అలా అనక ఇంకేమంటుంది?"
"నేను గానా చారిలా వుండాలట!"
'వుంటే పోలా?'
'పెళ్ళి మానేయ్యలట_'
'మానేస్తే పోలా ?'
అదే నిర్లప్తత! అదే ధోరణి_ ఆశ్చర్యంగా వుంది సంధ్యకి
'నాన్నా!'
'ఎవరు నాన్నా! నేను నీకు నాన్నని! నాకు నాన్నెవరు? అందరకీ నాన్నా ఆ బెజి నాన్న! ఆయన్నడుగు. అయన'వూ' అంటే పెళ్ళి చేసుకుంటేపోలా? అయన 'వూ' అనకేం చేస్తాడు?
'నాన్నా!'
"సంధ్యా!" గంభీరంగా పిలిచారాయన. ఇప్పటిదాకా ఏదో ధోరణిలో మాటడుతోన్న అయన వాగ్దోరణి మారిపోయింది. "ఈ సృష్టి అనంతమైనది స్రీ పురుషులు ఈ సృష్టికిఆద్యులు... ఈ సృష్టి ఆగిపోకూడదు. ప్రజాతంతుం మా వ్యవచ్చేచ్చీ:ఇది మరచిపోకూడదు.... సంధ్యా... మని మంత్రౌషధశక్తులున్నాయి... మహిమా తీతమైంది యీ లోకం..."
సంధ్య లేచి నుంచుంది.
'కూర్చో... అదిత్య ఎవరు?'
ఆమె అలాగే చూస్తుంది
"అడిత్యాయచ మాంగల్య బుధాయచ గురు శుక్రు శనిభ్యశ్చ రాశావే నమః లోని అదిత్యుడా? ద్వాదశీ దివ్యుల్లో ఒకడా?
సంధ్యా! శుక్ర శోణత సంభంధమైన యీ స్రీ, పురుష సంయోజగానికి, యీ మానవ శ్రుష్టికి నీలాటి స్రీ అంకితం కారాదు' నువ్వు గార్గని.... మైత్రేయివి..."
సంధ్య యిక కూర్చోలేదు వెళ్ళిపోయింది.
పరమేశ్వరంగారు అదే విధంగా మాతాడుతున్నారు.
19
ఫోన్ అదే పనిగా మోగుతోంది.
ధర్మరాజుగారు 'హాయిగా' నిద్రపోతున్నారు. అరుంధతిగా నిశ్చింతగా పడుకుని నిద్రపోతున్నారు.
వారం రోజులైంది ధర్మరాజుకి చూపు పోయి, తిరిగొచ్చి, మళ్ళీ ఎలాటి అవాంతరం లేదు. కుటుంభం అంతా హాయిగా వుంది. 'నిశ్చింతగా వుంది.
చప్పున మేళుకువైంది అడిత్యకి.
లేచి వెళ్ళాడు
రిసీవర్ ఎత్తాడు
మెల్లిగా పెదవులు విచ్చీ విచ్చాకుమ్డా నవ్విన శబ్దం గోధుమ వన్నె త్రాచు జరజర పాకినట్టునిపించే సవ్వడి.
"హలొ!" అన్నాడు ఆదిత్య.
'చూశావా! నువ్వే వస్తావని ఫోన్ ఎత్తుతావని నాకు తెలుసు అందుకే నువ్వేను... ఇప్పటికైనా నా శక్తి అర్ధమైందా?
ఆమె! ఆ యువతి! అదే గొంతు గిలిగింతలు పెట్టి మైకంకలిగించేటట్ట్లుగా వినిపించే నువ్వు. వెన్నెల ధారగా కురిసినట్లు ప్రవహిస్తావున్నా నవ్వు,
'ఏమిటి? ఈ వేళప్పుడు పిలుస్తున్నావు!'
"మీకు వేళలున్నాయి. దివ్యులకు మాకు వేళలేమిటి? మీ జీవితాలు కాలబడ్డం. మా జీవితాలు కాదు మేం నిన్న ఉన్నాం. రేపు ఉంటాం. ఇప్పుడున్నాం. ఇక్కడున్నాం! అక్కడుంటా! ఎక్కడైనా వుంటాం! మా స్థితి కాల స్థల, అతీతమైంది!"
అతనేం జవాబు చెప్పలేదు.
"సరళ ఎవ్వరు?" అడిగింది ఉలూచి.
"ఉలూచీ! నువ్వు నా గత జన్మ జన్మల ప్రేయసి పేరు చెబుతా స.. అని అపేవు ఆమె పేరు సరళా?
అతని కంఠంలో ఉద్విగ్వత గమనించి నవ్విందామె.
'సంధ్యా'చప్పున అడిగాడు అతను
మళ్ళీ నువ్వు... మనస్సుకి చక్కిలిగింతలు పెట్టేనవ్వు
'పిల్లికి చెలగాటం! ఉడుకుమోత్తనం కనిపించింది.
'ఆదిత్యా!' అర్దతా పుట్టిపడే గంతుకతో పిలిచింది. కిన్నెరపై వలపిరాగంలో వసంతగీతిక ఆలపించినట్టయింది చిమ్మేనా గ్రోవితో ఎద తడిసి మెత్తనయ్యేట్టు ప్రేమ వసంతం చివ్వున చిమ్మినట్టుయింది.
'ఆదిత్యా! నేను నిన్ను హేళన చేస్తానా?'
ఆ కంఠంలో ద్వానిమ్చిన అత్మీయతకి కలవర పడ్డాడు ఆదిత్య
'ఉలూచీ! నేను సంధ్యని ప్రేమిస్తున్నాను. మధ్య యీ సరాల ఎవరు?'
అటువైపున వున్న ఉలూచి ముఖం అప్రసన్నమైంది. కోపం ఉవ్వెత్తున వచ్చింది. ఆమె వదిలిన దీర్హ్గా నిశ్వాసం కలనాగు బుసకొట్టినట్టుగా అనిపించింది.
ఆదిత్య ఆ ప్రయత్నంగా నిటారుగా అయ్యాడు.
'సరళ ఎవరో తెలుసుకోవాలనుందా?
'అవును!'
'ఎందుకు?'
'అది యిప్పటి నా జీవిఇత సమస్య!'
'సమస్యా? నీకు సమస్యలా ఆదిత్యా! నేను ఎప్పుడూ నీ శ్రేయస్సునే కామ్క్షిస్తున్నాను. నేను నిన్ను వలచాను వేయ్యేళ్ళుగా! నిన్ను ప్రేమించి, తపించి, నిన్ను పెళ్ళిచేసుకుని, నీతో ధర్మబద్దమైన సాంసారిక జీవితం పొందాలనే నా యీ సహాస్రవత్సర నిరీక్షణ. ఇక నీకు సమస్య లేమిటి?'
"ఉలూచీ! నీవు నాగాకన్యకనని చెప్పావు. దేవతా స్రీని అన్నావు నగులకి, నరులకి సంభందాలు అనాదిగా వున్నాయన్నావు. నిజమే! కానీ నేనో ప్రేమికుడిని నా మనస్సు సంధ్యని విడిచి ఊహించలేదు ఇక జీవించటం ఏ వుంది?'
సంధ్యని అంతగా ప్రేమిస్తున్నావా?'