అతని భుజం తట్టి "ఊర్కో... ఊర్కో..." అన్నాడు సర్వోత్తమరావు.
కేడీరావ్ అయితే సీట్లొంచి లేచి అతన్ని కౌగలించుకుని తనూ కంట తడి పెట్టాడు. నిజానికి వాళ్ళిద్దరూ ఎప్పుడూ దెబ్బలాడుకుని చచ్చేవారు.
"ఇంకెవరు మాట్లాడతారు?" సర్వోత్తమరావు అందరివంకా చూస్తూ అన్నాడు! అందరూ మనసులో బాబోయ్ అనుకున్నారు. వెనుక వరసులో వున్న వాళ్ళయితే సర్వోత్తమరావుకి కనిపించకుండా తలలు బాగా క్రిందకి దించేసికూర్చున్నారు. ముందు వరసలో వాళ్ళయితే సడెన్ గా బుర్రకాయ్ గోక్కుంటూ అతను అన్నది వినిపించనట్టు అటూ ఇటూ దిక్కులు చూడ్డం మొదలు పెట్టారు.
ఇంకా తనని పొగడేవాళ్ళు ఎవరూ లేరని తెలుసుకున్న కేడీరావ్ మైకుని తను అందుకని స్వీచ్ యిచ్చాడు.
"డియర్ ప్రెండ్స్... మీరు నా మీద చూస్తున్న ఈ ప్రేమ ఆప్యాయతల్ని చూస్తుంటే నకు త్రన్స్ ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ చేయించుకుని మీతోనే వుండిపోవాలని వుంది..." బాధగా అందరివంకా చూస్తూ అన్నాడు కేడీరావ్.
"బాబోయ్....అంతపని మాత్రం చేయకు" అంతకంటే బాధగా మనసులో అనుకుంటూ అందరూ కేడీరావ్ వంక దీనంగా చూశారు.
"నాకు ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వచ్చిన రోజు నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు.... అంత బాధ కలిగింది మీ అందర్నీ వదలి పెట్టి వెళ్ళాలంటే..."
"అంతా అబద్దం!.... ఏం నాయనా...అనంతపూర్ మీ సొంత ఊరిని అక్కడికి ట్రాన్స్ ఫర్ కోసం నువ్వే బాగా ప్రయత్నించి పై నుండి రికమెండేషన్లు కొట్టించావుగా?..." కసిగా అరవాలని అనుకున్నాడు బ్రహ్మాజీ.
"అంతా కోతలు!" రాంపండు చెవిలో అన్నాడు బ్రహ్మాజీ.
"ఈ రిలీనింగ్ పార్టీలు ఇలానే వుమ్తాయిలే... నువ్వు బాధపడకు" రాంపండు బ్రహ్మాజీ భుజం తట్టాడు.
కేడీరావ్ స్వీచ్ కొనసాగుతూ వుంది.
రాంపండు మనసు మాత్రం యింటి దగ్గరే వుంది.
* * * *
"ఛఛ... వెధవ పార్టీలు! అన్నీ బోగస్ స్వీచ్ లు!!.... అసలు మనుషులే బోగస్ అయినప్పుడు స్వీచ్ బోగస్ కాకేమవుతాయ్?!" అనుకుంటూ వాచ్ వంక చూశాడు.
ఎనిమిది అయ్యింది.
బాబోయ్!
నడక వేగం పెంచాడు. రాజీతో ఈ వేళ గొడవ తప్పదు... అసలు రాజీ ఏమైనా తిందో లేదో?!
"దబ్!..."
ఓ మొత్తని శరీరంతో డీకొంది రాంపండు శరీరం.
ఉలిక్కిపడి చూశాడు. ఎదురుగ ఎదురుగా బాబ్డ్ హేర్ తో, స్వీవ్ లెస్ బౌజ్ తో ఆమె! ఆ రోజు డ్యాష్ కొట్టినామే!!...
ఆమె హ్యండ్ బ్యాక్ క్రిందపడి వుంది. ఆమె కళ్ళు రాంపండు వంక సీరియస్ గా చూస్తున్నాయ్.
"ఓ... అ అ అ అయాం సారీ..."
కంగారుగా అన్నాడు రాంపండు.
తర్వాత గటుక్కున క్రిందకి వంగి హ్యండ్ బ్యాగ్ తీసి ఆమెకి అందించాడు.
"అడపిల్లలకు డ్యాష్ లు కొట్టడం మె హ్యబీనా?" సీత్రియాస్ గా అంది ఆమె. అలా అంటున్నప్పుడు ఆమె రాంపండు వంక కాకుండా దూరంగా ఉన్న పోలీస్ ఇన్స్ స్పెక్టర్ వంక చూస్తూ అంది.
