"సినిమాకా?" అంది సీత.
"సినిమాకంటే, జేమ్స్ బాండ్ పిక్చర్లు కాదు, బాబీ, ప్రేమకథా కాదు, అంతులేనికథ, తెలుగుదానికీ కాదు."
"మళయాళం పిక్చర్ కా, కన్నడం పిక్చర్ కా?" అంది సీత.
రుక్ష్మిణి ఫక్కున నవ్వింది.
"బ్లూ ఫిల్మ్ అని అదో సినిమాలే. మగా ఆడ తప్ప, ఓ కథ, సీనరీలు, పాటలూ ఉండవు. ఆ మగా ఆడ ఓ జాతివాళ్ళు ఓ వయసువాళ్ళు కాదు. ఆఫ్రికన్, నీగ్రోలు, ఫ్రెంచ్, అమెరికన్, నానా జాతివాళ్ళుంటారు. పిక్చర్ రహస్యంగా చిన్న స్క్రీన్ పై కొన్నిచోట్లా మాత్రమే చూపిస్తారు. ఆడా, మొగకి పెద్దగా మేకప్ ఉండదు. కనీసం శరీరం మీద ఒక్క సూలు పోగు కూడా వుండదు. ఫిల్మ్ మొదలవుతుంది. పాపం.... వాత్సాయనుడు చచ్చిపోయాడు గాని, బ్రతికుండి ఆ ఫిల్మ్ చూస్తే "నాదీ ఓ బ్రతుకేనా? కామసూత్రాలంతే ఇన్నుంటాయా? నాముఖం, నాకేం తెలిసిచచ్చని రాశాను! నేనో పుస్తకం రాసి, నేనే గొప్పవాడినని మురిసిపోతున్నాను. ఛీ....నా బ్రతుకెందుకు? ఇన్నిరకాలు, ఇన్ని పద్దతులుండగా నా పుస్తకమూ ఓ పుస్తకమేనా? నా రాతా ఓ రాతేనా? నేనూ ఓ రచయితనేనా అని వెంటనే ఆత్మ హత్య చేసుకునేవాడు.
బ్లూ ఫిల్మ్ చూస్తుంటే ఒళ్ళు వేడెక్కింపోతుంది. పరిసరాలు. గుర్తుండవు. పరిసరాలు, పక్క మనుషులని చూడటానికి వీలుండదులే. ఎందుకంటే కటిక చీకటిలో వీళ్లు, అనగా ప్రేక్షకులు కూర్చుంటారు! తెరమీద మాత్రమే వెలుతురుంటుంది. తెరమీద భాగోతం చూస్తుంటాం కదా! పక్కవాడి వళ్లు వేడెక్కి, కొత్తగా చూస్తున్న నీ లాంటిదాని ఒళ్ళు వేడెక్కి, వాడి చెయ్యి ఇలా నీ మీదపడి- వెంటనే నువ్వలా వాడి వళ్ళో వాలిపోయి..... ఫినిష్."
రుక్మిణిచెంప 'ఛెళ్' అంది. వెంటనే రుక్మిణి 'అమ్మా!' అంది. అందరూ అదిరిపడ్డారు.
"నాపనికాదు ఫినిష్. మళ్ళీనోరెత్తావంటే నీపని ఫినిష్ అవుతుంది." సీత రుక్మిణిణి తోసేసి పిడికిలిబిగించి లేచినుంచుంది.
అందరూ కూడబలుక్కున్నట్లు లేచినుంచున్నారు. "మామీదచెయ్యి వేస్తావా? చంపిపారేస్తాం?" అన్నారు.
"మరీమంచిది. నాకు శ్రమలేకుండాపోతుంది, ఊ, కానీయండి' చంపండి." అంది సీత.
అందరూ సీతని ఓపిల్ల రాక్షసిలాచూసి నిస్సత్తువగా మళ్ళీ సోఫాలో కూలబడిపోయారు.
రుక్మిణి చెంపతడుముకుంటూ కూర్చుంది.
అరుంధతి లేచింది. "ఆవేశపడకు సీతా! కూర్చో," అని సానునయంగా సీతభుజాలు పట్టుకుని సోఫాలో కూర్చోపెట్టింది.
