ప్రతి ముఖ్యమంత్రి రెండు రకాల పత్రికల్ని ఆశిస్తాడు. ఒక పత్రిక తన పార్టీకి అండగా ఉండాలని __ మరో పత్రిక వ్యక్తిగతంగా తనకు అండగా ఉండాలని.
పార్టీని కాపుకాసే పత్రిక మూలంగా ప్రతిపక్షల్ని ఎదుర్కోంటాడు. తనను కాపుకాసే పత్రిక మూలంగా తన పదవిని కాపాడుకుంటాడు. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ ప్రాంతీయ భాషల్లో దినపత్రిక ని నడిపే యజమానికి అర్హత ఉన్నా లేకపోయినా అతని పత్రికని తమపార్టీకి బాగాకా వుపయోగిచుకునేందుకు అతనికి రాజ్యసభ సభ్యత్వం కల్పిస్తుంది. అతను రాజ్యసభ మేమ్బరాయి, తన పత్రికని అధికార పార్టీకి బాకగా మర్చి, తను డిల్లీ , రాష్ట్రా రాజదానుల లెవల్లో పైరవీలు చేసుకుంటూ బ్రతికేస్తుంటాడు. ఈ దిగజారుడుతనం ప్రతి రాష్ట్రంలోనూ వుంది. ప్రతి రాష్ట్రంలో కొన్ని దినపత్రికలు తాకట్టు పెట్టబడ్డాయి.
అలాగే ఇక్కడ నందకిషోర్ వ్యక్తిగతంగా సపోర్టు ఇచ్చేది టైమ్స్ పేపర్ ఆఫీసుకి వెళ్ళి, కొన్ని సూచనల్ని , తన ఆఫీసుకి వెళ్ళిపోయాడు.
ఆ క్షణం నుంచి రెసిడెంట్ ఎడిటర్ ముఖ్యమంత్రి నందకిషోర్ కి వ్యతిరేఖంగా రానున్న వార్తకోసం ఎదురుచూడసాగారు. ముఖ్యమంత్రి మైఖల్ ర్రాజు పంపుతున్న మామూళ్ళని ఏ నెలకానెల మాయం చేస్తున్నా రెసిడెంట్ ఎడిటర్ అన్ని పత్రికలకి పోన్స్ చేసి తనకు, తెల్సినవార్ని లైన్ మీదకు పిలిపించుకుని, ముఖ్యమంత్రికి వ్యతిరేఖంగా న్యూస్ వస్తే తనకు తెలిపపర్చకుండా ప్రింట్ చేయవద్దని చెప్పేసాడు.
రెసిడెంట్ ఎడిటర్ ఈ పని చేసింది తనకు సంచులు అందుతాయనే ఆశతోనే కాదు __ మైఖల్ రాజు, తను పనిచేసే ఇండియన్ టైమ్స్ ప్రతికాదినేతకు అప్తుడనే భయంతో కూడా.
మొత్తానికి చకచకా అన్ని పనులు, చర్యలు నందకిషోర్ అనుకూలంగా జరగిపోతున్నాయి.
* * * * *
అదే రోజు సాయంత్రం......
సిటీకి ఎనభై కిలోమీటర్ల దూరంలో.... మరప్ప తమ్ముడు రామదాసు అలసిపోయేవరకు ఆ చుట్టూ ప్రక్కల పొలాల్ని చూపించి సంతృప్తి పరిచాడు. ఆ ఆనందాన్ని తట్టుకోలేని టైమ్ లో పీటర్ స్కాచ్ అందించాడు. రామదాసు ఫ్రీగా వస్తే ఫినాయిల్ త్రాగే రకం పుల్ గా తాగేసాడు __ ఆపైన తిన్నాడు __ గుర్రుపేట్టి నిద్రపోయాడు సాయంత్రం ఏడు గంటలకు నిద్రలేచాడు.
కారు నగరానికేసి బయలు దేరింది.
ఇరవై కిలోమీటర్ల ప్రయాణించాక ఒక పంజాబి డాబా హొటల్ ముందు కారు ఆగింది. మారప్ప తమ్ముడు రాదదాసు కి మరో షేగ్ అందించాడు. దాన్ని తీసుకుని ఆపైన కరం బాగా దట్టించిన చికెన్ ముక్కల్ని నమ్జుకున్నాడు. టైమ్ ఎనిమిదయింది. తిరిగి కారు బయలుదేరింది.
సిటీలో , సెక్రటేరియేట్ లో , గూఢచారి విభాగంలో , గ్రీన్ ఫీల్డ్స్ లో , మైఖల్ రాజు ఆఫీసులో, ఇండియన్ టైమ్స్ రెసిడెంట్ ఎడిటర్ రూమ్ లో ఏం జరుగుతోందో రామదాసు తెలీదు తెలిసినా భయపడకుండా నిషాలో రామదాసున్నాడు.
