Previous Page Next Page 
రెడీమేడ్ మొగుడు పేజి 11

    ఆమె వెళ్ళిన దిక్కుకే చూస్తూ "ఎంత అందంగా వుంది!!" అనుకున్నాడు రాంపండు.

   
                                         *    *    *    *
   
    రాంపండు, రాజీ ఇద్దరూ యింట్లో అటూ ఇటూ హడావిడిగా తిరిగుతున్నారు.

    రాజీ మొహంలో పట్టరాని అనందం.

    "రాజీ...." సూట్ కేస్ సర్డుతున్నా రాంపండు గావుకేక పెట్టాడు.

     మాములుగా అయితే రాంపండు అంత గావుకేక పెడితే రాజీ చచ్చేంత విసుక్కునేది.... కానీ ఇప్పుడు మాత్రం ఆమె మనసు అనందంతో తేలిపోతూ వుండడంచేత ఆ అరుపు కూడా చలా సౌమ్యంగా పిలిచినట్లు అనిపించింది.
    "ఏంటి పండూ?" అతని దగ్గరకొచ్చి అడిగింది.

    "బిరువాలోంచి మొన్నీ మధ్య కొనుక్కున్నానే.... ఆ బల్క్ షర్ట్ తీసుకురా.... సూట్ కేస్ లో సర్దుతా."
 
    "అలాగే... కానీ నువ్వు కూడా నా కిష్టమైన చీరలు నీ సూట్ కేస్ లో సర్దుకోవాలి!"
 
    "ఏవీ.... ఆ మేజంతా చందేరి చీరా,హాప్ వైట్ బెంగాల్ కాటన్ శారీ, రెడ్ షిఫాన్ శారీ... ఇవేనా?" అడిగింది ఆమె.
 
    "ఊ.... వాటితోపాటు ఆ రస్ట్ కలర్ ప్రింటేడ్ శారీ, రాజస్థానీ కోటా శారీ కూడా తెచ్చుకో" అన్నాడతను.

    "అలాగే" మోకాళ్ళ మీద కూర్చుని రాంపండు బుగ్గమీద ముద్దు  పెట్టుకుంది ఆమె.

    "పండూ... నేనంటే నీ కిష్టమేనా?"

    "ఎందుకిష్టం లేదూ భలేదానివే.... నున్ను సంతోషపెట్టాలనే ఎప్పుడూ ప్రయత్నిస్తా కానీ ఎప్పుడూ అనుకొని పనులు తగుల్తాయ్... ఏం చేయ్యను."

    "లోకంలో మీ ఒక్కరికే అనుకోకుండా పనులు తగుల్తుంటాయి అందరూ వల్ల పెళ్ళాలని ఎక్కడికీ తీసుకెళ్ళడం లేదా?" బుంగా మూతి పెట్టిందామె.

    ఇలా మాట్లాడుతూ వుంటే మెల్లగా పరిస్థితి విషమించినా విషమించోచ్చని అతను అనుకున్నాడు.

    "సర్లే... సర్లే! నో ఆర్గ్యూమెంట్స్.... అందుకే కదా నిన్నిప్పుడూ మైసూర్, బెంగుళూర్, ఊటీ అన్నిచోట్లకి తీసుకేళుతున్నా?" అన్నాడు కంగారుగా.

    "మా మంచి పండు..." అతని బుగ్గ మెడ ముద్దు పెట్టింది ఆమె "సరేగానీ నువ్వు ఎన్ని రోజులు లీవ్ పెట్టావసలు?"

    "నాలుగు రోజులు శలవు పెట్టాను. వాటిల్లో రెండ్రోజులు అయిపోయాయ్."

    "హయ్యో మరెలా? అయితే రెండు రోజులూ, ప్లస్ ఆదివారం కలుపుకుని మూడు రోజుల్లో మొత్తం తిరిగి వచ్చేయ్యాలనా?" మొహం చిట్లించి అంది ఆమె.

    "చాల్లే... మూడు రోజులు ఎలా సరిపోతాయ్. మరో వారం రోజులకి ఆఫీసుకి శలవు చీటీ బ్రహ్మాజీ తో పంపిస్తాను." ఆమె బుగ్గగిల్లుకూ అన్నాడతను.

    "ఓహొ...! హొ స్వీట్..." సంతోషంతో చప్పట్లు కొట్టిందామె. "అవునుగానీ రేపటికి మనకి టిక్కెట్లు దొరుకుతాయా?"

    "ఇప్పుడేం హాలిడేస్ సీజన్ కాదు కదా... ఈజీగానే దొరుకుతాయి అయినా రిజర్వేషన్స్ సూపర్ వైజర్ నాకు తెలుసు....ఎలాగోలా సంపాదిస్తాను కదా.""ఇమాటకి రేపు ట్రైన్ లో తినడానికి ఏం చేయమంటారా?"

    ప్రేమగా అతని తల నిమురుతూ అడిగింది ఆమె.