"సీతా, నువ్వు చాలా గట్టిదానివే. ఇప్పుడే తెలిసిపోతున్నది. కానీ చివరిగా ఒక్కమాట చెపుతాను విను తర్వాత నీఇష్టం, సతీఅనసూయ ఇష్టం. ఏంజరిగినా మేం బాధ్యులంకాదు. అసలువిషయాని కొద్దాం.
పారిపోవటానికి యింటికి కాపలావుంటుంది. ఈ యింటిసంగతి బైటవాళ్ళకి తెలియదు. సతీ అనసూయకి పెద్దపెద్దవాళ్ళదగ్గర పలుకుబడి జాస్తి. ఇక్కడ అలివికాని అమ్మాయిల నేంచేస్తుందో తెలుసా! ఇతర దేశాలకి అమ్మేస్తుంది. ఇక్కడైతే మనం పుట్టినగడ్డమీద హాయిగా వుండొచ్చు. దేశంగాని దేశం. భాషతెలియదు. వాళ్ళదో రాక్షసరసికత మన ప్రతి కీలుకీలు పటకారుతో మెలిపెట్టి మన హృదయంలో మరమేకుబిగించి ప్రాణంలేని బొమ్మలా తయారుచేస్తారు. అక్కడ యంత్రంలాగా వాళ్ళ పనికి ఉపయోగపడతామేగాని ఓ సౌఖ్యం పాడూవుండదు. యిక్కడ సినిమాలు, షికార్లు, మంచిగుడ్డ, కమ్మనితిండి- మహారాణిలా జరిగిపోతుంది.
మనమున్నది ధనవంతుల యిల్లు. అలాఅని మాత్రమే బైటికి తెలుసు. అందువల్ల ఎర్రటోపీల భయంవుండదు. ఎవరికీ అనుమానం తగలదు. గుట్టుగల ఖరీదైన ప్యాసింజరుకి మాత్రమే మనం సప్లయిచేయబడతాము.
ఈ ఊళ్ళో రామాటాకీస్ పరిసరప్రాంతాల్లో, విజయాటాకీస్ వెనక సందుగొందుల్లో, రైల్వేలై నుమూల, ఒన్ టవున్ ముత్యాల మూడో వీధిలో ఇలా చాలా చాలాచోట్ల సతీఅనసూయలు, వాళ్ళతాలూకు, మాలాంటివాళ్లు కోకొల్లలుగా వ్యాపారంచేస్తున్నారు. వాళ్ళనెప్పుడూ పోలీసులు పట్టుకెళ్ళటం నాలుగురోజులు కటకటాల్లోవుంచి వదిలేయ్యటం, మళ్ళీ యదాప్రకారం వ్యాపారం.
డ్యూటీప్రకారం పోలీసులు పట్టుకెళతారు, వీళ్ళకికావలసింది కడుపుకి తిండి. బైటవుంటే రెండుపూపాయలకి, మూడురూపాయలకి ఒళ్ల మ్ముకుంటారు. ఐదుగురు పనిచేసిన నీరసం ఒక్కరాత్రికే వీళ్ళని ఆవరిస్తుంది. రెండురూపాయలతిండి ఏమూలకి? ఆపనితప్ప రెండోది చాతగాదు. అందుకనే జైలులో ధీమాగా కూర్చుని తింటారు. పోలీసులకి విసుగుపుట్టి వీళ్ళని మేపలేక వదిలేస్తారు. మనకాబాధలేదు? పోలీసులకి తెలియదు, ఆ దేముడికీ తెలియదు. అంతా సతీఅనసూయ చూసుకుంటుంది. పైకి ధనవంతుల్లా, గౌరవసంస్థలలో పార్టనర్స్ గా వుండటంవల్ల గొప్పవారి హేండ్స్ కలవటంవల్ల ఆపద కనుచూపుమేరలో వుండదు." అరుంధతి చెప్పుకుపోతున్నది.
సీత ఇటు జాగ్రత్తగా చెప్పేదివింటున్నది. అటు ఈ మనుషులు ఈ వాతావరణం అర్థంచేసుకుంటూ యిక్కడినుంచి ఎలా బైటపడాలి అని ఆలోచిస్తున్నది. ఇంతవరకూ పుస్తకాల్లో చదవటం, సినిమాలలో చూడటం వల్ల వేశ్యాగృహాలు వుంటాయి- అక్కడ చెడువుంటుంది అని పైపైన తెలుసుకుంది. యిప్పుడు కళ్ళారాచూస్తూ, చెవులారా వింటుంటే సీతకి పూర్తిగా అవగాహన అయింది.