అతనికి గాబరా పుట్టింది. కొంపదీసి తనని రోడ్ సైడ్ రోమియో అనుకుమ్తుమ్డా ఏమిటి? ఆ ఇన్స్ స్పెక్టర్ పిలిచి కప్లయింట్ యిస్తుందా యిప్పుడు?
"మేడమ్ ....మీరు నన్ను అపార్దం చేసుకుంటున్నారు... నేను ఎంత మంచివాడినో కాలేజీలో మ ప్రిన్స్ పాల్ ఇచ్చిన కాండక్ట్ సర్టిపికేట్ చూస్తే మీకే తెలుస్తుంది. పోనీ మా ఆవిడని అడిగిన తెలుస్తుంది" కంగ్రుగా అన్నాడు.
అతని మాటలకూ ఆమెకి నవ్వొచ్చేసి ఫక్కున నవ్వింది.
"ఇప్పుడే మా ఆఫీసులో ఎవరికో ట్రాన్స్ ఫర్ అయితే రీలిజింగ్ పార్టీ, మితిమ్గూ పెట్టారు. అ పార్టీలోని స్వీచ్ లు విని కాస్త మనసు పాడయి పరధ్యానంగా వస్తూ మిమ్మల్ని చూస్కోక డ్యాష్ కొట్టాను... అంతేకానీ వేరే దురుద్దేశ్యం ఏమీ లేదు."
"ఓ... రిలీవింగ్ పార్టీనా...? అంతేలెండి... అవి అలానే వుంటాయ్!!..." అతనివంక జాలిగా చూస్తూ అంది ఆమె.
"నన్ను నమ్మినందుకు థాంక్యూ మేడమ్!మిమ్మల్నీ డ్యాష్ కొట్టినందుకు సారీ మేడమ్."
"ఇట్సాల్ రైట్."
హై హిల్స్ టకటక లాడించుకుంటూ ముందుకు కదిలింది ఆమె.
"అహ.. ఈమె ఎవరోగానీ... ఈమేని చేస్కేనే వడు అనుకున్నాడు రాంపండు.
* * * *
"వామ్మోయ్!..." గావుకేక పెట్టాడు బ్రహ్మాజీ.
"ఏంటా కేకలు?... ఏం కొంపలు మునిగి?" లోపలి గదిలోంచి అంతకంటే గట్టిగా అరిచింది దుర్గ.
"ప... పాపా... పలు పొంగుతున్నాయ్" వంట గదిలోంచి చెప్పాడు బ్రహ్మాజీ.
"పలు పొంగుతుంటే అరుస్తూ కూర్చున్నార. స్టవ్ మీది నుండి దింపక...మీ గొంతునొక్కా..."
"దింపాలనే అనుకుంటే నా చెయ్యి కాలిందన్నమాట.... అందుకే అరిచ.... బాబోయ్..."
"మళ్ళీ ఎందుకరిచారు.... మళ్ళీ చెయ్యి కాలిందా?"
"కాదు పాలు పొంగిపోతున్నాయ్."
"వెధవ చెయ్యి కాల్తే కాలింది. ఏ ఆయింట్ మెంటైనా పెట్టుకోవచ్చు. ముందు పలు స్టవ్ మీది నుండి దించండి" గావు కేక పెట్టింది దుర్గ.
"అలాగే... అలాగే" పళ్ళు కొరుకుతూ సమాధానం చెప్పి పాలుని స్టవ్ మీది నుండి దింపాడు బ్రహ్మాజీ.
"ఏం? పళ్ళు కొరుకుతూ సమాధానం యిచ్చారా?" గదిలోంచి అరిచింది దుర్గ.
"అబ్బే...లేదే... హహహ.... మాములుగానే సమాధానం యిచనే. పళ్ళు కొరుకుతూ సమాధానం చెప్తేనా పళ్లుంటాయా? నాకామాత్రం తెలీదూ? హహహ...."మేటిమలు విరుస్తూ అన్నాడు బ్రహ్మాజీ
రెండు నిమిషాలు గడిచాయి.
పొగలు కక్కే వేడివేడి కాఫీ దుర్గ దగ్గరకి తీసికేళ్ళాడు బ్రహ్మాజీ.
"తీస్కో దుర్గా! నీ కోసం చిక్కగా, చక్కని కాఫీ కలసి తీసుకొచ్చా" ట్రిని ముందుకు పెడుతూ అన్నాడు అతను.
"ఊ...ఊ...ఈ కాకాలకి తక్కువేం లేదు" కాఫీ కప్పు అందుకుంటూ అంది ఆమె.
"మరి నేను కూడా కాస్త కాఫీ తాగానా?" జాలిగా ముఖం పెట్టి అడిగాడు అతను.
వీల్లేదు! సర్ ర్ ర్ ....మీకీ పూట తిండీ కూడా లడు. నా ఒక్కదానికే వంట చెయ్యిండి....స ర్ ర్ ర్ ..."కాఫీ జుర్రుతూ అంది ఆమె.