Previous Page Next Page 
అసిధార పేజి 11

   

  విజిల్ ద్వనింవింటూనే కృతి టైమ్ చూసుకుంది. 'పదమూడు నిముషాలయింది' అనుకుంటూ వెనకకు మరలింది కృతికి అల్లంత దూరంలో ఓ గుహా కనిపించింది. అటు అడుగు వేయటానికి ఆనందంతో కాలు ఎత్తింది. విజిల్ ద్వని వింటూనే గిరుక్కున వెనుతిరిగి వేగంగా నడక సాగించింది.

    "తాము వెళ్లేమార్గం ఆ గుహాలోభోంచేనేమో! అండా? వెళ్ళి వెనుకకు మరలిరావటం అయింది. కాలుజారి అపాయానికి లోనయి తిరిగిరమ్మని సంకేతం పంపటం జరిగిందేమో ! ఎవరికైనా......." ఆలోచిస్తూ వేగంగా నడిస్తూ మరలిస్తున్నకృతి జర్రున జారింది. జారుతూ గట్టిగా కొండంతా ప్రతిద్వనించేటట్లు ఓ వెర్రికేకవేసింది.

    పెద్దరాయి అడ్డుగా వుండటంతో జారిపడబోయిన కృతి అక్కడ ఆగిపోయింది.

    "అదృష్టవంతురాలీని. జారి ఏ లోయలోనో పడిపోలేదు' అనుకుంటూ తిమ్మిరిపట్టిన కలిని గట్టిగా విదిలించి మళ్ళీ పైకి ఎక్కింది కృతి .

    అరనిమిషం వారగా కమల్ నిశ్చల విజయ్ వద్దకు వచ్చారు.

    విజయ్ ముఖం అందోళనగా ఉంది.

    "మీకు కేక వినిపించిందా? ఆ కంఠస్వరం కృతిది"

    "అవును" కమల్ అన్నాడు.

    "ఏం జరిగిందో ?" ఆదుర్దాగా అంది నిశ్చల .

    "అంతగట్టిగా కేకపెట్టిందంటే కృతికేదో గట్టిఆపదసంభవించినట్ట్లే లెక్క. ముందు కృతివద్ద కెళదాం పదండి" విజయ్ అడుగు ముందుకువేస్తూ  అన్నాడు.

    "అక్కరలేదు అదిగో కృతి వస్తున్నది. హరియాన్  కృతీ! హారియాన్" నిశ్చల పసిపిల్లలా సంతోషం వ్యక్తం చేస్తూ అరిచింది.

    కృతి దగ్గరకోస్తూ అడిగింది "ఈలపాటఎవరిది?"

    "ముందు నువ్వెందుకరిచావో చెప్పు?" ముగ్గురూ ఆదుర్దాగా ఒకేప్రశ్న వేశారు.

    "ఓస్ అదా! కాస్త కాలు స్లీప్పయి దోర్లాను, కంగారులో ఓ గావుకేక వేశాను. ప్రమాదం ఏమీ జరగలేదు" చాలా తేలిగ్గా చెప్పింది కృతి.

    "ఏడ్చినట్లేవుంది. నీ అరుపుకి మేమంతా హడలిచచ్చాం" నిశ్చల అంది.

    "ఇంతకీ ఈలపాట ఎవరిది?" మళ్ళీ అడిగింది కృతి.

    "రఘురామయ్యగారిది కాదు విజయరామతారకది ఈ ఈలపాట" అంటూ బొటనవేలు చూపుడు వేలు మడిచి పెదవికానించి గట్టిగా ఉషారుగా ఈలవేశాడు విజయ్.

    "గుహా కనిపించిందా?"

    "ఏది?"

    "ఎక్కడ?"

    "కొద్దిమలుపు తిరగాలి పదండి" అంటూ దారితీశాడు విజయ్.

    ముగ్గురూ అతన్ని అనుసరించారు.

    రెండు నిమిషాల్లో నలుగురూ అ గుహాముందు కెళ్ళారు.

                                                                                    7

    "ఇదే ఆ గుహా పదండి లోపలి" విజయ్ అనంగానే ముగ్గురూ లోపలి దూరారు.

    వాళ్ళవెనకే లోపలికొచ్చాడు విజయ్
   
    "కరెక్ట్ గా ఇదేనంటావా?"

