"నేను వాడి మేనమామనులే... ఈవేళ ఉదయమే ఊర్నుండి వచ్చాను. నువ్వు యింటికి వెళ్ళిపో... ఈవేళ పండు రాడు" తొణక్కుండా చెప్పాడు కన్నారావు. అలా మాట్లాడుతున్నాడేగాని ఆ ఇంట్లోంచి ఎవర్తెనా రామయ్యని చూస్తారేమోనని మాత్రం అతని గుండె పిచు పిచుమంటోం ది.
"అబ్బాయిగారు రారాండి?... ఎందుకండి?" అడిగాడు కన్నారావు వాడిని కంగారుపెడ్తూ.
"అరెరె... జ్వరం.... ఇంక నువ్వెళ్ళు" అన్నాడు కన్నారావు వాడిని రామయ్య ప్తెగుడ్డ ఓసారి దులిపి దులిపి మళ్ళి భుజం మీద వేస్కుని గేటు వేపు రెండడుగులు వేశాడు.
కన్నారావు చటక్కున రామయ్య చేతిని పట్టుకున్నాడు.
"ఎక్కడికి వెళ్తున్నావ్" లోలోపల కంగారు పడిపోతూ అడిగాడు.
"అబ్బాయ్ గార్ని ఓసారి సూసేళ్ళిపోతా" అన్నాడు రామయ్య కన్నారావు వంక అయోమయంగా చూస్తూ.
కన్నారావు అలా చటుక్కున తన చేయి ఎందుకు పట్టుకున్నాడో రామయ్యకి అర్ధం కాలేదు.
"పండా?... వాడు యింట్లో ఎక్కడున్నాడు?... లెడుగా... హిహి" కంగారుని కప్పి పుచ్చుకోవడం కోసం నవ్వాడు కన్నారావు.
రామయ్య ఆశ్చర్యంగా చూశాడు.
"జొరం పెట్టుకుని అబ్బాయిగారు ఎక్కడికెళ్ళి పోయారు బాబూ?"
శనిగాడు వదిలేలాలేడే!... ఇప్పుడు ఈ పండుగాడు ఎక్కడికెళ్లాడని చెప్పాలి? ఏమని చెప్పాలి??
రెండు క్షణాలపాటు తికమకపడిపోయాడు కన్నారావు. అంతలో సమాధానం తట్టింది.
"ఆ... ఏమన్నావ్? జ్వరమని కాదూ?" అడిగాడు హుషారుగా.
"నేనేమి అన్లేదుబాబూ..... తమరే అన్నారు"
"ఆ.... ఆ అదే. జ్వరమ్తేతే ఎక్కడికెళ్తాడోయ్? ఆ?... ఆడుకోడానికికెళ్తాడా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. మా అక్క బావ వాడిని డాక్టర్ దగ్గరికి తిస్కెళ్ళరు. ఇంక నువ్వెళ్ళు..." గబగబా అన్నాడు కన్నారావు.
"కాని కారు ఇంట్లోనే ఉందికదు బాబూ?' కాంపౌండులో ఉన్న ఫియట్ కారు చూపిస్తూ అన్నాడు రామయ్య.
కన్నారావు వెనక్కి తిరిగి ఫియట్ కారువంక అయోమయంగా చూశాడు. అతనికి నాలుగ్తెదు క్షానాలు వేర్రెక్కిపోయింది.
"కారుంటే?.. కారెం మనిషికాదా?" అని వెంటనే తన తప్ప తెలుసుకుని నాలుక్కర్చుకుని "కారుకేం రిపేర్లు రావా?... మనుషులకేనా జబ్బులూ గట్రా వచ్చేది? కార్లకి రావా? కారుకేదో రిపెరోచ్చింది. అందుకే రిక్షాలో తిస్కెళ్ళారు డాక్టర్ దగ్గరికి" పళ్లు నూర్తూ అన్నాడు కన్నారావు.
