"ఏం గురూ! శలవాయిపోయిందా? బాగా ఎంజాయ్ చేశావా...?" అడిగాడు.
"ఓ! బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాలే.... చెప్పాడానికి మాటలు చాలవు" అన్నాడు రాంపండు దిగులుగా మొహం పెట్టి.
"అదేం? మళ్ళీ ఏమొచ్చింది?"
"మేం వూరి కెళ్దాంమని అనుకుంటుండగామా పిన్నీ, చిన్నాన్న వూర్నుండి వచ్చారు. వాళ్ళు నిన్ననే వాళ్ళ వూరికెళ్ళారు."
"మరికనేం? నీ శలవుని మరో నాలుగు రోజులకి పొడిగించి మీ ఆవిడ్ని తీసుకుని ఊరికెళ్ళిపోయి వుండాల్సింది!"
"నిజమేగానీ ఎన్నాళ్ళని అలా శలవు పొడిగించుకుంటూపోతా? అదీకాకుండా మొన్న సర్వోత్తమరావు మా యింటికి వచ్చాడు. మా ఆవిడాకేలా వుందో చూసిపోదామని. అతను కళ్ళారా చూశాడు మ ఆవిడా బాగుండడాన్ని ... అందుకే శలవు ఎక్స్ డెంట్ చెయ్యకుండా ఆఫీసుకు రావల్సోచ్చింది!" వెర్రిమొహం వేసుకుని చెప్పాడు రాంపండు.
సరే! అలాగయితే అది నీ ఖర్మ! నిన్ను దురదృష్టం మరీ ఈ విధంగా తరుముకుని వస్తుంటే ఎవరూ ఏమీ చెయ్యలేదు గానీ ఈ కాగితం మీద సంతకం చేసి ఓ పాతిక రూపాయలిటు పడేయ్" అన్నాడు బ్రహ్మాజీ చేతిలోని కాగితాన్ని రాంపండు ముందు పెడుతూ.
"ఏంటది?"
"ఫేర్ వేల్ పార్టీ! మన ప్రక్కా సెక్షన్ లోని కే. ధర్మారావ్ లేడూ?"
"కే.ధర్మారావ్? వాడేవాడు?" ప్రశ్నర్దాకంగా చూస్తూ అడిగాడు రాంపండు.
"అదేనోయ్! క్.ధర్మారావ్ అంతే మనం అంతా కే.డి. రవ అని అంటామే.... అతను! అతనికీ మధ్య అనంతపూర్ కి ట్రాన్స్ ఫర్ అయ్యింది కదా. అతన్నీ రిలీవ్ చేస్తున్నారు. సాయంత్రం ఫేర్ వేల్ పార్టీ యివ్వాదానికి చందా" అన్నాడు బ్రహ్మాజీ.
ర్మ్పండు అతను కాగితంలో ఇరవై అయిదు రూపాయలు రాసి పెయిడ్ అని సంతకం చేసి జేబులోంచి ఇరవై అయిదు రూపాయలు తీసి బ్రహ్మాజీకిచ్చాడు.
బ్రహ్మాజీ ఆ కాగితాన్ని రాంపండు ఎదురు సీట్లో వున్నతని దగ్గరకి తీసుకెళ్ళాడు.
"మాయదారి సంత.... ఈ చందాలతో చస్తున్నాం. అయినా ఆ పని దొంగ కేడీ రావ్ గదికి పార్టీ ఎందుకూ దండగ" అనీ విసుక్కుంటూ పర్సులోంచి డబ్బులు తీసి బ్రహ్మాజీ యిచ్చాడు.
అఫేసులలో దాదాపు అందరూ విసుక్కుంటూనే డబ్బులిచారు.
* * * *
సాయత్రం అయిదయింది.
కాన్ఫరెన్స్ హాలులో కేడీరావ్ కి ఫేర్ వేల్ పార్టీ ఆరెంజ్ చేశారు. పార్టీకి అందరూ ఏడుస్తూనే వచ్చారు.