    "జవాబు నేచేపుతాను ఇదే, ఎందుకంటే గుహలో విరిగిపోయిన పెద్దరాయి అడ్డంగా పడివుంటు౦దని అరాతిమీద స్పష్టంగాలేని ఆకారంతో ఎవరో హనుమంతుడి బొమ్మ చెక్కుతూ ఆపారని గుహాఆకారం పై భాగాన టెంకాయచిన్న బోర్లించినట్లు  వుంటుందని వుంది. అక్షరాలా యీ గుహా అలాగేవుంది. పైగా గుహాకడ్డంగా నామమాత్రంగా రాయి పేట్టి వుందని కాస్తబలం వున్నవాడైనా ఆరాతిని తొలగించవచ్చని మార్గం అక్కడే  మొదలనివుంది. ఇక్కడ అలాగే వుంది.అవునా విజయ్?" కమల గుహాని పరిశీలనగా చూస్తూ అన్నాడు.

    "బాగానే గుర్తించుకున్నావ్?" కమల ని అభినందించాడు విజయ్ .

    "మాకు బాగానే వుంది జ్ఞాపశక్తి . కాపోతే మాకన్నా ముందునువు  చెప్పావ్" అంది కృతి.

    "అవును" వంతపాడింది. నిశ్చల.

    "ఆడవాళ్ళకి ఈర్ష్య ఎక్కువన్నారు. కరెక్టేకదూ భాయ్!"

    "కళ్ళారా చూస్తూ చెవులారా వింటూ కాదందునా భాయ్!"

    నలుగురి మనసూ తృప్తిగా ఆనందంతో నిండివుంది. వాళ్ళమీద వాళ్ళే జోకులేసుకుంటూ నవ్వుకున్నారు.

    గుహకున్న రాతిని అడ్డుకోలిగించి చూశారు. మరోసారి ఆ గుహనంతా పరీక్షించి తాము వెళ్ళేమార్గం ఇటునుంచే అని గట్టి నిర్ణయం తీసుకున్నారు.

    "మనం బయల్దేరి గంటన్నర దాటింది. మనవాడికి కంగారు భయం జాస్తి ఇంక వెళదాం పదండి" అన్నాడు విజయ్.

    నలుగురూ తిరుగుప్రయాణం అయ్యారు.

    "ఈ రాత్రికి రైస్ తో బోజనం తృప్తిగా ఆరగించ బోతున్నాము. తిరిగి వచ్చేదాకా మనకి అన్న ప్రాప్తి ఉండకపోవచ్చు. కొన్నాళ్ళు రొట్టెలు, బిస్కెట్స్ . సీలుచేసిన టిన్నుల్లోని పదార్దాలు మధ్య మధ్య లిక్వీడ్స్ ....... ఆహారం పొదుపు. నీటి పొదుపు. ఆరోగ్యంలో జాగ్రత్తలు. నియమాలు మనం ఎంతో జాగ్రత్తగా పాటించాలి" మరోమారు హెచ్చరికగా అన్నాడు విజయ్.

    "అంతేకాదు. ప్రతి చిన్న విషయంలో మేలుకవులు చూపాలి. దారిలో ఎన్నో ఆపదలు జరగవచ్చు వాటిగురించి వూహించదల్చుకో లేదు ముందుకు సాగిపోవడమే మన లక్ష్యం అనగరం చేరటం" కమల్ అన్నాడు.

    "మనం వున్నది కొండమీద కదూ చలిబాగా వుంది" చేతులతో భుజం కప్పుకుంది నిశ్చల.

    "మనతో బరువులు చాలానే తీసుకేళుతున్నాం. ఇవి మంచుకొండలు కావు కాబట్టి సరిపోయింది. లేకపోతె ఇంకా లగేజి పెరిగేది మనకి" చేతిలో టార్చ్ లైట్ వెలిగిస్తూ అర్పూతూ అంది  కృతి.

    నలుమూలలా చీకటి ఆక్రమించుకుంది.

    ఈ చెవిలోంచి ఆ చెవిలోకి రయ్యిన కొడుతున్నది చలిగాలి.

