Previous Page Next Page 
అసిధార పేజి 6

  

  నాలుగున్నరకి విజయ్ నిద్రపోయాడు ఓ పక్క తెల్లవారుతుండగా.

                                                                           4

    సాయంత్రం అయిదుగంటలు దాతుతున్నది.

    నిర్మానుష్యంగా వున్న ఆచోట వాళ్ళయిదుగురూ చేరారు.

    విజయ్, కమల్ నాథ్ . సుబ్బారావు , కృత్తిక , నిశ్చల,  వాళ్ళయిదు పేర్లు అవి వాళ్ళంతా ప్రాణ మిత్రులు. అంతేగాక రెండుజంటలు కాబోయేవారు. కలసి మెలసి తిరుగుతున్నా నమవ అస్కులు . 

    కమల్ నాథ్ బియస్సీ ఫస్టు క్లాస్ లో శాఫ్ అయాడు. పిలిచి పిల్ల నిస్తానని చాలామందే వచ్చారుగాని ప్యూన్ పనికికూడా ఎవరూ పిలవలేదు. కమల్ ఫస్ట్ క్లాస్ నిరుద్యోగి.

    సుబ్బారావు ఇంటర్ పాస్ అయి ఇంటిపట్టునే వుండిపోయిన వాడు. "సుబ్బాయ్ ! నువ్వు అచ్చం మీ తాతగారి పోలికరా! ఆయనేలాగూ నాకు దూరం అయ్యారు. నువ్వు నాకు దూరం కాకురా  తండ్రీ!" అనివాళ్ళ బామ్మ సుబ్బారావుని ఇంట్లో  కట్టిపడేసి పాలు పెరుగు తీపి పిండివంటలు తెగ తినిపించి పీనుగులా వున్నవాడివి ఏనుగుపిల్లలా చేసింది. యీమధ్య పెల్లిం చేస్తానని కూర్చుంది.

    సుబ్బారావు బామ్మకి లకారందాకా ఆస్థివుంది. బామ్మ టపాకట్టిన మరుక్షణం లకారం సుబ్బరావుదే సుబ్బారావు తల్లీతండ్రి కూడబలుకున్నట్లు ఒకేసారి పోవటంతో స్వరం బామ్మే అయింది.సుబ్బారావు కమల్ లాగా చాకులాంటి శరీరంతో గట్టిగా వుండడు. విజయ్ లాగా భారీ మనిషి కాడు. పొట్టిగా లావుగా కాస్త పెద్ద తలకాయతో వుంటాడు. తెల్లగా అందంగా గుమ్మడిపండులా వుంటాడు. సుబ్బారావు పేరు సమయానుకూలంగా మారిపోతుంటుంది. సుబ్భ్! సుబ్బాయ్ సుబ్బుడు! సుబ్రావ్! అన్నీ సుబ్బారావే జోకులేస్తుంటాడు. బొత్తిగా కోపంలేదు . రవంత పిరికి.

    కృత్తిక  వాళ్ళ అమ్మా నాన్న ఆరొందలపేర్లు ఆలోచించి ....... చించి ...... కృత్తిక కార్తెలో పుట్టింది కృత్తికా నక్షత్రం అని చివరికి కృత్తికా అని పేరు పేట్టి కృతి అని పిలిస్తుంతారు ఇంతా. బైట, గడుగ్గాయని గట్టిపిల్లని కొండోకచో చిన్నసైజు రాక్షసి అని పలురకాల పేర్లు తెచ్చుకుంది. చెడుమార్ ఎవరన్నా సరే చెప్పు చేతిలోకి తీసుకుంటుంది. మనిషన్న తర్వాత చాలా నేర్చుకుని వుండాలంటుంది. అసంపూర్తిగా అన్ని విద్యలో వేలుపేట్టి వదిలేసింది. ప్రస్తుతం విజయ్ ని ప్రేమిస్తూ ప్రేమలో మెళుకవలు ప్రేమలో తృప్తి ప్రేమించు ప్రేమకై ఆతన కవిత్వం బట్టీపడుతున్నది.

    కృత్తిక స్నేహితురాలు నిశ్చల. "నీ అడుగుజాడల్లోనే నడుస్తానే కృతీ!" అని ఓ మంచి ముహూర్తం చూసి చెప్పి ఆటగాడూ ప్రేమించడం మొదలుపెట్టాడు.

    నిశ్చల పేరుముందు చాలా కధకమామిషే వుంది. నిశ్చల అసలు పేరు వీరవరహావెంకటలక్ష్మినాగసుబ్బరత్నం. నిశ్చలపుట్టంగానే అందరిపిల్లల్లాగా ఏడవలేదు. డాక్టరమ్మ గిల్లీగిచ్చి నాలుగు వుతికినా ఆ పిల్లాడి ఏడవకపోవటంతో ఆ ద్కాక్తరమ్మాగారు నిశ్చలంగా నిలబడిపోయింది. ఆ పిల్లదాని చేష్టలు అర్ధంగాక తల్లి తండ్రి తదితరులు అదేపని చేశారు. ఈ పిల్లదానికి ప్రాణం వుందికాని ఏడవదు. ఇదేదో పెద్దలోపమే అనుకుంటుండగా అందరూ హడలి చచ్చేటట్టు కెరుకేరుమని ఏడవటం మొదలుపెట్టింది. ఆ దెబ్బతో అందరిలో చలనం వచ్చింది.