ఇరవై అయిదు రూపాయలివ్వడమే దండగనుకుంటే ఈ దరిద్రం పార్టీ గురించి టైం కూడా వేస్టు చేసుకోవాల్సి వచ్చింది! అనుకున్నాడు పార్టీకి వచ్చునవాళ్ళు.
డయాస్ మీద సర్వోత్తమరావు, కేడీనాల్ కూర్చుని వున్నాడు టేబుల్ మీద మైక వుంది. దాని ప్రక్కనే ఓ గిప్టు పాకెట్ వుంది. స్టాఫ్ దగ్గర్నుండి వసూలు చేసిన డబ్బుతో కేడీ రావ్ కి ఓ ప్రెషర్ కుక్కర్ కొన్నారు.వ్మిగాతా డబ్బులు స్నాక్స్ కీ, టీకి, ప్రెషర్ కుక్కర్ కేడీ రావ్ కియిస్తే బాగుంటుందా లేదా... అసలు ఒక మగాడికి ప్రెషర్ కుక్కర్ యివ్వోచ్చా?
మొదలయిన పెఅశ్నలు వాళ్ళకి తట్టవు. తట్టినా వాళ్ళు పట్టించుకోరు ఫేర్ వేల్ పార్టీ అంటే మొక్కుబడిగా ఓ గిప్ట్ కొనివ్వాలి చచ్చినట్టు! అది తీసుకునేవాడికి ఉపయోగపడేదా లేదా అన్నది వాళ్ళకి అనవసరం... ఏది ఒకటి ఇవ్వాలి అంతే!
ఈ సభ గురించి రాంపండుకి మరీ చికాగుగా వుంది. అసలే రాజీ రాత్రి నుండి అలిగి పడుకుంది. ఇప్పుడు లేటైతే యింకేమయినా వుందా? ఇలా ఆలోచిస్తుండగానే మైక్ లో కంఠం ఖంగున మోగింది.
"డియర్ ప్రెండ్స్!"
రాంపండు ఉలిక్కిపడి స్టేజీ వంక చూశాడు. సెక్షన్ ఆఫీసర్ పండు రంగారావు మైకుని పట్టుకుని నిల్చున్నాడు. అప్పుడే బ్రహ్మాజీ రాంపండు ప్రక్కన కూర్చున్నాడు.
"ఈ రోజు చాలా దుర్దినం" స్వీచ్ ని మొదలు బెట్టాడు పాండురంగారావు. అతనలా అక్కడున్నావాళ్ళ మోహాలు బలవంతంగా బాధగా మారిపోయాయి.
"ఇన్నాళ్ళూ మనతో కలసి మెలసి పని చేసిన కేడీకార్ ఇప్పుడు మనల్ని వదలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నారంటే మనందరకీ నిజంగా ఎంతో బాధగా వుంటుంది."
అందరూ బాధతో బుస్సున నిట్టూర్చారు. రాంపండు, బ్రహ్మజీలు కూడా ఇద్దరూమోహ మోహాలు చూసుకుని నిట్టూర్చారు.
"మీ అందరకి తెల్సు. మనం ఈ రోజు ఇక్కడ ఎందుకు కలుసుకున్నామో... మన ప్రియతను కోల్లింగ్ కేడిరావ్ అనంతపూర్ కి ట్రాన్స్ ఫర్ అయ్యారు. అయన ఈ రోజు రీలివ్ అయ్యారు."
"ఓహొ! అలాగా" అనుకున్నాడు రాంపండు కసిగా.
"ఈ సందర్బంగా మన బాస్ శ్రీ సర్వోత్తమరావుగారు కేడీరావ్ గురించి నాలుగు ముక్కలు మాట్లాడ్తారు."
మైక్ ని సర్వోత్తమరావు ముందుంచాడు పాండురంగారావు.
