్" అని ఒక్క మాటతో కొట్టి పారేసి వూరుకుంటాడు.
ఎందుకో తెలియదు-సుందరికి శంకర్రావు అంటే మంట.
వాళ్ళకథ అలా వుండగా ఈరోజు శంకర్రావు కవరు ఇక్కడికి వచ్చింది పైగా పక్కఇంటి శంకర్రావు ఆ సమయంలో లేడు.
అద్దెకున్న శంకర్రావు లేడు.
వినేవాళ్ళు ఎవరూ లేకపోవడంతో అక్కాతమ్ముడు స్వేచ్చగా మాట్లాడుకున్నారు.
"ఈ కవరు వాడింట్లో పారేయనా?" సుధీర్ అడిగాడు.
అప్పటికే దీర్ఘాలోచన చేసి ఓ నిర్ణయానికి వచ్చిన సుందరి "వద్దు" అన్నది.
"మరేం చేద్దాము. రేపు పోస్టువాడు వస్తే అతనికి యిద్దామా?"
"వద్దు"
"మరి?"
"కవరు చింపి చదువుదాము"
"ఇతరుల ఉత్తరాలు చదవడం తప్పుకదా?" సుధీర్ అనుమానంగా అడిగాడు.
"తప్పే"
"మరి....?"
"అది మంచివాళ్ళ విషయంలో ఈ త్రాష్టుడికి వచ్చిన లెటర్ కాబట్టి చించి చదవనూ వచ్చు, వేయి ముక్కలుచేసి తగల పెట్టనూవచ్చు. కనుక కవరు చింపు" అన్నది సుందరి.
18
సుధీర్ కవర్ జాగ్రత్తగా చింపాడు.
కవరులోంచి లెటర్ ని పైకి తీస్తూ "నేను చదవనా?" అన్నాడు సుదర్. "వద్దు. ముందు నేను చదువుతాను" అన్నది సుందరి.
"అతితే పైకి చదువు."
"ఉహూ" అన్నది సుందరి కాగితం మడత విప్పుతూ,
Previous Page
Next Page