కెమేరా, లైటింగ్, దర్శకత్వం చుట్టూ వాళ్లమనుషులు. అప్పుడు అందరిముందు దిగంబరంగా ఆ పిల్ల నుపయోగించుకుంటూ పిక్చర్ తీస్తుంటే ఎలావుంటుందో ఊహించుకో. పోనీ వారి వయసు పాతిక ముఫై వుంటుందా అంటే అదీలేదు. కొందరు పసిమొగ్గలను రేప్ చేయటం ఇష్టపడతారు. అలాంటివారి కోసం- పదమూడు, పద్నాలుగేళ్ళ అమ్మాయిలను ఉపయోగించుకుంటారు. నలభై ఏళ్ల స్త్రీని పద్దెనిమిదెళ్ల అబ్బాయిని చూపిస్తారనుకో. అబ్బాయిని ఎక్కడినుంచో ఎత్తుకు రానక్కరాలేదు. రెడీగా వుంటాడు. అమ్మాయిలదే సమస్య బోలెడు డబ్బు పోసి కొనాలి. లేకఎన్నో సాధక బాధలు చూసుకుని ఎత్తుకురావాలి. పిక్చర్ తీసేవిధానం ఇది?
పిక్చర్ చూపించటం.....ఇలాంటి పిక్చర్ మనదేశంలో తియ్యరు. లక్షలు పెట్టి విదేశాలనుంచి చాటుగా తెప్పిస్తారు. ఈ పిక్చర్ ని తెప్పించటం నేరమే, చూపటమూ నేరమే. అందుకే చాటుగా జరిగిపోతుందీ వ్యవహారం. బయటికి పొక్కనీయని నమ్మకం గల మనుషులకు మాత్రమే టిక్కెట్లు అమ్ముతారు. ఒక టిక్కెట్లు వెల కొత్తలో అయిదారొందలు. పాతబడిపోతే పాతిక రూపాయలకి తక్కువుండకుండా వుంటుంది.
ఫస్ట్ ఈ దేశం బ్లూ ఫిల్మ్ వచ్చినప్పుడు సినిమా హాల్సులోనే చూపించేవారు. ఎలా అంటే ముందుగా టిక్కెట్లు ధనవంతులు కొనేసేవారు. హాలువద్ద బోర్డ్ వుంటుంది. పవిత్రమైన పాత ఇంగ్లీషు ;లేక హిందీ పిక్చర్ చూపిస్తున్నట్లు బోర్డు తగిలిస్తారు. ఎవరో దారినబోయే దానయ్యకి పిక్చర్ చూడాలనిపించి టికెట్ అడిగాడనుకో. టికెట్స్ అయిపోయాయి, హాలు నిండింది. అని చెప్పి పంపేస్తారు. మర్నాడు హాలు వద్ద బోర్డులు ఉండవు, బ్లూ ఫిల్మ్ చూపించటమూ ఉండదు.
ఇది ఎర్రటోపీలు కనిపెట్టాము. చాలా గొడవయింది. అప్పటి నుంచి ఈ వూళ్ళో కొన్ని పెద్ద హొటల్స్ ఈ వ్యాపారం మొదలు పెట్టాయి. హొటల్స్ లో బ్లూఫిల్మ్ చూపిస్తున్నారని బయటపడింది. దాంతో మరోసారి నానా గందరగోళమైంది. బ్లూఫిల్మ్ తెప్పించినా, ఆడించినా, చూసినా, అందరికీ కఠిన దండన అవలంబించారు, పోలీసుల నిఘా ఎక్కువైంది. ఇప్పుడు పెద్దవారి ఇళ్లలోనే ఫిల్మ్ చూపిస్తున్నారు. ఎక్కడి దాకానో పోవటం ఎందుకు? మన మేడ మూడో అంతస్తులో అరవైమంది, పట్టే పెద్దాహాలు వుంది. ఫిల్మ్ ఇక్కడికొచ్చి చూసిపోతుంటారు. పోలీసులకి తెలియదు, దేముడికి తెలియదు. ఇంటిదొంగని ఈశ్వరుడైనా పట్ట లేడని వినలేదా? గౌరవనీయ కుటుంబం గల వ్యక్తుల మీద, వారి ఇళ్ళ మీద నిఘా ఉండదు కాబట్టి రెండోకంటికి తెలియదు. ఈఇంటి మీద అనుమానం లేదు. సతీ అనసూయ మీదా అనుమానం లేదు. పోలీసు మనవాడు. ఇదెప్పటికీబయటపడదు. అర్థమైందా సీతా!"