    పెద్దవాళ్ళమాట తీసేయలేక చచ్చినోళ్ళు బతికున్నోళ్ళు అందరి పేర్లూ కలిపి "వీరవరహావెంకటలక్ష్మి నాగసుబ్బరత్నం" అని అందరిముందూ నామకరణం చేసి ఆపై ప్యాషన్ గా ఏం పేరు పేట్టి పిలవాలో తెలియక ఆ పిల్లదానికి ఆరేళ్ళు  వచ్చిందాకా ఆగాడు వాళ్ళ నాన్న. చూసి రామ్మతే ఆ పిల్ల కాల్చివచ్చే రకంగా తయారయింది. అన్నింటిలో అందరికన్నా ఓ అడుగు ముందే వేస్తుంది. తోణకదు బెణకదు . కాలుచెయ్యి  నోరు ఏదీ నిముషం వూరుకొదు. ఇదంతా చూసి ఓ  రోజు వాళ్ళమ్మ తన ముక్కు మీదనే వేలువేసుకునిబోలేడు ఆశ్చర్యపోతూ తన భర్తతో అంది "భూమిమీద పడ్డా అరగంట దాకా అంత నిశ్చలంగా వుంది. ఇది చలనంలేని పిల్లని భయపడ్డాను దీని వ్యవహారం చూస్తుంటే పిల్లా పిడుగా అనిపిస్తున్నది. నిశ్చలంగా వున్న పిల్ల.

    ఆమె మాటలు పూర్తీగాకముందే నిశ్చల నాన్నగారు గాలిలో గంతేసి గావుకేకకొకటి పేట్టి "మనమ్మాయికి ఫ్యాషన్  పేరు సరికొత్త పేరు వచ్చిందేవ్ నిశ్చల ఇహనుంచీ ఈ పేరుతోనే పిలుద్దాం." అన్నాడు. వీరవరహా వేంకటలక్ష్మి నాగ సుబ్బరత్నం సుబ్బరంగా ఆ క్షణం నుంచే నిశ్చల అయిపోయింది. నిశ్చల అసలు పేరు వాళ్ళఅమ్మ నాన్నే మర్చిపోయారు. ఊళ్ళో వాళ్ళకి నామకరణం రోజు చేసిన విందులో బొబ్బట్లు . పులిహోర గుర్తున్నాయిగాని నిశ్చలఅసలుపేరు మర్చిపోయారు.

    విజయ్ రామతారక గురించి చెప్పేదేంలేదు. సింద్ బాద్ కథల నుండి సింగినాదం కథలవరకూ చదివి చదివి అలాంటి సాహస యాత్రలు చేస్తే బాగుండునన్న కోరిక కలవాడు ఆ తోచన తప్ప ఆచరించనివాడు . అన్నింటిలో ఆరంభశూరక్వమే ఎరిగినవాడు దేంట్లో చెయ్యి పెట్టినా కలసిరాలేదు. ఏదో చేయాలన్న తపన ఏదీ చెయ్యక కాలయాపన ఉద్యోగం వస్తే కృతిని తన అర్దాంగిగా చేసుకుందామని  అత్తా కూతుళ్ళని అయిదు ఆమడల దూరాన వుంచుదామని చాలాదూరం ఆలోచన చేసి కృతిని ప్రేమిస్తూ వుండిపోయాడు.

    వీళ్ళయిదుగురూ ఎప్పుడు ఎక్కడ చేరినా రకరకాల కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ కాలక్షేపం చేసేవారు.

    ప్రస్తుతం సీరియస్ గా చర్చించుకుంటున్నారు.

    విజయ్ చెప్పటం మొదలు పెట్టాడు.

    "ఆ రోజు మ తాతగారు చెప్పిందంతా మీకు చెప్పాను విన్నారు. కదా! నేచేసిన అతిచిన్న పొరపాటు ఎంత అనర్దానికి దారితీసిందో చూడండి ! నాకు బాగా గుర్తు తాతగారు చివరిదశలో వుండి అస్తవ్యస్తంగా మాట్లాడుతున్నారనే ఆపోహతో వుండి మరో ఆలోచన చేస్తూ వుండిపోయాను అయినా చెవిలో రెండుమూడు మాటలు దూరాయి. ఈ ప్రదేశాలలో జాగ్రత్తగా వుండాలి. సరీగ యిక్కడే ఆపద ఆదాటుగా వచ్చి మీద పడేది. మార్గంలో సరీగా లేకపోయినా ఆపద తగు జాగ్రత్తగా వహిస్తే తెలీగ్గా వెళ్ళవచ్చు ఇలాంటి మాటలు విన్నాను"

    "ఏడవలేక పోయావ్! కావాల్సిన మేటర్ వదిలేసి మధ్యలో మాటలు విన్నాడుట. ఇలాంటి ముఖ్యమయిన వాటిని జాగ్రత్తగా  వినాలిరా విజయ్!" సుబ్బారావు పెద్దతరహగా మందలించారు.