కారు నెమ్మదిగానే నగరానికేసి రాసాగింది.
* * * * *
రాత్రి ఎనిమిదన్నర గంటలకు సూర్యోదయం అనే పత్రికనుంచి ఓ ఫోన్ కాల్ ఇండియన్ టైమ్స్ రెసిడెంట్ ఎడిటర్ కి వెళ్ళింది.
"ఏమిటి....? ఏమన్నా తెలిసిందా!" రెసిడెంట్ ఎడిటర్ అడిగాడు ఆతృతగా .
"తెలిసింది __ ఈ రాత్రి సరీగ్గా పదిగంటలకు రోజ్ గార్డెన్ కి జర్నలిస్టుల్ని రమ్మని రామదాసు సెక్రటరీ అందరికీ ఫోన్ చేసి చెప్పాడట. "
"ఆహా... ఏ విషయం గురించి .....?"
"తెలీదు "
"సరే... అయితే... ఒక పని చెయ్ ...."
"చెప్పండి"
రాత్రి పదిగంటల ప్రెస్ మీట్ లో రామదాసు ఏం చెప్పినా అది పత్రికల్లో రాకూడదు. కనీసం డెస్క్ వరకు కూడా వెళ్ళకూడదు. నీకు అందవలసిన వుదయమే అందుతుంది. ప్రెస్ మిట్ కాగానే వచ్చినవారని బార్ కి తీసుకువెళ్ళు __ రాని వార్ని వేరే విధంగా సంతృప్తి పరచు. వినని వాళ్ళని, నిజాయితీ పరులని బ్రతిమాలాడు. మొత్తానికి ఈ రాత్రి పదిగంటలకు రోజ్ గార్డెన్ లో రామదాసుగారు చెప్పింది పత్రికల్లో రాకూడదు. నీమేలు నేనే కాదు నందకిషోర్ జీ __ మైఖల్ రాజు గారు మరచిపోరు మారాలా నీ నుంచి పదిన్నరకి పోన కాల ఎక్స్ పెక్ట్ చేస్తాను బై......" రెసిడెంట్ ఎడిటర్ పోన పెట్టేసాడు.
** ** ** **
గ్రీన్ ఫీల్డ్ బంగ్లా .......
టెర్రస్ మీద నమ్దకిశావురం, గోపీనాథ్, చీఫ్ సెక్రటరీ యోగేంద్రసిన్హా కార్పెట్ లాం మెడ వేసి వున్న కుర్చీల్లో కూర్చున్నారు.
టెర్రస్ చుట్టూ, పిట్టగోడమీద రెండడుగులు ఎత్తులో అల్యూమినియమ్ పోల్స్ కున్న లైట్స్ వెలుగుతున్నాయి.
వాటి కాంతి కోపంగా వున్న నందకిషోర్ మొఖం మీద పడిజేవురురంగులో కనిపిస్తోంది. విషయం చాలా సీరయస్ గా వుంది. అంతకుముందే వచ్చిన చీఫ్ సెక్రటరీ భావించాడు.
రాష్ట్రా రాజకీయాల రంగు మారబోతుంది. అధిష్టాన వర్గంలోని శక్తులు తమ ప్రభావాన్ని నా మీద చూపించబోతున్నాయి. కారణాల కోసంపొంచి ఉన్నారు. అసలు మా పార్టీలోనే ఈ అనాచారముంది ప్రైమ్ మినిష్టారా? అధిశాన వర్గమా? లేక రాష్ట్రా అసెంభ్లీ ఎన్నిక కాబడ్డ శాసన సభాసభ్యులా ? అధిష్టాన వర్గంలో ఎవరుంటారో తెలుసా? ఆయా రాష్ట్రా రాజకీయాల్ల్లో పనికిరాక __ పనిలేని గుంటనక్కలు వీళ్ళకు చావు తెలివితేటలు తప్ప తమ రాష్ట్రాల ప్రజల్లో అభిమానముండదు.