"ఆఁ. ఆఁ......అర్థమైంది. ఇంత పటిష్టంగా ప్లాన్ వుంటే సక్సెస్ కాక చస్తుందా?" అంది సీత. ఊ, ఊఁ...సగం మీ తల వెంట్రుకలు నా చేతిలో చిక్కాయి. ఇక్కడినుంచి బయటపడాలి. అప్పుడుంది పెద్ద పండుగ.' అనుకుంది.
"నన్నడిగితే ఇంటికన్నా గుడి పదిలం.....అన్నట్లు సంసారి కొంప కన్నా సానికొంప నయం." అంది సావిత్రి.
"ఇక్కడి కొచ్చేవాళ్ళంతా బాగా ధనవంతులేనా....? ఎవరెవరు వస్తుంటారు.....?" సీత ఇంటర్వ్యూలో ముఖ్య ప్రశ్న అదే అన్నట్లు అడిగింది.
ఫలానా...ఫలానా.....ఫలానా..... అని వివరాలతో సహా గొప్ప వాళ్ల పేర్లు చెప్పి__ "ఆఁ..... వారంతా నీకేం తెలుసు?" అంది అహల్య.
"మరి.....వీళ్లకి బాధలు..... రోగాలు..... వగైరా లుండవా?" సీత మరో ప్రశ్న.
"రోగాలా..... భలేదానివే! నాలుగు రోజులకోసారి మమ్మల్ని డాక్టరు పరీక్ష చేస్తాడు. ఆరోగ్యానికి బలమైన తిండి, టానిక్ లు.... మాకేమిటి, మహారాణికి కూడా జరగదు! మేమేం పేవ్ మెంటు మీద, రైల్వే ఫ్లాట్ ఫాం మీద పావలాకి అర్థకి దొరికే సరుకులమా, లేక పూర్ణా నందం పేట, గాంధీనగరం చివర, లబ్బీపేట మూలల్లో , గుడిసెల్లో రూపాయికి, రెండు రూపాయలకి దొరికే వరహలమ్మ. ముత్యాలమ్మల వద్ద అర్థాకలితో అలమటిస్తూ చవకరకం నైలాను చీరెతో, చెమట కంపుతో, ముదిరిపోయిన రోగాలతో, ముష్టాళ్లు....కుష్టాళ్లు.....ముదరష్టపాళ్ళు..... ఆళ్ళతోపోయే రకాలమా? మా హెల్త్, అనగా ఆరోగ్యం నవనవ.....మిసమిస......
మా వద్దకొచ్చేవారితో బాదంటావా? నీకు తెలియదు. వెరైటీలో అందం పొందితే గాని తెలియదు. పశువులాంటి వెధవచ్చాడనుకో......నీళ్లల్లో నిద్రమాత్ర వేస్తాం, ఇస్తాం. కాసేపటిలో వాడిపని ఖాళీ.....చచ్చిన శవంలా నిద్రపోయి, బ్రతుకున్న శవంలా ఉదయం నిద్రలేస్తాడు. విడమర్చి చెప్పాను. భయపడాల్సిందేమీ లేదు సీతా!"
