ష్... తప్పు... సహాయం చేస్తామని వచ్చిన సహ్రుదయుల్ని అలా అనకూడదు. నీవు త్వరగా లేస్తే అన్ని వివరాలు చెబుతాను" అంది బ్లాంకెట్ ని మడత పెడుతూ.
"అలాగే ...ఇదేమవుతుందో చూద్దాం ... మరి కాఫీ ఇవ్వు.... అన్నాడు వున్న చోటునుంచి కదలకుండా.
"అదేం కుదరదు. నీ పప్పులేం వుడకవ్.... శుభ్రంగా పళ్ళు తోముకొనిరా.... అప్పుడే కాఫీ .... గీసీ...."
"పళ్ళు తోముకుంటేనే కాఫీ.... తావుముకోలేదు గదా? గీఫీ ఇవ్వచ్చుగా....?
గీఫీనా ...?!" అవంతి ఆశ్చర్యపోతూ అడిగింది.
"అవును ... అంటే ఉత్తడి కాషన్ ..... ఇవ్వవా?"
"చచ్చినా ఇవ్వనూ..." అంది రిషి భుజాన్ని పట్టుకుని లేపెప్రయట్నం చేస్తూ.
"డాక్టర్ ని ప్రేమించిన వాడికి ఈ శిక్ష తప్పదు. ఏం చేస్టాం?" అంటూ గొణుక్కుంటూ వాష్ బెషణ్ నడిచాడు రిషి.
అవంతి లోలోనే నవ్వుకుంది.
* * * *
ఉదయం ఆరుగంటల సమయం......
గోపీనాథానికి ఆరింటికే లేచే అలవాటుంది. లేస్తూనే పేపర్, కాఫీ అని కలిపి అరుస్తాడు.
ఆ దినచర్య యధావిధిగా జరిగిపోయింది.
కాఫీ ఒకసారి సీస్ చేసి, కళ్ళు నులుముకుని ఒక్కో పేపర్ తీసుకుని ఆ రోజు వార్తల్ని చదవసాగాడు . ఓ పది నిమిషాలకు పేపరాన్నీ తిరగేసాడు. రాత్రి శుభోధయం పేపర్ సిటీ ఎడిషన్ ఆలస్య ప్రింట్ కావటంతో ఇంకా ఆ పేపర్ గ్రీన్ ఫీల్డ్స్ రాలేదు.
సరీగ్గా అరగంట క్రితమే శుభోదయం పేపర్స్ తో వ్యాన్స్ బయలుదేరాయి.
ఒక్కో సెంటర్ లో శుభోదయం పేపర్స్ బండిల్ ని జరవిడుస్తూ వేగంగా వెళ్ళిపోతున్నాయి వ్యాన్స్.
పేపర్ బండిల్ విప్పి సర్దుకునే కుర్రాళ్ళ దగ్గర్నుంచి . అ పేపరంటే ఇష్టపడే రీడర్స్ వరకు బ్యానర్ హెడ్డింగ్ చూసి విస్తుపోతున్నారు.
శుభోదయం మేనేజ్ మెంట్ ధైర్యానికి , తెగువకు విస్మయ పడుతున్నారు.
ఒక్కో సెంటర్ లో ముఖ్యమంత్రి అవినీతి వార్తా గుప్పమంటో౦ది.
అ ఉదయం..... ఆ నగరంలోని ప్రాజల మస్తిస్కాలు ముఖ్యమంత్రి అవినీతి పట్ల అసంతృప్తితో నిండిపోయాయి. అంతలో గోపీనాధం బెడ్ రూమ్ లోని ఫోన్ రింగయింది. గోపీనాధం కాఫీ తాగుతూ ఫోన్ అందుకున్నాడు.
మరో నిముషాలకే అతని మొఖం వివర్ణమయిపోయింది. ముందు పోన్ లో విన్న మాటల్ని నమ్మలేక పోయాడు. కాని పోన్ కి ఆవల వున్న మనిషి నమ్మకస్తుడు తమ గ్రూఫ్ కి చెందిన ఎమ్. ఎల్. ఏ. కావటంతో నమ్మక తప్పలేదు.
మరో నిమిషానికే శుబోధయం పేపర్ గోపీనాధం ముందుంది. ప్రంట్ పేజీ చూస్తూనే గ్రీన్ ఫీల్డ్స్ స్టాఫ్ షాక్ తిన్నారు. మరికొద్ది నిమిషాలకే స్టేట్ పేపర్ లాబీ కుతకుత ఉడికిపోసాగింది.
పోన్స్...... పోన్స్ ... ఒకచోట నుంచి ఒక చోటకు.
మంత్రుల నుంచి __ ఎమ్. ఎల్ ఏ. లకు.
అధికారుల నుంచి ..... అధికారులకు.....
ఎమ్. ఎల్. ఏ. ల నుంచి.... ముంఖ్యమంత్రి రెసిడెన్స్ కి......
ప్రతిపక్ష సభ్యులనుంచి __పత్రికలకి.
