" నాకు తెలుసు నీకు నిద్ర పట్టదని. ఇక ప్రతిరోజు నీకు నిద్రలేని రాత్రులు చాలా ఎదురౌతాయి. నీ గుండెలో పరిగెత్తేది రైళ్ళుకాదు నేను.....నేను పరిగెత్తుతాను......అదీ ఇనుప బూట్లతో ఎట్ లాస్ట్ రూపాచక్రవర్తిని బ్రతికించుకున్నావ్. లక్కీ ఫెలో....నీ సైడూ అదృష్టం వుంది" భయంకరమయిన నవ్వు తెరలు తెరలుగా ఉధృతమైన సముద్రపు అలల్లా ఫోన్ లో వినిపించింది మంగళకు. భయమనిపించి ఫోన్ కట్ చేసింది. వళ్ళంతా చెమటలు పట్టేశాయి మంగళకు. నాలుక తడారిపోయినట్లయింది. వెంటనే మాట పెగల్లేదు.
మంగళ పరిస్థితి గమనించిన కమలిని లేచి మంగళ ప్రక్కనే కూర్చుని ఆమె భుజాలు పట్టుకొని కుదిపింది అనునయంగా.
కొద్దిగా తేరుకొంది మంగళ. తను ఫోన్ లో విన్నమాటలు చెప్పింది కమలిని మెదడు మంచు ముద్దయినట్లయింది. ఫోన్ చేసింది ప్రదీప్ అని గ్రహించగలిగింది. రూపాచక్రవర్తి బ్రతకటమేంటి? మనోహర్ బ్రతికించు కోవటమేంటి? ఆ మిస్టరీ ఏమిటో తెలుమకోవాలనుకుంది కమలిని.
వెంటనే మనోహర్ యూనిట్ లో పనిచేసే మేకప్ మాన సింధియాకి ఫోన్ చేసింది. మనోహర్ ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చునన కారణాన ముందు చెప్పడానికి నిరాకరించినా, కమలిని మొహమాట పెట్టటంతో సీనియర్ మోడల్ గా ఆమెకున్న ఇమేజ్, పలుకుపడి, మంచితనం తెలిసుండటంతో తనే ఆ విషయం చెప్పినట్లు మనోహర్ కి తెలియనివ్వద్దని మాట తీసుకుని జరిగిన విషయం చెప్పాడు. సింధియా అది అనుకోకుండా జరిగిన ప్రమాదమనే చెప్పాడు. అతనికి అసలు విషయం తెలియదు గనుక. కాని ఫోన్ లో మంగళ విన్న మాటల్నిబట్టి రూపాపై హత్యా ప్రయత్నం జరుగుంటుంది. అది హత్యా ప్రయత్నమని తెలిసేలా జరిగుండక పోవచ్చు. ప్రమాదవశాత్తు జరిగినట్లుగా, పకడ్బందీగా నాటకం ఆది వుండవచ్చు. అందువల్లనే సింధియా దాన్ని ఫ్రీ ప్లాన్ డ్ అని గ్రహించి వుండకపోవచ్చు. ప్రదీప్ సమర్ధత, దుర్మార్గం తెలిసిన కమలినికి జరిగింది గ్రహించడం పెద్ద కష్టం కాలేదు. తను వూహించిన విషయాల్నే మంగళకు చెప్పింది కమలిని.
మంగళకు వళ్ళంతా చల్లబడినట్టయ్యింది.
మనోహర్ చుట్టూ పొంచివున్న ప్రమాదాల్ని తల్చుకొని చిరుగుటాకులా వణికిపోయింది.
అంత దారుణమైన సంఘటన జరిగినా మనోహర్ మాటమాత్రంగా నైనా చెప్పకపోవటం ఆ ఇద్దరికీ ఆశ్చర్యమనిపించింది. కోపం కూడా తెప్పించింది. మనోహర్ వస్తే నిలదీసి అడగాలని అలాగే కూర్చుండి పోయారు ఎదురుచూస్తూ.
* * *
"సార్ ఏ నెల సంచిక కావాలి.....?" మధు అడిగాడు మేగజైన్స్ వెతుకుతూనే.
"నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. అవి నేను చూసుకుంటాను, నువ్వెళ్ళి చందూ నోట్ టైపుచేసి తీసుకురా సంతకంచేసి ఇచ్చేస్తాను....." అంటూ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి సంచికలను బయటకు లాగాడు మనోహర్.
మధు హాల్లో వున్న టైప్ మిషన్ దగ్గరకు వెళ్ళి కూర్చోబోతూ ఓ క్షణం ఆగిపోయాడు. అద్భుతమైన లేత సోయగాలతో, యాడ్ వరల్డ్ ని ఒక ఊపు ఊపవలసిన అమ్మాయి ప్రదీప్ చేతిలో పడి అందవికారంగా తయారయి, బ్రతుకుతెరువు కోసం టైపిస్టుగా మారిపోయిన పూర్ గర్ల్.
