"విజయ్ ఇంకా లేవలేదా?"
నరేంద్ర కంఠం విని సునందను వదిలేసి, చివ్వున లేచి మంచం మీద కూర్చొన్నాడు.
"నువ్వు తయారయ్యావని బావను లేపడానికే వచ్చాను" గదిలోకి ప్రవేశించిన నరేంద్రతో అని సునంద బయటికి వెళ్ళిపోయింది.
"ఇంత పొద్దున్నే ఎక్కడకు తయారయావ్? రాత్రంతా సరిగా నిద్ర కూడా లేదు." విజయ్ ఆవలిస్తూ అన్నాడు.
"నేర పరిశోధన చేసే వాళ్లకు, హంతుకుడ్ని కటకటాల వెనక్కు పంపించాకే నిద్రపట్టేది. ఊ! కానీయ్! త్వరగా!"
"త్వరగా!"
విజయ్ మంచం దిగుతూ నరేంద్ర ముఖంలోకి చూశాడు.
"అరే!అదేమిటి కళ్ళంతా ఎర్రగా ఉన్నాయ్? రాత్రంతా నిద్రేపోలేదా?" విజయ్ విస్మయంగా అడిగాడు.
"అవును! విజయ్! రాధారాణి, రామకృష్ణల హత్యల గురించే ఆలోచిస్తున్నాను. పాపం! రెండు నిండుప్రాణాలను పొట్టన పెట్టుకొన్నాడు దుర్మార్గుడు.
"అంటే నీ ఉద్దేశ్యంలో హంతకుడు ఒక్కడనిగా?"
"నీ ఉద్దేశ్యం?"
"ఒక్కడు కాడు"
"ఎలా చెప్పగలవు?"
"చెప్పడానికి నాకు మరికొంత టైం కావాలి"
"అలాగే తీసుకో. సరే త్వరగా తయారవు." అంటూ నరేంద్ర గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు.
"హంతకుడు అందుబాటులోనే ఉన్నాడు ఇంకా నీ అనుమానం ఏమిటో....?"
బయటికి వెళుతున్న నరేఅద్ర ఆగి వెనక్కు తిరిగి"నేరపరిశోధకులు పోలీసువాళ్ళలా తొందరపడి తీసుకోకూడదని నీకు చాలాసార్లు చెప్పాను: అన్నాడు.
విజయ్ స్నానం చేసి టిఫెన్ చేసి తయారయి బయటికివచ్చాడు.
అప్పటికే నరేంద్ర కార్లో స్టీరింగ్ ముందు కూర్చుని ఉన్నాడు. విజయ్ కొరకు ఎదురుచూస్తూ.
"ఊ! కమాన్!ఎక్కు" అంటూండగానే గేటు లోపలకు దూసుకొని వచ్చిన పోలీసు జీపు చూసి స్టార్టు చేసిన ఇంజన్ ఆపుచేశాడు.
జీపు ఆగింది. ముందు సీట్లో నుంచి అద్వయితం దూకాడు. వెనక హెడ్డు యాదగిరి కూర్చుని ఉన్నాడు.
"నరేంద్రా ఎక్కడకు ఇంత పొద్దుటే బయలుదేరావ్ ఇన్ స్పెక్టర్ అడిగాడు.
"తమరు ఇంత పొద్దుటే ఊడిపడటానికి కారణం?" విజయ్ అడిగాడు.
"నరేంద్రతో అర్జెంటుగా మాట్లాడాలని...." నీళ్ళు నమిలాడు ఇన్ స్పెక్టర్.
"కారెక్కు నేను నీ దగ్గరకే బయలుదేరాను?"
"ఎక్కడికీ? మరో హత్యకాని జరగలేదు కదా," ఇన్ స్పెక్టర్ గాభరాగా అన్నాడు.
"అదేం లేదులే. కారెక్కు" అన్నాడు నరేంద్ర.
అద్వయితం కారెక్కి వెనక సీట్లో కూర్చుని "ఎక్కడికో చెప్పలేదు?" అన్నాడు.
"నల్లకుంట"
"ఓ కమలాంబ ఇంటికా?" ఇన్ స్పెక్టర్ సాలోచనగా గొణిగినట్లు అన్నాడు"
"రాత్రి వెళ్ళావటగా? ఏమైనా క్లూ దొరికిందా?" విజయ్ వ్యంగ్యంగా అన్నాడు.
"అక్కడేం దొరుకుంది? పాపం. తమ్ముడు పోయాడని ఒకటే ఏడుస్తోంది. అక్కడ మనకు దొరికే అదనపు ఇన్ పర్ మేషన్ ఏదైనా ఉంటుందని నేను అనుకోను. బాధలో కుమిలిపోతున్న ఆమెను విసిగించడం అవసరమేమో?"