సీత గది అదిరేటట్లు ఫక్కున నవ్వింది. "నాకు భయమా? నా పేరు సీత. పొరపాటున ఆ పేరుపెట్టారు! శూర్పణఖ అని నామకరంణ చేసుంటే సరిగ్గా సరిపోయేది." అంది నవ్వాపి.
"అమ్మయ్య.... మా దారికొచ్చావ్! ఫస్ట్ నైట్ ఎలాంటివాడ్ని కుదర్చమని సతీ అనసూయతో చెప్పమంటావ్?" అంది అరుంధతి.
"నోర్ముయ్, బురదగుంటలో పోర్లాడే మడ్డి ముఖందానా!"
"సీతా....." తెల్లబోయింది అరుంధతి.
"మరోసారి చెపుతున్నాను. నా పేరు సీతాదేవి. నా గుణం మెతక కాదు, నిప్పు. అవసరమైతే నన్ను నేను చస్తాను, లేక మీ అందరి నెత్తిన నిప్పులు జల్లి మారణహొమం చేస్తాను." సీత కళ్లల్లోంచి నిప్పులు రాలుస్తున్నట్లు చూస్తూ అంది.
"ఆఁ......నువ్వు మారలేదా?" రుక్మిణి నీరసంగా అంది.
"మారాను. ఇదివరకు సీతలో కాస్త మెతకదనం వుందేమో? మీ గీతా మకరందం కర్ణానందంగా కర్ణానందంగా విన్నతర్వాత నాలో ఆ.....మెతకదనం పోయి, కఠినశిలగా మారిపోయాను. ఈ సీత వందమంది సతీ వందమంది సతీ అనసూయ లొచ్చినా, లక్షమంది మీలాంటి పత్తిత్తులొచ్చినా మారదు..... మారదు..... మీరేం చేసినా సరే, ఐ డోంట్ కేర్." అంది సీత తలెగరేసి.
"ఆ......? ? ?" ఈదఫా అందరూ ఒకేసారి నోరు తెరిచారు.
21
చాలాసేపు ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యం చేసింది.
ఏమీ జరగనట్లు, మీరంటే నాకు లెక్కలేదుసుమా? అన్నట్లు సీత సోఫాలో కాళ్ళాడిస్తూ కూర్చుంది. తీవ్రంగా ఆలోచిస్తున్నది. ముఖాన ఆ భావాలు ప్రతిబింబించకుండా జాగ్రత్త వహించింది.
అక్కడున్న పతితలకి ఏం చేయాలో తోచలేదు.
"నేనోమాట అడగనా?" అంది సుమతి.
"మాట___ఫరవాలేదు అడుగు సినిమా నీతి కథలుమాత్రం చెప్పకు". అంది సీత.
"ఏం చేద్దామని నీవుద్దేశ్యం?" అంది సుమతి.
"ఏం చేయలేనని నీవుద్దేశ్యం?" ఎదురుప్రశ్న వేసింది. సీత.
"ఇక్కడికొచ్చిం తరువాత మా వృత్తి చేయక తప్పదు. పాపం ఏం చేస్తావో?"
"ఏం? దిగులుగావుందా? మొదటే చెప్పాగా? వాడిని చంపి నే చస్తాను."
"చంపినా, చచ్చినా, సాధించేదేమిలేదు. మాలా హాయిగా బ్రతక మంటే ఏంటో చెపుతున్నది. చేతగాని దద్దమ్మలు చెప్పేవన్నీ నీతులే." రుక్మిణి చెంపదెబ్బ ఇంకా మర్చిపోలేదు. సీతని పనికిమాలిన దద్దమ్మ కింద చేర్చి హేళనగా అంది.
సీత, కలకత్తా కాళికామ్మవారిలా, బెజవాడ కనకదుర్గమ్మలా , నరకాసురుణ్ని సంహరించటనికి విల్లంబు, బాణాలు చేతధరించిన సత్యభామాలా లేచింది సోఫాలోంచి.
