Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 92

 

    సో, అనదర్ ట్రిక్. అనదర్ సక్సెస్.

 

    రాత్రికి ఇవ్వబోయే పార్టీ చాలా ఘనంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు శశికాంత్.

 

    తను దివాళా తీసినట్లు ప్రకటించి అందరిని ఫూల్ చెయ్యడం కోసం పెద్ద హంగామా చేశాడే అంతకు మించిన పార్టీ ఇవ్వాలి ఇవాళ.

 

    అట్టే టైం లేదు. కానీ డబ్బు పారేస్తే కొండమీది కోతి కూడా దిగి వస్తుంది. దిసీజ్ యాన్ అకేషన్ టు బర్న్ మనీ.

 

    అప్పుడు పార్టీ ఇచ్చి దివాళా తీశానని ప్రకటించి , పార్టనర్స్ ని అందరిని ముంచేశాడు ఆ డబ్బుతో ఈ కంపెని కొన్నాడు.

 

    ఇప్పుడు ఇంకో పార్టీ ఇచ్చి ఈ కంపెనీని అమ్మేస్తున్నానని చెబుతాడు.

 

    ఈసారి ఏకంగా గురుదత్ కంపెనీకే ఎసరు పెడతాడు.

 

    రిపీట్ పెర్ ఫార్మెన్స్.

 

    థాంక్స్ టు ఉజ్వలా!

 

    ఇంగ్లిషు ట్యూన్ ఒకటి హమ్ చేస్తూ, ఓ అరడజను ఫోన్ కాల్స్ చేశాడు శశికాంత్. డిన్నర్ అరేంజ్ మెంట్స్ ఇన్ స్ట్రక్షన్స్ జారీ చేశాడు.

 

    ఒక పెద్ద హోటల్ లాన్స్ లో జాజ్ ఆర్కెస్ట్రా బాక్ గ్రౌండ్ తో పార్టీ ప్రారంభమయింది. ఆర్కెస్ట్రాని ఒక్క నిముషం ఆగమని సైగచేసి డ్రమెటిక్ అనౌన్స్ చేశాడు శశికాంత్.

 

    "ఫ్రెండ్స్! ఈ శశికాంత్ ఏం చేసినా సెన్సేషనల్ గానే చేస్తాడని మీకు తెలుసు."

 

    "ఈ పార్టీ కూడా మరో సరికొత్త సెన్సేషన్ ని అనౌన్స్ చెయ్యడానికి అరేంజ్ చేశాను.

 

    "ఫ్రెండ్స్! ఐ యామ్ సెల్లింగ్ దిస్ ఇండస్ట్రి టు మై గుడ్ ఫ్రెండ్ , మిస్టర్ గురుదత్!

 

    "నా స్నేహితుడు గురుదత్ కి నా ఇండస్ట్రీ అమ్మేస్తున్నాను. నౌ, లెటజ్ గివ్ ఏ బిగ్ హాండ్ టు దిస్ లక్కి చాప్ గురుదత్!" అని చప్పట్లు కొట్టాడు శశికాంత్.

 

    ఆహుతుల కరతాళధ్వనులతో ఆ ఆవరణ మారు మొగిపోయింది.

 

    తరువాత కులాసాగా నవ్వుతూ, షాంపేన్ గ్లాస్ ఒకటి చేతిలో పట్టుకుని, గెస్టుల మధ్య సర్యులేట్ అవుతూ ఒక్కొక్కరిని పలకరించడం మొదలెట్టాడు శశికాంత్.

 

    హటాత్తుగా అతని చేతిని గట్టిగా పట్టేసుకున్నాడు ఒక వృద్దుడు.

 

    అయన నవ్వి అన్నాడు - "గుర్తున్నానా శశికాంత్? నేను లాలా"

 

    నుదురు చిట్లించి శశికాంత్ . "ఏ లాలా? ఓహ్, లాలా! మీరా! ఎలా ఉన్నారు?"

