Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 91

 

    శృంగారం కాస్త పరాకష్ట అందుకుంటూ ఉండగా.

 

    ఉహతితంగా.

 

    అతను హటాత్తుగా చేతులు ముందుకు చాచి ఆ అమ్మాయి మెడ చుట్టూ బిగించాడు.

 

    రతి పారవశ్యంలో ఉన్న ఆ అమ్మాయి వెంటనే అది గమనించలేదు.

 

    గమనించేసరికి చాలా ఆలస్యమైపోయింది. మెదచుట్టు అతని చేతులు గట్టిగా, మరింత గట్టిగా బిగుసుకుపోయాయి.

 

    కెమెరా క్లోజప్ లోకి వచ్చింది.

 

    అది నటన కాదు! నిజం!

 

    రెండు రకాల అనుభవాలు తాలూకు ఛాయలు ఒకేసారి ఆమె కళ్ళల్లో కనబడుతున్నాయి.

 

    ఓ వైపు స్వర్గ సుఖం!

 

    మరో వైపు ఘోర నరకం!

 

    అ రెండు ఎక్స్ ట్రీమ్ ఎక్స్పీరియన్స్ మధ్యలో కొట్టుకులాడిపోతూ కొద్ది నిమిషాల తరువాత నిశ్చలంగా అయిపొయింది ఆ అమ్మాయి శరీరం.

 

    అది చూస్తున్న ఉజ్వలకి సౌమ్య గుర్తొచ్చింది.

 

    "దట్ సెల్ఫ్ రైటియస్ బ్లడీ బిచ్" అనుకుంది అసూయగా. నీతి నియమం అన్ని తనకొక్కదానికే అన్నట్లు చూసే దాని ఫోజూ, అది........."

 

    హటాత్తుగా స్పురించింది ఆమెకి. తను సౌమ్యకి  ఇలాంటి పనిష్ మెంట్ ఇవ్వగలిగితే ఈ సిన్మాలో అమ్మాయికి అతను ఇచ్చినట్లు!

 

    అదే సమయంలో గురుదత్ అన్నాడు.

 

    "నువ్వు చెప్పినట్లే చెయ్యడానికి ప్రయత్నిస్తాను ఉజ్వలా!"

 

    "ఏమిటి?"

 

    "అదే! నువ్వు మా కుటుంబంలో చేరిపోవడం?"

 

    అతని గొంతుకోరికతో కొత్త రకంగా వినబడుతోంది. గురుదత్ కి కూడా అతని భార్య గుర్తుకు వచ్చింది. హిప్పో పోటమాస్ లాటి షేవ్ లెస్ వైఫ్!

 

    అతనికి అలాంటి ఆలోచనే వచ్చింది.

 

    ఆమెని ఈ సినిమాలో పిల్లని చంపినట్లు చంపేస్తే-

 

    సాలోచనగా నెమ్మదిగా ఉజ్వల చుట్టూ చేతులు వేశాడు అతను.

 

    మని మేక్స్ మెనీ థింక్స్! నో డవుట్!

 

    బట్ సెక్స్ కెన్ మేక్ మెని మోర్ థింక్స్! యా యా!

 

                                                           31

 

    గురుదత్ తో మాట్లాడి హైదరాబాద్ వచ్చింది ఉజ్వల. మళ్ళీ మర్నాడే బాంబే వెళ్ళింది. ఆతరువాత రోజే తిరిగి వచ్చింది.

 

    "నువ్వు పూనుకోవడం వల్ల పనులు చకచకా జరిగిపోతున్నాయి!" అన్నాడు శశికాంత్.

 

    "రేపు గురుదత్ హైదరాబాద్ వస్తాడు. ఇక డీల్ సెటిల్ అయిపోయినట్లే. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసెయ్యాలి" అంది ఉజ్వల.

 

    ఆమె అన్నట్లే మర్నాడు హైదరాబాద్ వచ్చాడు గురుదత్.

 

    అతనితో పైనల్ రౌండ్ టాక్స్ జరపాలి శశికాంత్.

 

    మీటింగ్ వెళ్లబోయే ముందు శశికాంత్ ని ఏకాంతంగా కలుసుకుని చెప్పింది ఉజ్వల.

 

    అతన్ని గాడపరిష్వంగంలో బిగించేస్తూ "శశీ! ఇప్పుడింక చాలా డెలికేట్ లెవల్ కి వచ్చాయి టాక్సు. ఇక్కడి నుంచి మనం చాలా జాగ్రత్తగా ప్రొసీడ్ అవ్వాలి. లేకపోతె నష్టపోతాం. లేట్ మీ హేండిల్ దిస్ అన్ యువర్ బిహఫ్."

 

    "నీ ఎఫిషియేన్సీ మీద నాకు పూర్తీ నమ్మకం ఉంది ఉజ్వల. నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి." అన్నాడు శశికాంత్ చాలా సిన్సియర్ గా.

 

    టాక్స్ చాలా స్మూత్ గా జరిగిపోయాయి. వాళ్ళిద్దరి మధ్యలో ఉజ్వల వుండటం వల్ల ఎక్కడన్నా స్వల్పమైన అభిప్రాయబేధాలు వచ్చినా తను వెంటనే జోక్యం చేసుకుని వాటిని సర్దుబాటు చేసింది ఉజ్వల. మధ్యాహ్నం వరకూ జరిగాయి చర్చలు. లంచ్ కూడా బిజినెస్ లంచ్ గా మారిపోయి టాక్స్ నిరాటంకంగా సాగిపోయాయి. లంచ్ తరువాత మళ్ళీ ఏడింటిదాకా చర్చలు.

 

    ఆ టాక్స్ అన్ని కూడా గురుదత్ పెట్టబోయే కొత్త కంపెనీలో శశికాంత్ కి రావలసిన షేర్లగురించి.

 

    చివరికి సంతకాలు పెట్టె కార్యక్రమం నిర్విఘ్నంగా ముగిసి పోయింది.

 

    సంతోషంగా గురుదత్ తో కరస్పర్శ చేశాడు శశి కాంత్.

 

    "ఇవాళ రాత్రి నేను గాలా పార్టీ ఒకటి ఇస్తున్నాను మీరు రావాలి."

 

    "ఓహ్! ష్యూర్! అన్నాడు గురుదత్.

 

    ఇంటికి తిరిగి వచ్చి అద్దం ముందు నిలబడి టై విప్పుకుంటూ అనుకున్నాడు శశికాంత్.

 

    "వెల్ డన్! శశీ వెల్ డన్, సాధించగలిగావు నువ్వు. గురుదత్ కంపెనీలో ఫుటింగ్ దొరికితే చాలు, సంవత్సరం తిరగకుండా అతని కంపెని ఆక్రమించేసుకుంటాను. సరిగ్గా చాలా మంచి సమయంలో వచ్చింది ఈ ఆఫర్. లేకపోతె తేజస్వి పురి ఎక్కిస్తే సౌమ్య నిజంగా ఫోర్జరీ కేసు పెట్టినా పెట్టి వుండేది. పెద్ద గోడవైపోయేది. ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టినా, జెయింట్ లాంటి గురుదత్ తో తలపడాలి. వాళ్ళ తాతలు దిగి వస్తారు."

 Previous Page Next Page