Previous Page Next Page 
చీకటికి అవతల పేజి 13


    తనకు విద్య నేర్పించిన గురువుగారి భార్య అంత దీనంగా అర్ధిస్తుంటే ఆదినారాయణ కరిగిపోయాడు. గురువుగారి భార్యకు ఏ కష్టం రాకుండా వుండాలంటే తను ఆమె బాధ్యతంతా తీసుకోవాలి అని నిర్ణయించుకుని, ఆమె కోసం సకల ఏర్పాట్లు పూర్తి చేశాడు.

 

    అలా నిర్మల అత్తగారి వూరొదిలి ఆదినారాయణ వూరికి షిప్టు అయిపోయింది. ఆమె వచ్చింది మొదలు రాఘవులు ఆమెపైన కన్నువేశాడు.

 

    ఆమె చూపు తనమీద ఎప్పుడు పడుతుందా అని ఉదయం నుంచి రాత్రయ్యే వరకు ఆమె ఇంటి ముందు పడిగాపులు కాసేవాడు. ఆమె వక్షస్థలం మీద నుంచి పైట ఎప్పుడు జారుతుందా అని కనుగుడ్లు ఆర్పేవాడు కాదు. ఏదయినా పనీ పాటా చేసేటప్పుడు ఆమె చీర కుచ్చిళ్ళను ఎత్తి ఎప్పుడు బొడ్లో దోపుకుంటుందా అని ఎదురుచూసేవాడు. కానీ నిర్మల అతనివైపు కన్నెత్తి చూసేది కాదు. పన్నెత్తి మాట్లాడేదికాదు. ఎదురుగ్గా అతను వున్నట్టే ఫీలయ్యేది కాదు.

 

    ఆమె ఒంటరిదని  తెలియడంతోనే యువకుల దగ్గర్నుంచి వృద్ధుల వరకు ఆమె ఇంటిముందు నిట్రాయిలై పోయారు.

 

    కాని నిర్మల మాత్రం ఆదినారాయణతో తప్ప మరొకరితో మాట్లాడేది కాదు. అయినా ఇతరులు వదల్లేదు. ఏదో ఒక విధంగా ఆమెకి దగ్గరవ్వడానికి ప్రయత్నించేవారు. కూర నారాయణ అయితే మరీ పేట్రేగిపోయేవాడు. అతను పొట్టేలు మాంసం అమ్మి, ఆ వచ్చిన లాభంతో పొట్టపోసుకునేవాడు. ఆదివారంనాడో, పండగ రోజుల్లోనో మాంసం కావాలంటే నారాయణ దగ్గరకు వెళ్ళాల్సిందే. పొట్టేలు కోసిన రోజున ఆమెను మెత్తని ముక్కలు ఏరి ఎవరికయినా ఇచ్చి "నిర్మలకి ఇచ్చేయ్" అని పురమాయించేవాడు.

 

    ఆమె తీసుకునేది కాదు. అది తీసుకుంటే అతనికి లొంగిపోయినట్టే. మగవాళ్ళు ఒంటరి ఆడపిల్లకు వూరకనే సహాయం చేయరు.

 

    ఆమె మాంసం తీసుకోవడానికి నిరాకరించినా నారాయణ మాత్రం పట్టువదలడం లేదు.ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పొద్దుపోయేవరకు కాకుల్లా తనను పొడుచుకు తింటున్న ఊరి మగాళ్ళ బారినుంచి తప్పించుకోవాలంటే ఆమెకి ఓ మంచి ఉపాయం తట్టింది.

 

    ఆ రోజు పౌర్ణమి. ఆకాశంలో నిండు చంద్రుడు దొర్లుకుంటూ పోతున్నాడు.

 

    రాత్రి పదయిందేమో ఊరిజనం దుప్పట్లలో దూరడానికి సిద్ధపడి పోతున్నారు.

 

    "రాత్రి పదిగంటలప్పుడు ఓసారి వచ్చిపో" అని నిర్మల సాయం కాలం చెప్పడంతో ఆదినారాయణ భోజనం ముగించాక నిర్మల యింటికి వచ్చాడు.

 

    అది చిన్న మిద్దె ఇల్లు. అందులో అంతకు ముందున్న ఓ ఆచారి బెంగుళూరుకు వెళ్లిపోవడంతో దాన్ని నిర్మల కొనుక్కుంది.

 

    "డాబా మీదకు వెళదాం రా" అని నిర్మల మరో మాటకి తావివ్వకుండా మెట్లెక్కింది.

 

    ఆదినారాయణ ఆమెను అనుసరించాడు.

 

    ఆమె ఓ దగ్గర పిట్టగోడకు ఆనుకుంది.

 

    "భరించలేకుండా వున్నాను ఈ గోల. ఒంటరిగా ఆడది బతకటం ఎంత కష్టమో తెలుస్తోంది" అని ప్రారంభించి ఎవరెవరు ఎలా ప్రయత్నాలు చేస్తున్నారో వివరించి చెప్పింది.

 

    అతను మాత్రం ఏం చేయగలడు?

 

    ఒకరా? ఇద్దరా? పంచెకట్టిన ప్రతి మగాడూ చొంగ కార్చుకుంటూ వుండడమే.

 

    "అందుకే నేనో నిర్ణయం తీసుకున్నాను" అని అతని ముందుకొచ్చింది.

 

    ఆ నిర్ణయం ఏమిటో అతడు అడగలేకపోయాడు.

 

    అప్పటికే ఆమె నుంచి వస్తున్న ఫేస్ పౌడర్ వాసన అతన్ని ముంచెత్తుతోంది. ఆమె అందం, యవ్వనం తనను చుట్టేస్తున్నట్టుంది.

