రాఘవానంద భక్తురాలిగా చేరిపోయింది. అక్కడ ఏం జరుగుతూ వుందో కనిపెట్టసాగింది.
అక్కడికి చాలామంది ప్రముఖులు వచ్చేవాళ్ళు. రాఘవానందంటే పడి చచ్చే భక్తి వున్నవాళ్ళు కూడా చాలామందే వున్నారు.
అలా వచ్చిన వాళ్ళలో ఒకడు ఆనందరావు.
అతనికి నలభై ఏళ్ళుంటాయి. రాఘవానందంటే విపరీతమయిన భక్తి. రాత్రే స్వామి కలలోకి వచ్చి "ఏరా ఆనందా! పార్వతితో నీకు కొట్లాట ఏమిట్రా! భార్యాభర్తలంటే ఎలా వుండాలి? భక్తుడూ? దేవుడిలా వుండాలి. అనేవాడు"- ఇలా చెప్పేవాడు ఆనందరావు చుట్టూ చేరిన వాళ్ళతో.
ఒంట్లో నలతగా వున్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళడు.
"అంతా రాఘవానందే చూసుకుంటాడు" అని తన ఆరోగ్యం గురించి పట్టించుకునేవాడు కాడు.
అలాంటి ఆనందరావు తన కుటుంబంతో దిగిపోయాడు ఓ రోజు. అంత పిచ్చి వున్నవాడు సంసారాన్ని ఎలా లాక్కురాగలడు? అంతా అప్పులైపోయి ఇక విధిలేక కుటుంబంతో సహా వచ్చి రాఘవానంద కాళ్ళముందు పడిపోయాడు.
రాఘవానంద చూశాడు.
పార్వతికి కాస్త వయసెక్కువైనా ఇంకా బిగువు సడలేదు. బాగా మాగిన పండు వాసనలు ఎగజిమ్ముతున్నట్లు అవయవాలన్నీ మరింతగా వంపులు తిరిగి వున్నాయి. ఇక వాళ్ళ ముగ్గురు ఆడపిల్లలు రకరకాల వయసుల్లో రంజుగా వున్నారు.
రాఘవానంద కనుసైగలతోనే వాళ్ళకి అక్కడ ఆశ్రయం కల్పించాడు.
కొత్తదనం పోయిందని అనిపించగానే ఆయన పార్వతిని తన కౌగిలికి రప్పించుకున్నాడు.
ఆకలితో చచ్చిపోబోతున్న తన కుటుంబాన్ని ఆదుకున్నాడన్న కృతజ్ఞత ఆమెకు ఎక్కువగానే వుంది. అందుకే ఏమీ అభ్యంతరం చెప్పలేకపోయింది.
మూడురోజులకు ఆమె అంటే మోజు తీరిపోయింది రాఘవానందకు. ఆయన చూపు ఆనందరావు పెద్దకూతురి పైన పడింది.
ఆమెకి పద్దెనిమిదేళ్ళుంటాయి. ఇప్పుడిప్పుడే యవ్వనం అవయవాల్లో విచ్చుకుంటోంది.
ఓరోజు రాత్రి పూజ చేయాలని చెప్పి ఆమెను తనకు తోడుగా వుండమన్నాడు రాఘవానంద.
అరగంటసేపు కాశికామాతకు పూజ చేశాక "ఇది క్షుద్రశక్తి- నువ్వు నగ్నంగా తయారవ్వాలి. నగ్నంగా వున్న ఆడపిల్ల హారతి ఇస్తే మాత చాలా సంతోషిస్తుంది" అని ఆయన ఆమె మీద చేయివేశాడు.
ఆయన మనసేమిటో కనిపెట్టలేని అమాయకురాలేం కాదు ఆమె. అందుకే బయటికి పరుగెత్తుకొచ్చింది తల్లి దగ్గరకెళ్ళి ఏడుస్తూ చెప్పింది.
ఈ మాటలు వింటూనే తల్లి కాళికాదేవి అయిపోతుందని, రాఘవానందను చీల్చి చెండాడుతుందని ఆ పిల్ల అమాయకంగా అనుకుంది.
కానీ జరిగింది వేరు.
"మన కుటుంబం ఆకలితో చావకుండా కాపాడింది ఆయన. మీ నాన్న వెర్రిబాగులోడయితే ఎవరు మాత్రం ఏం చేస్తాం. మన ఖర్మ ఇలా కాలింది కాబట్టి, స్వామి ఏం కోరినా కాదనకు" అంది తల్లి.
దాంతో ఆ పిల్ల షాక్ తిండి. ఏం చేయాలో పాలుపోలేదు. చీకట్లో ఆశ్రమానికి దూరంగా వున్న ఓ రాయిమీద కూర్చుని ఏడ్వడం ప్రారంభించింది.
అప్పుడు అటుగా వెళుతున్న తనూజకి కంటపడింది ఆ పిల్ల. బలవంతం చేస్తే విషయం చెప్పింది.
ఇక ఆగలేదు తనూజ. స్వామిమీద పోరాటానికి ఇది నాంది కావాలనుకుంది. ఆ పిల్లను అంత అర్థరాత్రి సరాసరి తన పత్రికాఫీసుకి తీసుకు వచ్చింది. రకరకాల భంగిమల్లో ఇంటర్వ్యూ చేసింది.
