Previous Page Next Page 
చీకటికి అవతల పేజి 17


    రెండోరోజే ముగ్గురూ టౌన్ కెళ్ళారు. ఇలాంటి కేసుల్లో బాగా పేరున్న ఓ డాక్టర్ దగ్గరకి దంపతులిద్దర్నీ తీసుకెళ్ళాడు విశ్వనాథం. డాక్టర్ దంపతులిద్దర్ని పరీక్షించి కొన్ని టెస్ట్ లు రాసిచ్చాడు. ఆ టెస్ట్ లు చేయించుకుని రిపోర్టులు తెచ్చి చూపిస్తే ఏం చేయాలో చెబుతానన్నాడు.

 

    ఆయన చెప్పినట్లే టెస్ట్ లన్నీ చేయించారు. దాదాపు రెండువేలు దాకా ఖర్చయింది. అంత ఖర్చు చేయడమన్నది భీముడికి తలకు మించిన పనే. అప్పటికీ ఇంతకాలం కూడబెట్టిన పదిహేనువందలూ తెచ్చారు. అవి చాలక విశ్వనాథం దగ్గరే ఐదువందలు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

 

    విశ్వనాథం పరిస్థితీ భీముడికంటే పెద్ద గొప్పేం కాదు. ఆ జీతం రాళ్ళు తప్ప మరో ఆదాయం లేదు. అందుకే భీముడు అయిదొందలు అడగ్గానే కష్టమనిపించినా స్నేహధర్మంగా ఇచ్చాడు.

 

    మూడురోజుల తరువాత రిజల్ట్ ఇస్తామంటే తిరిగి వచ్చేశారు. ల్యాబ్ వాళ్ళు రమ్మన్న రోజున మళ్ళీ వెళ్లారు. రిపోర్టులు తీసుకుని డాక్టర్ని కలిశారు. డాక్టర్ అవన్నీ పరీక్షించాక లోపం భీముడిదేనని తేల్చాడు.

 

    "ఆమెకన్నీ ఓ.కే. లోపం ఏమీలేదు. నీలోనే లోపం. మందులకు పోయే లోపం కాదు. ఆపరేషన్ చేయాలి" అంటూనే భీముడికి తెలివి తప్పినంత పనయింది.

 

    "ఎంత ఖర్చవుతుంది?" మెల్లగా అడిగాడు.

 

    "దాదాపు అయిదువేలు"

 

    ఆ మాట వింటుంటే భీముడికి కళ్ళు తిరిగాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. తనలాంటివాడ్ని నమ్మి అయిదువేలు అప్పు ఎవరూ ఇవ్వరు. మరిక ఏం చేయాలి?

 

    "మళ్ళీ కలుస్తాం" అని చెప్పి బయట పడ్డాడు భీముడు. ముగ్గురూ బస్టాండ్ చేరుకున్నారు. దారి పొడవునా ఎవరూ మాట్లాడుకోలేదు ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు.

 

    ఊరెళ్ళే బస్సు వచ్చి ఆగింది.

 

    అది బయల్దేరాలంటే మరో పదినిముషాలు పడుతుంది. ముగ్గురూ వెళ్ళి సీట్లో కూర్చున్నారు.

 

    అప్పుడూ ఎవరూ మాట్లాడుకోలేదు.

 

    డ్రైవర్ వచ్చి కూర్చున్నాడు.

 

    ఇక బస్సు బయల్దేరతుండగా భీముడు సడన్ గా పక్కనున్న విశ్వనాధం వైపు తిరిగి "అంత డబ్బు ఖర్చుపెట్టి నేను తండ్రిని కాలేను. నువ్వే ఏదో ఓ దారి ఆలోచించి నన్ను తండ్రిని చెయ్. నేను మా అక్క వాళ్ళ ఊరెళ్ళి నెల తరువాత వస్తాను" అని ఠక్కున భార్య చేతిని తీసుకుని విశ్వనాథం చేతిలో పెట్టి అంతే వేగంతో బస్సు దిగేశాడు.