సీతకి లోలోపల ఈ నరకంనుంచి బైట పడగలనా? అనే భయంతో కూడిన అనుమానం ప్రవేశించింది. బైటపడితే చులకనవుతామనే మాట తెలుసుగాబట్టి ఏమాత్రం తొణక్కుండా కూర్చుంది. మాటల్లోపెట్టి వీలైనంత కూపీలాగి బైటపడ్డ తర్వాత వీళ్ళపని చెప్పొచ్చని అబుకుంది.
"పోరపాటునకూడా పోలీసులు ఈ యింటిముఖం చూడరా? గజదొంగలని పట్టుకుంటారు, స్మగ్లర్సుని పట్టుకుంటారు, మిమ్మల్ని ఆమాత్రం గుర్తించలేరా?" అంది సీత.
"పోలీసులంతా న్యాయంగలవారైతే కథేలేదు. కొందరు నీతికి నిలబడేవారైతే, మరికొందరు దొంగలకన్నా, దోపిడీడార్ల కన్నా ఘోరంకల వారు. దొంగలకి, హంతకులకివుండే మానవత్వంకూడా లేనివారు పోలీసు డిపార్టుమెంటులో వుండటంవల్ల చాలా చాటుపనులు స్వేచ్చగా జరిగిపోతున్నాయి. హెడ్ కానిస్టేబుల్ ఏడు కొండలు మనవాడు నెలకి వాదిజీతంకన్నా డబుల్ జీతం సతీఅనసూయ అందిస్తున్నది. వాడు "ఫలానాచోట రెయిడ్ జరగబోతున్నది, ఫలానాచోట రెయిడ్ జరిగింది, ఫలానావాడిమీద అనుమానంతో సి.ఐ. డీలు వెంటాడుతున్నారు. ఈవచ్చిన ఇన్ స్పెక్టర్ లంచాలు తీసుకుంటాడు, ఈ వచ్చిన ఇన్ స్పెక్టర్ సత్యహరిశ్చంద్రుడు." అంటూ ముందే వార్తలు చేరేస్తాడు కాబట్టి భయంలేదు." అంది అరుంధతి.
"అదీ! అలాఐతే ఫరవాలేదు. రెండోకంటికి తెలియదు. మరి.... మీరుచెప్పే ప్రకారం పెద్దపెద్దవాళ్ళు యిక్కడికొస్తారుకదా, వాళ్ళకి అందమైన పెళ్లాలు లేకనా? ఇంకేమైనా కారణంవుందా?" అమాయకంగాముఖం పెట్టి అడిగింది సీత.
"పిల్ల దారిలోపడుతున్నది." అనుకున్నారు వాళ్ళంతా.
` "అందరూ యిక్కడికిరారు. ఒకరోజుముందుగా బుక్ చేసుకున్న ప్రకారం వాళ్ళిళ్ళకెళ్ళటం.....పిక్నిక్ కెళ్ళటం.....సినిమాల కెళ్ళటం....ఏ పెద్ద హొటల్లోనో ఏ.సి. రూమ్ లో యిద్దరి ఫ్రెండ్స్ కి ఒకేసారి బుక్ కావటం.... ముసలిధనవంతుడితో కలిసి బ్లూపిలించూడటం.....యిలా చాలాచోట్ల కలుసుకునే ఏర్పాట్లు వుంటాయి. గంటకి ఐదొందలనుంచి అయిదువేలదాకా యిస్తారు."
"బాప్ రే! ఇచ్చేది డబ్బా, చిల్లపెంకులా?" అంది సీత.