టైప్ మిషన్ ముట్టుకోగానే ఆమెకు జరిగిన అన్యాయానికి ఒకింత సేపు గుండెను పిండినట్లయింది మధుకి. అర్దరాత్రి దాటిపోయింది. బయట గాడాంధకారం, జోరున వర్షం, ఉండుండి మెరుపులు, ఉరుములు-ప్రళయం ముంచుకొచ్చినట్లుగా వుంది వాతావరణం మధు వేళ్ళు టైప్ మిషన్ మీద, మనోహర్ కళ్ళు 'ఓగ్' మేగజైన్ పేజీల వెంట పరిగెడుతున్నాయి. సెయింట్ లారెంట్ ఫోన్ లో చెప్పిన మాటలు పదేపదే వింటున్నట్టున్నాయి మనోహర్ కి.
"తరంగిణి అనే పేరు బాగా ఫెమిలియర్ నాకు. ఆమె ఈమధ్య ప్యారిస్ జరిగిన మూడు ఫ్యాషన్ షోల్లో పాల్గొంది. ప్యారిస్ సిటీలో ఆమెకు సంబంధించిన వివరాలు కనుక్కోవటం చాలా కష్టం. ఆమె ఫ్రాన్స్ పౌరురాలో కాదో తెలియదు. నువ్వు వచ్చి అన్నీ తెలుసుకోవటం మంచిది. నాకు క్షణం తీరిక వుండదు. నీకు తెలుసుగదా.....!నాకు ఒక్క నిముషానికే ఆదాయం వేలల్లో ఉంటుంది. వీలయితే మరికొంత సమాచారం గేదర్ చేస్తాను. అది రేపు ఫోన్ చేసి చెబుతాను."
సెయింట్ లారెంట్ చెప్పినదాన్నిబట్టి ఆమె ఫ్యాషన్ షోలో పాల్గొంటే వరల్డ్ ఫేమస్ ఫ్యాషన్ మేగజైన్ 'ఓగ్' కవర్ చేసి వుంటుంది. అవి చెక్ చేస్తే మరికొంత సమాచారం దొరకవచ్చనిపించింది మనోహర్ కు.
ఫోన్ లో వివరాలు విన్నా దగ్గరనుంచి తనూహించినది నిజమైనందుకు ఆనందంగా వుంది మనోహర్ కి. ప్రతి పేజీ సునిశితంగా చూస్తూ చకచకా పేజీలను త్రిప్పుతున్నాడు. ఫ్యారిస్, న్యూయార్క్ లండన్. రోమ్ లో జరిగే ప్రతి ఫ్యాషన్ షోని కవర్ చేస్తూంది ఓగ్ మేగజైన్. ముఖ్యంగా ప్యారిస్ లో జరిగే ఫ్యాషన్ షోలను అసలు వదిలిపెట్టదు. ఆ లెక్క ప్రకారం షోస్ ఫోటోలు ప్రచురించి వుండాలి. అదృష్టం బావుంటే ఆమె గురించి వివరాలు కూడా రాసుండవచ్చు అనిపించింది మనోహర్ కు. ఆ భయంకరమైన నిశ్శబ్దంలో టైప్ మిషన్ శబ్దపు ప్రకంపనాలు కర్ణకఠోరంగా వున్నాయి. ఒక్కొక్కదానిలో మూడొందలు పేజీలున్న నాలుగు సంచికలను తిరగవేయడానికి దాదాపు అరగంట పట్టింది మనోహర్ కి. ప్రయోజనం కనిపించలేదు. నవంబర్ 5న జరిగిన షోని డిసెంబర్ సంచికలో, డిసెంబర్ 6న జరిగిన షోని జనవరి సంచికలో, జనవరి 7న జరిగిన షోని ఫిబ్రవరి సంచికలో కవర్ చేశారు. పెద్ద వివరాలు లేకపోయినా కొన్ని ఫోటోలు పాల్గొన్నవారి పేర్లు వేశారు. ఫోటోల క్రింద రైటప్ లో ఎక్కడా తరంగిణి పేరు కనిపించలేదు.
నిస్పృహగా లేచి నిలబడ్డాడు మనోహర్ మేగజైన్స్ రేక్ లో పెట్టి. గిణి వుంటే గ్రూప్ ఫోటోలలో కనిపించి తీరాలి.
