ఉజ్వలా! యూ ఆర్ డివైన్! అన్నాడు గురుదత్ మళ్ళీ.
"మీ ఆవిడకంటే బాగుంటానా?" అంది ఉజ్వల ఓరగా చూస్తూ.
"చ చ! అది ఆడది కాదసలు! గాడిద!" అన్నాడు గురుదత్ వికారంగా.
నవ్వింది ఉజ్వల. "మరి అంత నచ్చనప్పుడు ఆవిడకి విడాకులు ఇచ్చేసి ఇష్టమైన అమ్మాయిని పెళ్ళి చేసుకోలేకపోయావా?"
నిస్పృహగా భుజాలు ఎగరేశాడు గురుదత్.
"అది అంత సులభం కాదు ఉజ్వలా!"
"భార్య అంటే గుర్తొచ్చింది. ఈ జోక్ విన్నావా?" అంది ఉజ్వల.
ఆసక్తిగా ముందుకు వంగాడు గురుదత్. ఐ లైక్ యువర్ జోక్స్! చెప్పు!"
"బాగా డబ్బున్న ఒకావిడ తన పనిమనిషి మీద విరుచుకు పడిందట. "నీకు పని చేతకాదు!" పాడూ చేతకాదు! ఇది వంటా పెంటా? అన్నం మాడి బోగ్గయిపోయింది! కూర కంపు కొడుతోంది? చారుకి రుచి పచి లేదు. చీ చీ!" అని.
పని మనిషి మాంచి వయసులో ఉంది. ఉడుకు రక్తం అందుకని తిరగబడింది.
"ఇదగో! యవమ్మావ్! మాటలు మీరకు! అసలు నీకంటే నేనే వంట బాగా చేస్తానని , ఇల్లు శుభ్రంగా ఉంచుతానని మీ ఆయనే నాతొ లక్షసార్లు చెప్పాడు తెలుసా?"
"మా అయన చెప్పాడా?" అంది ఇంటావిడ నిర్ఘాంతపోతూ .
"అంతేకాదు! సెక్సులో కూడా నీ దగ్గరకంటే నాదగ్గరే ఎక్కువ సుఖం దొరుకుతుందిట" అంది పనిమనిషి.
"అది కూడా మా ఆయనే చెప్పాడా?" అంది ఇంటావిడ మండిపడుతూ!
"కాదు! మీ కారు డ్రైవరు చెప్పాడు!" అంది పనిమనిషి చల్లగా అంటిస్తూ.
అది విని విరగబడి నవ్వాడు గురుదత్. తరువాత అన్నాడు.
"ఇంత మంచి డీల్ సెటిల్ చేసినందుకు నీకేం కావాలి ఉజ్వలా!
"నువ్వే కావాలి!" అంది ఉజ్వల తడుముకోకుండా.
సరదాగా అన్నాడు గురుదత్. "నేనేలాగు నీ వాడినే అనుకో! అదికాక-"
"అడిగింది ఇస్తారా?"
"అదిగి చూడు!"
"నీ కంపెనీలో షేర్లు కావాలి."
"జోక్ చేస్తున్నావా ఉజ్వలా?"
"కాదు, నిజంగానే అడుగుతున్నాను."
"కానీ, నా కంపెని షేర్లు నా కుటుంబంలోనే ఉండిపోవాలి. బయటి వాళ్ళకి అమ్మను. అది నాకు నేను పెట్టుకున్న రూలు!" అన్నాడు గురుదత్.
తక్షణం అంది ఉజ్వల. "అలా అయితే , నేనే నీ కుటుంబంలోకి వచ్చేస్తాను."
ఆమె మాటల తాత్పర్యం అతనికి అర్ధం అయ్యేసరికి కొద్ది క్షణాలు పట్టింది.
నేనే మీ కుటుంబంలోకి వచ్చేస్తాను.
అంటే.......
"వాడ్యు సే?" అంది ఉజ్వల చిరునవ్వుతో.
అతను గ్లాసులోకి రాయల్ శాల్యుట్ ఓంపుకుని , కిటికీ దగ్గరికెళ్ళి నిలబడ్డాడు.
ఉద్వేగంగా ఉంది ఉజ్వల మనసు. తనని చుస్తే తనకే జాలి వేస్తోంది వుజ్వలకి. తనని చూస్తే తనకే అసహ్యం వేస్తోంది కూడా!
అందరూ ఆడవాళ్ళులాగా ఎందుకు ఉండలేకపోతోంది తను? ఎందుకీ చంచలత్వం తనకి? ఒక మగాడిని ఇష్టపడి, పెళ్ళిచేసుకుని అతనితో జీవితాంతం గడిపేసే స్థిరత్వం తనకెందు కివ్వలేదు దేవుడు?
బొమ్మల షాపులోకి వెళ్ళిన చిన్న పిల్ల ఏ బొమ్మ సొంతం చేసుకోవాలో తేల్చుకోలేక తబ్బిబ్బైపోయినట్లు.
ఒకరోజు సి కెప్టెన్, ఒకరోజు శశి కాంత్ , మరో రోజు గురుదత్ మరోరోజు మరొకడు.
ఎందుకిలా? తన కేమన్నా సైకలాజికల్ డిస్ ఆర్డర్ ఉందా?
ఆమె ప్రశ్నకి జవాబు చెప్పకుండా అన్నాడు గురుదత్.
"ఉజ్వలా! డీల్ సెటిల్ చేశావుకదా! సెలబ్రేట్ చేసుకుందాం!"
అతనికి ఆలోచించే వ్యవధి కావాలి. అది తెలుస్తూనే ఉంది.
అందుకని లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని లేచింది ఉజ్వల. "వైనాట్! లెటజ్ హావ్ ఎ బాష్!"
అంటూ తనూ ఓ గ్లాసు అందుకుంది.
తన పెదిమల మధ్య రెండు సిగరెట్లు పెట్టుకుని గోల్డ్ సిగరెట్ లైటర్ తో అంటించి ఒక సిగరెట్ ఉజ్వలకి అందించాడు గురుదత్.
తరువాత విడియో అన్ చేశాడు.
ఇద్దరూ ఒకరి నొకరు అనుకుంటూ కూర్చుని సేటిలయ్యేసరికి స్క్రీన్ మీద బ్లూ ఫిలిం కనబడడం మొదలెట్టింది.
మాములుగా మొదలయింది అది ఒక అందమైన అమ్మాయి ఒక కండలు తిరిగిన మొగాడు వాళ్ళ శ్రుంగార చేష్టలు.