"నీకేంతెలియదు. కొందరి మొగాళ్లకి బొండాంలాటి ఆడదికావాలి. కొందరికి సన్నగా పన్నెండేళ్ళ అమ్మాయి కావాలి. కొందరికి అప్సరస కావాలి. మరికొందరికి వికృతరూపంకలది కావాలి. వీళ్ళటెస్టు యిదీ అని చెప్పలేం. యింట్లో రంభలాంటి పెళ్లాంలేకనా? ఉంటుంది. అది అచ్చం పెళ్ళాంలాగా సిగ్గుపడుతూవుంటుంది. అదినచ్చదు వీళ్లకి. వెరైటీసరుకు కావాలి. వాళ్ల అభిరుచికితగ్గట్లు వుండాలి. వెరైటీసరుకు. పోనీ చిల్లరతిను బండారాలనుకుందాము. అదిమరిగినవారు పెళ్లాంవద్ద సుఖపడలేరు. పెళ్లాన్ని సుఖపెట్టలేడు. మావద్ద బూతుమాటలుచెప్పే ఈమగాడు పెళ్ళాం దగ్గర బూతులుమాట్లాడడు. పవిత్రంగా వుంటాడు. నిజంచెప్పాలంటే ఈ వెధవలకి భయం. డబ్బిచ్చి మా శరీరాలను కొంటారు. కాబట్టి ఒళ్ళూ పై తెలియకుండా ప్రవర్తిస్తారు. పెళ్ళాందగ్గర పడుకునేటప్పుడు మాత్రం మూగిముండాకొడుకుల్లాగా, నంగివెధవల్లాగా జావకారుతూ ఏడ్పుమొహాలేసుకుని అఘోరిస్తుంటారు.
"ఎందుకలాంటి తెగులు వారికి?"
"పెళ్ళాం చెడిపోతుందని భయం.... మా దగ్గరకొచ్చే ప్రతివాడికి పెళ్ళాం చెడిపోతుందేమో అనే అనుమానమే!"
"నీకెలా తెలాసు?"
"మేం మధ్య మధ్య జోకేసి, కవ్వించి, వాళ్ళనాడిస్తుంటాము."
"ఎలా?"
"మీరిలా వచ్చారు కదా! ఈ సమయంలో మీ ఆవిడకి కోరిక పుట్టిందనుకోండి. ఎవరి దగ్గరకన్నాపోతుందేమో? అంటాము. అప్పుడు చూడాలి వాదిముఖం.....చిల్లపెంకులా పెడతాడు. "ఛా,ఛా.....మా ఆవిడ నా ముఖం తప్ప పరాయి మగాడి ముఖం చూడదు. సాంప్రదాయం గల కుటుంబం నుంచి వచ్చింది. తలెత్తి వాళ్ళన్న ముఖమే చూడదు. అరడజను పిల్లలకి తల్లయింది. ఇప్పటికీ నన్నుచూస్తే సిగ్గే, కళ్ళల్లో కళ్లెట్టి చూడదు. రమ్మంటేనే పడుకోటానికి వస్తుంది. దాని బుద్దే వేరు. నా మాట జవదాటదు. ఇరవైనాలుగు గంటలు పూజలు, పునస్కారాలు....." అంటూ పెళ్లాం గురించి ఒకటే గొప్పలు." అంది అరుంధతి.
"బ్లూఫిల్మ్ అన్నావే- అదెక్కడ చూపిస్తారు, ఎలా తీస్తారు?" సీత కావాలని అడిగింది. ఇక్కడినుంచి బయపడ్డ తర్వాత, నిజాయితీ గల ఇన్స్ పెక్టర్ కి వివరాలు చెపుదామని సీత ప్లాను.
"ఎలా తీస్తారంటే సరిగ్గా నాకు తెలియదు. విన్నదాని ప్రకారం చెప్పగలను. నే దానిలో నరిస్తే పూర్తిగా తెలిసేది. నే విన్నదేమిటంటే కొందరు ఇష్టపూర్వకంగా వృత్తి ధర్మం ప్రకారం కోరిన ప్రతిఫలం పుచ్చుకుని నటిస్తారు. కొందరలా కాదు. సతీఅనసూయ లాంటివారి వద్ద కొన్న అమ్మాయిలు, లేక ఎత్తుకురాబడిన అమ్మాయిలను బలవంతానా లొంగదీసుకుని నటింపజేసి ఫిల్మ్ తీస్తారు. బ్లూ ఫిల్మ్ లో రెఫ్ సీన్సు చూపించాలంటే కొత్తవారికి నేర్పి పిక్చర్ తీయక్కరలేదు. వాళ్ళవాళ్ళే మగ నటులు కొత్తమ్మయిని రేప్ చేస్తారు. అదే ఆ నిమిషాన పిక్చర్ తీసేస్తారు. అప్పుడు వాస్తవానికి దగ్గరగా ఆ అమ్మాయిలో హావభావాలు భయం, అన్ని వేరే నటించకుండా కెమేరా లాగేస్తుంటుంది.