సర్వోత్తమరావు తన స్వేచ్ మొదలుపెట్టాడు.
"డియర్ ప్రెండ్స్!"
అందరూ కుర్చీలో ముందుకు జరిగి అంచుల మీద కూర్చుని మొహంలో లేని ఇంటరెస్టుని తెచ్చుకుని బాస్ మొహంలోకి చూశారు.
బాస్ స్వేచ్ ని ఆ మాత్రం ఇంట్రెస్టుతో వింక తప్పదు!
"కేడీరావ్ కి ట్రాన్స్ ఫరై వెళ్ళిపోతున్నాడంటే నాకు చాలా బాధగా వుంది." సర్వోత్తమరావు ముఖం చాలా బాధగా పెట్టాడు. అతనితోపాటు కేడీరావ్ కూడా మొహం చాలా బాధగా పెట్టాడు. వాళ్ళని చూసి మిగతా స్టాప్ మెంబర్లు కూడా ముఖాలు బాధగా పెట్టారు.
"మొదట్లో కేడీరావ్ చూడగానే ఎవరీ చురుకైనా కుర్రాడు అనుకున్నాను! అసలింత చలాకీగా ఉంటే కుర్రాడు ఆఫీసు వ్యవహారాలు సారిగా చూస్తాడా అని అనుకున్నా" అందరివంకా నవ్వుతూ చూస్తూ అన్నాడు సర్వోత్తమరావు.
అందరూ ఘొల్లున నవ్వారు.
కేడీరావ్ మాత్రం సిగ్గుపడుతూ నవ్వాడు.
సర్వోత్తమరావు స్వీచ్ ని కంటిన్యూ చేశాడు.
"కానీ నా అంచనాలని త్రుమారు చస్తూ కేడీరావ్ తమ చాలా మంచి వర్కర్ అని నిరూపించుకున్నాడు... హి ఈజ్ రీయల్లీ ఏ సిన్సియర్ వర్కర్!"
ఈసారి కూడా అందరూ ఘొల్లున నవ్వారు. కానీ బయటకి కాదు. మనసులో!
"అతని తోటి స్టాప్ తో చాలా ప్రండ్లీగా, చాలా కో ఆపరేటర్ గా, చాలా అదిగా... చాల ఇదిగా.. మరెంతో వ్యవహారంగా వున్నాడు యిన్నాళ్ళూ."
కేడీరావ్ ఇమ్మీడియట్ బాస్ అయినా పండు రంగారావు, అతని సీటుకి అటు ప్రక్కా. ఇటు ప్రక్కా, ఎదురుగా కూర్చునే వాళ్ళు పళ్ళు నూరారు.
ఇంకా కేడీరావ్ గురించి పొగుడుతూ అయిదు నిమిషాలపాటు సిగ్గుతో చితికిపోతూ మాట్లాడాడు సర్వోత్తమరావు.
".... ఇలాంటి వ్యక్తి మనల్ని వదలిపెట్టి వెలుతున్నందుకు నాకు... చెప్పలేని... మాటలకందని..." సర్వోత్తమరావు గొంతు వూడుకుపోయింది. కోటు జేబులోంచి కర్చీఫ్ తీసి ముక్కు చీది ముక్కు తుడుచుకున్నాడు.
"ఇంకా నేను మాట్లాడలేను..." సర్వోత్తమరావు కూర్చున్నాడు.
తర్వాత కేడీరావ్ ప్రక్క సీట్లోతను మాట్లాడాడు, కేడీరావ్, తనూ చాలా బాగా కల్సిమేల్సి పని చేసే వాళ్ళమనీ, ఈ నాలుగేళ్ళాలో వాళ్ళిద్దరి మధ్య అనుబంధం బాగా పెరిగిపోయిందనీ, అందుకని కేడీరావ్ వెళ్ళి పోతుంటే చాలా బాధగా వుందనీ చెప్తూ అతను వెక్కి వెక్కి ఏడ్చాడు.