Previous Page Next Page 
అసిధార పేజి 7

   

  "వాడు చెప్పేది సాంతం వినకుండా మధ్యలో మీగోల ఏమిటర్రా ఆడవాళ్ళతో వచ్చిన చిక్కేయిది. వాళ్ళకి తోచదు చెపితే వినరు. మీ ఆవేశం ప్రేమలో చూపిస్తే బాగుంటుందిగాని పెడర్ధాలు తీస్తే బాగుండదు మైండిట్! చెప్పరా విజయ్ యింక వివరంగా చెప్పు పానకంలో పుడుకలా ఈ పెళ్ళి గోలేంటిట మధ్యలో?" కమల అడిగాడు.

    "తాతగారి గదిలోంచి బైటికి రాంగానే అందరూ తాతగారు ఎం చెప్పారంటూ చుట్టూ మూగారు. నోటికి వచ్చిన అబద్ధం ఆడాను. నన్ను తొందరలో పెళ్ళి చేసుకోమన్నారు పుట్టిన బిడ్డకి తనపేరు పెట్టమన్నారని అదే నా కొంపదీసింది."

    "బస్. స్వరం అర్దమైంది. అతిచిన్న అబద్దం నీ ప్రాణం మీదకి వచ్చింది . హైటు వేయిటు అందం చందం వున్న వాడివి ఆస్తి మొత్తానికి ఏకైక వారుసుడువి . నీ లాంటి బంగారు పిచ్చుకుని ఎవరైనా వదులుతారా! అందుకే నీ మరదళ్ళు మాటలతో పగ్గాలు చూపులతో వలలువేసి వేధిస్తున్నారు. ఇదే సండను మీ అత్తయ్య మావయ్యలు మా అమ్మాయిని చేసుకోమంటే మా అమ్మాయిని చేసుకోమని వత్తిడి తెచ్చి వుంటారు . నీ పెళ్ళి అనే అబద్దం కూత కాదుగాని ఈసరికి మీ ఇంట్లో పలు పార్టీలు ఏర్పడి వుంటాయి. దానాదీనా నీ పై నిర్ణయం వదిలి దానికి ముహూర్తం అవులేళ్ళు౦డికి పేట్టి వుంటారు. యా మై కరెక్ట్?"

    కమల్ అనంగానే "సరిగా జరిగింది అదేరా! నా నిర్ణయం చెప్పకపోతే యిమ్ట్లో అందరికీ కోపం వస్తుంది. పరిస్థితులు చాలా దూరం పోతాయి. ఈ పెళ్ళిగోల ఎలా తప్పించుకోవాలి తెలియటం లేదు" అన్నాడు విజయ్.

    "వెరీ సింపుల్ . కృతి మేడలో తాళికట్టి అవులేళ్ళు౦డి వాళ్ళ ముందుకు వెళ్ళండి" సుబ్బారావు విచిత సలహా ఇచ్చాడు.

    "వుహూ. ముందు తాతగారి కోర్కె నేరవేర్చాలనే దృఢనిశ్చయంతో వున్నాను. ఇటు కృతిని పెళ్ళాడి ఆమెని వదిలి యాత్రకి వెళ్ళాలంటే ఎంత బాధాకరమైన విషయం అసాహసయాత్ర మార్గం మధ్యలో న అప్రానం హరీ ......"

    చటుక్కున విజయ్ నోరు మూసింది కృతి.

    "విజయ్! నన్ను వదిలి నీవు వెలగాలవేమోగాని నిన్ను వదిలి నెవుండటంవల్ల మన పెళ్ళికేం తొందరలేదు. ముందు ఈ ప్రమాదం తప్పి పోయే మార్గం ఆపై ప్రయాణానికి పోయే మార్గం ఆలోచించు. నీ వెంట నె రావటం ఖాయం " అంది కృతి.

    "ముందీ విషయం చెప్పు కమల్ . నీ ముగ్గురూ వెళ్ళటానికి ముందే నిశ్చయించుకుని చర్చలోకి దిగారు. మా దగ్గర రహస్యాలు దాచారుకాబట్టి ఈ రోజు మ ఇద్దరితోను చెప్పారు అవునా" నిశ్చల అడిగింది.

    "ఎస్" కమల్ ఒప్పుకున్నాడు.

    "సరే మా నిర్ణయం వినండి. నేను కృతి ఆడపిల్లలంగాని అబలలం కాదు........"