"అదనపు ఇన్ ఫర్ మేషన్ అంటే కొంత దొరికిందననేగా?" విజయ్ రెట్టించాడు.
"అక్కడ నాకేమీ ఇన్ ఫర్ మేషన్ దొరకలేదు" అన్నాడు ఇన్ స్పెక్టర్.
నరేంద్ర మౌనంగా కారు స్పీడు పెంచాడు.
నల్లకుంట రైల్వేట్రాక్ కు ఎదురుగా ఉన్న ఓ బంగాళా ముందు కారు ఆపాడు ఆ భవంతి ఆధునాతనంగా ఉంది, మరీ పెద్దది కాకపోయినా కనీసం ఐదు లక్షల ఖరీదైనా చేస్తుంది.
పోర్టికోలోవైట్ ఫియట్ ఆగి ఉంది.
కారు గేటు బయటే గోడవారగా ఆపి నరేంద్ర దిగాడు.
"లోపలకు వెళ్లొచ్చుగా?" అన్నాడు ఇన్ స్పెక్టర్.
ఇన్ స్పెక్టర్ మాట వినిపించుకానట్లే నరేంద్ర కారు దిగాడు. ఇన్ స్పెక్టర్ కారు దిగి గేటు తీసుకొని నరేంద్రకంటే ముందులోపలకు వచ్చాడు. కాలింగ్ బెల్ నొక్కాడు.
కొద్దిక్షణాల్లో తలుపులు తెరుచుకున్నాయి.
తలుపులు తీసిన పనిపిల్ల ఖాకీ డ్రెస్ లో ఉన్న ఇన్ స్పెక్టర్ నివ్వెరపోయి చూసి లోపలకు పరుగుతీసింది.
ముగ్గురూ డ్రాయింగ్ రూంలోకి వెళ్ళి కూర్చున్నారు.
ఐదు నిముషాల్లో నలభయి, నలభైఐదు ఏళ్ళవయసులో ఒక స్త్రీ డ్రాయింగ్ వచ్చింది.
పాతికేళ్ళ యువతి ముస్తాబు చేసుకొని ఉన్నవి.
ముగ్గుర్నీ చూసి ఓ క్షణం తట్టరపోయింది. అంతలోనే తేరుకొని "ఏమిటండి ఇన్ స్పెక్టర్ గారూ? మళ్ళీ వచ్చారు. తెల్లారేసరికి హంతకుడి ఆచూకి ఏమైనా తెలిసిందా? వీరెవరూ? అన్నది. అన్నది ఎదురుగాఉన్న కుర్చీలో కూర్చుంది.
"వీరు డిటెక్టివ్ నరేంద్ర. వారు ఆయన అసిస్టెంటు. పేరు విజయ్" అని ఇద్దర్నీ పరిచయం చేసి "ఈమె కమలాంబ. రామకృష్ణ అక్కగారు" అని నరేంద్రకు పరిచయం చేశాడు ఇన్ స్పెక్టర్.
కమలాంబ ముఖం క్షణంలో విషాదంతో మబ్బులు కమ్మిన ఆకాశంలా అయింది.
"నమస్కారం" ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొంటూ నరేంద్రకు చేతులు జోడించింది కమలాంబ.
"నమస్తే" అన్నాడు నరేంద్ర ఆమెను నిశితంగా చూస్తూ.
అంతలో "కమలా! కమలా" అని పిలుస్తూ ఓ ఏభయి ఏళ్ళ మగవాడు నైట్ డ్రెస్ లో పైభాగంలో నుంచి మెట్లమీదుగా డ్రాయింగ్ రూంలోకి వచ్చాడు. ఇన్ స్పెక్టర్ చూసి ఓ క్షణం నివ్వెరపోయాడు.
"నమస్కారం ఇన్ స్పెక్టర్! ఏమిటిలా దయచేశారు? రాత్రి వచ్చి వెళ్ళారటగా?" ఆన్నాడు కమలాంబ పక్కన ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.
నరేంద్ర అతడ్ని తేరిపార చూశాడు.
ఆజానుబాహుడు- బలమైనశరీరం- గుబురుగాఉన్న కనుబొమలు వయసు ఏభయ్ దాకా ఉన్నా అవలీలగా ఇద్దరు మనుషుల్ని ఒకేసారి అవతలకు విసిరెయ్యగలడు అని అనిపించింది నరేంద్రకు అతడ్ని చూస్తుంటే.
"వీరెవరూ?" అడిగాడు విజయ్.