"మిస్! నో.....నో.....మిసె స్ స్ స్ రుక్మిణీ! చేతగాని దద్దమ్మలు చెప్పేవన్నీ నీతులుకదూ? ఎస్, బహువచన ప్రయోగం చేశావు. అంటే మీరంతా ఇంతవరకూ చెప్పింది దద్దమ్మా నీతులన్నమాట......? సరే, అక్కడితో దాన్ని వదిలేద్దాం. చంపినా, చచ్చినా, దగ్గరకు వద్దాము. నా అభిప్రాయం చెపుతాను.
ఆడది వ్యభిచారం చేస్తూ లొంగి వుంటుందనుకో. తరతరాలుగా ఈ సమాజం స్థితిగతులూ ఈ విఒష్యంలో మార్పులేకుండా ఎలా పడివున్నాయో అలాగే వుంటుంది. మరో రెండొందలేళ్ళు దాటినా స్త్రీ జాతికి విముక్తిలేదు. పురుషుడి కోరికకు అంతూ వుండదు.
ఓ మగవాడు మొదటిసారి మిమ్మల్ని రేప్ చేయటానికి వచ్చాడు. ఎదిరించండి, మీశక్తి వున్నంతవరకూ పోరాడండి. మీ బలం చాలదు. మీరు ఆ పోరాటంలో నెగ్గలేరు. దిగులుపడొద్దు, లొంగిబ్రతకొద్దు. వాడ్ని చంపండి, లేక మీరు చచ్చిపోండి. మగాడి చేతిలో భంగపడ్డ ప్రతిస్త్రీ ఆ మగాడిని చంపినా, తాను చచ్చినా పురుషుల్లో మార్పు వస్తుంది. వాళ్ళల్లో ఓ విధమైన భయం ఆవరిస్తుంది. పర స్త్రీ వంటిమీద చేయివేస్తే మనప్రాణం తీస్తుంది, లేక అది చస్తుంది- అని లోకానికంతా తెలియాలి.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందంటే యధేచ్చగా తెల్లవాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించి కొన్నేళ్ళ తర్వాత తోకముడిచారంటే ఒక వీరుడి మరణంవల్ల కాలేదు, పదిమంది వీరుల తిరుగుబాటువల్ల కాలేదు, వందమంది వీరుల రక్తం నేలపాటు కావటంవల్ల కాలేదు, రోజులు......నెలలు.....సంవత్సరాలు.....పోరాడగా కాలేదు, లక్షల సంఖ్యలో వీరులు విప్లవపోరాటంలో ఏళ్ళతరబడి ప్రాణాలకి లెక్కచేయక రక్తం ధారపోయగా, వాళ్ళలో మార్పు వచ్చి మనలో మహాత్ములు ఉదయించి విజయం సాధించాము. అలాగే, ఈ చీడపురుగులాంటి వేశ్యావృత్తి సర్వనాశనం కావాలంటే మగాళ్ళలో మార్పువచ్చి స్త్రీలు విజయం సాధించాలంటే చంపటమో? చావటమో? విజయమో? వీరమరణమో? ముందుగా పతనమయ్యే లేక పతనమైన ప్రతి స్త్రీ తెలుసుకోవాలి. స్త్రీలందరిడీ ఒకే మాట, ఒకేబాటగా వుండాలి. మీలాంటివారు దీనిలో సౌఖ్యం వుందని వంచన చేసుకుంటూ పడుంటే, అందమైన పెళ్ళాలున్నవాళ్ళు, అనుకూలవతి అయిన భార్య వున్నవాళ్లు పెళ్ళాన్ని ఏడుస్తూవుండమని మీవద్దకొచ్చి పోతూనే వుంటారు. ఓసారి లొంగితే ఒకటా? రెండుసార్లు లొంగితే ఒకటా? అని మీరు లొంగిపోతూనే వుంటారు.