Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 20

    "రజని! రజని!! నారాజ్జని!!!..." అన్నాడు పరవశంగా.


    కన్నారావు రెండు చేతుల్తో మొహాన్ని కప్పకున్నాడు.


    "నా ప్రేయసి పేరుని నేను కలవరిస్తుంటే నీకెందుకు సిగ్గేస్తుంది?"  కళ్ళు మూస్కుని ఉన్న కన్నారావుని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు చిట్టబ్బాయి.


    "సిగ్గా బొందా?... ప్తెకేత్తి  గిరగిరా తిప్పావుగా...అందుకని కళ్ళు తిరిగితే కళ్లు మూస్కున్నా"  అన్నాడు కన్నారావు.


    చిట్టబ్బాయి కన్నారావు మెడచుట్టూ చేతుల వేస్తూ "చెప్పవా...ఇంకేం కనుకున్నావ్? అసలెలా కనుకున్నావ్?" అంటూ అడిగాడు.


    "వాళ్ళింటి ఎదురుగా ఒక కిళ్ళిషాపు ఉంది.  వాడి దగ్గర్నుండి మొత్తం వివరాల్ని రాబట్టాను..."


    "మరి ఇంతాలశ్యం అయిందేం?" మెడని రెండు చేతుల్తో నిముర్తూ అడిగాడు.


    "వాడి దగ్గర్తెతే మాత్రం అంత సులభం అనుకున్నావా?  వెళ్ళగానే కిళ్ళి కొట్టువాడిని  ఎదురింట్లో అమ్మాయి పేరేంటి, ఆ వివరాలేంటి అంటే దోంగాడివి చూసినట్టు అనుమానంగా చూస్తాడు. అందుచేత వాడి దగ్గరికి వెళ్ళి సిగరెట్టు ఒకటి కొనుక్కున్నాను"


    "నువ్వు సిగరెట్టు కాల్చవుకదా ... ఎందుక్కోన్నావ్?" ఆశ్చర్యంగా అడిగాడు చిట్టబ్బాయి.


    కన్నారావు నాలుక కొరుక్కున్నాడు.


    "అవునుకదా! ఆ విషయమే తట్టలేదు నాకు"


    "సరేగాని సిగరెట్టు కొన్నాక ఏం జరిగింది?" కన్నారావు పీక పట్టుకుని ఊపుతూ అడిగాడు చిట్టబ్బాయ్.


    "ఏముంది సిగరెట్టు కాల్చి చచ్చేటట్టు దగ్గాను. కాస్త తేరుకున్నాక ఎదురుగా ఉన్న బంగళా  ఎవర్ది?  చాలా బాగుందే!  నేను కూడా ఇలాంటి మోడల్ లో ఇల్లు కట్టించుకుంటా అన్నాను"


    "తర్వాత?" మళ్ళి పీక పట్టుకుని ఊపాడు చిట్టబ్బాయ్.


    "ఏముంది....ఆ ఇల్లు ఎవరిదో చెప్పాడు కిళ్ళి కొట్టువాడు..."


    "పేరేంటి?" కుతూహలంగా అడిగాడు చిట్టబ్బాయ్.


    "యాదగిరి!"


    చిట్టబాయి ఆశ్చర్యంగా చూసాడు.


    "ఆ అమ్మాయిని చూస్తుంటే పక్కా ఆంధ్రస్తెడు  ఆమ్మయిలా ఉంది. వాళ్ళ నాన్న పేరేంటి తెలంగాణా ప్రాంతం వాళ్ళ పేరులా ఉంది?"


    "నేను చెప్పింది ఆయన పెరుకాదు...కిళ్ళి కొట్టువాడి పేరు."


    "నీ బొంద. వాడి వివరాలు నాకెందుకు? రాజనివాళ్ళ  నాన్న... అంటే నాక్కాబోయే  మామగారి పేరేంటో చెప్పు..." అడిగాడు పీక పట్టుకుని కుదిపేస్తూ.


    "ఆయన పేరు  రంగనాయకులు... ఆయనకీ చాలా రకాల బిజినెస్ లు ఉన్నాయి.


    "ఇంకా చెప్పు, చెప్పు .... చెప్పు"  తెగ ఉత్సాహపడిపోయాడు చిట్టాబ్బాయి. కన్నారావు కళ్ళు పెద్దవిచేసి నాలుక బ్తేట పెట్టాడు.


    "వివరాలు చెప్పరా అంటే వెక్కిరిస్తావేం ?" మొహం చిట్లిస్తూ అడిగాడు చిట్టబ్బాయి.


    కన్నారావు తన మేడమీద చిట్టబ్బాయి చేతుల్ని  విదిలించికొట్టాడు.


    "నీ ఉత్సాహం మండిపోనూ... వెక్కిరించడం కాదు... నీ హుషారులో  నా పీక పిసికేస్తుంటే  నాలుక బయటికొచ్చింది"  మెడ రుద్దుకుంటూ అన్నాడు కన్నారావు.


    సరే... సారి సారి,  ఇంకా వివరాలు చెప్పు... ఆ అమ్మాయి చదువు కుంటుందా?" కుతూహలంగా అడిగాడు.


          "లేదు. మొన్ననే డిగ్రి పూర్తి చేసింది. ప్రస్తుతం ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది.... ఆ ఇంట్లో ఇంకా వాళ్ళమ్మాగారు ఉంటారు.  ఆవిడ పేరు చాముండేశ్వరి."