 

    బుజ్జి, విశ్వనాథం ఆ షాక్ నుంచి తేరుకుని భీముడ్ని పిలుద్దామని ఎంత ప్రయత్నించినా వీల్లేకపోయింది.

 

    అప్పటికే బస్సు కదిలేసింది.

 

    అ నెలలోనే బుజ్జి నెల తప్పింది.

 

    మరుసటి నెలలో భీముడు ఊర్లోకి తిరిగి వచ్చాడు.

 

    స్వామి ఆ సంగతి తనకు ఎందుకు చెప్పాడో అర్థం కాలేదు కస్తూరికి.

 

    ఆ భావాల్ని గ్రహించినట్టు రాఘవానంద సూటిగా చెప్పాడు-

 

    "ఇదంతా నీకు ఎందుకు చెప్పానంటే దీనివల్ల రెండు విషయాలు తెలుస్తాయని. దరిద్రం ఎంత భయంకరమైనదోననేది ఒకటి, రెండు మంత్రాలకు చింతకాయలు రాలుతాయి గానీ పిల్లకాయలు మాత్రం పుట్టరు. ఇప్పుడు తెలిసిందా మనం ఏం చేయాలో."

 

    కస్తూరి అర్థమైనట్టు చిన్నగా నవ్వింది.

 

    రాఘవానంద ఆమె భుజాల్ని పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు. అలా అతడు తన జీవితంలోకి రెండో ఆడదాన్ని ఆహ్వానించాడు.

 

    కస్తూరి అర్థమైనట్టు చిన్నగా నవ్వింది.

 

    రాఘవానంద ఆమె భుజాల్ని పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు. అల అతడు తన జీవితంలోకి రెండో ఆడదాన్ని ఆహ్వానించాడు.

 

    కస్తూరి ఆ తరువాత ఇంటికి వెళ్ళలేదు. రాఘవానందకు పర్సనల్ సెక్రటరీ అయిపోయింది.

 

    ఆమెను ఆ పోస్ట్ లో నియమించిన రోజు రాత్రి తొలిరోజు చెప్పినంత సూటిగానే తన మనసులో మెదులుతున్న మరో మాటను చెప్పాడు.

 

    "నాకు డబ్బు మీద వ్యామోహం లేకుండా పోలేదు. కానీ అంతకంటే వ్యామోహం స్త్రీలపైన వుంది. నేను నీతోనే వుండాలన్న కోరికలేం పెట్టుకోకు.

 

    నా అంతరంగిక సేవకురాలిగా నువ్వు ఇక్కడ ఏమైనా అనుభవించు. నాకేం అభ్యంతరం లేదు.

 

    కానీ నువ్వు చేయాల్సిన పనల్లా ఒక్కటే. నా దగ్గరికి వచ్చే స్త్రీలంతా పీకల వరకు కష్టాల్లో మునిగిపోయిన వాళ్ళే. తెలివి తక్కువ వాళ్ళే. ఇలాంటి వాళ్ళని బుట్టలో తోయటం చాలా తేలిక.  

 

    అలా వాళ్ళను బురిడీ కొట్టించి నా ఒళ్ళో వాలేట్టు చేయడమే నీ పని. అందుకు ఎన్ని పద్ధతులున్నాయో అవన్నీ ఉపయోగించు. నీకేం భయం లేదు. నీ వెనక నేనున్నాను. సరేనా?"

 

    కస్తూరి తటపటాయిస్తుంటే రాఘవానంద చివరిసారి చెప్పాడు-

 

    "మనం కోల్పోయింది ఇతరులూ కోల్పోయినప్పుడు వచ్చే రాక్షసానందం చాలా గొప్పది. అది ఎంతగా మనకు ఆనందాన్ని కలుగజేస్తుందో నీకే అనుభవంలోకి వస్తుంది."

 

    అలా తన దగ్గరికి వచ్చిన స్త్రీలను తన కౌగిలిలోకి తెచ్చే పనిని కస్తూరికి అప్పజెప్పాడు.