 

    "ఆ నిర్ణయం ఏమిటో తెలుసా? నీతో స్నేహం కొనసాగిస్తాను. ఇక అప్పుడు ఈ వెధవల పీడ వుండదు. అప్పుడు నేనూ ఓ మగతోడున్న ఆడదాన్ని అయిపోతా" అని అతని భుజం మీద చేతులు వేసింది.

 

    అప్పటికే అతను పట్టుతప్పిపోయాడు. నరాలు చిట్లడం, రక్తం పరుగులు తీయడం, గుండె వేగంగా కొట్టుకోవడం తెలుస్తూనే వుంది.

 

    అంతకు ముందు అతను స్త్రీ స్పర్శ ఎరుగడు. అందుకే ఆమె మొదట చేతులు వేసినా అతను అదే మోతాదులో రియాక్ట్ కాలేదు. అదంతా అతని అనుభవరాహిత్యమేనని ఆమెకి తెలుసు.

 

    అందుకే "నీకేమీ ప్రవేశం లేదనుకుంటా. మావారు నీకు బొమ్మలు చెక్కడం నేర్పిస్తే- బొమ్మల్లాంటి ఆడపిల్లల్ని ఎలా సుఖపెట్టాలో నేను నేర్పిస్తా" అని చేతుల్ని తీసుకుని తన భుజాలమీద వేసుకుంది.

 

    వెన్నెలకన్నా ఆమె నవ్వే ప్రకాశవంతంగా వున్నట్టు అతను గుర్తించాడు.

 

    అతను ఎంతకీ చేతుల్ని అక్కణ్నుంచి జార్చకుంటే ఆమే చాలా లాఘవంగా కదిలింది. ఆమె ఎంతగా కదిలిందంటే అతని చేతులు పట్టు తప్పి కిందకు జారి ఏదో ఎత్తయిన అందాలు అడ్డు తగలడంతో ఆగాయి.

 

    ఆమె మత్తుగా నవ్వింది. బహుశా అలాంటి నవ్వుల్ని నీళ్ళుగా పోస్తేనే పారిజాతాలు విచ్చుకుంటాయేమోనని అతనికి అనిపించింది.

 

    ఆమె తమకం పట్టలేక మునికాళ్ళమీద ఓ అంగుళం పైకి లేచి అతని పెదవుల్ని అందుకుంది.

 

    పనసపళ్ళు, అరటిపళ్ళు, బంగిలిపల్లి మామిడిపళ్ళు, ద్రాక్ష- వీటన్నిటినీ కలిపితే కూడా అంత తియ్యగా వుండవని ఆమె పెదవుల రుచి తెలిశాక అతనికి అనిపించింది.

 

    ఆమె మరోసారి కదిలింది.

 

    అతని చేతులు ఒక్కసారిగా కిందకు జారి ఆమె నడుం మడతల మధ్య చిక్కుకుపోయాయి. సెక్సీతనాన్నంతా పూర్ణంగా అక్కడ కూరినట్టు ఆమె నడుం మడతలు కజ్జికాయల్లా అనిపించాయి అతనికి.

 

    ఇక అతని చేతులు కదలడానికి ఆమె ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేకపోయింది.

 

    బొమ్మలు చెక్కే వేళ్ళు అవి.

 

    ఏ అవయవం ఎక్కడ వంపులు పోతుందో తెలిసిన చేతులు కనుక అతని పట్టు ఆమెకి రక్తం జిలకొట్టినట్టు అయిపోతోంది.

 

    అతని చేతులు మరింత కిందకు దిగుతుంటే ఆమె సుతారంగా వారించింది. కానీ అతను తన పట్టు వదలడంలేదు ఏవో అందాలను వెదుకుతున్నట్టు అతని చేతులు కదులుతున్నాయి. ఆమె అతని బరువుకి తాళలేనట్టు కిందకు ఒరిగిపోయింది.

 

    చంద్రుడు మరీ నిస్సిగ్గుగా ఆకాశం మధ్యలో ప్రకాశిస్తున్నాడు. కాలం వాళ్ళిద్దరి మధ్యా పడి నలిగిపోతున్నట్టు వాళ్ళిద్దరికీ టైమ్ తెలియడం లేదు.

 

    మరో అరగంటకి కాబోలు కాలం మళ్ళీ తన కాళ్ళను తగిలించుకొని నడవడం మొదలుపెట్టింది.

 

    అలా నిర్మల ఆదినారాయణకు చిక్కడంతో అందరూ నిరాశకు గురయ్యారు. ఇక లాభం లేదనుకుని వాళ్ళింటి ముందు గుమిగూడడం ఆపేశారు. నారాయణ కూడా మాంసం కూర పంపించడం లేదు.

 

    పాతికేళ్ళు కూడా లేని పిల్లవెధవకి నిర్మల ఎలా పడిపోయిందో అర్థంకాక రాఘవులు తల బాదుకున్నాడు. అందరిలా అతను నిర్మలమీది కోరిక చంపుకోలేకపోయాడు.

 

    మరో రెండు సంవత్సరాలకి ఆదినారాయణకు పెళ్ళయింది. ఇక ఆదినారాయణ నిర్మలను వదిలేస్తాడని, ఇకనయినా ఆ ఛాన్స్ తను కొట్టెయ్యాలని రాఘవులు ఆశలు పెంచుకుంటున్నాడు.

 

    ఆరోజుకి ఆదినారాయణకి పెళ్ళయి పదహారురోజులయింది. బంధువులంతా వెళ్ళిపోయారు.

 

    పెళ్ళి కుదిరినప్పట్నుంచి, ఇంతవరకు అతని నిర్మల గడప తొక్కలేదని రాఘవులుకి తెలుసు.

 Previous Page Next Page