Previous Page Next Page 
అసిధార  పేజి 12

    "మేమంతా నీకేం ప్రమాదం జరిగిందో అని హడలిచచ్చాం. ఇంతకీ ఏ రాచకార్యం వెలగాబెట్టడానికి ఎక్కడికెళ్ళి  తగలపద్దావ్?"

    "మేం వస్తే కొంపేం మునగదురా! మీతోపాటు సిస్టర్స్ కూడా వస్తారు కదా ! వీసావచ్చింది వెళ్ళాక తప్పలేదు" అంటూ సుబ్బారావు రెండువెళ్ళు అలా పైకైత్తి మూడువేళ్ళు మూశాడు.

    నలుగురు తెల్లబోయి ఒకరి ముఖాలోకరు చూసుకుని అంతలోనే తెప్పరిల్లి ఫక్కున నవ్వారు.

    సుబ్బారావు నవ్వాడు.

                                                                                 8

    అనుకున్న ప్రకారం రాత్రి భోజనం చేశారు. కబుర్లు చెప్పుకున్నారు. మార్గంలో ఏ కష్టసుఖం వచ్చినా అందరూ సమానంగా పంచుకోవాలని ప్రయాణంలాంటిదేదో చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళని తలచుకున్నారు అందరూ అక్కడే వున్న ఓ గుహాలోచేరి చివరికి ఆదమరచి నిద్రపోయారు.

    తెల్లవారుఝామున టంచన్ గా నాలుగుగంటలకి లేచి కాల కృత్యాలు తీర్చుకుని ఎవరి లగేజీ వాళ్ళు మోసుకుంటూ అసలుగుహకి వచ్చారు.

    నాలుగున్నర అయింది.

    "రెడీ!"

    "ఓ.కే ."

    "జై హనుమాన్"

    ముగ్గురు మగవాళ్ళు హుషారుగా పైకి అన్నారు. కృతి . నిశ్చల కళ్ళుమూసుకుని వెంటనే తెరిచారు. వాళ్ళేమనుకున్నారో వాళ్ళకే తెలియాలి.

    అనుకున్న ప్రకారం ముందు విజయ్. అతని వెనుక కృత్తిక , ఆమె వెనుక సుబ్బారావు , అతని వెనుక, నిశ్చల, ఆమె వెనుక కమల్ నాథ్ నడిచారు.

    అందరి వీపులకి లగీజివుంది. అందరి చేతుల్లో పవర్ పుల్ టార్చ్ లైట్స్ వున్నాయి. చేతుల్లో బారు కర్రలున్నాయి.

    గుహలో నడుస్తున్నారు. ఆ నడకకూడా రైలు పెట్టేల్లా ఒక వరసక్రమంలో వుంది. ఎందుకంటే ఆ మార్గం సన్నగా వుంటుంది. ఒకరివెనుక ఒకరు నడిచి ముందుకు సాగాల్సిందే గాని పక్కపక్కల్న నడవడానికి వీలులేదు.

    బలంగావున్న ఒకతాడుని లింకుగా ఒకరి చేతినుండి మరొకరి చేతికి కట్టుకున్నారు. ఆ తాడు సహాయంతో ఆపదలో గబుక్కున వెనక్కో ముందుకో గుంజవచ్చు. దానివల్ల వాళ్ళు  విడిపోరు. అదీగాక తాడు వదిలించుకోవాలంటే చాలా సులభం జారుముడి వేశారు. చేతిని విదిలిస్తేచాలు విడిపోతుంది.

    వాళ్ళకి ముందుగా తెలియదు ఆ తాడే సరీగ అక్కడ అందరినీ కళ్ళుమూసి తెరిచే లోపల లాగేస్తుందని.

    ముందు కొంతదూరం వెలుతురు వుంది. క్రమంగా వెలుతురు హెచ్చింది . అంటే బయట పూర్తిగా ఎండవచ్చి వుంటుంది వాళ్ళ మార్గం తిన్నగాలేదు. కొంతదూరం నడిచింతరువాత పక్కకి తిరిగారు. అలా అలా నడుస్తూ ముందుకు సాగుతూ మరి రెండుచోట్ల మరో పక్కకి వేరే పక్కకి తీరవలసి వచ్చింది.

    గుహ మార్గంలో వెలుతురు తగ్గటంతో సుబ్బారావు టార్చ్ లైట్ వెలిగించాడు.

    "సుబ్బూ ! ముండా లైటు అర్పు" విజయ్ గద్దించాడు.

    టార్చ్ లైట్ ఆరిపోయింది.

    "నీకు బోధించిదంతా ఏమయిందిరా సుబ్బూ మార్గంలో ఏదీ వేస్ట్ చేయరాదన్నది మరచిపోయావా? అవసరం అనుకుంటే నేను అలా వెలిగించి ఇలా చేస్తున్నాను కదా చాలు"

    "పైభాగాన ఏమున్నాయో చూద్దామని ......" గోణిగాడు సుబ్బారావు.