ఆచూకి దొరికినట్టే దొరికి అసంపూర్తిగా, సందేహస్పదంగా మిగిలిపోయింది. పాపులారిటీలో, సర్క్యులేషన్ లో "ఓగ్" అంత స్థాయి సంపాదించుకున్న మరో వరల్డు టాప్ ఫ్యాషన్మేగజైన్ "రెవ్ లన్" మనోహర్ స్మృతి పథంలో మెదిలుంటే అతని ఆశ నెరవేరేదేమో! కాని ఆందోళన, హడావుడి మనోహర్ మరో పత్రిక గురించి ఆలోచించనివ్వలేదు.
* * *
సరిగ్గా ఇదే సమయానికి ప్రదీప్ గెస్ట్ హౌస్ లో ఓ గదిలో లైట్స్ వెలుగుతున్నాయి. ప్రదీప్-అతని ఎదురుగా కైలాష్. మధ్యలో స్టూల్ మీద రాయల్ సాల్యూట్ బాటిల్ అప్పటికే సగం ఖాళీ అయింది.
బంజారా హిల్స్ కొండల మధ్య విసిరేసినట్లుండే ఇండ్లలో ప్రదీప్ గెస్ట్ హౌస్ మరి ఒక ప్రక్కకు విసిరేసినట్లుగా వుంటుంది.
ఆ రాక్షస కాళరాత్రి మూడో ఝామును ముగించటానికి మరికొద్ది ఘడియాలు మాత్రమే వుంది. ప్రపంచాన్ని ముంచెత్తేట్టుగా కుండపోత వర్షం క్షణక్షణానికి ఉధృతమైపోతోంది. కన్ను పొడుచుకున్న కానరాని ఆ గాఢంధకారంలో అప్పుడప్పుడు మెరిసే మెరుపుల వెలుగుల్లో వానకు తడిసి నునుపుతేరిన నల్లనిబండలు ఒడల్ని జలదరింప చేస్తున్నాయి. ఇటీవలే మోడలింగ్ లోకి దిగిన జెన్నీఫర్ ఫెర్నాండేజ్ కి, పాలమీగడలా, వేపుగా పెరిగిన ఆమె అవయవాలిప్పుడు భయంతో ఎగిరెగిరిపడుతున్నాయి ఆమెలో ఉధృతమవుతున్న ఉచ్చ్వాస నిశ్వాసలకు ఆమె బరువైన ఎద ఎగిరెగిరి పడుతోంది.
అక్కడ మాత్రమే చూస్తున్న కైలాష్ లో శృంగారపరమైన అలౌకిక ఆనందం కట్టలు త్రెంచుకొని ప్రవహిస్తోంది.
మోడలింగ్ ని అడ్డం పెట్టుకొని సినీస్టార్ కావాలనుకునే ఆమె ఆగమ్య గమ్యానికి మధ్య ఎన్నో అగమ్య గోచరమైన అడ్డంకులు.....ఆ అడ్డంకులమీద అవరోధాల మీద తను తప్పక పరచవల్సివస్తున్న అందాలు సిగ్గుపడుతున్నాయి.
అంతకుముందే బలవంతంగా త్రాగించబడ్డ ద్రవం ఆమె మస్తిష్కం పైన తన ప్రభావాన్ని చూపిస్తూ క్రమంగా వశపర్చుకుంటోంది.
ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి. అయినా బలవంతాన తెరుస్తోంది.
ఆ మూస్తూ, తెరుస్తున్న కనురెప్పల మధ్య విలాసవంతమైన సినీ స్టార్ జీవితం, దాని తాలూకు గ్లామర్, పాపులారిటీ మెరుపులా మెరుస్తూ మేఘంలా గర్జిస్తూ, పిడుగుపాటులా ఆమెను తనవైపుకు ఆకర్షిస్తున్నాయి.
ఆమెలో ఆశ విజృంభించింది. నిక్షిప్తమై వున్న ఆమెలోని కోర్కెల్ని బలహీనత పలుగుతో త్రవ్వుతోంది.
ఆమె లేచింది.
ఆకలిగా, ఆశగా- శలభంలా ప్రదీప్ వైపు తడపడే అడుగులతో కదిలింది. కైలాష్ ఆకలి చూపుల్ని చూశాడు ప్రదీప్. లేచి గదిలోంచి బయటకు నడిచాడు. అపురూపంగా, అల్లారుముద్దుగా చూసుకున్న తమ కూతురు అపురూప లావణ్యం కర్కశత్వానికి లోను కాబోతున్న సమయంలో ఆమె తల్లిదండ్రులు ఉలికిపాటు లేచి, ఒకర్ని ఒకరు ఓదార్చుకుంటున్నారు. చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి పారిపోయిన తమ కూతురు అపురూప లావణ్యం కర్కశత్వానికి లోను కాబోతున్న సమయంలో ఆమె తల్లిదండ్రులు ఉలికిపాటుగా లేచి, ఒకర్ని ఒకరు ఓదార్చుకుంటున్నారు, చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి పారిపోయిన తమ కూతురు జెన్నీఫర్ ని తలుచుకొని. రాక్షసుడిలా వున్న కైలాష్ ని అల్లుకుపోయింది జెన్నిఫర్ కాలిపోతున్న కోర్కెలతో మరుక్షణం ఆమె లేత గులాబిరంగు అందం పంటిగాట్లతో, రక్తవర్ణం దాల్చింది.