నిర్నిరామంగా వేలాది ఫోన్ కాల్స్ వెళ్తూనే వున్నాయి.
ఎలా సంభవం ....?
మైఖల్ రాజు రంగంలోకి దిగినా, ఇండియన్ టైమ్స్ రెసిడెంట్ ఎడిటర్ పార్టి క్యూలర్ ఈ పని మీదే వున్నా ఎలా జరిగింది....? రోజ గార్డెన్ లో రామదాసు ఏం చెప్పాడు? అంతా సర్దుబాటు చేసానన్నాడు రాజు __ ఏం చేసాడు?
ఈ పేపర్ ని నందకిషోర్ కేలా చూపించాలి?
చూసి తట్టుకోగలడా .....?
చూసి తట్టుకోవటం అలా వుంచితే పదవి ఏమవుతుంది ....? అసలే కినుక వహించి వున్న అధిష్టానవర్గం ఎలా రియాక్ట్ అవుతుంది __? అసలీపాటికి ఈ గొడవ డిల్లీకి చేరపోయే ఉంటుంది? ఎన్నో దెబ్బల్ని , అటుపోటుల్ని ఎదుర్కొని నిలిచినా నందకిషోర్ ఈసారేలా బయటపడతారు __? గోపీనాధం పిచ్చెక్కిపోయాడు. ఆలోచనలతో.
డాక్యూ మెంట్స్ , పోటోలతో సహా కుంభకోణాన్ని బయటకులాగారు, ఎలా వీలు పడింది? తప్పులు ఎక్కువగా చేసేవాడు ఎప్పుడూ శత్రువుల్ని పెంచుకోకూడదు __ మిగుల్చుకోకూడదు ...... కాని నందకిషోర్ దానిమీద శ్రద్ద వహించలేదు ఫలితం.... ?
గ్రీన్ ఫీల్డ్స్ గంభీరంగా వుంది చీమ చిటుక్కుమన్నా వినిపించేంత లోతైన నిశ్శబ్దం అలముకుందక్కడ.
త్వరగా వెళ్ళి నిద్ర లేపి విషయం చెబితే ఎత్తుగడకి సిద్దం కావచ్చు నందకిషోర్ . అసలీపాటికే రాజకీయ డ్రామా రంగేసుకోవటం ఆరంభించి వుంటుంది. ఆ ఆలోచన రాగానే గోపీనాదం వడివడిగా ఫస్ట్ ప్లోర్ కేసి సాగిపోయాడు.
* * * *
మాణిక్యం, మారప్ప, మురహరి విసిరేసినట్టుగా ఒక్కొక్కరు ఒక్కోచోట ఉన్నారు. కావాలనే విడివిడిగా ఉండి, సిండికేట్ మేం వ్యతిరేకం అన్న భావం కలిగిస్తూ శుభోదయాన్ని పూజా పత్రిలా కళ్ళకద్దు కున్నారు. రాజకీయ నాయకుడు నాలుగు కాలాలపాటు నడపగలిగితే చాలు.
ప్రజలు నమ్మేలా నటించటం .... ప్రజా ప్రతినిదుల్ని మెప్పించటం __ కావాలి......
నటన .... ముసలి కన్నీరు.... ముఖంలో చూపించలేని నాయకుడు నిలదోక్కోలేడు.
మాణిక్యం సిండికేట్ తరుపున కొందరు ఎమ్. ఎల్.ఏ. లు అప్పుడే డిల్లీకి పోన చేసి అధిష్టాన వర్గానికి పని కల్పించారు.
కాగలపని చేసే గంధర్వులు చాలా ముందే తయరయ్యారు.
ముఖ్యమంత్రి అవినీతి వార్తా ఆలస్యంగా పేపర్ కి అందటంతో సిటీ ఎడిషన్స్ లో మాత్రమె అది చోటు చేసుకుంది. దాంతో రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాల్లోనే ఆ వార్తా గుప్పుమంది.
ముఖ్యమంత్రి రాష్ట్రానికి, రాష్ట్రా ప్రజలకు మేలు చేస్తే ప్రజలు ఆశ్చర్యపోతారు.... అబ్బుర పడతారుగాని, అక్రమంగా సంపాదించుకుంటే ఎందుకు ఆశ్చర్యపడతారు? ప్రజల్లో వేడి వేడి చర్యలు ఊపందుకుకున్నాయి.
"తమిళనాడులో __ ముఖ్యంగా మద్రాసు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి రోడ్డ్లు పాడయిపోతే, వర్షాలు తగ్గినా రోజే మద్రాసు నగర రోడ్లని మరమ్మత్తు చేసేందుకు ఆ రాష్ట్రా ముఖ్యమంత్రి ఏడు కోట్లు మంజూరూ చేయటం __ రోడ్లమీద రోడ్ రోర్స్. కంకర యంత్రాలు , కార్మికులు ఊపిరి తీసుకోవటం మర్చిపోయి పనిచేయటం చూస్తున్నాం. మన రాష్ట్రా గతేమిటీ ....? రోడ్డ్లు పాడయి పదేండ్లయింది. ....." అని ఒకరన్నారు.