వీళ్ళు రాష్ట్రాలకు పెద్ద పరీశీలకుల హొదాలో వస్తారు. వీళ్ళకు ముడుపులు చెల్లించాలి __ ముందు పార్టీ లివ్వాలి __ అవసరమైతే అందమైన అమ్మాయిల్ని పంపించాలి. రాష్ట్రాలని ఏలే మాలాంటి రాజకీయనాయకులు గొప్పవాళ్ళని మేమే అనటంలేదు. ఆ మాట కొస్తే రాజకీయ నయుకుల్లో గొప్పవాళ్ళు ఎవరునారు? కాని నీళ్ళ పెత్తనమెంటి....? చూస్తా..... వీళ్ళు నా పదవికి ఎలా ఎవరు పెడతారో చూస్తాను __ నా సత్తా ఏమిటో, తెలివి తేటలేమిటో నిరూపిస్తాను. ఆ మాణిక్యం ఏం చేస్తాడో చూస్తాను...." నిప్పులు కక్కుతున్నాడు నందకిషోర్. సాధారణంగా నిగ్రహాన్ని కోల్పోయి ముఖ్యమంత్రి అలా ఫైరవ్వటం, చాలా రేర్ కావటంతో చీఫ్ సెక్రటరీ విస్తుపోయాడు.
అంతలో కార్డ్ లేస్ పోన్ రింగయింది. గోపినాథం చటుక్కున అందుకుని ఫోన్ కి ఆ వేపున ఉన్నది మైఖల్ రాజాగా గుర్తించి నందకిషోర్ కిచ్చేశాడు పోన్.
మైఖల్ రాజు చెప్పేది ఐదు నిమిషాలు పాటు విని అప్పుడన్నాడు __ "రాజకీయనాయుకుడికి ఈ ప్రపంచంలో పదవికన్నా గొప్పది మరేదీ లేదు. జన్మనిచ్చే తల్లిదండ్రులకన్నా , జీవితాన్ని పంచుకునే భార్యకన్నా, పున్నమనరకంనుంచి తప్పించే బిడ్డలకన్నా, తోడబుట్టిన వాళ్ళకన్నా, మంచికన్నా, మానవత్వం కన్నా, వ్యక్తిత్వం కన్న గొప్పది అధికారం. ఆ అధికారం నా చేతుల నుంచి జారిపోతుందని తెలసి ఊరుకోలేను . ఎంతకయినా తెగిస్తాను. ఏమైనా చేస్తాను ఏ స్థాయికైనా దిగజారిపోతాను. భారతదేశపు సగటు రాజకీయ నాయుకుడి నేనేం కొత్త భాష్యం చెప్పలనుకోవటం లేదు.
అంతదాకా ఎందుకు __ చచ్చి సమాధి అయిపోయిన రాజకీయ నాయకుడి సమాధి అధికారపు వాసన చూపించండి. శవం లేచి కూర్చుని ప్రమాణ స్వీకారం ఎప్పుడాడంటుంది ఏమేం చేయాలో అన్నీ చెయ్...... అందుకు ఏం అవసరమైన జంకవద్దు __ డబ్బు __ బలగం __ అధికారం __ ఏమైనా నీకు అందుతాయి. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్ __ కిడ్నాపులు, హత్యలు అన్యాయాలు ఆశ్రమాలు __ ఏమైనా ఫర్వాలేదు నీ పనులకు న మోహరుంటుంది. మా వాడు నీ దగ్గరే ఉన్నాడుగదా....?"
"...................."
"ఓ.కే .... గో హెడ్ ..... ఈ రాత్రి నాకు నిద్దర ఉండదు. ప్రతిక్షణం నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తుంటాను. బై...." నందకిషోర్ పోన్ పెట్టేశాడు.
రాష్ట్రా రాజధాని రాజకీయాల్లో సంచలనం చెలరేగింది. దాదాపు ఎమ్. ఎల్. ఏ. మంత్రులకు కార్పోరేషన్ చైర్ మెన్స్ కి , అందరికీ ఈ విషయం తెలిసిపోయింది.
ఏదో జరగబోయింది.......
ఎక్కడో ముసలం పుట్టింది........
ఆ ముసలం నందకిషోర్ ని పదవీచ్యుతుడ్ని చేయడానికి దూసుకువస్తోంది. చూడాలి.... ఈ సారి నందకిషోర్ ఎలా తప్పించుకుంటాడని కొందరు.....
ఏ ముసలం అతన్నేం చేయలేదని ఇంకొందరు పందాలు కాచుకోవటం మొదలయింది.
స్టేట్ పవర్ లాబీ వేడెక్కుపోతుంది.
రక్తసిక్తమయ్యే యుద్ధం ఆరంభం కాబోతోంది. "ది బ్లడీఎస్ట చా పర్ట్ ఇన్ ది కట్ త్రోట్ పోలోతకల్ వాడ బిగిన్స్" అన్నాడు. నందకిషోర్ గంభీరంగా.
* * * *
అటు మాణిక్యం కేంప్ లో కూడా వెడందుకుంది. ఎత్తుకు పైఎత్తులు ఊపందుకున్నాయి.
పదినిమిషాలు క్రితమే డిల్లీ నుంచి మాణిక్యానికి ఓ పోన్ కాల వచ్చింది.