Previous Page Next Page 
రెడీమేడ్ మొగుడు పేజి 12

   "అసలు మీ పెళ్ళికి రావాలని అనుకున్నామమ్మా... కానీ సమయానికి ఈయనకి ఊష్టం వచ్చి రాలేకపోయాం" నానాజీ బుగ్గమీద పొడుస్తూ అంది కమలమ్మ.
 
    "మద్యలో నేనేం చేశావే నా బుగ్గమీద పొడుస్తావు? నేనేమైనా కావాలని జ్వరం తెప్పించుకున్నానా?" బుగ్గ రుద్దుకుంటూ అన్నాడు నానాజీ.

    "పదండి... ఇంక లోపలకి పోదాం" అంది కమలమ్మ .

    రాంపండు వాళ్ళ సూట్ కేసులవీ తీసుకుని లోపలకి వెళ్ళాడు. వెనకాలే ముగ్గురూ ఫాలో అయ్యారు.

    లోపల సర్దుతూ వదిలేసి వున్న సూట్ కేసుల్ని నానాజీ చూశాడు.

    "అదేమిటీ...సూట్ కేసులు సర్డుతున్నారు. కొంపదీసి ఏదైనా ఊరెళ్ళాలని అనుకున్నారా ఏంటీ?" రాంపండుని అడిగాడు.

    రాజీ రాంపండుకి సైగ చేసింది. అవును వెళ్తున్నాం అని చెప్పామన్నట్టుగా. కానీ రాంపండు ఆ సైగాల్ని పట్టించుకోలేదు.

    "అవును చిన్నానా... రేపు వెళ్దామని అనుకున్నాం" అన్నాడు.

    "హయ్యో... అలాగా?!మేం నీ దగ్గర వారం పదిరోజులుండి వెళ్దామని అనుకున్నమే... ఇప్పుడెలా?" అంది కమలమ్మ.

    "మీరు అంత దూరం నుండి ఇంతకాలం తర్వాత వస్తే మేం ఊరేలా వెళ్తాం పిన్నీ నువ్వు భలేదానివే... మీరేప్పుడూ  మా యింటికిరారుగా. మేం ఇంకోసారేప్పుడైనా వెళ్తాం."

    రాజీ పళ్ళు పరపరా నూరింది.

   
                                           *    *    *    *
   
    అమ్మాయ్ రాజీ! అమ్మా.... రాజమ్మా..." హాల్లోంచి పిలిచింది కమలమ్మ.

    "ఆ... ఏంటీ?" వంటగదిలోంచి విసుక్కుంటూ అడిగింది రాజీ.

    "నాకు కాస్త హర్లిక్సో, బోర్నవిటానో యివమ్మా! నీరసం, గుండెల్లో దడా వచ్చేస్తుంది" అయాసపడుతూ అంది కమలమ్మ.

    "అలాగే!" గట్టిగా అరుస్తూ అంది రాజీ.

    ఏంట్రా పండూ... కొంపదీసి మీ ఆవిడకి కోపం ఎక్కువ ఏం అల అరుస్తూ సమధానం చెప్తుంది?" అక్కడే కూర్చుని న్యూస్ పేపర్ చదువుతున్నా రాంపండుని అడిగాడు నానాజీ.

    "అంటే... అదీ... మరేమో వంటగదికి యింత దూరంలో వున్నాంకదా! అందుకుని మనకి వినబడ్తుందో లేదోనని అలా గట్టిగా సమాధానం చెప్తుందన్నమాట. అంతేగానీ ఊ ర్కేకోపం ఎందుకోస్తుందీ" అన్నాడు రాంపండు రాజీ మండిపడ్తోందన్న నిజాన్నివాళ్ళు గ్రహిస్తున్నారన్నకంగారుతో.

    అదేంట్రా అలా అంటావు! ఇందాక నేను దగ్గరకెళ్ళి ఏమ్మా స్నానానికి నీళ్ళు కాగాయ అని అడిగాను. ఇంకాస్త నిప్పుల్లా మసిలాక అప్పుడు బాత్రూంలోపెడ్తానులెండి అని గట్టిగా అరిచిందిరా నీ పెళ్ళాం అంత దగ్గరగా వుంటే మరెందుకలా అరిచింది?" కళ్ళేగారేశాడు నానాజీ.

    "అదా? మరేమో తనకి కూడా పిన్నిలా కాస్త గుండెదడా ,ఆయాసం అన్నమాట... అందుకని గారాభంగా వుంది ఎవరైనా కాస్త ప్రశ్నలు వేస్తె తిక్కతిక్కగా వుంటుందన్నమాట" అన్నాడు రాంపండు.

    అప్పుడే కమలమ్మ కోసం హార్లిక్స్ తెచ్చిన రాజీ రాంపండుకేసి కొరకొరాచూసి హార్లిక్స్ కప్పు  ముసలమ్మకి యిచ్చి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయింది.

    "అయినా యీ పెళ్లాలికి యిలా కూసింత ఆయాసం, గుండెదడా వుండడమే మంచిదిలెద్దూ... మా ఆవిడని చూడు, గుండెదడా, ఆయాసం వున్నా నేను భరించలేకపోతున్నా. అదే పూర్తీ ఆరోగ్యంగా వుంటే యింకేన్నిఆగడాలు చేస్తుందో?"

    "ఊ...ఊ..." అంది కమలమ్మ కప్పులోకి హార్లిక్స్ సర్రుసర్రున జుర్రుతూ నానాజీని కోరగా చూస్తూ.
    ఈ సంబాషణ లోపల్నుండి నిన్న రాజీకి భగ్గున మండింది.