    "పైభాగం మనచెయ్యి ఎత్తుకూడా లేదు. చేత్తో తడిమిచూడు తండ్రీ " వెనుకనుంచి కమల్ ఆమె నడుం మీంచి చేయితీసేస్తూ .

    "ఏం జరిగింది?" సుబ్బారావు అడిగాడు.

    "ఇంకా ఏం జరగలా ?" కమల్ సమాధానం విని విజయ్ కృతి నవ్వుకున్నారు.

    "అర్ధమైందా విజయ్!" అన్నట్లు విజయ్ భుజం తట్టింది కృతి.

    "ఊం" అన్నాడు విజయ్.

    ఈ వూ...... ఆ .... ల కర్ధం సుబ్బారావుకి అర్ధం కాలేదు. "ఏంటో పిచ్చిగోల మధ్య మధ్య వీళ్ళకి పిచ్చి పడుతుంటు౦ది" అనుకున్నాడు.

    "ఆగండి"

    తానాగిపోతూ గట్టిగా అరిచాడు విజయ్
   
    ఏం జరిగిందో ఎవరికీ తెలియదు అయినా సదన్ బ్రేక్ వేసినట్లు అందరూ ఆగిపోయారు.

    "ఇక్కడితో నడకమార్గం అంతమయింది లోపల మరీ గుయ్యారంలా వుంది. గుర్తుంచుకోండి అయినా మనం కొంతసేపు వంగి నడవాల్సి వస్తుంది రెడీ" అంటూ టార్చ్ వెలుగు ముందుకు ఫోకస్ చేస్తూ ముందుగా విజయ్ వంగి నడిచాడు.

    అందరూ వంగిముందుకు నడుస్తున్నారిప్పుడు వీపున బరువు ...... వంటిమీద కూడ మొద్దు పాటి షర్ట్ ..... కొంత సారంజామా జేబుల్లోను ....... అల నడవటం చాలా కష్టంగా వుంది. అయినా ఉత్సాహంగా మూపురము ఊగుతూ ముందుకు నడుస్తున్న ఒంటెల బారులా వాళ్ళు నడుస్తూన్నారు.

    "స్టాఫ్" పావుగంట తర్వాత విజయ్ అన్నాడు తానాగిపోతూ .

    పైకి లేవటానికిలేదు పక్కకి తిరగటానికి లేదు కనీసం కూర్చోటానికిలేదు. అదంతాసొరంగమార్గం బారీగా మనషివంగి నడిచేవరకే వుంది. వాళ్ళ వీపుమీద సామాను పై భాగానికి తగులుతోంది.

    ఈ మార్గం ఇక్కడిటో అంతమయింది. ఇంక అందరం బోర్లా పడుకుని ముందుకు జరగాలి. మైడియర్ ప్రెండ్స్ శక్తిని కూడగట్టుకోండి. ఉత్సాహాన్ని మూటగట్టుకోండి శ్రమపడి ఈ మార్గందాటామంటే ఇంకమనకివంగి పాకి. డేకి యిలాంటి పనులుండవ్, ముందుగా నేను బోర్లా పాడుకుంటూవిజయ్ నెమ్మదిగా ముందు చేతులు చాచి తర్వాత కాళ్ళు చాచిబోర్లాపడుకున్నాడు.

    విజయ్ చేసినపనే అందరూ చేశారు.

    దాదాపు గంటసేపు ఆ సొరంగ మార్గంలో అలా పాకుతూముందుకు సాగాలి పైకి లేవటానికి లేదు వెనక్కీ రావాలంటే అమితప్రయాస . అలా దాదాపు గంటసేపు ప్రయాణించవలసి వుంది. అని కాగితంలో అది నిజంగా గంట సమయం పట్టవచ్చు లేక ఇంకా సమయం తీసుకోవచ్చు . ఆ యిరుకు మార్గంలో ఏదైనా ఆపద వస్తే ముందువాడికి వస్తుంది. ఆ రిస్కు ఏదో తానె తీసుకొదలచిన విజయ్ ముందు తానె వున్నాడు సొరంగ మార్గంలో.

    వాళ్ళంతా ఉపాయంగా గాలి బెల్టులు ధరించారు అవి గాలిపోసుకుని వుబ్బి వుండడంవల్ల ముందుకు జరగటం కొంతలో టెలిక. అయినా వీపు మీద బరువులు జేబుల్లో వస్తువులు గాలి నింపిన రబ్బరు బెల్టులు దానాదీనా ముందుకు పాకటం కష్టం గానే వుంది.

 Previous Page Next Page