    "రజనికి బ్రదర్స్ ఎవరూ లేరా?"


    "ఉన్నాడు.... ఒక్కడే బ్రదర్!"


    "పరుగో పరుగు నవలలో సరోజకి కండలు తిరిగిన బ్రదర్ ఉన్నట్టుగా ఉండడు  కదా రజని బ్రదర్?" అనుమానంగా అడిగాడు.


    "అబ్బే... అలా ఏమి ఉండడు.... మనం వాడిని ఈజీగా తన్నోచ్చు"


    "ఇద్దరం కలిశా?"


    "కాదు....నువ్వయినా నేన్తేనా విడివిడిగానే తన్నోచ్చు"


    "బ్రదర్ అంటే రజని కి   అన్నయ్యవుతాడా?" అడిగాడు చిట్టబ్బాయి.


    "తమ్ముడే...వయసు నాలుగేళ్లుంటాయ్"


    చిట్టబ్బాయి కన్నారావు వంక కొరకొర చూసాడు.


    "నాలుగేళ్ళవాడా? మరిందాకట్నుండి  ఆ విషయం చెప్పవేం?"


    "నువ్వు చెప్పనిస్తేగా?  ప్రశ్నల మిద ప్రశ్నలేస్తున్నావ్."


    "అఘోరించావ్ లే గాని ...అంత  చిన్న తమ్ముడు ఉండడం ఏమిటి ?"


    "వాళ్ళకి  మొదటి సంతానం రజని... ఆడపిల్లతో బాటు  అబ్బాయి  అంటే వంశాంకురం కూడా ఉండాలిగా.... కాని పాపం వాళ్ళకి చాలాకాలం మళ్ళి పిల్లలు కలగలేదు. మగపిల్లాడి కోసం ఆ పుణ్యక్షేత్రలూ, ఈ పుణ్యక్షేత్రాలూ అన్ని తిరిగారు.  చివరికి రజని పుట్టిన పదహారు సంవత్సరాలకి వీడు పుట్టాడు. అందుకే వాడంటే ఆ  ఇంట్లో భలేముద్దు"


    అలా తను కనుక్కున్నవిషయాలన్నీ చెప్పసాగాడు కన్నారావు.


    వంట పూర్తిచేసి భోజనాలు అయ్యాక పక్కమిద నడుం వాలుస్తూ అన్నాడు చిట్టబ్బాయి.


    "అంతా బాగానే ఉందిగాని మరి ఇప్పుడు ఆ అమ్మాయి ప్రేమని నేను పొందేమార్గం ఏమిటి?"


    "దానికి మార్గం ఆలోచించిపెట్టాను!" మెల్లగా అన్నాడు కన్నారావు.


    "ఏమిటది?" పక్కమీద నుండి చాటుక్కునలేచి కూర్చుంటూ అడిగాడు చిట్టబ్బాయి.


    కన్నారావు చెప్పాడు.


    "అమ్మో!... నాకు భయమేస్తుంది" గుండేలమిద  చేయ్యేస్కుంటూ  అన్నాడు చిట్టబ్బాయి.


    నీకేం భయంలేదు... నేనున్నానుగా" అన్నాడు కన్నారావు చిట్టబ్బాయికి ద్తేర్యం చెప్తూ.


                        *                   *                 *


    రామయ్య గబగబా రిక్షా తొక్కుతున్నాడు. అతని మోహంలో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది.


    "ఇస్కూలు టైమ్తెపోనాది... ఆల్లింటికాడ  నేనింక రానేదేంటా అని కంగారుపడిపోతున్నారో ఏంటో?" అనుకున్నాడు రామయ్య.


    రామయ్య రంగనాయకులు అబ్బాయి ప్రశాంత్ ని రోజూ స్కూలుకి  రిక్షాలో తిస్కెళ్తేడు. మళ్ళి సాయంత్రం స్కూలు వదిలే టైముకి  స్కూలుకి  వెళ్ళి ప్రశాంత్ ని తిస్కుని  ఇంటికి వస్తాడు. అందుకు రామయ్యకి నేలక్కి వందరూపాయలు ముడ్తాయి.


    రిక్షా శాంతినగర్ సందులోకి తిరిగింది.


    రంగనాయకులు  ఇంటిముందు తచ్చాడుతున్న  కన్నారావు రిక్షాని చూస్తూనే  ఆ ఇంటి గేటుముందు రోడ్డు మీద సర్దుకుని నిలబడ్డాడు.


    రామయ్య రిక్షాకు బ్రేకు వేసి కన్నారావు పక్కగా ఆపి నుదిటిమిద  చెమటను వేలితో తిసి కిందికి దులిపాడు. ఓసారి  ఇంటివ్తెపు  చూశాడు.


    "ఏంటి?  మా పండుగాడిని  స్కూలుకి తిస్కేళ్ళాడానికి వచ్చావా?" అన్నాడు కన్నారావు రామయ్య తో అథర్టిగా.


    రామయ్య కన్నారావు వంక ఒక క్షణంపాటు తెరిపారచూశాడు.


    "అవును బాబూ... తమరూ?"  అన్నాడు ప్రశ్నార్ధకంగా కన్నారావు మొహం వంక చూస్తూ రామయ్య.

 Previous Page Next Page