అమ్మకి నామీద నిజంగా ప్రేమవుంటే నేననుకున్న పదినిమిషాలలో అమ్మ రావాలి అనుకున్నాను. అనుకున్న పదినిమిషాలలోనే సరీగ్గా వచ్చావ్! ఆశ్చర్యంగా వుండదేమిటీ? ఉత్తరం పత్తరం లేకుండా నువ్వు రావటం....?" అంటూ సీతమ్మ చేతిలో సంచి అందుకుంది శృతి.
"అలా ఎందుకనుకున్నావ్?"
"మరి లేకపోతే ఊరికెళ్ళి ఇన్నాళ్ళుండటమా! తూచక చచ్చిపోతున్నాను. నువ్వు లేకుండా నేనుండలేమ్మా?" తల్లి దగ్గరగారాంపోయింది శృతి.
"ఎల్లకాలం నేనే వుంటానా? పెళ్ళయిందంటే అత్తవారిల్లే శరణ్యం. ఆడపిల్ల తల్లినెప్పుడూ అంటిపెట్టుకు వుండడం కుదరదు. అన్నట్లు మన వెంకటాచలపతి ఓ సంబంధం చెప్పాడు. పిల్లాడు బ్యాంకిలో ఉద్యోగం చేస్తున్నాడుట. వాళ్ళకి...."
"అబ్బబ్బ ఇంట్లో అడుగు పెట్టావో లేదో అప్పుడే పెళ్ళి సంబంధాల గోల. ముందు నువ్వెళ్ళి కాళ్ళుకడుక్కురా. కాఫీ కలిపిస్తాను ఈలోపు." అంటూ శృతి వంటింట్లోకి నడిచింది.
"హ్హూ...." అని ఓ నిట్టూర్పు విడిచి సీతమ్మ బాత్ రూమ్ వైపు బయలు దేరింది.
"అమ్మొచ్బింది. ఇహ రాత్రింబవళ్ళు దేముడుఆ మీదుండాదాల్సిందే. ఎలా ?" అనుకుంటూ శృతి కాఫీ కలప.
సీతమ్మకి కామా పులిస్టాపులు లేకుండా మాట్లాడటం అలవాటు. నిద్రపోయేటప్పుడు మాత్రమే మాట్లాడదు. కానీ, నిద్ర మధ్యలో లేచి "లైట్లన్నీ ఆర్పారా? పెరటివేపు తలుపు జాగ్రత్తగా వేశావా?" అని ఏదో ఒకటి అడుగుతుంది.
"సిద్దూ లేడటే శృతీ?" బాత్ రూమ్ కెళ్ళి కాళ్ళు కడుకొచ్చి అడిగింది సీతమ్మ.
"నైట్ డ్యూటీ అమ్మా! ఈ వారమంతా అన్నయ్య చేస్తూనే వున్నాడు. ఒక్కరోజూ రెస్ట్ లేదనుకో!"
"రాజు మెతక అయితే ప్రజలకి మొట్టికాయలేయడం సరదాట. అలాగా వీడు శ్రద్దగా డ్యూటీ చేస్తుంటే అంతా శలవులుపెట్టి చెక్కేస్తుంటారు. నేను ఊరికేళుతూ వీడికేం చెప్పాను! శృతి ఒక్కతే ఇంట్లో వుంటుంది. నేను వూరినుంచి వచ్చేదాకా శలవుపెట్టి ఇంటిపట్టునుండమన్నానా? చెప్పిన మాట వినేవాడైతే ఇకనే? నా చాద స్తంగాని.....?"
శృతి నెమ్మదిగా నవ్వింది. "ముందు కాఫీ తాగమ్మా! చల్లారి పోతుంది. అన్నయ్య రాగానే సాదిద్దువుగాని" అంది.
సీతమ్మ కాఫీ గ్లాసుందుకుని ఓ గుక్క తాగి గ్లాసు కింద పెట్టి "నేను ఊరికెళ్ళేరోజు సుబ్బమ్మగారి రాధకు పెళ్ళి సంబంధం వచ్చింది. ఏమయిందే శృతీ!" అంది.
"నాకు తెలీదమ్మా!"
