Previous Page
Next Page
అతడు భార్య ప్రియుడు పేజి 17
బాధగా మూలిగింది.
జ్వాలని చల్లారిస్తే చాలు.
ప్రయత్నించడేం?
కళ్ళు తెరిస్తే-అతని మూడ్ పాడైపోతుందన్న భయం. తన శరీరంతో ఆడుకుంటోంది. తన శరీరంతో ఆడుకుంటోంది. తన భర్తేనని తెలుసు.
కొవ్వొత్తి కాంతి పడి జి. కె. ముఖం వికృతంగా మారింది.
కొవ్వొత్తి చుక్క చేతి వేలిమీద చుర్రుమంది.
దానికేసి చూశాడు జి.కె.
పెదవులపై క్రూరమైన నవ్వు!
అతని చేయి ఆమె తొడపైన బలంగా అదిమింది.
కొవ్వొత్తిని పక్కకి ఒంచి పట్టుకున్నాడు. ఆ చేతిని ఆమె తొడల కొంచెం ఎత్తులో నిలిపాడు.
ఒత్తి మంటకి మైనం త్వరత్వరగా కరిగిపోసాగింది.
కరిగిన మైనం ఆమె తొడపైన పడి చురుక్కుమంది.
ఉలిక్కిపడింది నాగమణి. ఆమె గబుక్కున లేవబోయింది. ఆమె ప్రయత్నాన్ని అతని బలమైన చేయి పోనివ్వలేదు.
కాళ్ళతోనూ,చేతులతోను. ఆమెని అదిమి పట్టాడు.
మైనంబొట్లు ఆమె తొడలపైన.... ఇంకా ......పడుతున్నాయి. చుర్రుమంటూ పడి గడ్డకడుతున్నాయి.
ఆమె విఫలయత్నం చేస్తోంది.
పెదవులు బిగించి బాధని పళ్ళ బిగువున అదిమిపెట్టి తప్పించుకోవటానికి చేస్తున్న ప్రయత్నం వ్యర్థం అవుతోంది.
ఆమె కళ్ళలో కనిపిస్తున్న బాధని చూసి పైశాచక ఆనందం పొందుతున్నాడు జి.కె.
కానీ అప్పటికే అతనిలో అనుమానం వచ్చింది.
ఆమె అరవదే?
బాధగాలేదా!
బాధని ఓర్చుకుంటుందా!
ఆమె ముఖం కేసి చూసాడు.
కళ్ళు గట్టిగా మూసుకుని పెదాలు బిగించి.....
దాంతో ఉద్రేకం ఎక్కువయింది జి.కె.కి.
తను బాధతో ఆరిస్తే అతను మరింత రెచ్చిపోతాడు.
ఆమె ఓర్చుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది.
అదే ఆమె చేసిన తప్పు.
జి.కె. కొవ్వొత్తి మంటని ఆమె తొడలకి తగిలేలా దగ్గర చేశాడు. చర్మంపైన రోమాలు... కాలుతున్న వాసన.
కెవ్వుమని అప్రయత్నంగా అరిచింది నాగమణి.
ఫెళ్ళుమని నవ్వాడు జి.కె.
కొవ్వొత్తి సెగ ఆమె శరీరాన్ని దహిస్తోంది, పిచ్చెక్కిపోతోంది. ఆరాక్షసుడి బారినుండి తప్పించుకునేదెలా?
మంటలు మండుతున్నాయి.
చర్మం కాలుతున్న వాసనని సుగంధ పరిమళాన్ని ఆస్వాదించినట్లు అస్వాదిస్తున్నాడు.
ఆమె కాళ్ళు వెనక్కి లాక్కోడానికి ప్రయత్నించింది.
అతనామెకుఎలాంటి అవకాశం ఇవ్వటం లేదు.
క్షుద్ర కార్యక్రమంలో మునిగిన రాక్షసుడిలా..... వికటంగా, నీచంగా వికారంగా. కృరంగా పాసవిక ఆనందాన్ని పొందుతున్నాడు. నాగమణి కళ్ళు వర్షిస్తున్నాయి.
నిస్సహాయ స్థితికి కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది.
ఇప్పుడు మునుపటి తమకం లేదు. ఉప్పెనలో కొట్టుకుపోయిన పూరిగుడిసెల్లా, దావాగ్నిలా మాడి మసైన శలభాల్లా ఆమెలోని కోరికలు సమాదైపోయినవి.
ఇప్పుడొకటి ఆలోచన.
Previous Page
Next Page