    సుబ్బారావు అందుకుని "ఆడపిల్లలేని ఖర్మ ఆడపులులు అమ్మో ఇద్దరూ ఇద్దరే" అన్నాడు.

    "సుబ్బూ! ఈ ఒక్క విషయం కరెక్ట్ గా చెప్పావ్! విన్నావుగా కమల్ నీవు కూడా జాగ్రత్తగా విను విజయ్! నేను కృతి మీతో వస్తున్నాము. స్రీ కృష్టుడు డంతటి వాడు యుద్దంలో మూర్చబోతే సత్యబామ మారణాయుధాలు అందుకుని యుద్ధం చేసింది తెలుసా!" నిశ్చల అనంగానే కృతి అందుకుంది.

    "విజయ్! ఆ వచ్చే ప్రమాదమేదో పెళ్ళి అన్న అబద్దం మాటతోనే నీకు వచ్చిపడింది. నీ కొస్తే నా కొచ్చినట్ట్లే. మమ్మల్ని కాదని మీరు ప్రయాణమైతే మేమూరుకోము. మీతో మేం రావటానికి ఇప్పుడే ఇక్కడే ప్రామిసి చేయండి. కాదంటే మేమేళ్ళి ఈ విషయం మీ యింట్లో చేపుతాం."

    "నేముందే చెప్పానా వీళ్ళు అడ పిల్లలు కాదు . ఇప్పుడే ఈనిన అడ పులులు లాంటి వారని!" సుబ్బారావు అనంగానే ఇరువురూ గుర్రుమన్నట్లుగా చూశారు సుబ్బారావు వేపు.

    "ఓ.కే ! ఓ.కే! మీ మాటకాదని ఎం చెయ్యంగాని, ప్రస్తుతం ఎం చేయాలన్నది కాస్త దీర్ఘాలోచన చేద్దాం." అన్నాడు విజయ్.

    అందరూ ఆలోచనలో మునిగి పోయారు.

    "వచ్చిందిరోయ్!" ముందుగా సుబ్బారావు ఓ గావుకేక పెట్టాడు.

    "ఏ మొచ్చింది?"

    "ఆలోచన "

    "అదే ఏ మొచ్చిందో అఘోరించు"

    "ముందు పాయింట్ మనం వెళ్ళటంకాదు. ఆ కాహోటు కేలావెళ్ళాలన్నది. అవునా?"
   
    "మధ్యలో నీవే  ప్రశ్నవేసి నీవే ఆగక మొత్తంకక్కెయ్యి" కమల్ విసుక్కున్నాడు.

    "బుర్రంటూ వుంటే తెలివంటూ వుంటుందికదా! కాస్త ఆసరా దిరికినా అందుకుని పైకి ఎగబ్రకవచ్చు కదా ? కాసిని కాగితం ముక్కలు దోరికాయి వాటిల్లో అక్కడక్కడా అక్షరం ముక్క లున్నాయి. ఈ రాత్రికి ఇంట్లో ఏదో ఒక వంక చెప్పి ఇంట్లోంచి బైటపడదాం. కమల్ రూమ్ లో కల్సుకుందా౦ అన్నీ తిరగేసి మరగేసి శోధించి సాధించుదాము ముందుగా కాస్త ఇక్కడే పరిశీలించి చూద్దాం. ఎలావుంది అయిడియా!"

    "ఒరేయ్ సుబ్బడూ! నీ బుర్ర ఇన్నాల్టికి పనిచేసిందిరా ! వచ్చే జన్మంటూ వుంటే చచ్చి నీ కడుపునా పుడుతరా నాయనా! ప్రస్తుతానికి నా సంతోషం ఇలా తెలియపరుస్తాను" అంటూ విజయ్ సుబ్బారవు బూరే లాంటి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు.

    "వాడు చచ్చి పుడుతానంటున్నాడు. నేబతికుండే పుడుటారా సుబ్భిగా ! నా నండం ఇలా?" కావాల సుబ్బారావు మరో బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు.

    బొద్దుగా ముద్దుగా వుండే సుబ్బారావు ఆడపిల్లలా సిగ్గు పడిపోయాడు.