"అదేంటి బాబూ... అయినా ఈళ్ళు తిస్కళ్ళడమేంటి?... ఆళ్ళ ఫేమిలీ డాక్టర్ నారాయాణగారున్నారుగా? ఆయనకీ ఫోన్ కొడ్తే ఇంటికే వత్తారుగా?" అన్నాడు రామయ్య కళ్ళు పెద్దవిచేసి చూస్తూ.
"ఎలా వస్తాడు?... ఆ నారాయణ రాత్రే గుండాగి చచ్చాడు... అందుకనే వేరే డాక్టర్ దగ్గరికి తిస్కళ్ళారు" కసిగా అన్నాడు.
రామయ్య మొహం నిండా జాలి కమ్మేసింది.
"అర్రెర్రె!... ఎంత పన్తేపోనాది బాబూ? అయినా డాక్టర్ బాబుకే గుండె జబ్బు రావడం ఇసిత్రంగా లేదూ?" అన్నాడు.
"ఏంలేదు... గుండె జబ్బు ఎవరికయినా రావొచ్చు!!"
"అయినా వేరేరిచ్చాలో ఎందుకెళ్లారు బాబూ... నేనొచ్చి తిస్కెళ్ళేవాడ్నిగా?"
కన్నారావు సహనం పూర్తిగా నశించింది. తన జుట్టులోనికి వెళ్ళు పోనిచ్చి గట్టిగా పట్టుకుని లాక్కున్నాడు.
"నువ్వోచ్చేదాకా ఆగితే ఆ పండుగాడు కూడా డాక్టర్ నారాయణ దగ్గరకే వెళ్ళిపోతాడు...వాడికి బాగా జ్వరంగా ఉంది. అందుకే ఇందాకే తిస్కెళ్ళారు... నువ్వింక వెళ్తావా లేకపోతే యాలాగే ని ప్రశ్నల్తో నన్ను కాల్చుకు తినేస్తుంటావా?" కొరకొర రామయ్యవంక చూస్తూ అడిగాడు కన్నారావు.
రామయ్య ఓసారి వింతగా కన్నారావు వంక చూసి రిక్షా ఎక్కాడు.
"నేనిక వస్తాబాబూ..." అన్నాడు. పెడల్ మీద కాలేసి తొక్కుతూ "రేపు రమ్మంటారా?"
"జ్వరం తగ్గోద్దూ?... రెండ్రోజులు పోయాక రా."
"అలాగే సాబూ"
రిక్షా ముందుకు కదిలింది.
"ఎంటో ఈ గోప్పాల్ల మనసు ఆరదమెకాదు. ఆ బాబు ఇంతసేపూ బాగానే మాట్టాడాడు... ఇంతలోనే ఏటైందో... కర్సిసినట్టు మాట్టాడడం మొదలెట్టాడు."
నిట్టూరుస్తూ అనుకున్నాడు రామయ్య.
రిక్షా సందు చివరిదాకా వెళ్ళి కుడిపక్కకి తిరిగి కనుమరుగయ్యాక 'రామయ్య' అనుకుంటూ తెలికగాక ఊపిరి పీల్చుకున్నాడు కన్నారావు.
మరుక్షణం అతనికి కర్తవ్యం గుర్తుకు వచ్చి ఆ యింటికి ఇటు పక్కన ఉన్న చిన్న సందు దగ్గరికి పరుగుతీశాడు కన్నారావు.
ఆ సందు మొదట్లో గోడ వెనకాల పొంచి వుండి ఇప్పటి దాకా జరిగిన తతంగం అంతా చూస్తున్న చిట్టబ్బాయి కన్నారావు దగ్గరికి రాగానే మండిపడ్డాడు.
"ఏంటి?... ఆ రిక్షావాడేదో నీకు స్నేహితుడో బంధువో అయినట్టు అంతసేపు మాట్లాడావు? ... కబుర్లు చెప్పడానికి ఎవడో ఒకడు దొరికితే చాలు నీకు?"
