అమ్మో వీడి మాయదారి అరుపులు కావుగానీ నాకు దాదా, ఆయాసం వచ్చేస్తుంది" అంది కమలమ్మ.
"ఏంటాయ్... ఏంటి నీ అరుపుల వ్యవహారం?"
అడిగాడు సర్వోత్తమరావు బిత్తరపోయి చూస్తూ.
"అదే సార్! మిమ్మల్ని చూసి దాదాపు పదిరోజులైపోయింది కద్సార్... ఆ ఆనందంలో అల అరిచ్ను సర్. మీరేంటి సార్ యిలా వచ్చారు? కూర్చోండి సార్" కంగారుగా అన్నాడు రాంపండు.
సర్వోత్తమరావు వరండాలోని సోఫాలో కూర్చుంటూ అడిగాడు_ "ఇంతకీ మీ ఆవిడాకేలా వుందోయ్... అదేం నర్సింగ్ హొం అన్నావు? సినీల్ అండవాల్స్ రోగాల్స్ నర్సింగ్ హొమే కదూ? నువ్విన్ని రోజులు శలవు పెడితే అసలు మీ ఆవిడ వ్యవహారం ఎలా వుందో చూసి పోదామని వచ్చాను."
రాంపండు సమాధానం చెప్పేలోగా అతను అలా ఎందుకరిఛాడో, అసలు ఎవరోచ్చారో చూద్దామని లోపలున్న ముగ్గురూ బయటకి వచ్చేశారు.
"ఈయనమా బాస్! మా ఆవిడ.... రాజీ! వీళ్ళు మా చిన్నాన్నా, పిన్నీ" పరిచయం చేశాడు అతను గుండెల్లో గుబగుబలాడుతుండగా.
"ఓ! అయితే నీ ఆరోగ్యం ఇప్పుడు బాగానే వుంటుంది" అంది ఆమె.
"తను అంతేలెండి! అలానే అంటుంది" కంగ్రుగా అన్నాడు రాంపండు.
"నర్సింగ్ హొం నుండి ఎప్పుడు దిస్తార్జ్ అయ్యవయ్యా?" రాజేని అడిగాడు సర్వోత్తమరావు.
"నర్సింగ్ హొమా... అదేంటండీ?" అడిగింది రాజీ.
"తను అంతేలెండీ! ఆ నర్సింగ్ హొంని అసలు నర్సింగ్ హొమ్
క్రిందే కన్సిడల్చెయ్యదు. అందుకని అది చెత్తని అక్కడనుండి వచ్చేసింది.... అంచేత తనకి సాయంగా వుంటారని మా పిన్నీ, చిన్నాన్నలని వూర్నుండి పిలిపించా" సర్వోత్తమరావుతో గుక్క తిప్పుకోకుండా అని రాజీతో_ ఇలా అన్నాడు "మ సార్ కి కాఫీ పట్రా."
రాజీ, నానాజీ, కమలమ్మ లోపలకి వెళ్ళిపోయారు.
"మీ చిన్నాన్నా, పిన్ని ఇంకా చాలా రోజులుంటారా?" అడిగాడు అయన.
"అబ్బే.... లేదండీ... రేపు సాయత్రం వల్ల వుండడానికి పిలిపిమ్చనని అన్నావు?"
"అంటే మా ఆవిడకి ఇప్పుడు కాస్త తేలిగ్గానే వుందండి. పాపం వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళని యిక్కడ వుంటారు? అందుకని పంపించేస్తున్నాను."
"అలాగా! అయితే ఎల్లుండి నువ్వు ఆఫీసుకొచ్చి డ్యూటీలో జాయినయిపో.... చాలా వ్యవహారాలూ పెండింగ్ లోపడిపోయే" అన్నాడు సర్వోత్తమరావు.
"అలాగే సార్" రాంపండు బుర్రకాయ్ వూపాడు.
* * * *
ఉదయం తొమ్మిదిన్నర కావోస్తున్నా రాజీ యింకా మంచం మీది నుండి లేవలేదు. ఆమె కళ్ళు ముసుకునే వుందిగానీ నిద్రపోవడం లేదు. రాంపండు నిట్టూర్చాడు.
మళ్ళీకోపం...! లేదా అలక!!
ఆ క్రితం రోజు సాయంత్రమే రాంపండు చిన్నాన్న, పిన్నీ, వూరికి వెళ్ళిపోయారు. అప్పటినుండీ రాజే మౌనవ్రతం పాటిస్తూనే వుంది.
హూ! ఈ పూటా హొటల్ భోజనం తప్పేలా లేదు అనుకున్నాడు.