    "సుబ్బూ! మేం ఆడపిల్లలం . నీ ప్రెండ్స్ లా కోతిపనులు చెయ్యం ఆశీర్వదిస్తాం. బుజ్జి తమ్ముడు సుబ్బూకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఆస్తి పాస్తులు ఓ అమ్మాయి పెళ్ళాంగా, వాళ్ళ అరడజను మంది ఆడపిల్లలతో హాయిగా ......"

    "ఒరిదేముడోయ్! ఇది ఆశీర్వదించటమూ? తిట్లూ శాపనార్డాలా" అన్నాడు సుబ్బారావు కళ్ళుతేలేయబోయి మళ్ళీ అదోగోల దేనికని మావేస్తూ.

    వావరనమ చల్లబడింది. అందరి మనుషులూ తేలికయ్యాయి.

    సంచీలో పెట్టుకొచ్చిన కాగితాలు బైటికి తీశాడు విజయ్.

    తలా ఒకటి అందుకుని పరిశోధన అనే రంగంలోకి ఆ నిమిషానే దిగారు.

     ఓ కాగితంలో ఇలా వుంది.

    (ఇక్కడ మేటర్ పెట్ట వలెను)

    అన్నీ తిరగేసి చివరికి అంతా రఘురామయ్యగారు రాసిన ఆ కాగితంమీద పడ్డారు. అ కాగితంలో ఎలుక కొంతభాగం కొరికి వేయగా సగం సగం అక్షరాలు అవి.

    తలో రకంగా ఆ అక్షరాలు పూరించారు!

    ఎల్లమట్టి కుండలు వున్న ఇళ్ళు వదలక మరో పుల్ల.

    సుబ్బారావు అన్నాడు.

    ఎర్ర యిట్టికలు


    ఉహూ కుదరలేదు అన్నాడు కమల్.

    డలు అంటే కోడలు, కోట గోడలు,

    కవచ్చుకదా? అంది నిశ్చల .

            కోడలు, గోడలు, మేడలు, ఆవడలు,

    డలు తో ఏదైనా కావచ్చు, ముందు నీకు పెళ్ళి పిచ్చి పట్టింది. వచ్చే కోడలు విషయం మానేసి తీవ్రంగా ఆలోచించు నెమ్మదిగా నిశ్చలని మందలించింది కృతి.

    అక్కర లేదు వచ్చింది అన్నాడు విజయ్. కాగితం కలం అందుకుని ఇలా రాశాడు.

    ఎర్ర మట్టి కొండలు (మార్గంలో) ఇటుకలు పొదలు మధ్య మధ్య పురుగు పుట్రా.

    "ఇదుగో ఇలా తలకట్లు వత్తులు నడుం విరిగిన అక్షరాలకి శస్రచికిత్స చేయగా ఈ వాక్యం వచ్చింది ఎలా వుందిరా కమల్?" విజయ్ అడిగాడు.

    "అది కరేక్టయినా కాకపోయినా వాక్యం చక్కగా వచ్చింది. ఓ విధంగా ఇది రైట్ అనుకుంటూ మరికొన్ని అక్షరాలకి శస్రచికిత్స చేద్దాం అన్నాడు కమల్.హుషారుగా.

    "బ్రదర్స్! అయిడియా బాగుంది నా దోచిన్న అనుమానం "౧౧ " వున్న అక్షరం కింద  సరిచేస్తే "ఇ" అయింది. అలాగాక అది లకిందల ఎత్తేమో? ల వత్తు "౧౧" ఇలాగే వుంటుంది కదా!" సుబ్బారావు అన్నాడు.

    "నరేయ్! నీ శంక మండిపోనూ, ప్రతి మాటకీ అనుమానం అంటూ అడ్డుతగలక లకారేమో వికరమో చేసి కొన్ని వాక్యాలు తయారు చేయి. చివరికి ఏదో ఓ ఆకారం రాకమానదు" విజయ్ అన్నాడు.

    "మళ్ళీ మరో అనుమానం వచ్చిందిరా?"

    "అనుమానం ముందుపుట్టి ఆ తర్వాత నీవు పుట్టావ్. అదేదో అఘోరించు"

    "ఎర్రమట్టి కొండలు పుట్టి మూడువందల ఏళ్ళు అయిందేమో అంతకు క్రితం అక్కడ ఆ కొండలులేవని ఆ ఆమధ్య ఓ శాస్రజ్ఞడనగా నె వినినట్లో దే౦ట్లొనో చదివినోట్లో గుర్తురా!" సుబ్బారావు అన్నాడు.

 Previous Page Next Page