 

    ఆమె తనకు చెప్పిన పనిని సమర్థవంతంగా నిర్వర్తించింది. ఓ స్త్రీని స్వామి గదిలోకి పంపించిన ప్రతీసారీ ఆయన చెప్పిన రాక్షసానందాన్ని అనుభవించింది. దానికోసం తన తెలివితేటల్ని, తన లౌక్యాన్ని, చాకచక్యాన్ని- అన్నిటినీ ఉపయోగించింది.

 

    ఒక్కసారి అలాంటి ఆనందానికి అలవాటుపడితే ఎంతటి క్రూరత్వానికైనా మనిషి వెనుకాడడని చెప్పడానికి ఆమె మంచి ఉదాహరణ.

 

    ఏ ఆడపిల్లయినా స్వామితో వున్నప్పుడు ఫోటోలు తీసేది. వాటిని చూపించి వాళ్ళతో చేయరాని పనుల్ని చేయించుకునేది. తనతోపాటు తోడుగా తీసుకొచ్చిన స్త్రీలను ఒప్పించమనేది. ఒప్పించకపోతే తను తీసిన ఫోటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేసేది.

 

    కస్తూరి అలాంటి సమర్థవంతురాలు కాబట్టే రాఘవానంద రోజుకో కొత్త స్త్రీతో గడిపేవాడు. కొత్త అందాల్ని జుర్రుకునేవాడు. కానీ పాపం పండకపోదు.

 

    ఓరోజు రాత్రి రాఘవానంద తన గదిలో ఒక స్త్రీతో సరసాలాడుతుండగా నాలుగుకళ్ళు గమనించాయి.

 

    ఆ నాలుగు కళ్ళు ఎవరివో రాఘవానందకు తెలియదు.

 

    గది లోపలికి చూస్తున్న దీపశిఖ, నందిని చెమటతో తడిసి ముద్దయిపోయారు. ఒళ్ళంతా అదిరిపోతోంది. కళ్ళు పేలిపోతున్నట్టు నరాలు కదులుతున్నాయి. తామిద్దరూ పాతాళంలోకి కూరుకుపోతుంటే కిటికీ ఊచలకు తగులుకున్న చూపులు నిటారుగా నిలబెడుతున్నట్లు బిగుసుకుపోయారు. లోపల కనిపిస్తున్న దృశ్యం అలాంటిది మరి.

 

    రాఘవానంద చేతుల్లో ఓ అమ్మాయి నగ్నంగా కనకాంబరాలు, మల్లెపూల దండ పెనవేసుకున్నట్టు నలిగిపోతోంది.

 

    "ఋగ్వేదం నుండి మనకు లిఖిత సామాగ్రి ప్రారంభమవుతుంది. అలా నీ అందం నీ తల వెంట్రుకల నుంచి మొదలవుతుంది" అన్నాడు రాఘవానంద మబ్బు తునకలా విప్పారిన ఆమె తల వెంట్రుకలను సుతారంగా నిమురుతూ. ఆ మాటలు వింటూ ఆమె ఎర్రగులాబీలు విచ్చుకున్నట్లు పెదవుల్ని సాగదీసింది.

 

    "క్రీస్తుపూర్వం రెండువేల సంవత్సరాలనాడు హిమాలయాల ప్రదేశాన్ని కిన్నెరదేశం అనేవాళ్ళట. కంటిచూపు ఆనినంతవరకు తెల్లటిమంచుతో ఆ ప్రదేశమంతా కప్పబడి వుండేదట. అదెలా వుండేదో ఊహించుకునేకంటే నీ నుదురు చూస్తే ఇట్టే తెలిసిపోతుంది" అని ఆమె నుదురును తడుముతున్నాడు.

 

    "అదిగో- ఆ కిన్నెర దేశాన్ని కొల్లగొట్టేందుకు ఆర్యులు ఎన్నోసార్లు యుద్ధాలు చేశారట. అలానే నా పెదవుల్తో నీ పాలభాగాన్ని కొల్లగొడతాను" అంటూ ముందుకి వంగి పెదవుల్ని ఆన్చాడు.

 Previous Page Next Page