"వీరు లాయర్ శంకర్రావుగారు" అన్నాడు ఇన్ స్పెక్టర్.
"వారి పరిచయం?" శంకర్రావు గుబురు కనుబొమల్నిముడివేస్తూ అడిగాడు.
"వీరు నరేంద్ర. ప్రఖ్యాత డిటెక్టివ్. వారు విజయ్ . వీరి అసిస్టెంట్" అన్నాడు ఇన్ స్పెక్టర్.
"శంకర్రావుగారు మీకేమౌతారు?" ప్రశ్నించాడు నరేంద్ర కమలాంబని చూస్తూ.
"ఏమీ కారు" అని ఓ క్షణం ఆగి "మా కుటుంబానికిఆప్తమిత్రులు. మా తమ్ముడు రైలుప్రమాదంలో పోయినప్పట్నుంచీ వీరే మా ఆస్తికి సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకొంటున్నారు" అన్నది కమల ముక్తిసరిగా.
శంకర్రావు కుర్చీలో వారి నివాసం?" అడిగాడు నరేంద్ర.
"అప్పుడప్పుడు మరీ పొద్దుపోతే ఇక్కడే ఉండిపోతారు.ముఖ్యంగా తమ్ముడు చనిపోయిన రోజు నుంచి అంటే మూడురోజులుగా ఇక్కడే ఉంటున్నారు" కమలాంబ నేలచూపులు చూస్తూ అన్నది.
"శంకర్రావుగారూ! మీరు రామకృష్ణగారి ఆస్తి వ్యవహారాలన్నీ చూస్తున్నారటగా? అతడి ఆస్తిని అనుభవించే హక్కు అతడి భార్య అనసూయాదే కదూ?" నరేంద్ర అడిగాడు
అద్వయితం నరేంద్రకేసి ప్రశంసాపూర్వకంగా చూశాడు. రాత్రి తనకు ఆ ఆలోచన రానందుకు తనను తనే మనసులో విసుక్కున్నాడు.
"ఇంతకు ముందు ఆ హక్కు ఆమెకున్న మాట వాస్తవమే ఇప్పుడు మాత్రం ఆమెకు ఆ హక్కులేదు" అన్నాడు శంకర్రావు నిస్సహాయంగా.
"ఎందువల్లా?" ఇన్ స్పెక్టర్ అద్వయితం అడిగాడు శంకర్రావు కేసి అనుమానంగా చూస్తూ.
"రామకృష్ణ రైలు ప్రమాదంలో నిజంగా మరణించి ఉంటే, ఆ ఆస్తిమీద హక్కులన్నీ ఆమెకే చెందేవి?"
"ఇప్పుడు మరణించాడుగా? మరి ఇప్పుడు అతడి ఆస్తిమీద ఆమెకు హక్కులేదా?"
"లేదు." దృఢంగా పలికింది అతడి కంఠం.
"ఎందుకు లేదో చెప్పండి" గట్టిగా అడిగాడు ఇన్ స్పెక్టర్.
"రామకృష్ణ చనిపోలేదు."
"చనిపోలేదా?" ఇన్ స్పెక్టర్ నోరు తెరిచాడు.
"పూర్తిగా వినండి. అతడు మేము అనుకున్నట్లుగా మూడేళ్ల క్రితం చనిపోలేదు. మొన్నటివరకు బతికే ఉన్నాడు. అంటే అనసూయ భర్త బ్రతికి ఉండగానే మరోకడ్ని చేసుకొన్నది. అందువల్ల ఆమెకు తన మొదటి భర్త ఆస్తిమీద ఎలాంటి హక్కూ లేదు. ఉండదు. ఒక వేళ కోర్టుకు వెళితే ఆమె దోపిగా నిరూపించబడుతుంది" గుబురు కనుబొమ్మలు దగ్గరగా చేర్చి, ఇన్ స్పెక్టర్ కేసి తీవ్రంగా చూస్తూ అన్నాడు శంకర్రావు.
"మీరు చెప్పింది నిజమే కావచ్చు. అంత మాత్రంచేత కమలాంబగారికి తమ్ముడి ఆస్తిమీద హక్కు వచ్చినట్టు ఎలా చెప్పగలరు! ఆయన ఒకవేళ వీలునామా రాశారేమో? రాస్తే తన ఆస్తి ఎవరెవరికీ రాశారో ఎలా తెలియడం ?" శంకర్రావు కళ్ళల్లోకి లోతుగా చూస్తూ అన్నాడు నరేంద్ర.
విజయ్ మౌనంగా కూర్చుని అందర్నీ గమనిస్తున్నాడు.
