డాక్టరొచ్చాడు డాక్టర్నిచూసి అడిగింది అర్జున.
"డాక్టరంకుల్ ! ఈ శాల్తీతిని నేను తీసుకుపోవచ్చా?"
"శాల్తీయా?" డాక్టర్ ఆశ్చర్యంగా అటూ ఇటూ చూశాడు.
అర్జున అందంగా నవ్వింది.
"ఇక్కడ డాక్టర్" అంది.
తనని చూసి డాక్టర్ చిన్నగా నవ్వి....
"తీసుకెళ్ళమ్మా" అన్నాడు.
డాక్టర్ వెళ్ళిపోయాక తనన్నాడు.
"పరుపు తిశావుకదే రాక్షసి!"
"రాక్షసినో, దెయ్యాన్నో, యూ ఆర్ ఎ పూల్, చెప్పినా నీకు అర్ధం కాదు" అంది.
అర్జున మెల్లగా తనని లేవదీసి తన చేతిని భుజంచుట్టూ చుట్టి మరోచేతిని తన నడుంచుట్టూ వేసి బయటకి నడిపించుకుంటూ తీసుకెళ్ళింది.
రిక్షాని పిలిచి -
"ఎక్కగలవా? ఎక్కించమంటావా?" అంది.
"తనకేంచెయ్యాలో తోచలేదు. అర్జున మొహంలోకి చూశాడు.
మాట దురుసేకానీ మంచి మనసు అనుకున్నాడు తను.
అర్జున తనని రిక్షా ఎక్కించి, తనూ ఎక్కి పక్కన కూర్చుంది.
"కారు పంక్చరయింది. అందుకే ఈ అవస్ధ" అంది. అతని భుజంచుట్టూ చేయివేస్తూ తన కళ్ళలోకి చూసింది.
"అంతే!"
ఆమె కళ్ళలోకి నీరు ఉప్పెనలా పొంగింది.
తను బాధగా నవ్వాడు.
"ఎందుకానవ్వు? అసలిది ఆడదేకాదు. దీనికి కన్నిళ్ళేక్కడినా అనా?" అని పేలవంగా నవ్వింది అర్జున.
ఆ నవ్వునే అర్ధం చేసుకోగలిగితే ఆలోచించవలసందేమీ లేదు.
ఆ నవ్వుకే భాషవస్తే దాన్ని తను చదవగలిగితే దాని భావం ఇలా వుంటుంది.
"ఒరే పిచ్చిసన్యాసి, నేనింకా నీకు అర్ధంకాలేదంటే నీది ఎతి ఫెంటు బ్రెయిన్ అయి వుండాలి. ఈ ప్రపంచమే నువ్వు నాకు నా ఆరాధన మీ కోసం. ఎన్ని మాట్లాడుతున్నాను. ఎన్ని చేస్తున్నాను. ఇంకా నువ్వు నన్నూ, నా మనసునీ చదవలేందటే నీది మనసేనా?"
ఆ నవ్వులో ఇన్ని అర్ధాలున్నాయి. అవన్నీ తనకి తెలుసు.
తను ఆమెకేసి అదోలా చూసాడు.
అర్జున అంది మెల్లగా.
"సారి విజయ్ నాలో నీ గురించిన ఆలోచనలకి ఇంకా మొదలే లేదు" అంది.
"లేదు. నువ్వు....నువ్వు నా ప్రాణానివి" అన్నాడు తను
అర్జున తన చేతిని చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టుకుంది.
__ఉదయం ఆరు కాలేదు. అర్జున కాఫీ కప్పుతో ప్రత్యక్షమయింది.
"దర్జాజకేం తక్కువలేదు. లేచి బెడ్ కాఫీ తాగు" అంది.
"లేటయిందా"
"అబ్బే ఇంకా తెల్లారలేదు. అర్దరాత్రి సరసాలాడతావని లేపాను" అంది.
తను కాఫీ తాగుతుంటే అంది.
"నీకు దెబ్బలు తగిలాయని డాడి కంగారు పడిపోతున్నారు. కేసు పెడతారట నీతో మాట్లాడాలని రెండుసార్లు పైప్తె కొచ్చారు. కానీ నువ్వు గాడిదలా నిద్రపోతున్నావు.
"అయాం సారి-
డాడికి చెప్పానులే"
"కుంభకర్జుడని"
తను నవ్వేడు.
"ఒళ్లెలావుంది?" అడిగింది.
"నువ్వు దగ్గరకొస్తే తెలుస్తుంది!" అన్నాడు తను
అర్జున ఆశ్చర్యంగా చూసింది కళ్ళు వింతగా మెరుస్తుండగా ఫకాలుమనిని నవ్వింది.
"అన్ని కట్లు కట్టుకొని నువ్వేంచేస్తావు స్వామి," అంటూ కప్పు తీసుకుని వెళ్ళిపోయింది అర్జున.
తను తిరిగి కోలుకున్నాక ఆరోజే అద్దెగదికి వచ్చాడు..
__"ఏమిటి ఆలోచిస్తున్నావు?" అడిగింది కాశ్మీర.
"ఏంలేదు నీకెవరు చెప్పారు?" అడిగాడు విజయ్.
"మా పనిమనిషి చెప్పింది వెంటనే విన్నోచ్చి చూడాలను కున్నాను కాని ఎక్కడున్నావో తెలీలా! అయినా ఒద్దుమొర్రో అనే వాళ్ళ వెనకబడితే అంతేమరి" అంది కాశ్మీర.
విజయ్ కి నవ్వొచ్చింది.
"అయితే కావాలనుకునే వాళ్ళ వెనుక పడోచ్చా"
"దెబ్బలు తగలవు ఆపైన అదృష్టం" అంది.
"ఇంట్లో ఎవ్వరూలేరా ?"
"లేరు, వస్తావా?" అడిగింది కాశ్మీరా".
ఎందుకు?" అడిగాడు విజయ్
"ఇంట్లో ఎవరూలేరా అని అడిగినవాడివి నీకు తెలిదా?" అంది కాశ్మీర. అలా అంటూనే పవిట జార్చింది కాశ్మీర.
వయసుకి మించిన ఎత్తుపల్లాలు..... సొంపులు సొగసులు.
తెల్లటి జాకెట్ లోంచి "బ్రా" అడ్డులేని ఆమె నునుపైన అందమయిన గుండెలు అతన్ని సవాలు చేస్తున్నట్టుగా కనబడినాయి.
కాశ్మీర నవ్వుతోంది.
విజయ్ చూపుని తిప్పుకున్నాడు.
"ఏం అటుచూస్తున్నావ్? నేను.... బాగోలేదా?"
"నువ్వన్నట్టుమామూలు దెబ్బలు తిని మామూలు హాస్పిటల్ కెళ్ళాను. ఈ సారి పిచ్చి ఆస్పత్రికి వెళ్ళాల్సివస్తుంది" నవ్వుతూ అన్నాడు.