"ఎప్పుడైనా ముఖ్యమంత్రి గతి గురించి ముఖ్యమంత్రి ఆలోచించే నికృష్టమైన స్థితిలో మన రాష్ట్ర ముంది. రోడ్డ్లు పాడయితే హేలీకాప్టార్ లో తిరుగుతారు మన ఘనమైన ముఖ్యమంత్రి. మన రాష్ట్రా ప్రజలకు సిగ్గులేడు. లేదంటే కనబడ్డ మంత్రిని, ఎమ్. ఎల్. ఏ. ని కనబడ్డట్టు వెంటబడి కొడితేగాని పనులు జరగవు. ఈ దిక్కుమాలిన రాష్ట్రంలో ఒక అభివృధ్ధి కార్యక్రమం జరగదు....." అని మరొకరు ఈసడించుకున్నారు.
"నీకోటి తెలుసా....? తమిళనాడులో కాంట్రాక్టర్స్ రోడ్డ్లువేసి మిగుల్చుకుంటే __ మన రాష్ట్రంలో మిగుల్చుకుని మిగిలిన దానితో రోడ్డ్లు వేస్తారు. ఛీ.... ఛీ.... వెధవ రాష్ట్రం....."
ఇలా ప్రజల్లో అసంతృప్తి అసహనం, చోటు చేసుకోసాగాయి.
"మాజీ ముఖ్యమంత్రి కొంపలోని కోట్లు పొతే ప్రజల కేమిటినష్టం ...? ఉన్న ముఖ్యమంత్రి వాటిని పట్టుకుంటే ఏమిటి లాభం ప్రజలకు ....? విదేశం నుంచి వస్తూ అరవై పెట్టెలు తనిఖీ లేకుండా తెచ్చుకున్నారని మరొకరు అసలు వీళ్ళకు బుద్దుందా? తినేది అన్నమా? గడ్డా? అరె.... ప్రజల సమస్యలేమిటి? బాధలేమిటి? అవసరాలేమిటి? అనే విషయాలు మరచి పిచ్చికుక్కలా పిచ్చి విషయాలపై తమ దృష్టిని కేంద్రీకరిస్తారా ? చెప్పుతో కొట్టాలి ....."
ఎక్కడ చూసినా ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
మొత్తానికి .... చివరకు ..... నందకిషోర్ శుబోధయాన్ని చూసారు. అది తనకు అశుభం అని ఒక్క క్షణమనుకున్నారు __ అంతే __ ఆ వెంటనే తన ఆలోచనలకూ పదును పెట్టసాగాడు.
తను చేసిందేమీ చిన్న కుంభకోణం కాదు. ఇరువర్గాలకు కోట్లకు కోట్లు మిగిలే ఫైళ్ళమీద సంతకాలు చేసాడు. తను కోట్లు మ్రింగేసినట్లు ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. కోడిగ్రుడ్డుకి ఈకలు తీసే అధిష్టాన వర్గానికి తను ఎంత మిగిల్చుకున్నది తెలుస్కోవటం పెద్ద కష్టం కాదు. అధిష్టాన వర్గానికి కాని __ పార్టీకిగాని , అధిష్టాన వర్గంలోని సభ్యులకు గాని పైసా విదల్చలేదు.
ఎంతోకొంత విదిలించి ఉండవలసింది. జరగవలసింది జరిగి పోయింది రెండు మూడు రోజుల్లో అధిష్టాన వర్గంనుంచి తనకు తాఖీదు రావటం ఖాయం ఈపాటికే తన మీద కేసుని బిల్దఫ్ చేసే ఉంటారు. ఎలా దీనినుంచి బయట పడటం? నందకిషోర్ అలా ఆలోచిస్తున్నంతలో గోపీనాధం అందోళనగా వచ్చాడక్కడికి .
"ఇదివరకులా కాకా ఈసారి సీరియస్ అయ్యేలా ఉందని గూఢచారి వర్గాల కధనం నేను మొత్తుకుంటూనే ఉన్నాను. లాగేసిన ఎమౌంట్ లో కొంత పార్టీకి పంచేయమని నువ్వు వినలేదు. శత్రువుల్ని పెంచుకోవద్దని చెప్పాను. వినలేదు ఈసారి పదవి చేజారిపోవటం ఖాయం. ఈమధ్య నువ్వు పెడసరంగా వ్యవహరిస్తున్నావ్ . నీలో అహం బాగా పెరిగిపోయింది. శుబోధయం లోపల పేజీల్లో ఏం వ్రాసారో చూసావా?" గోపీనాథం. తన మందలింపు చివర ఆ ప్రశ్న వేసాడు.
ఏం వ్రాసారు? లాండ్ సీలింగ్ గురిమ్చేగా?" నందకిషోర్ ఒకింత అసహానాన్ని ప్రదరిస్తూ అడిగాడు.