ఇలా ఎన్నడూ జరగలేదు.
క్షణక్షణానికి 'సమాధి' శిధిలమవుతోంది.
ఏదో జరగబోతున్నది అది నిస్సందేహంగా ఆపదే! అదీ తనకే చప్పున కళ్ళు తెరిచారు శాస్రీగారు.
మంత్ర, తంత్ర, శాస్త్ర విద్యాలని నిక్షేప్తం చేసిన తాటాకుల గ్రంధంపై కాలనాగు....
కాలనాగు
కాలనాగు
క్షణకాలం పాటు అయన మనస్సు స్థంభించింది.
ఈనాటిది యీ కాలనాగు!
మళ్ళీ తనకీనాడు కన్పిస్తోంది ఎందుకు?
తను తన జపసిద్దికోసం, మంత్రసిద్ధికోసం "సుబ్రహ్మణ్యోపాసన' ప్రారంభించిన కొత్తలో మంత్ర సిద్దికి మందు, మంత్రరూప దర్శనానికి ముందు "ఈ మంత్రాది దేవత" 'కాలనగు' దర్శనం అయింది?
మళ్ళీ యిప్పుడు!
కదులుతోన్న భావ లహారిని సిద్ధంచేసి, మనస్సుని తిరిగి స్వాదీనంలోకి తెచ్చుకున్నరాయన. నాగా భరణ స్త్రోత్రం చేశాడు.
కాలానాగు అలాగే భీకరంగా పడగెత్తి "చూస్తొంది" నిజానికి మామూలు పాములుకి నల్ల గుడ్డు వెనక పావురాలు పదిపదిహేనుదాకా వుంటాయి ప్రతిబింబించ లేవు. ఒక ఆకారాన్ని అస్పష్టంగా ప్రతిబింబిస్తాయి.
కానీ దివ్య సర్పాలికి ఎన్నో మహిమలుంటాయి. వాటికి రాక్షుసులకి మల్లె రూప గ్రహణం కూడా వుంది. అంతే అవి "తలుచుకున్న" రూపానికి మారగాలవు. కోరిన రూపం ఎత్తగాలవు. దీన్ని కామరూప వుద్య అంటారు.
శ్రీధరశాస్రీ ప్రార్దన చేస్తున్నాడు.
కాలనాగు అక్కడి నుంచి కదలింది.
చుట్టుకున్న చుట్ట విడిపోయింది.
నిలువేత్తిన నుంచుంది కాలనగు.
"శ్రీధరా!" కాలనాగు నాలికలు చాస్తోంది.
అయన రెండు చేతులు జోడించాడు.
"ఇది నా స్వయం విషయం.... నువ్వు జోక్యం కల్గించుకోవద్దు, నేను అడిత్యని సాధించాలి. వాడు నన్ను వేయఎల్లుగా "ఎడ్పిస్తున్నాడు" నేనతన్ని సాధించాలి..." స్పష్టంగా వినిపిస్తున్నాయి ఆ మాటలు.
శ్రీధరశాస్రీకి యివి పూర్వానుభూత విషయాలే.
ఏ మంత్రాన్నో ఉపసించేవాడు ఏ విషయం గురించో జపిమ్చేవాడు ఆ మంత్రాది దేవతో_ ఆ విషయమో అయన "మనస్సులో" ప్రశ్న జవాబు రూపంలో "బాసించేది"
ఇప్పుడూ అంతే జరుగుతోంది.
'నేనతన్ని ప్రేమించాను, నన్నతాడు తిరస్కరించాడు.
నేనతన్ని ఇష్టపడ్డాను, నన్నతను చీత్కారిమ్చాడు.
నాది కామం అన్నాడు, అతనిది దివ్య ప్రేమట!
అతనికి నిన్న మా జన్మల రహస్యం చెప్పాను
అతను నమ్మలేదు.... నమ్మినట్టు నటించాడు"
"శాస్రీ! అతనో గంధర్వుడు... నీకు తెలిసే వుండాలి. అతడు ఖడ్గ విద్యారూపుడు "మహేశ్వరిని" ఇష్టపడి, సేవకుడై కూడా ఆ మహారాణిని ప్రేమించి, అఖరికి "మునీకుని" పన్నాగంలో ఇరుక్కుని "జయద్రధు " ని ఖడ్గాదారకి బలి అయిపోయినవాడు....
వాడిని నేను ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాను.
శాస్రీ? ఈ శరీరం వేరు_ ఈ మహిమ వేరు. కానీ క్మరూపం ధరిస్తే నా మనస్సులో కలిగే సంచలనం వేరు.
నేను అప్పుడప్పుడూ అనుకుంటాను. ఏ పతంజలినో, పాణినినో మరే యోగ్య విద్యా నిరూది అయినా మహావ్యక్తినో ఆశ్రయించి అతనివల్ల శ్రీవిద్యా ఫలితాన్ని ధారా పోయించుకుని యీ కోరికను చంపెద్దామని.
కానీ మంత్రాశక్తిని ఎవరు ధారపోస్తాను?
నావేర్రి కానీ...
చూశావా!ఈ సృష్టి విచిత్రంనే నెక్కడ? నా దేవతాశక్తి ఎక్కడ?
న మహిమలు ఎక్కడ?
ఈ "భావం" ఎక్కడ? ఇదంతా ఒక "మాయ"
కాబట్టి శిధిలమైంది
ఇంకే భావం మిగల్లేదు....
భావ శూన్యం....
ఎదురుగా కాటయ బావుతున్నట్టున్న కాలనాగు
జపంలో శ్రీధరశాస్రీగారు.
18
సంధ్య, పరమేశ్వరంగారు యిడ్డారూ వరండాలో కూర్చున్నారు
'నాన్నా! ధర్మరాజుకి చూపు పోయిందట!
'పోకేం చేస్తుంది!"
'కళ్ళు బొత్తిగా కనిపించవట_'
'అంతే మరి_గుడ్డితనం రాకేం చేస్తుంది!'
'అతనెవరో తెలుసా నాన్నా!'
'ఎవరైతేనేం! పాపం ఫలించి తీరుతుంది!'
'చిత్రంగా! మళ్ళీ చూపు వచ్చిందట_'
'రాకేం చేస్తుంది!'
గాడంగా నిట్టూర్చింది సంధ్య తండ్రి స్పృహలోనే వున్నాడా? తను చెప్పేది గ్రహించుకుంటున్నాడా? అయన మనస్సు పనిచేస్తోంది. ఆయనకి మనస్సుకి ఊహించే శక్తి వుందా?
'అతనెవరో మీకు తెలుసా?'
నువ్వు చెబ్తే తెలుస్తుందిగా!'
నాప్రెండ్!'
"నీ ప్రెండుయితే న కెందుకు తెలీదు-"
"మేం పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం_"
"అడ మగ అయితే పెళ్ళిచేసుకోరా ఏమిటి?"
"అత్తయ్య వద్దంటుంది?"
'వద్దనకేం చేస్తుంది. తనకి పెళ్ళి కాలేదుగా?'
'అతన్నే కాదు_ ఎవర్నీ పెళ్ళిచేసుకోవద్దంటుంది!'