    ఊరు ప్రయాణం కాన్సిల్ చేయించిందే కాకుండా వరం రోజు ల్నుండీ అవి కావాలీ, ఇవి క్వాలీ అని అడిగి నడ్డి విరిగేలా చేయించుకుని ముప్పుటులా మింగుతూ పైగా వెధవ కామెంట్స్ ఒకటి.

    కసిగా చేతిలోని స్టీలు పళ్ళాన్ని నేలకేసి 'ఠంగ్' మని గట్టిగా కొట్టింది.

    ఆ శబ్దానికి హాల్లోని ముగ్గురూ వంటగదిలోకి పరుగెత్తుకు వచ్చారు.
 
    "ఏంటయ్యా ఏమైంది?" అని అడిగాడు నానాజీ.

    రాంపండు నేలమీద ఘోరంగా సొట్టబోయిన స్టీలు పళ్ళాన్ని చూశాడు. రాజీ ముఖం చూశాడు_పరిస్థితి అర్ధం అయిపోయింది.

    "అంటే... మరేమో... రాజీ చేతిలోంచి పళ్ళెంజారిపడిపోయినట్టుంది....అదన్నమాట" అన్నాడు రాంపండు.

    అదేంట్రా అబ్బాయ్... ఎక్కడైనా చేతిలోంచి పళ్ళెం జారిపడితే అంత ఘోరంగా సొట్టలు పడ్తాయా?" బుగ్గలు నొక్కుకుంటూ అడిగింది. కమలమ్మ.

    "అంటే ఇక్కడ పట్నంలో పళ్ళాలు మరీ రేకుల్ల చేస్తారు పిన్నీ! క్రిందపడ్డం ఏంటీ ముట్టుకుంటే కూడా సొట్టలు పడిపోతాయ్."

    "నువ్వు చెప్పింది చలా విడ్డూరంగా వుందిరా అబ్బాయ్."

    వాళ్ళ సంభాషణతో తనకో సంభంధం లేనట్టు వంట చేసుకుంటూ వుంది రాజీ.

    కమలమ్మ, రాంపండూ బయటకి వెళ్ళిపోయారుగానీ  నానాజీ అక్కడే వుండిపోయాడు.

    "అమ్మాయ్ రాజీ!" అన్నాడు మెల్లగా.

    "ఆ..." వెనక్కి తిరక్కుండానే పలికింది రాజీ.

    "ఏం వండుతున్నావు?"

    "ఇందాక ఆర్డర్ వేశారుగా చికెన్ కూర చెయ్యమనీ... అదే వండుతున్నా."

    "కాస్తా నూనె ఎక్కువేసి ఎర్రగా వేయించమ్మా. అలాగైతే నాకు యిష్టం."

    "అలాగే..."

    "త్వరగా చెయ్ తల్లీ! కాస్త టిని బయటకెళ్ళి బోల్టు స్థలా చూడాలి కదా మరి" అనేసి వెళ్ళిపోయాడు నానాజీ.

    ఈసారి ఓ గరిటె నెలకి 'ఠపాల్' మని కొట్టుకుంది.

   
                                           *    *    *    *
   
    అందరి భోజనాలూ అమ్మాయ్.

    "ఈ రోజు మమ్మల్ని ఎక్కడికి తీస్కేళుతున్నావ్ రా అబ్బాయ్ కిళ్ళీ నోట్లో పెట్టుకుంటూ అడిగాడు నానాజీ.

    "మీకు చూపించల్సివన్నీ చూపించేశాను చిన్నాన్నా! మ్యూజియం పార్కులూ, గుళ్ళూ, బిర్లా ప్లానేటోరియం, గోల్కొండ కోటా, గండిపేట,చార్మినార్ అన్నీ చూపిమ్చేశాను. ఇంకా చూడ్డానికి ఏమీ లేవు. ఈ కాస్తా రెస్టు తీసుకోండి" అన్నాడు రాంపండు.

    "అదేంట్రా అబ్బాయ్! ఇంత పెద్ద సిటీలో ఇంకేమీలేవని అంటావ్... ఏమ్మాయ్! ఇంకేమీలేవా?" రాజీని అడిగింది కమలమ్మ.

    "ఆ! ఈ ప్రక్కనే ఓ స్మశానం వుంది" అంది ఆమె.

    "అదేంటమ్మా! మరి స్మశానానికి వెళ్ళమంటావు?" మొహం ముడుచుకుంటూ అన్నాడు నానాజీ.
    "మరేంలేదు చిన్నాన్నా! అది మామూలు స్మశానం కాదు.... నిజాం నవాబులందర్నీ అక్కడే పాతిపెట్టారన్న మాట? చాలా ఫేమస్. అందుకని అలా చెప్పింది" కంగారుగా అన్నాడు రాంపండు.

    "ఓ... అలాగా? అలాగైతే తప్పకుండా చూడాల్సిందే!"

    అబ్బే! అది మనం చూడ్డానికి కుదర్డు... కేవలం ముస్లిమ్స్ నే లోపలకి పంపిస్తారు."

    "అయ్యో! అంత మంచి స్మశానం చూళ్ళేకపోతున్నామే" బాధగా అంది కమలమ్మ.

    ఇంతలో డోర్ బెల్ మోగింది.

    రాంపండు బయటకెళ్ళి తలుపు తీశాడు.

    ఎదురుగా సర్వోత్తమరావు!

    "కేవ్ వ్ వ్ " అని అరిచాడు రాంపండు.

 Previous Page Next Page