మొత్తం తనకు తెలిసిన సమాచారాన్నంతా రాసి, మధ్యలో ఆ అమ్మాయి ఫోటోలు, ఇంటర్వ్యూలు పత్రికలో ప్రచురించింది.
తెల్లవారి సర్క్యులేషన్ ప్రారంభంకాగానే రాఘవానంద జీవితంలో నిప్పంటుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా అధిక సర్క్యులేషన్ గల ఆ పత్రికలో వార్త రావడంతో, దాని ఎఫెక్ట్ బాగానే వుంది.
ఆరోజు సాయంకాలమే ఆశ్రమం మీద పోలీస్ రైడింగ్ జరిగింది. ఆశ్రమంలో అమ్మాయిల నగ్నచిత్రాలు, బ్లూఫిల్ములు చాలానే దొరికాయి. రాఘవానంద అరెస్ట్ కూడా జరిగిపోయింది.
అదిగో ఆ సమయంలో చలపతిరావు రాఘవానందకు చాలా సహాయము చేశాడు. ఆశ్రమంలో పూచిక పుల్ల పోకుండా కాపాడాడు. కానీ పోలీసులు ఆస్థులన్నీ స్వాధీనం చేసుకున్నారు.
ఆస్థులు పోయినా రాఘవానంద మాత్రం కొంతమంది రాజకీయ నాయకుల సహాయంతో బయటపడ్డాడు. పరువు, ప్రతిష్ఠ, ఆస్థిపాస్తులు, భక్త జనసందోహం, తన అంతరంగికులు- అన్నీ పోవడంతో మహారాష్ట్రకు పారిపోయాడు. షిండేగా తన పేరు మార్చుకున్నాడు, తనను వీధుల పాల్జేసిన వారిమీద పగ సాధించడం మొదలుపెట్టాడు.
రాఘవానంద కష్టాల్లో వున్నప్పుడు తాను సాయం చేశాడు. ఇప్పుడు తాను కష్టాల్లో వున్నాడు గనుక రాఘవానంద తప్పక సహాయం చేస్తాడు అన్న నమ్మకంతోనే చలపతిరావు ఇప్పుడిక్కడికి వచ్చి ఆయన కోసం స్మశానానికేసి నడుస్తున్నాడు.
అర్థరాత్రి దాటిందేమో చంద్రవంక పాలమీదున్న జొన్నకంకె వంగినట్టు కనిపిస్తోంది. చలికి వణుకుతున్న నక్షత్రాలు మబ్బుల్ని కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
అంతవరకు బాగా తిరుగాడుతున్న గాలి మంటల్లో చిక్కుకుపోయినట్టు కమురు వాసనేస్తోంది. తాను స్మశానంలోకి వచ్చినట్టు చలపతిరావు గుర్తించాడు. ఓ క్షణంసేపు నిలబడి రాఘవానంద కోసం చూశాడు.
దూరంగా ఓ చిన్న దీపం చీకటి కడుపున ఎర్రగా కాల్చిన కమ్మీతో రంధ్రం చేసినట్టు కనిపిస్తోంది.
చలపతిరావు అక్కడికి నడిచాడు.
మరో నాలుగడుగులువేస్తే దీపం దగ్గరికి వెళతాడు గానీ ఆ మసక వెలుతురులో అక్కడ కనిపిస్తున్న దృశ్యం చూసి ఓ క్షణం ఆగాడు.
రాఘవానంద కళ్ళు మూసుకుని వున్నాడు. పెదవులు మాత్రం అక్షరాలను కొరుక్కుతిన్నట్టు కదులుతున్నాయి. నుదుట నామంలాగా వున్న కుంకుమబొట్టు రక్తపు తిలకంలా వుంది.
మండుతున్న కర్పూరం ఆరిపోయింది. వెంటనే అక్కడ పరుచుకున్న వెలుగును చీకటి మింగేసినట్టు నల్లగా మారిపోయింది.
రాఘవానంద కళ్ళు తెరిచాడు.
ఎదురుగా వున్న చలపతిరావు రెండు చేతులూ జోడించి దగ్గరగా వెళ్ళాడు.
ఆయన కూర్చోమన్నట్టు సైగ చేశాడు.
చలపతిరావు కింద కూర్చోబోతూ చూశాడు. రాఘవానందకు ఎదురుగా నేలమీద ఓ శవం వుంది. కడుపులో కలిగిన వికారం మెదడుకు పాకినట్టు అటూ- ఇటూ కదిలాడు చలపతిరావు.
ఆయన ఇబ్బంది కనిపెట్టి కాబోలు వివరణ ఇస్తున్నట్టు "శవపూజ" అన్నాడు రాఘవానంద.
ఎందుకని అడగలేదు చలపతిరావు.
రాఘవానంద పగబడితే ఎదుటివాడ్ని ఎంత క్రూరంగా హింసిస్తాడో తెలుసు.
"నా బతుకు బుగ్గి పాల్జేసిన ఆ ఇద్దరు అమ్మాయిల్ని ఏం చేశానో తెలుసా?" అని ఓ వికృతమైన నవ్వు నవ్వాడు రాఘవానంద. పుట్టలోంచి ఓ నల్లని త్రాచు కదిలినట్టుందా నవ్వు.
"ఏ అమ్మాయిల్ని?"