"సింగమ్మ కూతురు అనూరధకి నెప్పులొస్తుంటే నర్సమ్మని పిలిపించారు. అప్పుడే నా ప్రయాణమూను ఇంతకీ అనూరాధ ప్రసవించిండా? సుఖ ప్రసవమేనా? కాన్పుకష్టమయిందా?
"సుఖంగా పండంటి పాపాయిని కంది ముందు కాఫీతాగు."
"కడుపుతో ఉన్నమ్మ కనక మానుతుందా అని.... అంతానా ఆదుర్దాగాని, మనసు మనసులో లేదనుకో." ఓ నిట్టూర్పు విడిచి చల్లారిన కాఫీ రెండు గుక్కల్లో తగింది సీతమ్మ.
సీతమ్మ పూర్తి అమాయకురాలా అంటే కాదనే చెప్పాలి. తెలిసిన అందరి సంగతి తనకే కావాలి. ఎవరికో నెప్పులు వస్తే ఈవిడ ఇక్కడ నెప్పులుపడటం, ఇతరుల కష్టాలు తనవే అన్నట్టు లేనిపోని కష్టాలు నెత్తినేసుకోటం, జానితో ఒక్కోసారి పొగడ్తలు, తేగడ్తలు పొందటం అలవాటే. తల్లి విషయం బాగా తెలిసిన శృతి నవ్వి ఊరుకుంటుంది.
"రాధ చంటాడికి నేను ఊరెళ్ళేటప్పుడు భేదులవు తున్నాయ్." సీతమ్మకి అడ్డు తగిలింది శృతి.
"అమ్మా! నీవు ఒక్కొక్కటీ గుర్తు తెచ్చుకు అడగటం, నేచెప్పటం పరమ బోర్ గావుంది! నేచెప్పటం పరమ బోర్ గావుంది! నేనే వరసపెట్టి చెపుతాపట్టు చెపుతాపట్టు. వెనకింటి కృష్ణవేణమ్మ మొగుడుతో పోట్లాడిపుట్టింటికెళ్ళింది. ఎదురింటి కామాక్షమ్మ మాతిదగ్గర కాలుజారిపడి మంచ మెక్కింది. జానకమ్మగారి పిల్లి రెండో కాన్పులో నాలుగు పిల్లల్ని పెట్టింది......మరి...."
సీతమ్మ చీరకొంగు నోటికడ్డం పెట్టుకొని నవ్వాపుకుంది.
"పిల్లి, పిల్లిపిల్లలని పెట్టక కుక్కపిల్లలని పెడుతుందిటే శృతీ, చదవేస్తే వున్న మతిపోయిందని, అలా వుంది నీవరస. అన్నట్లు మన అటకమీద....." అంటూ సీతమ్మ తల పైకెత్తి అటక చూస్తూ ఆగిపోయింది.
శృతి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినట్లయింది. రెండు గుటకలు మింగి "అటక.....బాగానే వుందిగా. ఈ మధ్య శుభ్రంగా తుడిచాను కూడా" ఏవరో తరుముకోస్తునట్టు అంది.
"ఇప్పుడు నిన్ను తుడవలేదన్నానటే! అటకమీద సుబ్బమ్మగారి డేకిసా వుండాలి. నేను వెళ్ళేటప్పుడు వాళ్ళ కిమ్మని చెప్పాను! ఇచ్చావో లేదో అని......
"ఓ అదా! డేకిసానా, పిండి వడియాలకి దాంట్లో పిండి వుడికించాం!"
"ఆ...అదే."
"నువ్వటు వెళ్ళగానే ఇచ్చాను" అంది శృతి. గుండె మీద చెయ్యేసుకోలేదు గాని "అమ్మయ్య" అనుకుంది పెద్ద ఆపద తప్పిపోయినట్లు.
సీతమ్మకామా పుల్ ష్టాపులు లేకుండా ఇంకా ఆ వీధిలో తెలిసున్న వాళ్ళ క్షేమసమాచారాలు అడుగుతూనే వుంది. శృతి జవాబిస్తున్నదిగాని మనసంతా అటక మీదే వుంది.
"మురారిదేముడు ఏ దేముణ్ణి తల్చుకుంటున్నాడో పాపం" అనుకుంది శృతి.