"నోర్ముయ్?... నేను గనక వాడిని ఇప్పటిక్తేనా వదిలించుకున్నాను... నువ్వ్తేతే ఇంకా మాట్లాడ్తూ ఉండేవాడివి. ఎంత జిడ్డ్డులా పట్టుకున్నాడో నీకేం తెల్సు?" అన్నాడు కన్నారావు.
"అఘోరించావులే!!..."
"సరే గాని నువ్వింక పద..." అన్నాడు కన్నారావు.
"నాకు భయంగా ఉందిరా కన్నా!... గుండెల మిద చెయ్యి పెట్టుకుంటూ అన్నాడు చిట్టబ్బాయి.
"భయమేందుకూ? ఏం కాదులే... చాలా సింపుల్ ప్లాన్ కదా?... నువ్వెళ్ళు..." భుజం తడ్తూ ద్తేర్యం చెప్పాడు కన్నారావు.
చిట్టబ్బాయి రోడ్డు పక్కన ఆపివున్న రిక్షా ఎక్కి నెత్తిన ఉన్న పాగా సర్దుకున్నాడు.
ప్రస్తుతం చిట్టబ్బాయి,కన్నరావులు మారువేషాల్లో ఉన్నారు. చిట్టబ్బాయి రిక్షావాడిలా తయారయ్యాడు. నలిగినా చొక్కా, పంచెకట్టు, తలకి పాగా, గుబురు మీసాలు, ఇది చిట్టబ్బాయి వేషం.
కన్నారావు మధ్యపాపిడి తిసి దువ్వేశాడు. అతను కూడా గుబురు మీసాలు పెట్టుకున్నాడు. కళ్ళకి నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాడు.
వాళ్ళిలా మారువేషాలు వేస్కోడానికి కారణం ఉంది.
కన్నారావు రజని గురించి వివరాలు కనుక్కున్నప్పుడు ఒక విషయం తెలిసింది. రజనికి పండు అంటే చాలా ప్రేమ. వాడు స్కూలుకి వెళ్ళినప్పుడు తప్ప మిగతా అన్ని వెళ్ళల్లో వాడిని అంటి ప్ర్ట్టుకునే ఉంటుంది. అది తెలుసుకున్న కన్నారావు మనసులో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది.
పండుని కిడ్నాప్ చేసి తీస్కుని వెళ్ళాలి. తరువాత రంగానాయకులుకి ఫోన్ చేసి మీ అబ్బాయి మా దగ్గర ఉన్నాడు. ఫలానా చోటికి రెండు లక్షలు తీసుకురా,లేకపోతే ని కొడుకుని సఫా చేస్తాం అని చెప్పాలి. అంతే... అది విన్న రంగనాయకులు బెంబేలు పడిపోతాడు.కొడుకుని రక్షించుకోడానికి రెండు లక్షలు సమకూర్చుకునే టైంలో ఇద్దరూ పండుని తీసికెళ్ళి వాళ్ళ ఇంట్లో అప్పజేప్తారు/
"కిడ్నాప్ చేసినవాళ్ళ దగ్గర్నుండి మేమే మీ అబ్బాయిని రక్షించి తిసుకోచ్చాం" అని చెప్తారు. ఆ విధంగా వాళ్ళతో పరిచయం ఏర్పడుతుంది తనకి ప్రియాతి ప్రియమ్తెన తమ్ముడిని రక్షించిన చిట్టబ్బాయి అంటే రజనికి కచ్చితంగా ప్రేమ ఏర్పడుతుంది.
ఇది కన్నారావు చిట్టబ్బాయికి చెప్పిన ప్లాను.
"నీ ప్లాను ఏడ్చినట్టే ఉంది... ఆ పండు గాడు మనమే వాడిని తిస్కెళ్ళినట్టు ఇంట్లో చెప్పెయ్యడూ?" అన్నాడు ప్లానంతా విన్నాక చిట్టబ్బాయి కన్నారావు వంక మొహం చిట్లించి చూస్తూ.
కన్నారావు తెల్లబోయాడు.