    "భోంచేసి ఓ గంటప్రయాణం గురించి సరదాగా మాట్లాడుకుని ఆపై చక్కగా నిద్రపోదాం. సరీగా తెల్లారుజాము నాలుగుగంటలకి లేద్దాం. నాలుగున్నరకి ప్రధమపాదం గుహామార్గంలో పెడదాం." విజయ్ అన్నదానికి "ఓ.కే , ఓ.కే "అన్నాడు కమల్.

    "మేం కూడా ఓ.కే " అంది నిశ్చల.

    కృతి నవ్వి వూరుకుంది.

    దారి పొడుగుతా మాట్లాడుకుంటూ సుబ్బారావు వున్న చోటుకి వచ్చారు.

    అన్నీ రెడీచేసి వున్నాయి సుబ్బారావు మాత్రం అక్కడ లేడు.

    "మనం ఎంతకీ రాలేదని మన్ని వెతుక్కుంటూ సుబ్బు వెళ్ళలేదు కదా?"

    "ఎక్కడి కెళ్ళామని వెతుకుతూ బయలుదేరుతాడు.? ఈ కొండ ఏమన్నా చిన్నదా చితకదా ? మనం సరైన రూటులో బయలుదేరి కావాల్సిన కొండ ఎక్కాము చుట్టూ అన్నీ కొండలేకదా?"

    "సుబ్బూ! సుబ్బూ!" విజయ్ గట్టిగా పిలిచాడు.

    "అలా పిలిస్తే వాడు పలకడురా నువ్వుండు " అని కమల్ చాలా గట్టిగా పిలిచాడు." సుబ్బాయ్! ఒరేయ్ సుబ్బడూ!"

    "ఉహూ . దూరంనుంచయినా సమాధానం రాలేదు."

    "నో రిప్లయ్ మన సుబ్బుకి ఏదో జరిగింది" అంది కృతి
   
    "మొదటే ఇదేమి ఖర్మే!" అంది నిశ్చల .

    "మరోసారి పిలిచి. ఆ తర్వాత నలుగురం కలసి వెతుకుదాం." అంటూ ముందు విజయ్ పిలిచాడు ఆపై అందరూ పిలిచారు.

    సుబ్బు ఏదో ప్రమాదంలో పడ్డాడు అందుకే కొండలు ప్రతి ద్వానిమ్చేలా జవాబులేదు.

    ఎవరికీవారు యిదే అనుకున్నారు. ఉత్త ప్రమాదమేనా లేక ..... ఆపై ఊహించటం ఇష్టంలేక మానేశారు.

    ఇంక సుబ్బారావుని వెతక్క తప్పదు అని బయలుదేరుతుండగా కొద్దిదూరం నుంచి సుబ్బారావు వస్తూ కనిపించాడు.

    నలుగురి ముఖంలో అనందం చోటుచేసుకుంది. 'వేధవాయ్! ఇంత దగ్గరలోనే వున్నాడు పిలుపుకి 'ఓయ్' అన్న జవాబు లేడు. కనీసం గుర్తుగా విజిల్ వూదవచ్చుకదా!" అనుకున్నారు రవంత చిరాకుతో.

    సుబ్బారావు దగ్గరకు రాంగానే నలుగురూ సుబ్బర్వుమీద విరుచుకు పడ్డారు.

    "విజిల్ వేయాలన్న ఆలోచనే తట్టలేదా గిన్నెలు గిన్నెలు నెయ్యి తాగిన ఆ బుర్రకి ."

    "ఓయ్ అనటానికి నీ నోటికి అరిసెలు అడ్డంవచ్చాయా!  ఆవకాయ ముద్దా అడ్డం పడిందా?"

    "అసలు ఎక్కడికేళ్ళావ్ ?"

    "ఏం చేస్తున్నావ్?"

    తాపీగా చివాట్లుతిని బిక్కముఖం పెట్టాడు. చివరికి నెమ్మదిగా అన్నాడు "అదికాదురా! 'ఓయ్' ఇక్కడే వున్నాను అన్నాననుకోండీ మీరంతా వచ్చేస్తారు. పోనీ విజిల్ వూదవచ్చు. అదివిని విషయం అర్ద౦గాక వచ్చిపడతారు. మీ పిలుపులు వింటూనే క్ వున్నారా కాని ...... కాని ....." సుబ్బారావు తలొంచేసుకున్నాడు.

 Previous Page Next Page