8
"స్నేహితురాలింటికెళ్ళోస్తా"నని చెప్పింది తల్లితో కాని శృతి బైలుదేరింది మాత్రం మురారిదేముడికి మెడిసిన్స్ తేవటానికి బజారుకి.
శృతి ముందుగా ఓ స్నేహితురాలింటికెళ్ళి కాసేపు కూర్చుంది. తర్వాత అటునుంచి బజారుకెళ్ళి మెడికల్ షాపులో కావాల్సినావన్నీ కొంది. సంచి అడుగున కాటను ఫ్యాకెట్, గాజు గుడ్డ మాత్రలు పెట్టి పైన ఇంట్లోకి కావాల్సిన సరుకుల పొట్లాలు వుంచి ఇంటికి బయలుదేరింది. దారి పొడుగునా మురారిదేముడి ఆలోచనలే.
"అమ్మ వచ్చింది. పగలంతా అటకమీద వుండాల్సిందే. అతనెలా వుంటాడోగాని ఆ దేముడికే తెలియాలి. ఇప్పుడు నాలుగున్నరయింది. ఈ సరికి మూడుసార్లు కాఫీ, ఓసారి భోజనం కానిచ్చేవాడు. రాత్రి వంట్లో బాగుండలేదని భోం చేయలేదు. ఉదయం తనకి మాట్లాడటానికి వీలులేకపోయింది. కళ్ళుమూసుకుని కొంగజపం చేస్తూ నడిమంచంమీద కూర్చుని వుంటే స్టూలుమీద శబ్దంచేస్తూ కాఫీ కప్పు వుంచి ఇవతలికి వచ్చేసింది.......
"ఏమ్మా రిక్షాకడ్డం వస్తావ్? కనపడటంలా?" రిక్షా వాడి గదమాయింపుతో శృతి ఆలోచన చాలించి చటుక్కున పక్కకు తొలగింది.
ఈదఫా పరిసరాలు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు నడిచింది, జోరీగ రొదలా ఆలోచన మాత్రం వదల లేదు శృతిని.
తర్వాత మురారిదేముడు తనను పిలవలేదు. తనూ ఆ గది చాయలకి వెళ్ళలేదు. అతను బాత్ రూమ్ కెళ్ళోచ్చాడో లేదో కూడా గమనించలేదు. అతను బాత్ రూమ్ కెళ్ళోచ్చాడో లేదో కూడా గమనించలేదు. అమ్మ వచ్చి తలుపు తట్టటంతో బెడ్ రూమ్ లోకోసారి తొంగిచూచి అతను లేకపోవటంతో వెళ్ళి తలుపు తీసింది. అమ్మ వచ్చిన తర్వాత అతను అటకెట్లా దిగుతాడు? అలాగే వుండిపోయాడు ఏదన్నా అందిగ్దామన్నా అది అయ్యే పనికాదు. మరో నాలుగు రోజులలో అన్నయ్య నైట్ డ్యూటీ అయిపోతుంది. రాత్రిళ్ళు అన్నయ్య ఇంట్లోనే పడుకుంటాడు. పగలు, రాత్రి అమ్మ ఇంట్లోనే వుంటుంది. తప్పదు. అతను బైట పడిపోతాడు. తర్వాత ఏదయినా అఘాయిత్యం జరగవచ్చు. పోనీ అమ్మకి, అన్నయ్యకి నెమ్మదిగా నిజం చెపితే......? అమ్మో? అమ్మ అన్నయ్య అపార్థంచేసుకోవచ్చు ఓ వేళ చేసుకోకపోయినా ఒక పరాయి మగాడితో రాత్రిళ్ళు వంటరిగా ఉన్నానంటే......ఊహు.....
క్వార్టర్స్ వచ్చేశాయి.
ఇంట్లో కాలు పెట్టేదాకా శృతి ఆలోచిస్తూనే వుండి.
వాకిలి తలుపు తీసేవుంది.
శృతి లోపలికి నడచింది.
ఎదురుగా గదిలో కనపడ్డ దృశ్యం చూసి శృతి నిగాంతపోయింది. చేతిలో సంచీ జారి కిందపడింది.