    "మార్గం సరిగా లేకపోయినా ఆపదలెదురైనా ఫరవలేదురా విజయ్! డోంట్ వర్రీ ! మీ తాతగారు ఆ నగరానికి వెళ్ళే మార్గం అయినా చెప్పివుంటారు. అది చాలు మనకి" కమల్ విజయ్ భుజం తడుతూ అన్నాడు.

    విజయ్ ముఖంలో వుడాసీత చోటుచేసుకుంది.

    "సారీరా కమల్! అన్నింటిలో ముందుకు దూకే నేను తాతగారు మరణిస్తున్నారనే విచారంతో ఆయనకు సంధి పుట్టిందన్న అపోహతోపరధ్యానం వహించాను. సరీగ అప్పుడే తాతగారు నగర విశేషాలు వెళ్ళే మార్గంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పివుంటారు. రెండు మూడు మాటలు చెవిలో పడ్డాయి. తాడు లేకుండా బొంగరం తిప్పటం ఎలాగురా!"

    ప్రతత్నిస్తే చేత్తో తిప్పోచ్చురా నాన్నా!" సుబ్బారావు జోకేశాడు కాని అది పేలలేదు.

    "అప్పుడు నా మనసు బాగుండలేదు. సరే కనీసం సందూకాపెట్టెలో వున్న కాగితాలయినా భద్రంగా వున్నాయో అంతే అవికొన్ని శిధిలావస్థలో మరికొన్ని రూపుమారిపోయి వున్నాయేమో. మనయిదుగురిదీ ఒకేమాట ఒకేబాట ఒకే ప్రాణం . అందుకే జరిగింది మీతో చెప్పుకున్నానురా! మీరూ చూస్తున్నారుకడా ఈ ఆధారాలతో తుదీ మొదలూలేని ఈ రాట పట్టుకుని ఏ చేయాలో తెలియక మతి పోతున్నది."

    "విజయ్ నీ ఆవేశం ఏమయింది ? నీ ముందు చూపు ఏమయింది? మొండిగా ప్రవర్తించే నీవు దేనికీ కేర్ చేయని నీవు. జావాకారిపోతున్నావేమిటి? సిగ్గు సిగ్గు. అందరం కలిపి మార్గం ఆలోచిద్దాం" కృతి అంది ధైర్యం చెపుతున్న తీరులో.

    "సమయంలేదు కృతీ?"

    "సమయంలేదా దేనికి? అంత తొందరేముంది? తీరిగ్గా ఈ కాగితాలతో కుస్తీ పట్టి విషయం తెలుద్దాము" నిశ్చల తాపీగా అంది.

    "అవతల ప్రమాదం ముంచుకోస్తుంటే . తీరికగా అలోచించటమా! ఉహూ నావల్లకాదు " విజయ్ తల విదిలిస్తూ అన్నాడు.

    "ప్రమాదమా?" నిశ్చల. కృతి ఒకేసారి అన్నారు.

    "అవును ప్రమాదమే . ఘోర ప్రమాదం ఏదో ఓ అత్తయ్య కూతురితో అవులేళ్ళు౦డి నా పెళ్ళి "

    "పెళ్ళా?" తెల్లబోయాడు కమల్.

    "కొంపమునిగింది నాయినొయ్ వీడిమతిపోయింది దేముడోయ్!" ఇప్పుడేం చేయాలి రాముడోయ్!" సుబ్బారావు రాగం అందుకున్నాడు.

    "సుబ్బా! సమయం సందర్భం చూడకుండా జోకులేయ్యకు రాగాలు తియ్యకు " అని సుబ్బారావుని కోప్పడి విజయ్ వేపు తిరిగి "విజయ్ మనమధ్య ఎవరడ్డు వచ్చినా సరే ముల్లోకాలు ఎదురించి నిన్నే పెళ్ళాడుతా నన్న వాడివేనా అవులేళ్ళు౦డి నా పెళ్ళి అని తీరుబడిగా చెపుతున్నావ్! నీ కష్ట౦లేంది నీ అత్తయ్య కూతురయేది టాటాబిర్లాగార్లమనుమరాలయేది పేళ్ళట్లా అవుతుందట! చెప్పు విజయ్ చెప్పు?" ఆవేశంగా అంది  కృతి.

    "నీ పక్కన నీకు తోడుగానే వున్నాను. పెళ్ళిగిళ్ళిఅంటున్నాడు.  అదేమిటో ముందు గట్టిగా తేల్చుకో కృతీ!" ఎందుకైనా మంచిదని ముందు చూపుతో చీర కొంగు నడుంకి దోపుతూ అంది నిశ్చల.

 Previous Page Next Page