Previous Page Next Page 
అతడు భార్య ప్రియుడు పేజి 18

     ఎలా తప్పించుకుపోవాలి?

     " ఏమే నీకు రాజకీయాలు కావాలా?"

    ఆమె మాట్లాడలేదు.

    "ఎం.ఎల్ .ఏ చాలా? మంత్రి పదవి కూడా కావాలా" కొవ్వొత్తిని ఆమె గెడ్డం క్రింద పెట్టాడు.

    హృదయవిదారకంగా ఆర్తనాదం చేసింది  నాగమణి.

     "కాబోయే మంత్రి ణివి, ఓర్పు వుండాలి"

     తొడలమీద పాశం పెట్టాడు.

      " ఆ ముసలిమక్కతో ఫోన్ చేయించి కార్లో వాడితో పోయావా? కార్లో వాడి ఒళ్ళో కూర్చుని పోయావు కదూ?"

    ఇక లాభం లేదు.

     శరీరంలోని బలాన్ని చేతుల్లోకి, కాళ్ళలోకి కూడదీసుకుంటోంది.

    " చూడవే? నా గురించి బయటి ప్రపంచానికితెలీకూడదు.అందుకే   ఆవెంకటపతిగాడు ఆడగ్గానే ఓకే అన్నాను. కానీ నాకు తెలుసే! నువ్వు వాడిపైన కన్నేశావని. నీకు పరాభవం చేస్తేగాని  నాకు నిద్రపట్టదు" అని  జి.కె. చేతిని కదపబోయాడు.

    అతివేగంగా కదిలింది  నాగమణి.

     ఆనకట్టని తెంచుకుని దూకిన గోదావరిలా.....

     జి.కె. చేతుల్లోంచి తప్పించుకుంది.

     గది లోని బల్బు ఒక్కసారిగా వెలిగింది.

     గది మధ్యలో నగ్నంగా ..... వణికిపోతూ

     రెండుచేతులతో శరీరాన్ని కప్పుకోవడానికి ప్రయత్నిస్తూ....

    ఏడ్చేడ్చి ఎర్రబారిన కళ్ళలో...

     నోటి  దగ్గర ఆహారం చేయిజారిపోయినట్టు కంగారుగా మంచం మీంచి  లేచాడు. జి.కె. చేతిలోని కాండిల్ మూలకి విసిరేసాడు.

    కళ్ళలో సత్తువ లేనట్లు కుప్పలా కూర్చుడిపోయింది నాగమణి. మోకాళ్ళ మధ్య తలపెట్టుకుని రోధిస్తోంది.

     అతని అడుగుల చప్పుడు విని, భయంగా తలెత్తి చూసింది. అదే క్షణంలో అతను కుడిపాదంతో ప్రక్క టెనుకులమీద తన్నాడు.

    కెవ్వుమని ఆరిచింది నాగమణి. అతను  ఈమెని కాళ్ళతో కుమ్మేస్తున్నాడు.

     ఏడవటానికి కూడా యింకా శక్తి లేనట్లు ఆమె నేలపై పడిపోయింది.

     కళ్ళనుంచి ఏకధారగా కన్నీరు.ట

     జి.కె. ముఖం చెమటతో తడిసిపోయింది.

     ప్రతిఘటించలేని నాగమణి కేసి చూసి హేళన గా నవ్వి "మళ్లీ స్పృహలోకి వచ్చాక  వస్తాను"  అని గదిలోంచి బయటికి నడిచాడు.

     వరండాలో జర్మన్ షెప్పర్డ్ అతన్ని చూడగానే తోకాడించింది.యజమాని ప్రేమగా పలుకరించి చేత్తో  నిమురుతాడని ఆశపడింది.

     గొలుసు విడిపించుకోటానికి అటూ ఇటూ కదిలింది.

    గిరగిర తిరుగుతుంది " కుయ్ కుయ్ మంటూ,"

     జి.కె. చుట్టూ చూసాడు.

    కొది దూరంలో గొలుసు ఒకటి కనబడింది.

 Previous Page Next Page