"అవునండీ! మీరు చెప్పింది నిజమే. మా తమ్ముడు వీలునామాలో ఆస్తి అంతా నా పేరనే రాశాడు. వాడికి మాత్రం ఇంకెవరున్నాండీ? నా కూతురంటే బాడికి మాత్రం ఇంకెవారున్నారండి? నాకూతురంటే వాడికి ప్రాణం. తల్లిలా చూశానుగాని వాడ్ని అక్కల చూడలేదు. వాడికీ నేనంటే ఎంతో ఇష్టం" అన్నది కమలాంబ.
"ఆ!రామకృష్ణ వీలునామా రాశాడా?" ఏదో చూద్దామనివిసరిన వాలతాకాలేదు. అందులో ఏనో చిక్కుకుంది. లాగుతుంటే బరువుగానే ఉంది అని ఆలోచిస్తూ కమలాంబ! కేసి చూశాడు నరేంద్ర,
"రక్తసంబందం. నాకు రాయకపోతే ఇంకెవరికి రాస్తాడు?" ధీమాగా అన్నది కమలాంబ.
"అయితే మొన్న రామకృష్ణను మీరు కలిశారన్నమాట నరేంద్రఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు.
"లేదు" ఆమె చూపులు కిందకు వాలాయి. పైటకొంగుతోకళ్ళు తుడుచుకుంది.
"ఆ అదృష్టం కూడా కలగలేదు మూడేళ్ళనాడుచూసిన తమ్ముడ్ని మళ్ళీ శవంగా చూడాల్సి వచ్చింది" ఆమె కంఠంలో దుఃఖం గరగరలాడింది.
"ఊరుకో కమలా! ఏడిస్తే పోయినవాడు తిరిగొస్తాడా" ఓదారుస్తూ అన్నాడు శంకర్రావు.
"అయితే శంకర్రావుగారు రామకృష్ణను కలిశారా?"
"నేనా? అబ్బే! నేను కూడా ఇన్ సెక్టర్ గారు కబురు చేస్తే వెళ్ళి మార్చురీలో శవాన్ని పోల్చుకున్నాను" అన్నాడు శంకర్రావు.
"మరి! ఆయన తన ఆస్తిఅంతా మీ పేరున రాసినట్టు మీకెలా తెలిసింది?" నరేంద్ర కమలాంబను ప్రశ్నించాడు.
"లాయర్ రమణారావుగారిచేత తమ్ముడు వీలునామా రాయించాడట. నిన్న ఉదయం రమణారావుగారు తెచ్చి ఇచ్చారు."
"మరి ఆ సంగతి నాకు చెప్పలేదేం?" తీవ్రంగా చూస్తూ అడిగాడు అద్వయితం.
"మీరు అడగలేదుగదా?" అన్నది కమలాంబ.
అద్వయితం గతుక్కుమన్నాడు.
"ఉండండి చూపిస్తాను" అంటూ కమలాంబ లేచి లోపలకు వెళ్ళింది.
ఐదు నిముషాల్లో కమలాంబ వీలునామా కాగితాలు తెచ్చి నరేంద్ర చూసి ఆ కాగితాలు అటూ ఇటూ తిప్పుతూ"రమణారావంటే రావూస్ టెక్ స్టెల్స్ లీగల్ అద్వాయిజరేనా?" అని అడిగాడు.
అతడి ప్రశ్నకు కమలాంబ అమాధానం ఇవ్వలేదు వినిపించుకొనట్టే ఉండి పోయింది.
"అవును ఆయనే!" అన్నాడు శంకర్రావు తల ఊపుతూ.
అంతలో ఒక యువతి కిలకిలా నవ్వుతూ హల్లో నుంచి డ్రాయింగ్ రూంలోకి వచ్చింది.
ఆమె వెనకే ఈల వేసుకొంటూ ఒక యువకుడు వచ్చాడు.
డ్రాయింగ్ రూంలో ఉన్న కొత్త వ్యక్తుల్ని చూడగానే ఇద్దరూ బిత్తరపోయారు.
"మా అమ్మాయి లావణ్య " అని నరేంద్రకు ఆ యువతిని పరిచయం చేసింది కమలాంబ.
"అతడెవరూ?" అడిగాడు ఇన్ స్పెక్టర్ ఆ యువకుడ్ని కన్నార్పకుండా చూస్తూ.
"అతని పేరు కృష్ణమూర్తి మా ఫామిలీ ఫ్రెండు."
ఆ పరిచయం వినగానే కృష్ణమూర్తి ముఖం ముడుచుకుపోయింది.
"మాకు దూరవుబంధువు కూడా" అన్నది కృష్ణమూర్తి ముఖం చూసి కమలాంబ.