    ప్రయాణమప్పుడు అంత హెవీ పుడ్ ఎందుకులే.... ఏదైనా లైట్ గా చేయి చాలు... సరేగానీ నా షర్ట్ ళు తెస్తే నా సూట్ కేస్ సర్దుకోడం పూర్తయిపోతుంది."

    "ఆ రెండు షర్టులే కదా... నేను సర్డుతాలెండి... మీరెళ్ళి టిక్కెట్స్ కొనుక్కుని రండి.

    అతను లేచాడు.

    "సరే... నేను వెళ్ళొస్తా.... ఈ లోగా నీ సూట్ కేస్ కూడా సర్దేసుకో..."

    రాజీతో చెప్పి గదిలోంచి బయటకి వెళ్ళాడతను.

    రాజీ లేచి బీరువాలోంచి రాంపండు షర్టులు తీసింది.

    వాటిని సూట్ కేస్ లో వేసిసర్డుతుండగా పెద్దగా కేక... బయట హాల్లోంచి.

    అది రాంపండు పెట్టిన కేక!

    రాజీ ఒక్కసారిగా వులిక్కిపడింది. ఆయనెందుకలా అరిచారు? ఏం ప్రమాదం ముంచుకొచ్చింది?? కరెంట్ షాకా? లేకపోతే కలు జారి పడ్డారా?

    అదిరే గుండెల్ని చేత్తో పట్టుకుని భయంతో బయటకి పరుగు తీసింది రాజీ.

    బయట హాల్లోని దృశ్యం చూసి రాజీ కూడా మొదట దిగ్బాంతి చెంది తర్వాత భయంకరంగా కేక పెట్టింది.

    రాంపండు కేకకే నిశ్చష్టులై నిలబడిపోయిన అతని చిన్నాన్నలమ్మయితేడబ్బున నేలమీద పడి మూర్చపోయింది.

    "బాబోయ్... నా పెళ్ళాన్ని చంపెశారర్రోయ్ మీ కసలు మంద."

    కమలమ్మ ప్రక్కన మోకాళ్ళ మీద కూర్చుని లబ్బున మొత్తుకున్నాడు నానాజీ.

    రాంపండు కంగారుగా ముందుకు వంగి కమలమ్మ ముక్కు దగ్గర వేలుపెట్టి చూసి "ఊపిరి అడ్తుంది... వట్టి మూర్చే" అని గబగబా లొపలకి పరుగుతీసి చెంబుతో నీళ్ళు తెచ్చాడు.

    రాజీ ఇంకా శిలాప్రతిమలా నిలబడే వుంది.

    నానాజీ రాంపండు చేతిలోంచి చెంబందుకని కమలమ్మ ముఖం మీద నీళ్ళు చల్లాడు.

    ఆమె మెల్లగా కళ్ళు తెరిచి గదిలోని ముగ్గుర్నీ కళ్ళు మిటకరించి చూసి ముక్కుతూ మూల్గుతూ మెల్లగా లేచి కూర్చుంది.

    "ఎందుకు బాబూ అలా అరిచే అలవాటు అలవాట్లు ఎవరికైనా వుంటాయా పిన్నీ!" అన్నాడు రాంపండు.

    "మరెందుకు బాబూ అంత చేతున అరిచావు?" నానాజీ అడిగాడు

    "సంతోషం... మీ యిద్దర్నీ యిన్ని సంవత్సరాల తర్వాత చూసిన సంతోషం పట్టలేక అల అరిచానన్నమాట! అంతే చిన్నాన్నా హిహిహి"అన్నాడు బలవంతంగా నవ్వుతూ.

    "ఆ మాయి మీ ఆవిడే కదూ?" అడిగాడు నానాజీ.

    అవునన్నట్టు బుర్రకాయ వూపాడు రాంపండు.

    "మరి ఆ అమ్మాయి ఎందుకు అరిచింది?"

    "ఎందుకేమిటి? నా ఆనందమే మా ఆవిడా అనందం కూడానూ... కాదు రాజీ?" రాజీ వంక చూసి అడిగాడు.

    "ఆ....ఊ...ఆ..?" అయోమయంగా అంది రాజీ.

    "చూశావా... నే చెప్పలా మనమంటే పండుగాడికి చాలా అభిమానమనీ?" భార్యతో అన్నాడు నానాజీ సంబరంగా.

    "నిజమేనండోయ్.... మీరు చెప్పింది కరకట్టే!" సంబరంగా అంది కమలమ్మ లేచి నిల్చుంటూ.

    "రాజీ... ఇలారా...." అన్నాడు రాంపండు.

    రాజీ నిస్సత్తువగా దగ్గరకొచ్చింది.

    "ఈయన మా చిన్నాన్నగారు,ఆవిడా మా పిన్ని..." పరిచయం చేశాడు. రాజీ వాళ్ళిద్దరకీ నమస్కారం చేసింది.

 Previous Page Next Page