ఆఫీస్ కెళ్ళాడానికి డ్రెస్ చేసుకున్నాడు అసలు చుట్టాలెళ్ళాకమరో రెండురోజులు శలవు ఎక్స్ టెండ్ చేసి రాజీని ఎక్కడికైనా తీసుకేళ్దమని అనుకున్నాడు. కానీ ఆ బాస్ శనిగాడు ఇంటికొచ్చి రాజీ నర్సింగ్ హొంలో లేదనీ, ఇంట్లోనే ఆరోగ్యంగా వుందనీ కళ్ళారా చూశాడు. ఇంక ఏం కారణం చెప్పి లీవ్ ఎక్స్ డెంట్ చేస్తాడు?
ఘాస్ వేసుకుని ఆఫీసుకెళ్తున్న అని చెప్పడానికి గదిలోకి వెళ్ళాడు రాంపండు. రాజీ గోడవైపుకి తిరిగి పడుకుంది.
అతను మెల్లగా దగ్గాడు.
ఆమెలో చలనం లేదు.
ఈసారి కాస్త గట్టిగా దగ్గాడు... ఉహూ... అయినా ఆమె కదల్లేదు. ఇంకాస్త గట్టిగా దగ్గాడు.
"గూట్లో దగ్గు మందుంది... వేసుకుని తాగండి" చాకాగుగా అంది ఆమె కళ్ళు మూసుకునే.
"అదికాదు! నేను ఆఫీసుకెళ్ళాలని చెప్పడానికి వచ్చాను" అన్నాడు అతను నసుగుతూ.
"ఊ..."
"వెళ్ళానా?"
"ఊ..."
"వెళుతున్నా..."
"ఊ..."
ఊ ఊ అటుందేగానీ ఇటువైపు తిరిగి భర్తవంక చూడనేలేదు.
అతను మెల్లగా దగ్గరకెళ్ళి మంచం మీద కూర్చుని ఆమె భుజం మెడ చేయ్యేశాడు.
"కోపం వచ్చిందా?" ఆమె అతని చేతిని విసిరికొట్టింది.
"జరిగిన దాంట్లో నా తప్పేం వుంది చెప్పు?" అడిగాడు.
ఆమె సమాధానం చెప్పలేదు. అతను లేచి నిలబడ్డాడు.
"సరే! నేను అఫేసు కేలుతున్నా....లేచి తలుపెస్కో."
అతను విధీ గుమ్మం దాటుతుండగా అతనికి ఆమె గదిలో వణికిన సణుగుడు వినిపించింది.
"నాలుగు లక్షల కట్నం పోసి నాన్న కొన్నాడు... ఎందుకూ దండగ?"
అది విన్న రాంపండు మనసు చివుక్కుమంది.
* * * *
రాంపండు ఆఫీసు కెళ్ళాగానే అందరూ మీ మిసెస్ కి బాలేదంట కదా... ఇప్పుడెలా వుంది అని పలకరించారు. ఇప్పుడు ఫరవాలేదు. బానే వుంది అని అందరకీ సమాధానం చెప్పుకొచ్చాడు.
అటెండెన్స్ లో సంతకం చెయ్యడానికి సర్వోత్తమరావు క్యాబిన్ లోకి వెళ్ళాడు రాంపండు.
"గుడ్ మార్నింగ్ సార్!" అన్నాడు సర్వోత్తమరావుతో.
"గుడ్ మార్నింగ్! రావోయ్ రా... ఏంటీ మీ ఆవిడా కేలా వుందీ ఇప్పుడూ?" అడిగాడు అయన.
"బాగానే వుంది సార్."
"మీ అట్టా, మావయ్యా..."
"అట్టా, మావయ్యా కద్సార్... పిన్నీ, చిన్నాన్న!"
"ఆ... అదే అదే... వాళ్ళు వెళ్ళిపోయారా?"
"నిన్న సాయంత్రమే వెళ్ళిపోయారు సార్."
"అది సరేగానీ నువ్వు చెప్పావే అదేదో సునితా అండవాల్స్ రావుగాల్స్ నర్సింగ్ హొం అని... అది నిజంగా వుండా అని? ఎవర్నీ అడిగినా అలంటి వ్యవహారం ఏదీ తెలీదని చెప్తున్నారు!"
అంతే అదెక్కడో చాలా మారుమూల సందుల్లో వుంది సార్ అందుకుని ఎవరికీ ఎక్కువుగా తెలీదు" చేతులు నలుపుకుంటూ చెప్పాడు అతను.
"సరే! నువ్వు అటెండెన్స్ లో సంతకం చేసి నీ సీట్లో వ్యవహారం చూసుకో" అన్నాడు అయన.
రాంపండు అటెండెన్స్ లో సంతకం చేసి క్యాబిన్ బయటికెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు.
పావు గంట తరువాత బ్రహ్మాజీ రాంపండు దగ్గరకి వచ్చాడు.