 

    "ఎలా ఉంటాను? అన్నాడు నువ్వు చేసిన అన్యాయంతో మళ్ళీ తెరుకోలేకుండా దెబ్బతినిపోయాను. కానీ శశికాంత్, ఇన్నాళ్ళకు నీకు కరెక్టు మొగుడు దొరికినందుకు ఆనందంగా వుంది. నేను నీ పార్టీకి రాలేదు. శశికాంత్, నీ పతాకాన్ని కళ్ళారా చూడాలని వచ్చాను. నువ్వు, నన్ను ఇన్వయిట్ చెయ్యలేకపోయినా."

 

    "వాట్ ద హెల్ ఆర్ యూ టాకింక్?" అన్నాడు శశికాంత్ తీవ్రంగా.

 

    "గురుదత్ నిన్ను ముంచేశాడు" అన్నాడు ఆ వృద్దుడు , క్లుప్తంగా. ముంచేశాడు అన్న మాటకి బదులు ఒక అశ్లీల ఆంగ్లపదాన్ని ఉపయోగిస్తూ.

 

      శశికాంత్ మొహం పాలిపోయింది.

 

    "బుల్ షిట్" అన్నాడు పెదిమలు తడి చేసుకుంటూ. "యూ ఆర్ సేనైల్. వృద్దాప్యంలో మతి చలించి మాట్లాడుతున్నావు నువ్వు!'

 

    పైకి అలా అన్నాడే గాని, లాలా మాటలు ముగియకముందే శశికాంత్ మనసు కంప్యుటర్ లా పనిచేస్తూ పరిస్థితిని బేరీజు వెయ్యడం మొదలెట్టింది.

 

    విక్రమార్కుడితో పరిహాసంగా మాట్లాడుతున్న బేతాళుడిలా తెల్ల జుట్టు వుగిసలాడుతుండగా అన్నాడు లాలా- "మైడియర్ స్మార్టి! ఈ మధ్యే జరిగిన ఒక ఫైనాన్షియల్ కూప్ ని గురించి చెబుతాను విను.

 

    "ఒక పెద్ద కంపెని, అది ఆర్ధికపరమైన ఇబ్బందులతో పడిపోయింది. దానికి కారణం "మిస్" మేనేజ్ మెంటు. అంటే యజమాని కూతురే కంపెనీని డామినేట్ చెయ్యడం మొదలెట్టింది. తనకి ఉన్న అసంఖ్యాకమైన లవ్ ఎపైయిర్స్ సరిపోవన్నట్లు కంపెని అఫేయిర్స్ లో కూడా తల దూర్చడం మొదలెట్టింది.

 

    అండ్ ద ఇనే విటబుల్ హాపేన్ద్డ్.

 

    "కంపెని కష్టాలలో పడింది. అప్పుడు వాలాడు ఒక పైనాన్షియల్ విజార్డ్ . ఆ కంపెనీని ఒకటిన్నర కోట్లకు కొనేస్తానన్నాడు.

 

    "ముందర అమ్మనుగాక అమ్మ నన్నది ఆ అమ్మడు. తరువాత అమ్మిపారేయ్యడమే తెలివైన పని అనుకుంది. కంపెనీని మాత్రం అప్పుడే స్వాధీనం చేసేసుకున్నాడు.

 

    "అప్పుడు రంగంలోకి దూకారు అతని అకౌంటేంట్స్ , మనిషి దేహాన్ని షార్క్ చేపలు ఎలా పీకేస్తాయి? అలా పీకి పాకాన పడేశారు ఆ అమ్మాయిని.

 

    చివరికి ఆ అమ్మాయే అతనికి ఏభై లక్షలు ఇవ్వాలని తేల్చారు- లయబిలిటేస్ కు.

 

    అంటే- అమ్మినవాళ్ళే కొన్నవాళ్ళకు అరకోటి ఇవ్వాలని.

 

    నెత్తుటి కూడు తినడంలాంటిది కదూ ఇది? ఇంత తెలివైనవాళ్ళు ఇంత తేలిగ్గా ఎలా మోసపోతారని అడక్కు. మోసపోతూనే ఉన్నారు. ఆ లిస్టులో లేటెస్టుగా నువ్వు.

 Previous Page Next Page