ఆమె లావణ్యానికి జరుగుతున్న అరిష్టాన్ని అడ్డుకొనే స్థితిలో లేదు మరింతగా అతనికి సహకరిస్తోంది ఇప్పుడామెలో భయంలేదు. నైతిక విలువల మీమాంస అంతకంటే లేదు. ఆ సన్నని సరిహద్దుని దిలాసాగా దాటేసింది. గది బయట హాల్లో కూర్చున్న ప్రదీప్ చేతిలోవైపు కణకణ మిండుతోంది. దాని నుంచి వస్తూన్న పొగవలయాల్లా ఆవరించుకుపోతోంది. ఆకలిగా వున్న కుక్కకు మాంసం ముక్కవేస్తే తోకాడిస్తూ తిరుగుతుందని ప్రదీప్ కి బాగా తెలుసు. రాక్షస కుక్కలాంటి కైలాష్ కు అందాల మాంసం ముద్ద ఎర.
ప్రదీప్ తెలుసు వందకుక్కల విశ్వాసం కైలాష్ లో పేరుకు పోతోందని. అతని మస్తిష్కంలో హిట్ లిస్ట్ మెషిన్ కన్నా వేగంగా తయారయిపోతోంది. విజయగర్వం అతని మొద్దు పెదాలమీద వంకరగా కదిలాడుతోంది.
కైలాస్ కర్కశత్వానికి అంత మత్తులోనూ ఆమె లేత శరీరం చిగురుటాకులా వణికిపోయింది. కెవ్వుమంటూ ఆమె వేసిన ఆర్తనాదాన్ని ఎయిర్ కండీషనర్ మ్రింగేసింది.
ప్రదీప్ బుర్ర ఆలోచనలతో వేడెక్కిపోయింది. అతని చేయి ఫోన్ మీదకు మళ్ళింది.
కైలాష్ లో వేడి దిగిపోయి వెల్లికిలా పడుకుండిపోయాడు......ఆ తరువాత రెట్టింపు ఉత్సాహంతో అతను పుంజుకొనే శక్తి ప్రదీప్ కే వరం.
మాంసం ముద్దలా. మంచు ముద్దలా మిగిలిన జెన్నీఫర్ శరీరం ఆ డబుల్ కాట్ ని కరుచుకుపోయింది. ఇవేమీ పట్టనట్టుగా వర్షం జోరుమని కురుస్తూనే వుంది.
ప్రదీప్ లేచాడు అతని పెదవులు అస్పష్టంగా గొణిగాయి. "రో......" అంటూ......అప్పుడే బయటకు వస్తున్న కైలాష్ చెవుల బడిందది.
మరుక్షణం ఇద్దరు రెయిన్ కోట్స్ తో చేతిలో పెద్ద బ్యాట్రీతో ప్రమాదకరమైన కొండచరియ అంచులవైపు నడవసాగారు. కైలాష్ చేతిలోని పొడవాటి గడ్డపార మెరుపులా వెలుగులో యమపాశంలా మెరుస్తోంది. జెన్నిఫర్ ఇంకా అలాగే అలసిసొలసిపోయి వుంది-ఆమెకివేమీ తెలియకుండా వుండేంతగా తాగించారు. వారి అడుగులు వడివడిగా పడుతున్నాయి. యమదుతల్లా దూసుకుపోతున్న వార్ని చూసి ప్రకృతే భయపడినట్లుగా వుంది. గెస్ట్ హౌస్ బయట మరో ఇద్దరు యమదూతలు చేతిలో బ్యారెల్ గన్స్ తో గస్తీ తిరుగుతున్నారు.
* * *
మార్చి మూడున మధ్యాహ్నం రెండు గంటలకు శాలినిపాటిల్ అతికష్టంమీద రిజర్వు చేయించిన టికెట్ తో ఢిల్లీ బయలు దేరేందుకు సిద్ధమావుతున్నాడు మనోహర్. మధు ప్రక్కనే వుండి సహకరిస్తున్నాడు. మంగళ అయిష్టంగా బట్టలు సర్దుతోంది. ఆమెకి మనోహర్ ప్యారిస్ వెళ్ళటం ఏమాత్రం ఇష్టంలేదు. కమలిని ప్రేక్షకురాలిగా మిగిలిపోయింది.