Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 25


    "ఈకాలం ఆడపిల్లలు ఉద్యోగాలు చూసుకుని మరీ పెట్రీగిపోతున్నారు" సావిత్రి కోసం.
    'అవును సావిత్రీ, పెళ్లి కాకపోయినా ఫరవాలేదన్న ఆత్మవిశ్వాసం వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఇప్పుడు చుడువుకుని,ఉద్యోగాలు  చేస్తూ వాళ్ళకీ ఓ వ్యక్తిత్వం ఉందని నిరూపించుకోవాలనుకుంటున్నారు. ఇదీ మంచి మార్పుకి నాంది అనుకుని మనం సంతోషించాలి.
    "తండ్రీ కూతుళ్ళు సంతోషిస్తూ కూర్చోండి ...." సావిత్రి కోపంగా చూసి వెళ్ళిపోయింది. చలపతి రావు భార్య బాధ అర్ధం చేసుకున్నట్టు నవ్వాడు.

                                                            ***

    "హలో....ఎక్స్యూజ్ మీ...." పిలుపు విని ఆఫీసు కాగితాలలోంచి తలెత్తిన సునీత ఆశ్చర్యంగా చూసింది.
    "ఏమిటలా చూస్తున్నారు? గుర్తుపట్టలేదా నన్ను రామకృష్ణని....అదే నెల క్రితం పెళ్ళి చూపుల కొచ్చాను. అప్పుడే మర్చిపోయారా?' నవ్వుతూ అన్నాడు.
    "ఆ గుర్తులేకేం..... కాని ఇలా ఇక్కడ మిమ్మల్ని చూడటం ...."
    "మీతో కాస్త మాట్లాడాలని వచ్చాను. కాని , ఇఫ్ యూ డోంట్ మైండ్ , ఓ అరగంట నాకోసం స్పేర్ చేయగలరా?"
    'అంత అర్జంటా? లంచ్ అవర్ లో...."
    "నేను ఆఫీసు పని మీద వచ్చాను. ఒంటిగంటకి నాకు మీటింగ్ ఉంది. ఓ అరగంట పర్మిషన్ తీసుకుని వస్తే."
    'సరే పదండి....' పక్క సీటు పద్మకి చెప్పి రిసెప్షన్ రూము వైపు నడిచింది సునీత.
    "ఊ చెప్పండి" అంది కూర్చున్నాక.
    "ఏం లేదు... పెళ్ళి చూపులలో మీరన్న మాటలు నాకు నచ్చాయి. మీ పాయింటు నాకు అర్ధం అయింది. ఇంటికెళ్ళాక ఆలోచించుకుంటే మీరన్నట్టు ఈ ఖర్చులు అన్నీ దండగ. మనలాంటి వాళ్ళం ఈ దండగ ఖర్చులకి పుల్ స్టాప్ పెట్టాలన్న మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. మావాళ్ళతో వాదించి ఒప్పించాను. నావైపు నుంచి లైన్ క్లియర్ . అది చెప్పాలని వచ్చాను.... ఇంక మీకేం అభ్యంతరం లేదుగా..." ఆదుర్దాగా అడిగాడు రామకృష్ణ.
    సునీత మొహం వికసించింది. తనని అర్ధం చేసుకున్న మగవాడు ఒకడైనాకనిపించడాన్ని సంతృప్తి కనిపించింది.
    "రియల్లీ! మీరు మనస్పూర్తిగా నా అభిప్రాయాలతో ఎకీభావించారానుకుంటాను.... నోనిగ్రేట్స్"
    'సెంట్ పర్సంట్ ఏకీభావించాను కనుకే వచ్చాను మీ దగ్గరికి.."
    "అయితే నాకేం ఇంక అభ్యంతరం లేదు. మీరు ఒక మాట మావాళ్ళతో కూడా చెప్పండి."
    "ముందు మీ ఇంటికి వెళ్ళే వస్తున్నాను ఇటు . మీ నాన్నగారితో మాట్లాడాను. మీతో మాట్లాడమంటే ఇలా వచ్చాను' రామకృష్ణ వివరించాడు.
    "థాంక్స్" సునీత మనస్పూర్తిగా అంది.

                                                          ***

    సునీత రామకృష్ణ ల పెళ్ళి ముందు రిజిష్ట్రార్ ఆఫీసులో అయ్యాక, దేముడు ముందు పూస్తే కట్టాడు రామకృష్ణ.సాయంత్రం అటు ఇటు దగ్గర బంధువులు సుమారు నూరు మందికి సునీత ఇంటి డాబా మీద పార్టీ ఇవ్వడంతో పెళ్ళి ముగిసింది. వచ్చిన అందరూ ఆదర్శదంపతులని, వారి ఆశయాన్ని అభినందించి వెళ్ళారు.ఆ సాయంత్రం నూతన దంపతులు కాపురం కోసం అద్దెకు తీసుకున్న ప్లాట్ లోకి వెళ్ళిపోయారు. గృహప్రవేశాలు , శోభనం తంతులు అన్నింటికీ స్వస్తి చెప్పి , తను అనుకున్నది సాధించానన్న తృప్తి, తనని అర్ధం చేసుకున్న భర్త దొరికిన ఆనందంతో,కృతజ్ఞతతో మనసారా అతనికి తనని తాను అర్పించుకుంది.
    అయితే సునీత తృప్తి , అనందం, గర్వం అంతా రెండు గంటలలోనే ఆవిరి అయిపోయినట్టనిపించింది. సునీత కళ్ళముందే ఆమె కట్టుకున్న కలల సౌధం కూలిపోయినట్టనిపించింది. అతని చేతిలో తృప్తిగా వాలిన సునీత కళ్ళ  ముందు రామకృష్ణ జేబులోంచి చెక్కు తీసి ఆడించాడు. లక్ష రూపాయాల చెక్కు.... కింద తండ్రి సంతకం.... సంభ్రమాశ్చర్యాలతో చూసింది. రామకృష్ణ ఇచ్చిన వివరణ విని సునీత దిగ్భ్రాంతి గా చూసింది. తనన్న మాటలకు, తన భావానికి రామకృష్ణ వక్రీకరణ కి దిమ్మెరపోయింది. "లక్షతో మన ఇంటికి కావలిసిన సామానులన్నీ వస్తాయి."

 Previous Page Next Page